Sunday, July 27, 2025

 
🙏🏻 *రమణోదయం* 🙏🏻

*భగవంతుని తమ హృదయంలో ప్రతిష్ఠించుకొని జీవించే ఉత్తమ భక్తులు ఒక స్తంభాన్ని పట్టుకొని చుట్టూ తిరిగి పరుగెత్తే చిన్న పిల్లల వంటి వారు. (అంటే క్రింద పడతారేమోనన్న భయం లేనివారు). అచంచలమైన భక్తి గలవారు నిరహంకారులు కాబట్టి జగన్మాయలో పడరు.*

భగవద్దర్శనం మన లోపల కలిగేది గాని
వెలుపల కలిగేది కాదు.
మనస్సు అంతర్ముఖం చేయబడినప్పుడు,
భగవంతుడు  అంతర చైతన్యంగా
మనకు సాక్షాత్కరిస్తాడు!

జీవిత భోగాల కోసం
దేవుడు సాధనంగా ఉండకూడదు.
దేవుని కోసం
జీవితం సాధనంగా ఉండాలి.

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏🏻

🙏🏻🌹ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🌹🙏🏻

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.735)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*

🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment