*_అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయి అంతరాత్మ చెప్పే సలహాను పట్టించుకోము అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే._*
*_ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము అందువల్ల అంతరాత్మ మనకు చెప్పేది నిజమేనని గ్రహించగలగటం వివేకం..._*
*_ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనపై వచ్చే విమర్శలు విజయానికి నిచ్చెనలు అవుతాయి. అందుకే విమర్శించే వారిని జీవితంలో అస్సలు దూరం చేసుకోవద్దు. ఒక్క విమర్శ మిమ్మల్ని వంద మెట్లు పైకి ఎక్కించే అవకాశం ఉంది._*
*_ఒక్క పొగడ్త మిమ్మల్ని పాతాళంలోకి నెట్టేసేందుకు దారి చూపుతుంది. అందుకే పొగడ్తలు కాదు... నిన్ను విమర్శించేవారే నీకు నిజమైన వారని గుర్తించండి. విమర్శ వలన మనలో అహంకారం జనించదు._*
*_||సమస్త హిందూ సుఖినోభవంతు||_*
🙏🙏🙏 🌷🙇🏻♂️🌷 🙏🙏🙏
No comments:
Post a Comment