ఎన్నో విషయాలు చాలా స్పష్టంగా మన పురాణాల్లో ఉంటే వాటిని చెప్పడం మానేసి ఎక్కడో ఇంగ్లీషు దేశాల్లో ఇంగ్లీషు భాషలో ఉదాహరణలు చెప్పి మన పిల్లల మనస్సులకి ఎక్కించాలని చూస్తే అసలు ముందు అర్థం అవుతాయా? ఒకవేళ అయినా ఆచరించేంతగా స్ఫూర్తిని అందించగలుగుతాయా? ఒకవేళ అందించినా ఆ విద్యార్థులకి అన్ని గొప్ప విషయాలూ ఇతర దేశాల్లోనూ, ఇతర బాషల్లోనే ఉన్నాయనీ, మన గ్రంథాల్లో, మన సంస్కృతిలో అంత గొప్పవి ఏమీ లేవనే అభిప్రాయం కలగదా? అటువంటి అభిప్రాయమే కలిగితే అంతకంటే ఆత్మవిశ్వాస రాహిత్యం వేరే ఏదైనా ఉందా? అలా ఆత్మవిశ్వాసంలేని యువతరాన్ని మనం తయారుచేస్తే ఇప్పటికే వెనుకబడ్డ దేశంగా పేరుబడ్డ మనదేశం ఇకముందు ముందుకు పడిపోయిన దేశమైపోదా? పెద్దలందరూ, ఉపాధ్యాయులందరూ, శిక్షణాకేంద్రాలు నడిపే వాళ్ళందరూ, ఇంగ్లీషులో ఉపదేశాలు చేసేవారందరూ, ఇళ్లలో తల్లిదండ్రులందరూ ఆలోచించాల్సిన విషయం ఇది.
No comments:
Post a Comment