Thursday, June 27, 2024

 *ఆణిముత్యాలు!!!*   
    
"సహనంతో చాలా వివాదాలు, ప్రమాదాలు తగ్గుతాయి. సమర్దులకే సహనం ఉంటుంది. మంచికోసం తగ్గేవాడు ఎప్పుడు నా దృష్టిలో గొప్పోడే. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు ముమ్మాటికీ సమర్థుడే ."

సహనం ఉండాలి కానీ, అ సహనం అన్నివేళలా  పనికిరాదు. దేనికైనా ఒక హద్దు, అదుపు ఉండాలి. ఎక్కడ ప్రదర్శించాలి. ఎక్కడ ప్రదర్శించకూడదు అనేది తెలిసి ఉండాలి...

ఎవరికైనా సరే ఒకసారి చెప్పండి లేదా, రెండుసార్లు చెప్పండి. ఇకపోతే పదిసార్లు కూడా చెప్పండి. అయినా వినకపోతే వారి కర్మకే వదిలేయండి. ఎందుకంటే, ముందు మీరు ప్రశాంతంగా ఉంటారు.

"మేఘం బరువు మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది. మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరు బయటకు వస్తుంది." పర్వాలేదు కన్నీరు ఆపకండి. ఎందుకంటే, గుండె బరువు తగ్గుతుంది.
 
అంతమాత్రాన కన్నీరు కారుస్తూ కూర్చోకండి. అ కన్నీటికి కారణమైనదాన్ని కాసేపు వదిలేయండి. ప్రశాంతంగా మారండి. తప్పకుండా అన్ని సర్దుకుంటాయి.

బాధలో నిర్ణయాలు, ఆవేశంలో వాగ్దానాలు, నిన్ను మరింత బాధకు గురిచేస్తాయి. ప్రశాంతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు. నీ జీవిత గమనాన్ని మార్చేస్తాయి.

నీ మేలు" కోరేవారు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు, నిరంతరం నిన్ను పొగుడుతుంటే నీ కీడు కోరుతున్నట్టే. భజన చేసేవారు కాదు ప్రశ్నించే వారే నీ శ్రేయోభిలాషులు.

No comments:

Post a Comment