Monday, June 24, 2024

 *_పక్కింటి కుక్క ఒకటే ఏడుస్తోంది. కొంతసేపు ఏడ్చి ఆపేస్తుందిలే అనుకుంటే, అది రోజంతా ఏడుస్తూనే వుంది._*

*_దాని ఏడుపు భరించలేక ఆ ఇంటి పెద్దమనిషిని అడిగాను...“ఆ కుక్క అలా ఏడుస్తుంటే దాని బాధ నివారించరా.? ”_*

*_“సమస్య ఏమిటంటే, ఆ చెక్క బల్లమీదే కూర్చుంటుంది. ఐతే ఆ చెక్క బల్ల మీద మొనదేలిన మేకు వుంది. ఆ మేకు గుచ్చుకుంటూంటే బాధ భరిస్తూ ఏడుస్తూంటుంది.”_*

*_“మరి ఆ కుక్క అక్కడి నుండి ఎందుకు లేవదు.? ”_*

*_“ఆ కుక్కకు ఆచెక్క బల్లమీదే కూర్చునే అలవాటు. అయితే ఇప్పుడు ఆ మొనదేలి వున్న మేకున్నా దాని మీదే కూర్చుని ఆ బాధ అనుభవిస్తూ వుంది. కానీ లేవడం లేదు.” అన్నాడా యింటి యజమాని._*

*_మనం కూడా చాలా రకాల ముళ్ళమీద కూర్చుని ఏడుస్తూనే జీవితాన్ని గడుపుతాం._*

*_మనం చేసే ఉద్యోగం ఇష్టం లేదు, బాస్ అంటే ఇష్టం లేదు. ఆ వాతావరణం బాగా లేదు. వాళ్ళు ఇచ్చే జీతం తృప్తిగా లేదు. అయినా ఏడుస్తూ గడుపుతాం._*

*_బాంధవ్యాల ముళ్ళమీద కూర్చుని బాధపడేవాళ్ళు కొందరు._*

*_ప్రేమ, అభిమానం, గౌరవం లేని బాంధవ్యాలను విధిలేక మూగగా ఏడుస్తూ కొనసాగిస్తుంటారు._*

*_అంతేకాక ఆరోగ్యం, కుటుంబం, స్నేహం, దురలవాట్లవంటి అనేక ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంటాయి. అయినా వాటిని వదలలేం. వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయం._*

*_అవి ‘భరించలేనివిగా మారినప్పుడు చూద్దాంలే ' అనుకుంటాం._*

*_గుచ్చుకుంటున్న ముళ్ళను తొలగించుకోకపోతే భరించలేని స్థితికి చేరుకుంటారు. జాగ్రత్త మిత్రమా..._*

        *_-మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹🌻🙇🏻🌻🌹🌹🌹

No comments:

Post a Comment