Sunday, July 27, 2025

 *ఉల్లికారం* 

ప్రభాకర్ పెదపూడి 

"ఏమండోయ్! ఎంతసేపూ ఆ దొడ్లో పడేడుస్తారు. కాస్త ఆ దొండ పందిరి దగ్గరకెళ్ళి నాలుగు దొండకాయలు తుంపుకు రాకూడదూ!" రత్నమ్మగారు వంటింట్లోంచి అరిచారు. "ఆ ఆ నువ్వు చెప్పాక వెళ్ళక చస్తానా! కాస్త ఉల్లికారం తగిలించు మహా బేషుగ్గా ఉంటుంది" అంటూ దొడ్డి గోడ దగ్గరున్న దొండ పందిరి దగ్గరకి నడిచారు భర్త. "అవతలి దొడ్లో సుగుణకేసి చూస్తూ పక్కనున్న కాకరకాయలు తుంపుకు రాకండి, వెధవ బుద్ధులు. పెళ్ళయినప్పటినుండీ అవే వంకర చూపులు" వంటింట్లోంచి అరుపులు. "ఇదిగో నీకు చాలాసార్లు చెప్పాను సుగుణ నాకన్నా వయసులో పెద్దదని "గట్టిగానే అన్నారు భర్తగారు. "ఆ ఆ మీరు పెద్ద గుణవంతులు, సుగుణవంతులూనూ, వయస్సు తారతమ్య మొకటి. మీకన్నా నేను దగ్గరదగ్గర పదహారేళ్ళు చిన్న, ఆ విషయం ఆలోచించారా! పెళ్ళి పీటలమీద మీరు తాడి చెట్టులాగా, నేను తులసి మొక్కలా ఉన్నామని మా వాళ్ళందరూ చెవులు కొరుక్కున్నారు ఆ రోజుల్లో  కళ్ళు చీరచెంగుతో తుడుచుకున్నారు రత్నమ్మగారు. "ఇదిగో! ఏడుపు ఆపి, ఉల్లికారం ఏమీ అక్కర లేదు. చప్పిడి కూరే చేసి ఏడు" దొండకాయలు కిందపోస్తూ అన్నారు భర్త. అయ్యయ్యో! ఈయన మనసు బాధపెట్టినట్లున్నాను ఉల్లికారం తయారుచేస్తూ అనుకున్నారు రత్నమ్మగారు.

No comments:

Post a Comment