*"మీరు ఇతరులకు మంచిని బోధించే ముందు మీరు ఆచరించి చూపండి. మనం ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని బోధనలు శ్రవణం చేసినప్పటికీ, వాటిని ఆచరణలో పెట్టకపోతే అవి ఏమాత్రం మనకు సహాయం చేయలేవు. మీ తోటి వ్యక్తికి కించితైనా సహాయం చేయండి. అవసరమైనప్పుడు అది మీకు సహాయపడుతుంది. భారతీయలు గా జన్మించడం నిజంగా మీ అదృష్టం. భారతదేశంలో లేని ది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ ఈనాడు భారతీయులలో ప్రేమ తత్వము గోచరించడం లేదు. ప్రేమ ఒక్కటే ఉంటే ఇంక భారతీయులను మించిన వారు మరొకరు ఉండరు. కనుక ప్రేమచేత మన గౌరవాన్ని పెంచుకోవాలి. ప్రేమ చేత సత్య ధర్మాలను పోషిస్తూ రావాలి. ప్రేమయే మనలను సదా రక్షిస్తుంది."*
*~"భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు - సనాతన సారథి 1/2004."*
No comments:
Post a Comment