Sunday, August 3, 2025

 మనిషికి మల్లే 
మాటలు రాని, మహిమలు తెలియని 
'జాతి' జంతువుది..
ప్రకృతిలో ఎదిగిందీ ఒదిగిందీ..

అహంకారం, ఆధిపత్యం తో 
తెలివినీ, బరితెగింపునీ సాధించిన 
'జాతి' మనిషిది..

అందుకేనెమో మనిషి -
తన జాతి నే
తన ప్రపంచాన్నే 
తనను కాపాడే ప్రకృతినే 
నాశనం చేసుకుంటూ..

మతాలు చూపే పవిత్ర పరలోకానికి పయనమయ్యాడు..
తన మరణ శయ్యనూ, శాసనాన్ని 
అందంగా తనే సిద్ధం చేసుకుంటున్నాడు..

No comments:

Post a Comment