మన పిల్లలను మనమే పొగడవచ్చా ??
...
మా అబ్బాయి ఇంత గొప్పవాడు
మా అమ్మాయి ఇంత గొప్పది అని వారిని పొగడటం మన అందరికీ ఒక అలవాటు అయిపోయింది. కానీ..
నిజానికి పిల్లలను కన్నవారు పొగడరాదు ....
.
మహాకవి భారవిని అతను బయట ఎంతగొప్పవాడని పేరు తెచ్చుకున్నా అతని తండ్రిమాత్రం
" ఆ వాడి ముఖం వాడికేం తెలుసులెండి !"
అని *కొట్టిపారేస్తూ* ఉండేవాడు.(ఈరోజుల్లో ఇలా కొట్టి పారేయరాదు)
.
ఇది *భారవి అంతటివాడిని బాగా నొప్పించింది .*
.
అతనిలోని *బుద్ధి నశించి తండ్రిని కడతేర్చాలని* నిశ్చయించుకొని ఆయన భోజనం చేసేటప్పుడు సరిగ్గా ఆయన నెత్తిన రుబ్బురోలు పడేసి తల పగలగొట్టేయాలని అనుకొని అది తీసుకొని అటకెక్కి కూర్చున్నాడు .
.
తండ్రికి అన్నం పెడుతూ భారవి తల్లి
" పాపం పిచ్చికుంక వాడిని మీరు తీసిపారేస్తే తట్టుకోలేకపోతున్నాడు .మహాకవి అని పేరు తెచ్చుకున్నాడు .వాడిని కాస్త పొగిడితే "".....
అని అనబోతుంటే ....భారవి తండ్రి ...ఓసి పిచ్చిదానా నాకు తెలియదటే వాడి అంతటి మహాకవి అసలు ఎవరున్నారు ? లోకులుపొగుడుతుంటే నాకు కలిగే ఆనందం నేను వర్ణించలేను ....
..
కానీ !! కన్న తండ్రి పిల్లలను పొగిడితే ఆయుక్షీణం ! వాడు చిరంజీవిగా మిగిలిపోవాలే ! అందుకే నేను వాడినిపొగడను !!
( పొగడకూడదు సరే.. మరి తిట్టడం ఎందుకు?..
క్రింది శ్లోకం లో పొగడ్త ల గురించి మాత్రమే ఉంది. తిట్టమని లేదు.
కొంతమంది మిడిమిడి జ్ఞానఅజ్ఞానులు అత్యుత్సాహం తో తమ సొంత పైత్యంతో ఇలాంటి కథలు చరిత్ర కారులకో, పౌరాణికులకో ఆపాదించి పిచ్చి కతలు చెప్పడంవల్ల నిజమైన సనాతనధర్మం యొక్క ఎంతో పాజిటివ్ ఉద్దేశ్యంను పెడమార్గం పట్టిస్తుంది. ఈతరం తల్లిదండ్రులారా.. మీ వారసులు జాగ్రత్త.జాగ్రత్త..జాగ్రత్తండీ..)
ప్రత్యక్షే గురవః స్తుత్యా
పరోక్షే మిత్రబాన్ధవాః
కార్యాన్తే దాస భృత్యస్య
పుత్రఃస్తుత్య కదాచన
.
గురువులను ప్రత్యక్షముగా పొగడవలెను. బంధుమిత్రులను పరోక్షమున
పొగడవలెను.
కార్యము ముగిసిన పిమ్మట దాస దాసీ జనములను పొగడవలెను.
కానీ సంతానమును మాత్రము ఎప్పుడూ పొగడరాదు
.
ఇది విన్నాడు భారవి ! అమాంతం అటక మీదనుండి దూకి తండ్రి కాళ్ళమీద పడి కన్నీటితో అభిషేకించాడు!!
🕉🕉🕉✡✡✡
తల్లి తండ్రులు పిల్లలను పొగడకూడదు, అలా అని తిట్టి కృంగదీయవద్దు- మీపై కక్ష పెంచుకోవద్దు కూడా .. ఏం చేస్తే మంచిది మరి!.. చూద్దాం..
వారి ప్రతిభను మీరు గుర్తించినట్లు తెలియా లి. అయితే ఇంకా చాలా నేర్చుకోవాలి కాబట్టి,
ఈరోజుల్లో ప్రపంచీకరణ , టెక్నాలజీ అభివృద్ధి వేగాన్ని అందుకొని జీవితంలో చాలా సక్సెస్ లు రావాలంటే పిల్లల్లో జిజ్ఞాస కలిగించండి. వారి మేథస్సు , లోకజ్ఞానం పెంచే విధంగా ప్రోత్సహించండి-కసి,పట్టుదల పెంచండి చాలు
🙂🇮🇳🧘♂️
🙏🤝🕉✡🌺🌷🌹💐
సవరణ:
–సుబ్రహ్మణ్యం చిట్రోజు
No comments:
Post a Comment