ఆత్మానందం
➖➖
ఈ మానవ జన్మ మళ్లీ మళ్లీ వచ్చేటటువంటిది కాదు.
ఈ ప్రాణమూ దేహమూ శాశ్వతంగా ఉండిపోవు కూడా.
ఇది మాయామయమగు లోకము కనుక ఇక్కడ దొరికే సుఖాలు కూడా మాయతో కూడినవే!
ఇది స్వార్థపూరితమైన ప్రపంచం కనుక ఇందులో ఉండే బంధాలన్నీ స్వార్థపూరితమైనవే!
ఇక్కడ మనదంటూ బయట ఏదీ లేదు.
మనదంటూ ఏదైనా ఉందంటే అది మన లోపలే ఉంటుంది.
అదియే ఆత్మానందము.
ఈ ఆత్మానందము చిక్కవలెనంటే పరలోకమునందే!
పరలోకమనగా ఎక్కడో ఆకాశం పైన లేదు! మనలోనే ఉంటున్నది.
కుండలో పాలుపోసి కవ్వముతో బాగుగా చిలికినపుడు వెన్న రావడం జరుగుతుంది.
అదే విధముగా మనస్సును భగవన్నామమనే కవ్వంతో బాగా చిలకాలి. అపుడే ఆత్మానందమనే వెన్న లభిస్తుంది.`
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
No comments:
Post a Comment