శాశ్వత అశాశ్వతాలు
✳️🥀🌹🪷🌻✳️🥀🌹🌻🪷✳️
🪷 మనిషి జీవిస్తున్నప్పుడే నేర్చుకోవాలి♪. నేర్చుకుంటూ జీవించాలి♪. బతకడం జీవించడం కోసమే కాదు♪. జ్ఞాన సముపార్జన కోసం కూడా♪. జీవిస్తూ ఏం నేర్చుకుంటున్నాం అన్నది ముఖ్యం♪. మనల్ని అతి వేగంగా ఆకర్షించేవి అజ్ఞానం, మోహం♪. ఆ రెండింటినీ తప్పించుకుని ముందుకు వెళ్తేనే జ్ఞానోదయం అవుతుంది♪.
🪷 ఈ లోకంలో శాశ్వతమైనది ఏదనే విషయం ముందు తెలుసుకోవాలి♪. శాశ్వతమైనది తెలిస్తే మనల్ని ఎప్పట్నుంచో వెంటాడుతున్న మరణభయం తొలగిపోతుంది♪. శాశ్వతమైనది తెలిస్తే ఏది అశాశ్వతమైనదో కూడా తెలుస్తుంది♪. ఈ రెండింటినీ పూర్తి అనుభూతిలోకి తెచ్చుకున్నవాడే నిజమైన మానవుడు♪. అతడే జ్ఞాని♪. అతడే యోగి♪. శ్రీకృష్ణుడు చెప్పిన ఉత్తమమైన యోగి అతడే♪.
🪷 శాశ్వతంగా ఉండేది ఏదీ కళ్లకు కనిపించదు♪. అంతా అశాశ్వతంగా అనిపిస్తుంది♪. ఈవేళ ఉండి రేపు కనిపించకుండా పోయేవి ఎన్నో♪. మరి శాశ్వతంగా ఉండేది మనకు ఎలా తెలుస్తుంది♪?
🪷 శాశ్వతంగా ఉండేది ఆత్మ♪. అది నీలోనే ఉంది♪. నువ్వు పుడతావు, మరణిస్తావు♪. కాని, నీ ఆత్మకు చావు పుట్టుకలు లేవు♪. అది శాశ్వతంగా ఉంటుంది♪. దాన్ని ఎవరూ చంపలేరు♪. ఇది తెలుసుకుని జీవించేవాడే తనకు ఆప్తుడని పరమాత్మ భగవద్గీతలో విశదీకరించాడు♪.
🪷 దీన్ని ఎలా నమ్మాలి? అర్జునుడికి చాలా సందేహాలు కలిగాయి♪. నమ్మకం కుదరలేదు♪. కాని చెప్పినవాడు శ్రీకృష్ణుడు♪. ఏం చెయ్యాలి? చూస్తేనే గాని నమ్మదు మనసు♪. ఆత్మను మామూలు కళ్లతో చూసే అవకాశం లేదు♪. అది జ్ఞానంతోనే చూడగలం♪. అటువంటి జ్ఞాననేత్రం కావాలి♪. అది అందరికీ ఉంటుంది♪. కాని, మూసుకుని ఉంటుంది♪. దాన్ని తెరిపించాడు శ్రీకృష్ణుడు♪.
🪷 ఈ భూమ్మీదకు మనం వచ్చింది రెండు విషయాలు తెలుసుకోవడానికి♪. ఒకటి శాశ్వతమైనదాని గురించి, రెండోది అశాశ్వతమైనదాని గురించి♪. ఈ రెండూ తెలిస్తే సర్వమూ తెలిసినట్లే♪. శాశ్వతమైనది ఆత్మ♪. అశాశ్వతమైనది శరీరం♪. ఆత్మ కనిపించదు♪. శరీరం కనిపిస్తుంది♪. కనిపించనిది ఎప్పుడూ ఉండేది♪. కనిపించేది ఎప్పుడూ ఉండనిది. అదే గమ్మత్తు♪!
🪷 జీవించడానికి తిండి, నిద్ర, గాలితోపాటు శుద్ధజ్ఞానం కూడా కావాలి♪. ఏ కాలుష్యం లేని అసలు సిసలైన సత్యస్వరూప జ్ఞానం వల్లనే ఆత్మ ఉనికి తెలుస్తుంది♪. ఆత్మ తెలిస్తే, ఇక రెండోది తెలుసుకోవడానికి ఏమీ మిగలదు♪. శాశ్వతమైన ఆత్మలో జగత్తు ఉంది♪. ఆత్మకు పూచిన పువ్వు వంటిది ఈ ప్రపంచం♪. ఆత్మాన్వేషణే జీవితం♪. తెలిసో తెలియకో ప్రతి ఒక్కరూ చేసే పని తమ ఆత్మను తాము వెదుక్కోవడమే♪. ఇదే బతుకు♪!
శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు♪. శరీరం ఉపకరణం, ఉపాధి. దీన్ని ఆధారం చేసుకునే ఆత్మను చేరుకోవాలి♪.
🪷 శరీరం నేను కాదు. ఈ శరీరంలో నేను నివసిస్తున్నాను♪. అశాశ్వతమైన దానిలో శాశ్వతమైనవాడు ఉంటున్నాడు♪. వాడు సర్వ జీవుల్లో ఉంటున్నాడని తెలుసుకోవాలి♪.
🪷 ఎవరైతే మానవసేవను మాధవసేవగా భావిస్తారో, వారు శరీరాన్ని పరులకోసం వినియోగిస్తారు♪. పరోపకారమే పరమార్థంగా భావిస్తారు♪. శాశ్వతమైన ఆత్మకోసం అశాశ్వతమైనదాన్ని తృణప్రాయంగా భావిస్తారు. అటువంటివారే లోకానికి ఆదర్శప్రాయులై వెలుగొందుతారు♪!
❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు
సేకరణ:
✳️🥀🌹🪷🌻✳️🥀🌹🌻🪷✳️
No comments:
Post a Comment