దేవుని మీద భక్తి శ్రద్ధ, ఏకాగ్రత కలిగిన వారు దైవీసంపదలను ఎలాగా గొప్పగా భావిస్తారో, ఆసురీ సంపదలను దుర్మార్గులు, దుష్టులు, దురాచారులు, తమ సంపదలుగా భావిస్తారు.
దైవిగుణాలు 26 ఉంటే దుర్గుణాలు 6 మాత్రమే ఉన్నాయి. ఎన్ని సుగుణాలు ఉన్నా ఒక్క దుర్గుణం చాలు అతడిని అధఃపాతాళానికినెట్టడానికి.
1. దంభము.. అంటే కపటము, మోసము, వేషముతో మోసంచేయడం.
2.దర్భము.. అంటే ఒక విధమైన గర్వము. వల్లమాలిన అహంకారము. నన్ను మించిన వాడు లేడు అని గర్వించడం.
3. అభిమానము.. అహంకారానికి ప్రతిబింబం అభిమానం. చాలామంది ఇదేదో గొప్పగుణంగా భావిస్తారు. కాని అది పరిమితులు దాటకూడదు అని గ్రహించాలి.
4. కోపము.. అభిమానము ఎక్కడ ఉంటుందో కోపం అక్కడే ఉంటుంది. తన గొప్పతనాన్ని గుర్తించని వాడి మీద కోపం రావడం సహజం. ఆ కోపం విపరీత పరిణామాలకు దారితీస్తుంది.
5. పరుషత్వము... అంటే కాఠిన్యము. కొంతమందికి ఇది అలవాటు. ఏం మాట్లాడినా మొహం మీద కొట్టినట్టు మాట్లాడటం. పరుషంగా మాట్లాడటం. ఎదుటి వారిని గౌరవించకపోవడం, నిర్లక్ష్యభావన. దీని వలన ఎన్నో ఇబ్బందులు వస్తాయి.
6. అజ్ఞానము, అవివేకము. ప్రతిదానినీ తప్పుగా అర్ధం చేసుకోవడం. తెలియకపోయినా తెలిసినట్టు నటించడం. తాను చెప్పిందే వేదం అని మూర్ఖంగా వాదించడం.
🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏
No comments:
Post a Comment