Saturday, May 4, 2024

పునర్జన్మ

 *శ్రీగురుభ్యోనమః*
                       *పునర్జన్మ*  


*ప్రశ్న :   "ఈ విశ్వమంతా  నాలో  ఒక్కరేణువు"  అని  భగవద్గీత  అంటుంది.  దీనిని  అర్థం  చేసుకోవటమెట్లా ?*

*జవాబు :*  భగవంతుని  నుండి  ఒక  రేణువు  విడిపోయి  విశ్వమవుతుందని   దాని  అర్థం  కాదు.  ఆయన  శక్తి  పనిచేస్తోంది.  దానివల్ల  ఆ శక్తిలోని  ఒక  పార్శ్వం  విశ్వంగా  అభివ్యక్తమయింది.  అట్లాగే ..  పురుషసూక్తంలో  అన్నిజీవులూ  ఆయనకొక  పాదమన్నప్పుడు,  బ్రహ్మానికి  ఎన్నో  భాగాలున్నట్టు  అర్థంకాదు.

*ప్రశ్న :  నాకిది  అర్థమయింది.  బ్రహ్మం  అవిభాజ్యమని.*

 *జవాబు :*  అంటే ..   బ్రహ్మమే  సర్వము,  అవిభాజ్యము,  సదాప్రత్యక్షము.  కాని  మనిషికి  ఆ ఎరుక  లేదు.  దీనిని  అతను  గ్రహించాలి.  ఆత్మే  బ్రహ్మమన్న  పరమసత్యాన్ని  గ్రహించటానికి  గల  అవరోధాలను  అధిగమించటమే  జ్ఞానం.  ఆ అవరోధాల  కలయిక  వల్లనే  నీవొక  వ్యక్తివన్న  భావం  కలుగుతుంది.

             *"నీ సహజస్థితిలో  ఉండు"*
      *భగవాన్ శ్రీ రమణమహర్షి బోధనలు*
                         
🌷🙏🌷

No comments:

Post a Comment