*శ్రీ గురుభ్యోనమః*
*బాధ - నీతి*
*ప్రశ్న : మనమంతా విముక్తులమే, మనకే బంధమూ లేదు, మనం భగవంతుని నుండి నిప్పు కణాల వలె వచ్చాం. తిరిగి ఆయననే చేరుతామంటారు శ్రీ శంకరాచార్యులు. అట్లా అయితే, అన్ని రకాల పాపాలనూ ఎందుకు చేయకూడదు ?*
*జవాబు :* మనకి, ఆత్మకీ బంధంలేని మాట నిజమే ! చివరికి, నీ మూలంలో నీవు చేరుతావన్నదీ నిజమే ! ఈ లోగా నీవనే పాపకార్యాలు చేస్తే వాటి ఫలితాన్ని అనుభవించాల్సిందే, దానిని తప్ఫించుకోలేవు. ఎవరైనా వచ్చి నిన్ను బాదుతూంటే .. "నేను విముక్తుడ్ని, ఈ దెబ్బల వల్ల నాకే బంధమూ లేదు, నాకే బాధా లేదు, వాడు కొట్టితే కొట్టనీ" అనగలవా ? అట్లా నిజంగానే నీకనిపిస్తే నీ ఇష్టం వచ్చినట్టు నీవు చేయవచ్చు. "నేను విముక్తుడ్ని" అని పెదవులతో అనటంలో అర్థమేమిటి ?
*ప్రశ్న : ప్రపంచమంతా ఈశ్వరుని లీల అని, అంతా బ్రహ్మమయమనీ అంటారు. అటువంటప్పుడు దురభ్యాసాలని విడనాడాలని ఎందుకంటారు ?*
*జవాబు :* మనిషి శరీరంలో ఒక పుండుందనుకో, శరీరంలో కొంచెం భాగమే నంటూ నిర్లక్ష్యం చేస్తే అది శరీరానికంతా నొప్పిని కలిగిస్తుంది. మామూలు వైద్యంతో నయం కాకపోతే, డాక్టరు వచ్చి కత్తితో దానిని కోసివేసి ఆ మాలిన్యాన్ని తీసివేయ వలసి వస్తుంది. ఆ భాగాన్ని తీసివేయకపోతే కుళ్ళుతుంది. తీసివేసిన తరువాత సరిగ్గా కట్టు కట్టకపోతే, చీము పడుతుంది. ప్రవర్తన విషయమూ అంతే ! దురభ్యాసాలు, దురలవాట్లూ దేహంలో కురుపువంటివే ! ప్రతి రోగానికీ తగిన వైద్యాన్నివ్వాలి.
*(ప్రశ్న :: _"జ్ఞానాగ్ని"లో కర్మలన్నీ దగ్ధమైపోతాయి అంటారు కదా. ఎలా, ఏ విధంగా దగ్ధమవుతాయి ??)_*
*గురుదేవులు :: "కర్మ" అనేటువంటిది జీవితాన్ని బంధిస్తున్నది. ఈ జీవన బంధన నుండి విడుదల పొందాలని– 'కర్మ రాహిత్యం' పొందడానికి నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వాటి ద్వారా నీకు సాధ్యం కాదు. కేవలము ఈ విధమైనటువంటి అవగాహనతో, (అంటే)*
ఇవి
చైతన్యము యొక్క
పాత్రలు
చైతన్యము యొక్క స్థితులు
అని చక్కగా అవగాహన
చేసుకొని,
* నీ జీవితములో
'చైతన్యము యొక్క
పాత్రల'ను
నీవు గుర్తెరిగి,
* ఏ చైతన్యము ఎందుకు
ఉద్దేశింపబడిందో కూడా
తెలుసుకొని,
ఆ భగవంతుణ్ణి–
(అంటే)
ఏ భగవంతుడు "వ్యక్తమై"
అవతరించాడో,
అవతరించినటువంటి
అవతారపురుషుని యొక్క
విధేయతలో,
అవతారపురుషుని యొక్క
సర్వార్పణ స్థితిలో
నీ యొక్క సర్వ కర్మలూ
దగ్ధమవుతవి.
*అదే జ్ఞానాగ్నిలో కర్మలన్నీ దగ్ధమవుతవి అంటే.*
*ఏది 'జ్ఞానము'?*
* ఈ పుస్తకములన్నీ చదివి
సముపార్జించినటువంటి
సిద్ధాంతమా,
జ్ఞానమంటే ?
_కాదు !_
* - ఈ జీవితమంటే
ఏమిటో, లేదా
- ఈ "కర్మ" అంటే
ఏమిటో,
- ఈ దేవుడంటే
ఏమిటో
- ఈ "చైతన్యమంటే"
ఏమిటో
చక్కగా నిర్వచించ
గలిగినటువంటిదా
జ్ఞానమంటేను ?
_కాదు !_
*(మరి) ఏది జ్ఞానము ?*
_ఏ గురువు,_
_నీవు విధేయుడవై_
_ఉన్నటువంటి_
_ఏ గురువు,_
_నీకు విధించినటువంటి_
_కర్మ ఆచరణకు_
_అవసరమైనటువంటి_
_"విజ్ఞత"ను నీవు పొంది_
_ఉంటావో,_
అది మాత్రమే జ్ఞానము !
_అంటే,_
_గురువు యొక్క ఆదేశమే_
_జ్ఞానము!_
*"జ్ఞానయోగము" అంటే– ఆ గురువు యొక్క ఆదేశమునకు బద్ధుడవై నీవు జీవించడమే "జ్ఞానయోగము"!*
*ఈ విధముగా, ఈ జ్ఞామనేటువంటి ఈ యోగము ద్వారా "కర్మ"ను రహితం చేసుకోవడం, ఈ "కర్మ రాహిత్య స్థితిలో– నీ వాస్తవమైనటువంటి స్థితి యొక్క అనుభవం పొందడమే గాక,*
_ఏ "ఉపాధి"_
_నీవు ఆటంకమని_
_అనుకుంటున్నావో,_
_వేటిని నీవు త్యజించాలని_
_నీవు కోరుతున్నావో,_
_ఆ 'శరీరముల' ద్వారానే_
_నీవు "దైవీ జీవితాన్ని"_
_జీవించగలుగుతావు–_
_దైవమై !_
°° "Existence is Real, Life is Shadow "
*"నీ సహజస్థితిలో ఉండు"*
*భగవాన్ శ్రీ రమణమహర్షి బోధనలు*
No comments:
Post a Comment