Tuesday, July 29, 2025

 *గరుడ పంచమి.....* 

*జూలై 29 మంగళవారం గరుడ పంచమి సందర్భంగా...* 

*గరుత్మంతుడు పక్షులకు రాజు. సర్పజాతికి శత్రువు. ఆయన గొప్పదనమంతా విష్ణుమూర్తిని వాహనరూపుడై సేవించడంలోనే ఉంది. నిరంతర స్వామి పాదసేవా పరాయణుడు గరుడుడు. అపార శక్తికి, అద్భుత గమనానికి సంకేతంగా ఆ పక్షిరాజును దేవతలు భావిస్తారు. వినతా సుతుడైనందున వైనతేయుడయ్యాడు. గరుత్మంతుని అన్న అయిన అనూరుడు సూర్యునికి రథసారథయ్యాడు. రెండో కుమారుడైన గరుడుడు విష్ణుమూర్తికి వాహనమయ్యాడు.* 

*దేవేంద్రుని వజ్రాయుధం దెబ్బలను కూడా తట్టుకోగలిగిన శక్తి గరుత్మంతుని రెక్కలకు ఉంది. అందుకే ఆయనను సుపర్ణుడు అన్నారు. అందువల్లనే దేవేంద్రుని ఓడించి అమృతాన్ని తెచ్చి సవతి తల్లికిచ్చి కన్నతల్లికి దాస్య విముక్తి కలిగించాడు. ఈ విధంగా తల్లికి దాస్య విముక్తి కలిగించిన రోజే శ్రావణ శుద్ధ పంచమి. విష్ణువు పతాకం మీద గరుత్మంతుడు అధిష్ఠించి ఉంటాడు.* *విష్ణునామాల్లో గరుడధ్వజుడనేది ప్రసిద్ధనామం.*

*┈┉┅━❀꧁జై గరుడా꧂❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁

No comments:

Post a Comment