*@ సృజనే నిచ్చెన @ 39
తేది:2/08/2025
""""""""""""""""""""""""""""""""""
అందరూ చూసేదాన్నే నువ్వూ చూస్తున్నా దాని గురించి
ఎవరూ ఊహించని విధంగా ఆలోచించడమే సృజనాత్మకత అంటారు విఖ్యాత శాస్త్రవేత్త
ఐన్ స్టీన్ అందుకే
అలాంటి సృజనాత్మక రచననో, పనినో,సినిమానో చూస్తే
'భలే ఉందే' అని అబ్బురపడతాం మనకీ ఆలోచన
రాలేదే అనీ అనుకుంటాం
ఈ సృజనని ప్రకటనల్లో చాలా ఎక్కువగా చూస్తాం
దశాబ్దాల కిందట
'ఓనర్స్ ప్రైడ్,నైబర్స్ ఎన్వీ' అని వచ్చిన
ఒనీడా టీవీ ప్రకటన ఎంతగానో ఆకట్టుకుంది
ఈ టీవీ
మీకు గర్వకారణమే కాదు పక్క వాళ్ళు అసూయచెందేలా
ఉంటుందన్న ఆ ప్రకటన సారం సగటు మనిషి ఇగోను
తృప్తిపరుస్తుంది ఈ మధ్య
వచ్చిన స్విగ్గీ ఇన్ మార్ట్
ప్రకటనలో ఓ యువతి
బ్రూమ్ (చీపురు) అని ఆర్డర్
పెట్టబోయి పొరపాటున
గ్రూమ్ (వరుడు) అని టైప్
చేస్తుంది వెంటనే డెలివరీ
బాయ్స్ ఓ మండపంలో
ఉన్న పెళ్లికుమారుణ్ని ఎత్తు
కొస్తారు ఇంతలో ఆమె
బ్రూమ్ అని ఆర్డర్ని సరిచేయడంతో
వెంటనే వరుణ్ని
దింపేసి, చీపురు పట్టుకెళ్లి ఇచ్చేస్తారు ఏ వస్తువు ఆర్డర్
చేసినా క్షణాల్లో తెచ్చిస్తామన్న సందేశాన్ని సృజనాత్మకంగా
చూపించిన ఆ ప్రకటన వినియోగదారులను ఆకర్షిస్తోంది
చేసే పని ఏదైనా భిన్నంగా ప్రయత్నించడమే సృజనాత్మకత
మూసలో పోసినట్లుగా పని చేసుకుంటూ పోతే ఏ
వృత్తిలోనూ ఎదుగూబొదుగూ ఉండదు
క్రియేటివిటీ అంటే
పరిశోధించడం, ప్రయోగించడం, రిస్కు తీసుకోవడం, అవసరమైతే తప్పులు చేయడం కూడా అన్నారు మేరీ లౌ కుక్.
కొత్తగా ఏం చేస్తే, ఎలా చేస్తే బాగుంటుందని శోధించడం,
దాన్ని ప్రయోగాత్మకంగా చేసి చూడటం, అవసరమైతే ఈ
క్రమంలో తప్పులు చేయడం అంతిమంగా ఆప్రయత్నం
విజయవంతమైతే చాలు వృత్తి వ్యాపారాల్లో ఎదగడానికి
బోల్డన్ని అవకాశాలు.
2005లో బస్సు టికెట్లు దొరక్క పండగకు బెంగళూరు
నుంచి హైదరాబాద్ రాలేకయాడు ఫణీంద్ర సామా అనే
యువకుడు టికెట్లు దొరక్కపోవడం అనే సమస్యకు
పరిష్కారం కనిపెట్టాలని అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు
అప్పటి వరకు బుకింగ్ ఏజెంట్లు ఫోన్లపై నడిపించే
ఈ వ్యవహారానికి ఓ వెబ్ సైట్ పెట్టి,దాన్ని బస్సు ఆపరేటర్లకు, ప్రయాణికులకు మధ్య వారధిగా మలిచాడు అదే
దాదాపు ఏడువేల కోట్ల నెట్ వర్త్ కల రెడ్ బస్
టికెట్ దొరకలేదని అందరిలా
ఫణీంద్ర కూడా కాసేపు బాధపడి ఊరుకుంటే ఈరోజు రెడ్ బస్ అనేది ఉండేదా అసలు..!
మడిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలని ముత్యాలముగ్గు
సినిమాలో రావుగోపాలరావు చెప్పినట్లు
ఆ మాత్రం
సృజన, కొత్తదనం లేకపోతే మీ పని
మీకే కాదు మీకంపెనీకీ బోర్ కొట్టే ప్రమాదం ఉంది అందుకే కొత్తగా
ప్రయత్నించడం మానొద్దు సుమా..!*
No comments:
Post a Comment