Thursday, May 9, 2024

((((( ఆలోచనాలోచనాలు ))))) సంస్కృత సూక్తి సుధ.

 ((((( ఆలోచనాలోచనాలు ))))) సంస్కృత సూక్తి సుధ.🙏                                ***** సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్.                నబ్రూయాత్ సత్యమప్రియమ్!                  ప్రియంచ నానృతం బ్రూయాత్, ఏష ధర్మః , సనాతనః!                            భద్రం భద్రమితి బ్రూయాత్,    భద్రమిత్యేవ వావదేత్!!         ఎప్పుడూ నిజం చెప్పాలి. ఆ చెప్పే నిజాన్ని కూడా ఇష్టంతో చెప్పాలి. అయితే సత్యాన్నైనా అప్రియం చెప్పరాదు. అట్లాగే ప్రియమైనదైననూ, అసత్యం పలుకరాదు. ఇది అనాది నుండి వస్తున్న ధర్మం. భద్రం అనగా శుభం. కాబట్టి ఒకరికి ప్రియం పలికేటప్పుడు " భద్రం" అని పలకాలి.                        ***** యద్యత్పరవశం కర్మ, తత్తద్యత్నేన వర్జయేత్! యద్యదాత్మ వశంతుస్యాత్! తత్తత్సేవేత యత్నతః!!                           ఎప్పుడైనా సరే పరాధీనమైన కార్యాలను విడిచిపెట్టాలి. తన అధీనమైన పనిని ఎంత ప్రయత్నించి అయినా పూర్తి చెయ్యాలి.                    ***** సర్వం పరవశం దుఃఖం, సర్వమాత్రవశం సుఖం, ఏతద్విద్యాత్సమాసేన లక్షణం సుఖ దుఃఖయోః!!      పరాధీనమైన పనులన్నీ కూడా దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. తన అధీనమైన పనులన్నీ ఎప్పుడూ సుఖాన్ని కలిగిస్తాయి.                         ***** విప్రాణాం జ్ఞానతో జ్యేష్ఠః, క్షత్రియాణాంతు వీర్యతః ! వైశ్యానాం ధాన్యధనతః, శూద్రాణాం ఏవ జన్మతః!!                        బ్రాహ్మణులలో జ్ఞానం కలవాడే పెద్ద. క్షత్రియులలో బలపరాక్రమాలు గలవాడే పెద్ద. వైశ్యులలో ధనధాన్యసంపత్తి కలవాడే పెద్ద. శూద్రులలో వయస్సు మీరినవాడిన వ్యక్తినే పెద్దగా గౌరవిస్తారు.                ***** విత్తం బంధుర్వయః కర్మ, విద్యా భవతి పంచమీ, ఏతాని మాన్యస్థానాని గరీయో యద్యదుత్తరమ్!!                  ధనికుని కంటే బంధువు శ్రేష్ఠుడు. బంధువు కంటే వయో వృద్ధుడు శ్రేష్ఠుడు. వయోధికుని కంటే క్రియావంతుడు అధికుడు. క్రియావంతుని కంటే విద్యావంతుడు అధికుడు. విద్యావంతుని కంటే మిగిలినవారు క్రమంగా తక్కువని భావం.               ***** న స్నానమాచరెద్సుక్త్వా, నాతుం నమహానిశి,                   నవా సోభి ర్వినాజస్రం, నవిజ్ఞాతే జలాశయే!!            అన్న తిన్న తర్వాత స్నానం చెయ్యరాదు. రోగంతో ఉన్నప్పుడు, అర్థరాత్రి వేళ స్నానం చెయ్యకూడదు. వంటిపై వస్త్రములు లేకుండా స్నానం చెయ్యకూడదు. తనకు తెలియని మడుగులలో దిగి స్నానం చెయ్యకూడదు.                     ***** వైరిణం నోపసేవేత, సహాయం చైవ వైరిణః!          అధార్మికం తస్కరంచ, తదైవ పరయోసితమ్!!             శత్రువు, శత్రువుకు సహాయం చేసేవాడు, లేదా శత్రువుకు స్నేహితుడు, ధర్మహీనుడు, దొంగ, పరస్త్రీ -- వీరితో ఎప్పుడూ సహవాసం.చెయ్యరాదు. దీనివలన చిక్కులు, ఆపదలు ఏర్పడతాయి.        ***** క్షత్రియం చైవ సర్పంచ, బ్రాహ్మణంచ బహుశ్రుతం, నావ మన్యేత వై భూష్ణుః,కృశానపి కదాచన!!                             వృద్ధి లోకి రాదలచినవాడు ఎప్పుడైననూ రాజు(పాలకుని) తో‌, పాముతో, పండితుడైన విప్రునితో, వైరం ఉంచుకోకూడదు. ( దాని వలన తనకు మేలు జరుగకపోగా అపకారమే జరుగుతుంది)                    చివరగా ఒక " ఆర్య ధర్మానికి " సంబంధించిన ఒక మహత్తర శ్లోకం.            శతం విహాయ భోక్తవ్యం,        సహస్రం స్నానమాచరేత్!        లక్షం విహాయ దాతవ్యం,       కోటిం త్యక్త్వా హరిం భజేత్!!                                    తప కోసం వేచివున్న వందమందిని విడచి అయినా భోజనం చెయ్యాలి. అట్లాగే వెయ్యి మందిని విడచి స్నానం చెయ్యాలి. లక్షమందిని విడిచిపెట్టి అయినా దానం చెయ్యాలి. కోటి మందిని విడచిపెట్టి "" భగవత్ ధ్యానం"" చెయ్యాలి. అన్నిటికన్నా ముఖ్యం భగవద్ధ్యానం అని శ్లోక సారాంశం.                             తేది 29--10--2023, ఆదివారం, శుభోదయం.

No comments:

Post a Comment