Sunday, August 3, 2025

 *_సమాధానం లేని ప్రశ్నలకి అర్ధాలు వెతక్కు... జీవితం నీది... కష్టం నీది... ప్రయాణం నీది గమ్యము నీదే... దారిలో ఎదురయ్యే ప్రతి చెట్టుతో పుట్టతో బంధాలను పెనవేసుకోలేము..._*

*_ప్రేమకైనా స్నేహానికైనా హృదయం స్పందించాలే కానీ ఏ బంధంలోనూ బలవంతాలు ఉండకూడదు... ఏమో ఎవరికి ఏ కష్టం ఉందో ఎందుకు నీకు దూరంగా ఉన్నారో వాళ్ళ స్థితిలు, పరిస్థితులు ఏంటో..._*

*_మనం ప్రేమించిన అంత మాత్రాన మనం స్నేహం చేయాలనుకున్నంత మాత్రాన అవతల వాళ్లకి కూడా అంతే అభిమానం ప్రేమ ఉందో లేదో అని ఆలోచించాలే కానీ ఆశించకూడదు... ఆశిస్తేనే బాధ... ఒక్కసారి దాన్ని దాటొచ్చి చూడు అంతా బాగుంటుంది._*

*_సత్యం కళ్ళకు కనిపించకుండా బంధం, కోరిక, భయం గర్వం కప్పేస్తాయి... బ్రతుకులో ముందు వెనక ఎప్పుడైనా మారచ్చు... మారడానికి సిద్దపడినోడికే బ్రతుకు విలువ తెలుస్తుంది..._*

*_మనిషి గొప్పతనం అందం డబ్బులో ఆరడుగుల ఎత్తులో_* *_ఉండదు... ఆర అంగుల నాలిక మీద ఉంటది... చేసే చేతల బట్టి ఉంటది..._*

*_అందుకే మనస్సుతో చూడు... బుద్ధితో చేయి... నీ చేయి ఎప్పటికి ఎదుటివారి కన్నీరు తుడవాలే కానీ, నువ్వు  కన్నీరు కార్చకు.☝️_*

      *~సదా మీ శ్రేయోభిలాషి...👏*
🌼🏵️🌼 🪷🙇‍♂️🪷 🌼🏵️🌼

No comments:

Post a Comment