Thursday, May 9, 2024

*****స్వయం యొక్క శోధనను ప్రారంభించండి. *

 [5/9, 15:42] +91 73963 92086: *స్వయం యొక్క శోధనను ప్రారంభించండి. *

*“సంతోషానికి మీకు ఉన్నదానితో లేదా లేని దానితో సంబంధం లేదు. సంతోషం అనేది నువ్వు ఎవరు అనే దానికి సంబంధించినది. మీరు ఎన్నైనా వస్తువులు సేకరించవచ్చు, అవి మీ చింతలను, మీ ఇబ్బందులను పెంచుతాయి కానీ వాటి వల్ల సంతోషం పెరగదు. ఖచ్చితంగా వాటితో అసంతృప్తి పెరుగుతుంది, కానీ మీ సంతోషం పెరగడానికి వారికి ఎటువంటి సంబంధం లేదు.*
 
*“మీరు వస్తువులను త్యజించాలని, మీరు మీ ఇంటి నుండి తప్పించుకోవాలని మరియు ప్రపంచాన్ని  త్యజించాలని చెప్పడం లేదు.  తప్పుగా అర్థం చేసుకోకండి. వస్తువులను పడవేయడం మరియు వాటి నుండి తప్పించు కోవడం లేదా వాటిని అంటిపెట్టుకుని ఉండటం వల్ల ఏమీ జరగదు. ఏవి  వున్నాయో  అవి ఉండ నివ్వండి. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, కానీ లోపలి శోధనను ప్రారంభించండి. సమయాన్ని వృధా చేయవద్దు. బాహ్య శోధన ఇప్పటికే చాలా జరిగింది, ఇప్పుడు లోపలికి వెళ్లండి. స్వయాన్ని తెలుసుకోండి. ఆ జ్ఞానములో అన్నింటినీ పొందుతారు. అన్ని కోరికలు ఒకేసారి నెరవేరుతాయి...*
.
*పురుషార్ధములు - వివరణ*

 మానవుడు తన మానవత్త్వాన్ని నిలబెట్టుకోవాలంటే జీవితానికంతా లక్ష్య భూతమైన పురుషార్ధాన్ని సాధించక తప్పదు. ఐతే ఈ పురుషార్ధమంటే ఏమిటి? అది ఎన్ని విధాలు అనే ప్రశ్న వస్తుంది. *జీవితానికి అనుకూలమైనది అర్ధం. ప్రతికూలమైనది అనర్ధం. అనర్ధాన్ని పరిహరిస్తూ అర్ధాన్ని పాటిస్తూ పోవటమే పురుషార్ధ సాధన.*ఆదిత్యయోగీ*

 ఇలాంటి పురుషార్ధాలు మానవ జీవితాని కంతా కలిసి నాలుగే నాలుగున్నాయి. *ఒకటి 'ధర్మం',మరొకటి 'అర్ధం'. మరొకటి 'కామం', ఇంకొకటి 'మోక్షం'. చతుర్విధ పురుషార్ధాలంటే ఇవే.* జీవిత సర్వస్వం వీటిలోనే ఇమిడిఉంది. అందులోనూ ఈ నాలిగింటినే పరిగణించటంలో - వాటిని గూడా ఈ క్రమంలోనే పరిగణించటంలో కూడా ఒక చక్కని ఉపపత్తి ఉంది. 

 ప్రతివాడూ తన ధర్మాన్ని ఆచరిస్తేనే కాని అర్ధం అనేది లభించదు. అర్ధమంటే జీవితం సుఖంగా సాగటనికి కావలసిన అన్ని వస్తువులు, అన్ని సౌకర్యాలు. అవి లభించిన తరువాత మానవుడి కామం లేదా వాంఛలన్నీ తీరిపోతాయి. ఐతే, ఎంత సాఫల్య మిలా గలిగినా జీవితంలో అది సాంతమే, అనంతం కాదు. అనంతమైన సౌఖ్యాన్ని చూరగొనాలనే కదా మానవుడి అభిలాష. అది ధర్మార్ధ కామములనే మూడింటిలోనూ మనకు కానరాదు. దానికి సంబంధించిన పురుషార్ధం నాలుగవది ఐన మోక్ష మొక్కటే. మోక్షం మానవుడికి నిత్యమైన సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. కనుకనే అది పరమ పురుషార్ధమని పేర్కొనబడుతున్నది. మొత్తం మీద నాలుగూ కలసి జీవితాన్ని అంతటినీ ఆపోశనం పడుతున్నాయి. ఆయా వ్యాపారములు చేయటం - తన్మూలంగా అభిమతార్ధాల నన్నిటినీ పోగు చేయటం - అలా ఒనగూడిన వాటి నన్నిటినీ తనవిదీరా అనుభవించటమూ, అలాంటి సుఖానుభూతిని శాశ్వతం చేసుకోవటం - ఇంత కన్న జీవితమూ, జీవిత ధ్యేయమూ మరేమున్నది. 

 కర్మాచరణతో ప్రారంభమై నిత్య సుఖప్రాప్తితో సమాప్తమవుతున్నది. మొదటిది సుఖం కోసం చేసే ప్రయత్నమైతే రెండవది దానికి ఫలభూతమైన సుఖానుభవం. సుఖానుభవమే గదా సమస్త పురుషార్ధ సారం...

ఒకసారి కావ్యకంఠ గణపతి ముని గారు మహర్షితో ఇలా అన్నారు. స్వామి! అందరికీ ఆత్మ విచారణ మార్గం కష్టం కదా! మీ వద్దకు వచ్చిన వారికి కష్టమైన ఈ మార్గాన్ని ఎందుకు బోధిస్తారు.

అందుకు మహర్షి ఇలా సెలవిచ్చారు... నేను ఈ ఆత్మ విచారణ మార్గాన్ని ఆచరించి ఎదుటివారికి వేరే మార్గాన్ని ఎలా బోధించేది?

  అలా అని మహర్షి ఎవరినీ తన మార్గంలోకి రమ్మని చెప్పలేదు అని భక్తుల చరిత్రలో మనం చూస్తూ ఉంటాము. భక్తులు ఎన్నుకున్న మార్గంలోనే మహర్షి దారి చూపే వారు.ఆదిత్యయోగీ..

   ఉదాహరణకు అన్నామలై స్వామి... మహర్షి,  స్వామిని చూడడం తోటే నీవు గతజన్మలో గొప్ప ఇంజనీర్.

ఈ జన్మలో ఈ ఆశ్రమానికి సంబందించిన కట్టడాలు కట్టి మోక్షాన్ని పొందు అని చెప్పారు. ఇదే నీకు చివరి జన్మ అని కూడా చెప్పారు. స్వామి హఠ యోగము అభ్యసించారు.

   మరొకరు సౌరిస్ మాత ... వీరు రమణ మహర్షి చెప్పిన ఆత్మవిచారణ మార్గము, నేనెవరు అని విచారించి మోక్షాన్ని పొందారు. 
   
మరొకరు  మురుగనార్..  భక్తి యోగాన్ని అభ్యసించి లక్ష్యాన్ని చేరారు.

   రమణ సంభాషణలు రాసిన మునగాల వెంకట్రామయ్య గారు హఠ యోగాన్ని అభ్యసించి లక్ష్యాన్ని చేరారని మనం వింటూ ఉంటాం.

  రామయోగి గారు హఠ యోగాన్ని అభ్యసించి లక్ష్యాన్ని చేరారు.

ఈ రామయోగి గారిని క్రియాయోగ పరమహంస యోగానంద బృందం  కలిసింది.

రమణ ఆశ్రమం పక్కనే ఉన్న అన్నామలై స్వామి సమాధి వద్ద ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయికి ఒక చిన్న చెక్కతలుపు. దాని లోపల రామయోగి సాధన చేస్తూ ఉంటే బయట ఒక పెద్ద నాగుపాము కాపలా ఉండేది . రామయోగిని చూడటానికి పాల్ బ్రంటన్ వచ్చినప్పుడు ఒక పెద్ద నాగుపాము పాల్ బ్రంటన్ ఎదురుపడింది . రామయోగి గారు తటాలున చెక్క తలుపు తీసుకొని వచ్చి  నాగుపాముతో ఒరేయ్ , వీరు మన వారు. వెళ్ళిపో అని అనే సరికి నాగుపాము వెళ్ళిపోయింది.

[5/9, 15:42] +91 73963 92086: అదేవిధంగా పరమహంస యోగానంద ఇలా అన్నారు. ఇంకా కొద్ది సమయం గనుక నేను రామయోగితో ఉన్నట్లయితే నేను ఈ భారత దేశం వదలి విదేశాలు వెళ్లి ఉండేవాడిని కాదు అని.  అంతటి గొప్పవారు రామయోగి.

  ఇంకా ఎందరో భక్తులు ఉన్నారు. కానీ అందరూ మహర్షి చెప్పిన మార్గాన్ని అనుసరించ లేదు కానీ లక్ష్యాన్ని పొందారు. అంటే ఈశ్వరుని సృష్టిలో అన్ని యోగాలు ఉన్నాయి . అంటే భక్తి, జ్ఞానము, ధ్యానం, కర్మ వీటి ద్వారా లక్ష్యాన్ని పొందవచ్చు అని ఇక్కడ మనకు అర్థమవుతూనే ఉంది కదా.

మహర్షి సెలవిచ్చినట్లు ....

    పవిత్రమైన  ఈ అరుణాచల క్షేత్రములో , పైగా సాన్నిధ్య బలముచేత ఎటువంటి యోగాన్ని అభ్యసించినా త్వరగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

    ఇక్కడ మనకు సాన్నిధ్య బలము అంటే రమణ మహర్షి సన్నిధి.

ఎందరో విదేశీయులు మహర్షి సన్నిధిని వదలి వెళ్ళలేక పోతున్నారు.

ఈ పది సంవత్సరాల నా రమాణాశ్రమ అనుభవంలో తెలుసుకున్నది ఇదే.

మహర్షి యొక్క సాన్నిధ్యము అంతగా ఉంటుంది. అది మాటల్లో చెప్పలేము .

ఎంతో మంది దేశ విదేశాల వాళ్ళు రమణ మహర్షి సన్నిధిని ఆశ్రయించి పాతుకు పోయారు.

అంటే మహర్షి యొక్క సాన్నిధ్య బలాన్ని మాటల్లో వర్ణించలేము.ఆదిత్యయోగీ..

అది ఎవరికి వారు అనుభవిస్తేనే తెలుస్తుంది.

    ఉదాహరణకు నావరకు...  నాది మొదట క్రియా యోగము .అక్కడి నుంచి రామకృష్ణ మఠానికి రావడం జరిగింది. అక్కడ నుంచి రమణాశ్రమం రావడం జరిగింది . ఇక ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళగలం. దీనిమీద ఏదీ లేదు కదా.
రమణశ్రమం లో యోగి రామయ్య తపస్సు చేసిన గుహ ఇదే...
.
*. రెండు తలుపులు *

*  ఇది సత్యం మరియు భ్రాంతి మధ్య ఎంచుకునే ప్రశ్న కాదు, ఎందుకంటే మీకు బయట ఉన్న అన్ని తలుపులు భ్రమకు దారి తీస్తాయి. *

*సత్యం నీలోనే ఉంది. ఇది సాధకుని హృదయంలో ఉంది. కాబట్టి ఒక తలుపు మీద 'భ్రాంతి' అని వ్రాసి, మరొకదానిపై 'సత్యం' అని వ్రాసి ఉంటే, వాటిలో దేనినైనా ఎంచుకోవడానికి తొందర పడకండి. రెండూ భ్రమలే. నువ్వు సత్యం. సత్యం అనేది మీ చైతన్యం. మరింత అప్రమత్తంగా మరియు మరింత ఎరుకతో ఉండండి. ఇది తలుపుల మధ్య ఎంచుకునే ప్రశ్న కాదు. మీరు అపస్మారక స్థితిలో ఉన్నందున చీకటి ఉంది, కాబట్టి బయటి నుండి వచ్చే కాంతి ఏదీ సహాయం చేయదు. నేను ఇప్పుడు మీకు దీపం ఇవ్వగలను, కానీ అది సహాయం చేయదు. మీరు మీ గదికి చేరుకునే సమయానికి, అది ఆరిపోతుంది.*

*మీరు మరింత మరింత చైతన్యంతో ఉండాలి మరియు అప్రమత్తంగా ఉందాలి, ఎందుకంటే మీ అంతర్గత జ్వాల మాత్రమే మీ పరిసరాలను ప్రకాశవంతం చేస్తుంది. ఆ వెలుతురులో అన్ని తలుపులు మాయమైనట్లు మీరు చూస్తారు. భ్రాంతి అయిన తలుపు మరియు సత్యమైన తలుపు రెండూ అదృశ్యమయ్యాయి. ఆ రెండూ కుట్ర పన్నాయి. నిజానికి, అవి రెండూ ఒకే ప్రదేశానికి దారితీస్తాయి. అవి మీకు ఎంపిక యొక్క భ్రమను మాత్రమే ఇస్తాయి. కాబట్టి మీరు ఏది ఎంచుకున్నా, మీరు ఎల్లప్పుడూ ఒకే విషయాన్ని ఎంచుకుంటారు. అవి రెండూ ఒకే మార్గానికి దారితీస్తాయి. చివరికి మీరు భ్రమలో ముగుస్తారు. కాబట్టి అది సమస్య కాదు. మరింత అప్రమత్తంగా ఉండటం ఎలా అనేదే సమస్య......*
.

No comments:

Post a Comment