. *మనిషి - జీవనము - సంస్కృతి.*
. ******************************
మనసు గల వాడే మనిషి.
మనసు లక్షణము ననుసరించి
మనుషులు 2 రకాలు.
1. సజ్జనులు. 2. దుర్జనులు.
సజ్జనులు సత్బుద్ధి గల వారు.
దుర్జనులు దుర్బుద్ధి గల వారు.
మనిషికి మనసే ప్రధానము.
ఏ మనిషి జీవనమైనా
ఆ మనిషి మానసిక వైఖరిని
అనుసరించియే కొనసాగును.
సమాజం కూడా ప్రభావం చూపుతుంది.
పరిసరాలు కూడా ప్రభావం చూపుతాయి.
మన ఆలోచనా సరళియే మనను నడుపుతుంది.
ముందు మన ఆలోచనా సరళి బాగుండాలి.
సజ్జన సాంగత్యం అలవరచుకోవాలి.
అపుడే మన జీవితం బాగుంటుంది.
సక్రమముగా సంతోషముగా కొనసాగుతుంది.
నలుగురిలో పరువుగా బ్రతుకు గలుగుతాం.
సమాజం పైన. పరిసరాల పైన
మన ఆలోచనా సరళి పైనా
మన జీవనం ఆధారపడి ఉంటుంది.
కలిసి ఉంటెనె కలదు సుఖం, సంతోషం.
మనుషులలో ఎందరో, ఎన్నో జంతువులు,
పక్షులు, క్రిమి కీటకాదులలో ఎన్నో
స్నేహముగా ఉంటాయి.
అపుడే మనసు హాయిగా ఉంటుంది.
పౌరసత్వము బలపడుతుంది.
చక్కని కీర్తి ప్రతిష్టలు ఆవరిస్తాయి.
పలువురితో కలసి మెలసి ఉండటం
చక్కని జీవనానికి నాంది.
దేవుడు ఉన్నాడని చెప్పలేము.
అట్లని దేవుడు లేడని చెప్పలేము.
అంత పరిజ్ఞానం మనకు లేదు.
దేవుడు ఉన్నాడని నిరూపించిన
భక్తులు ఎందరో ఉన్నారు.
ప్రహ్లాదుడు, చంద్రహాసుడు, పోతన,
త్యాగయ్య, రామదాసు, ఆదిగా
దేవుని గుర్తించిన వారే !
దేవుడు లేడని మొండిగా
వాదించెడి వారూ ఉన్నారు.
దేవుడు ఉన్నాడని నమ్మి
పూజించడమే ఉత్తమం.
మన పుట్టుకకు కారణం ఏదో ఉంటుంది !
అదే సృష్టి పరిణామం !
దీనీకి మూలం ఏదో ఉన్నది !
అదే దైవం !!
మన జీవన విధానమే సంస్కృతి.
మన చక్కని ఆలోచన పరిమితం కాకూడదు.
క్రొత్తవి ఎన్నో కనుగొనడానికి
ఉపయోగమవ్వాలి.
సైకిలు, మోటారు, రైలు, విమానం,
మొదలైనవన్నీ మన ఆలోచనల
ఆవిష్కరణలే !
ఈ ఆవిష్కరణలే మన సుఖ జీవన
ప్రయాణమునకు దోహదములు.
***********************
రచన:--- రుద్ర మాణిక్యం.( కవి రత్న)
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా).
**************************************
No comments:
Post a Comment