*🧚♂️క్షమిద్దాం 🧚♂️*
☘️💦🌻🌹💜🌈
*ఓ సారి పొరపాటుగా*
*ఇంకో సారి ఆవేశంతో*
*మరోసారి ద్వేషంగా*
*మళ్ళీ అహంకారంతో*
*ఎన్నో సార్లు ఎన్నో విధాలా*
*మనం ఒకరిని బాధ పెడుతుంటాం*
*ఒకరి వల్ల బాధ పడుతుంటాం*
*కసితోనో.. కోపంతోనో.. ఆవేదనతోనో*
*వారికి నచ్చ జెప్పాలాని*
*విప్పి చెప్పాలని*
*గుణపాఠం చెప్పాలనుకున్నా*
*ఇద్దరికీ సమన్వయం కుదరకపోవచ్చు*
*ఇబ్బంది పడ్డ ప్రతి సారి*
*కక్ష తీర్చుకోవాలన్న సంఘర్షణ*
*మనల్ని వెంటాడుతున్నా*
*ఆరోగ్యకరమైన ఆయుధాన్ని వాడుదాం*
*అదే క్షమాపణ...*
*తప్పు చేయాలి.. చేయించాలి*
*శిక్ష అనుభవించాలి.. శిక్షించాలి*
*అనే భావాన్ని వదిలేసి*
*క్షమించడం అలవాటు చేసుకుందాం*
*ఒకరితో కాకపోయినా*
*ఇంకెందరితో మన అనుబంధం*
*ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటుంది...* 🎣
☘️💦🌻🌹💜🌈
No comments:
Post a Comment