Saturday, June 22, 2024

 *_Pasupula Pullarao        జీవితంలో సక్సెస్ అనేది ఊరికేరాదు, కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది, కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది, మనసుకి గాయాలు అవుతాయి, బాధలు తట్టుకోవాల్సి వస్తుంది,_*

*_కొన్నిసార్లు కొందరి మాటల వల్ల బంధాల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది, గుండె ముక్కలవుతుంది... అయినాసరే సంకల్పంతో నువ్వు అనుకున్న లక్ష్యం కోసం ఎదురు దెబ్బలు తిను... సహనంతో మెలుగు, గుణపాఠాలు నేర్చుకో... అనుభవ పాఠాలు దిద్దుకో... ప్రతిక్షణం నీతో నీవు యుద్ధం చేయి నీ గమ్యం చేరుకునేదాక._*

*_ప్రయత్నం, అవకాశాలు వాటికవే రావు, నీవే వాటిని సృష్టించు కోవాలి... వేసే ప్రతి అడుగు... గడిపే ప్రతి ఘడియ... పలికే ప్రతి పలుకు... చేసే ప్రతి చర్య... ఆలోచన అనే ఆయుధంతో, నీ శ్రమను నమ్ముకుని సంకల్పంతో ముందుకు వెళ్ళు..._*

*_జీవితం నేర్పింది ఒక్కటే... దేనికి ఎదురు చూడవద్దని... ఎవరి మీద ఆధారపడవద్దని... నీకు నువ్వే తోడని... ఆత్మవిశ్వాసంతో నువ్వు వేసే ప్రతి అడుగు నీ విజయానికి తొలిమెట్టు కావాలి..._*

*_కాబట్టి, నిన్ను నువ్వు నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో ముందడగు వేయి నీకు విజయం తధ్యం.☝️_*
అన్ని అనుకున్నట్లు జరగాలంటే    నీలోకి నీవు ప్రయాణించాలి.. నీలోకినీవు ప్రయాణించే మార్గమే సరైన సాధన.. శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాస మరియు ఆలోచనలు స్థితికి చేరుకోవడమే సరైన సాధన. 
     నిద్రలో  మనసుకు రెస్ట్, mind కి రెస్ట్ దొరుకుతుంది తాత్కాలికంగా.. అదే సరైన సాధనలో mind కి మనసుకు రెస్ట్ దొరుకుతుంది పూర్తిగా.. 
ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.. సాధకులకు ప్రతి రోజు యోగా డే 

   

No comments:

Post a Comment