Sunday, August 3, 2025

 *@ రోడ్డు మీద జ్ఞానోదయం @36
         తేది: 27/07/2025
"""""""""""""""""""""""""""""""""""""""""""""

బడిలో బట్టీకొట్టిన పాఠాలకు,
కాలేజీలో కుస్తీపట్టిన చదువులకు,
వర్సిటీలో పల్లెవేసిన విషయాలకు
మించి
ఓ ట్రాఫిక్ జామ్ మనిషికి
గొప్ప లైఫ్ స్కిల్స్ నేర్పిస్తుంది
అంటే చాలామంది నమ్మరు నమ్మిందే
నిజంకాదని,నమ్మనిదానికీ నిజమయ్యే
అర్హత ఉందని చాలాసార్లు మన
శాస్త్రవేత్తలు నిరూపించారు కాబట్టి,
చెప్పాలనుకున్నది చెప్పేయడమే
తక్షణ కర్తవ్యం..!
ఒడుదొడుకుల జీవితం గజిబిజి రోడ్లకు ప్రతిబింబం అందులో
ఇంటికెప్పుడు చేరతామో తెలియని ప్రయాణం అంతులేని
జీవన గమనాన్ని స్పురింపజేస్తుంది ఆగలేని ఆరాటం,వెళ్లలేక
పోరాటం చిన్నచిన్న సందుల్లో సైతం ముందుకెళ్లిపోవాలనే
ద్విచక్ర వాహనదారుల ఉత్సాహం, దారిలేదని తెలిసీ దూరిపో
యేందుకు ప్రయత్నించే ఆటో అన్నల ప్రయత్నం... వెరసి,అవకాశాలు ఉన్నవి తీసుకోవడం కాదు,
కొత్తవి సృష్టించుకోవాలనే
పెద్దల మాటను కొంచెం గట్టిగానే పాటిస్తున్నట్లు అనిపిస్తుంది
ఉన్నత విద్యాసంస్థల్లో బోలెడంత ఖర్చుపెట్టి నేర్చుకునే
కమ్యూనికేషన్ స్కిల్స్ ను ట్రాఫిక్ లో చాలా సులభంగా ఆపోశన
పట్టేయొచ్చు ఎక్కడి నుంచో హఠాత్తుగా దూసుకొచ్చి, ప్రాణాలు
తీసేంత పనిచేసే మహానుభావులను...
కసితీరా తిట్టడానికి అతివేగంగా దూసుకొచ్చే బూతులను నోరు దాటకుండా ఆపగలిగితే
మీకున్నంత,సౌమ్యత ఇంకెవరికి ఉన్నట్టు? దారి కనపడనంతగా
వాహనాలున్నాయని తెలిసినా...
ఆగకుండా హారన్ వాయించే
వెనక బండి వారిని జాలిగా ఓ చూపు చూసి వదిలేస్తే అంత
కుమించిన స్థితప్రజ్ఞత ఎక్కడైనా ఉంటుందా..?
పదేపదే పలకరించే ఫోన్ కాల్స్,
ఎవరో రావాలి, ఏదోచేయాలి అని ఆశగా చూసే ఎదురుచూపుల మధ్య ఈసారి
ట్రాఫిక్ లో చుట్టూ ఒకసారి తలతిప్పి చూడండి
కార్ల అద్దాలు
తుడుస్తూ అటూ ఇటూ పరిగెత్తే చొక్కా చిరిగిన కుర్రాడు, కదల్లేని స్థితిలోనూ నెమ్మదిగా అడుగులేస్తూ పెన్నులు విక్రయించే
వృద్ధురాలు, ఆనందాన్ని పంచుతూ తన బతుకులో ఆసంతోషాన్ని ఎరుగని బుడగలు అమ్మే ఓ చిన్నారి...
ఎటువంటి పరిస్థితుల్లోనైనా జీవితానికి ఎదురీదాలనే ఓ గొప్ప
మేనేజ్మెంట్ పాఠాన్ని
చెప్పకనే చెబుతున్నట్టు తోస్తుంది..!*

No comments:

Post a Comment