Friday, June 28, 2024

 🔔 *సత్సంగం..* 🔔

సోమరితనం మనిషిని ఎందుకూ పనికిరానివాడిగా మారిస్తే, చురుకుదనం ఉన్నతుణ్ణి చేస్తాయి..

మానవ జీవితంలో అతి భయంకరమైన శత్రువు సోమరితనం..సర్వకాల సర్వావస్థల్లోనూ మన అభివృద్ధిని అడ్డుకోవాలని శత్రువు ఎలా చూస్తుంటాడో అలాగే సోమరితనం కూడా..అందుకే మనిషి కష్టాన్నే నమ్ముకోవాలి..

ఇంట్లో సౌకర్యవంతమైన ప్రదేశంలో పడుకొని విశ్రాంతి తీసుకుంటూ విజయం ఎలా సాధించాలో అని ఆలోచించే వారి సంఖ్య ఎక్కువే. అలాంటి వారికి చెప్పేది ఒక్కటే... మీరు విజేతగా నిలవాలంటే సోమరితనాన్ని విడిచిపెట్టండి..

సౌకర్యాలు, విశ్రాంతి వంటి పదాలను మరచిపోండి. కష్టపడి పనిచేయండి. విజేత కావాలనుకునే వారు ఎవరూ కూడా ఒకచోట కూర్చుని నిద్రపోతూ ఆలోచించరు..పనిచేస్తూనే ఆలోచిస్తారు..

మీరు కోరుకున్నది మీకు ఊరికే లభించదు.కష్టపడి పని చేస్తే మాత్రమే మీకు అది దక్కుతుంది. విజయం అంత సులభం కాదు. సోమరితనం ఉంటే విజయం ఆమడ దూరం ఉండడం ఖాయం..కాబట్టి ఏదైనా పని చేయాలంటే బద్దకాన్ని వీడి  ఇష్టపడుతూ, కష్టపడు  అప్పుడే నువ్వు అనుకున్నవి సాధించగలవు.

No comments:

Post a Comment