*అహంకారం, ఆవేశం మన ఆరోగ్యానికి మంచిది కాదు🙏💓*
*కొన్ని సందర్భాలలో మన మాటలను, ప్రవర్తనను నియంత్రించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది, అలాంటప్పుడు మనం దూకుడుగా స్పందించేస్తుంటాం. అప్పుడు మన పొరపాటును అంగీకరించకపోగా, తరచూ మన స్పందనను సమర్థించుకుంటూ ఉంటాము. ఈరోజుల్లో మన పరస్థితులకు మరియు బాధ్యతలకు చాలా శక్తిని, సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది..*
*మనలో చాలామంది మన జీవితాలను హడావుడిగా పరిగెడుతూ గడుపుతున్నాము. మనం త్వరగా ఆలోచిస్తున్నాము, ఆలోచించకుండా మాట్లాడుతున్నాము, అకస్మాత్తుగా స్పందిస్తున్నాము. ఒక్క క్షణం ఆగి పరిస్థితికి తగ్గ సరైన స్పందనను ఎంచుకోవడం లేదు, పైగా మన దూకుడు స్పందనలను సమర్థించుకుంటున్నాము.*
*మీరు దూకుడుగా స్పందించినప్పుడు, మీ ఈ దూకుడుకు ఏదీ, ఎవ్వరూ బాధ్యులు కారు అన్నది గుర్తించండి. దూకుడుగా ప్రవర్తించే స్వభావం వలన ముందుగా మీ ఆంతరిక శక్తి క్షీణిస్తుంది. తర్వాత, మీ ఆకస్మిక స్పందనకు బాహ్య పరిస్థితులను దోషిగా చేస్తే దాని వలన కూడా మీలోని శక్తి తగ్గుతుంది.*
*ప్రతి గంటకు ఒకసారి, ఒక్క క్షణం ఆగి, మీ స్పందనల నాణ్యతను పరిశీలించుకుని అవసరమైతే మార్చుకోండి. గుర్తుంచుకోండి – నేను శక్తిశాలి ఆత్మను, ఏమి జరిగినా కానీ నేను ప్రతి దృశ్యంలో సరైన విధంగా స్పందించడాన్నే ఎంచుకుంటాను. సరైన విధంగా స్పందించిన ప్రతిసారీ మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి.*
*ఏదైనా కర్మ లేక చర్య సరిగ్గా లేకపోతే, దాని గురించి ఆలోచించి ఇలా కాక మరింకెలా స్పందించి ఉంటే బాగుండేదో ఆలోచించండి. దీనిని మనసులో రిహార్సల్ చేసి, ఆ సరైన స్పందనను మనసులో చూసుకోండి.*
*మీ నిజ గుణాలైన శాంతి, ప్రేమ, ఆనందం శక్తి మరియు గౌరవాలతో స్పందించడం అనేది మీ మంచి సంస్కారం మరియు అవగాహనలకు క్రమ పద్ధతి. మీ ప్రవర్తనలో కనిపించేలా వెంటనే స్పందించకుండా ఉండటం మొదటి దశ, ఆ తర్వాత మీ మనసులో కూడా దూకుడుగా స్పందించకుండా ఉండాలి.*
*మిమ్మల్ని మీరు నేను శక్తి శాలి ఆత్మను.. సర్వశక్తివంతుడైన శివ పరమాత్ముని సంతానాన్ని.., నేను శాంతి స్వరూప ఆత్మును.., నేను ఆనంద స్వరూప ఆత్మను.. ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా, ఖుషి గా ఉంటాను.. అని మీ మనసులో సంకల్పాలు చేసుకోవాలి..*
*వెంటనే శివ✴️ పరమాత్ముని🕉️ మీద ప్రేమతో💓 ఓంకారాన్ని🕉️చేయాలి, మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.., అప్పుడు మీ మనసు సంతోషిస్తుంది.., శాంతిస్తుంది*
*ఓంకారం🕉️ చేసే సమయంలో మీ మనసులో💓 సంకల్పం ఇలా చేయాలి.. నా బలహీనతలు.., బాధలు.. అన్నీ భగవంతుడు🕉️ తీసుకొని నాకు శివశక్తిని✴️ ఇస్తున్నాడని*
 
No comments:
Post a Comment