Tuesday, May 14, 2024

మందిని ముంచడం, ఇకపోతే వంచించడం

 *_నేడు సమాజంలో మందిని ముంచడం, ఇకపోతే వంచించడం ఇదే జరుగుతుంది. ఎలా సంపాదించాను అనేది కాదు డబ్బులు వచ్చాయా... అవసరానికి అవసరం తీరాయా.. ఆనందించానా.. అనేది తాత్కాలిక ఆనందాన్ని గురించి మాత్రమే మనిషి ఆలోచిస్తున్నాడు. పాపపుణ్యాలు మరిచి విచ్చలవిడి డబ్బు కొరకు ప్రవర్తిస్తు..  పరిగెడుతున్నాడు. నన్నెవరు చూస్తున్నారు..? నన్ను ఎవరు గమనిస్తున్నారు...? అంటూ చేయరాని పనులు చేస్తూ,సమాజంలో బడాబాబులుగా చలామణి అవుతున్నారు._*
*_ఆకలి వేస్తే నాలుగు మెతుకులు కొనుక్కు తినేంత  పెట్టుకుంటే చాలు కదా! రోగం వస్తే చూపించుకునేంత దాచుకుంటే సరిపోదా!దానికోసం నమ్మిన మనుషులను ముంచాలా..? దాచుకున్న సొమ్మును దోచుకోవాలా...?_*
*_దేవుడు మనల్ని ఏం చూస్తాడులే అని నలుగురిని మోసం చేసి పది కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారుల్లో డబ్బు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు కానీ,_*
*_చేసిన పాపాలు పండి ఆస్పత్రిలో రోజులు లెక్కపెట్టేటప్పుడు గోడమీద ఇలా రాసి ఉంటుంది' I C U' అని అంటే అర్థం "నేను నిన్ను చూస్తున్నాను".దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు కాబట్టి మనం పక్కవారికి ఏమి చేస్తామో అదే తిరిగి మనకు లభిస్తుంది..కర్మ అనుభవించక తప్పదు.☝️_*


 *_✍️మీ డా. తుకారాం జాదవ్. 🙏_*

No comments:

Post a Comment