Monday, August 4, 2025

 🔔 *సరదాగా...* 🔔

*_స్నేహమంటే ఇదేరా..!_*
************************
_స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో.._
💐💐💐💐💐💐💐
*_స్నేహమంటే.._*

*తిరుగుళ్ళు..*
*ఇచ్చిపుచ్చుకోడాలు..*
*పరిగెత్తడం..*
*ఒకరి కోసం* 
*ఒకరు ఎలుగెత్తడం..*
*త్యాగాలు..*
*భోగాలు..భాగాలు..*
*షికార్లు..సినిమాలు..*
*క్లాసులు ఎగ్గొట్టడాలు..*
*గోడలు ఎగబాకడాలు..*
*స్లిప్పులు అందించుకోడాలు..!*

*_స్నేహమంటే.._*

*రోడ్లపై బజ్జీలు..*
*మురీ మిక్చర్లు..*
*పానీ పూరీలు..*
*బస్సు దొరక్కపోతే లారీలు..*
*ఎంగిళ్ళు తినడాలు..*
*ఒకే సీసాలో* 
*నీళ్ళు (?)తాగడాలు..*
*కొత్తకొత్త ఆగడాలు..*
*ఇంటి నుంచి అమ్మ పంపిన క్యారేజీలు లాక్కొని పంచుకోడాలు..!*

*_స్నేహమంటే_*

*క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు..*
*ఇంట్లో ఒక చోటికని చెప్పి*
*మరో చోటుకు వెళ్ళడాలు..*
*పెద్దోళ్ళకు దొరికిపోతే కవరింగులు..*
*కొన్ని మంచి పనులు..*
*ఎక్కువగా వెధవ పనులు..*
*ఒకరి లవ్వుకు* 
*ఇంకొకరి కోపరేషన్..*
*దొరికిపోతే పరేషాన్..*
*అప్పుడు ఇంకో* 
*కొత్త ఆపరేషన్..!*

*_స్నేహమంటే_*

*ఐడియాలు..*
*సోషల్ మీడియాలు..*
*రోమియోలు..*
*రోడ్డు సైడు బీట్లు..*
*అన్నా..మావా..*
*భయ్యా.. బావా..*
*ఇలాంటి చనువైన పిలుపులు..*
*ఎన్నెన్నో మధురమైన తలపులు..*
*ఫోన్ కాల్స్..*
*సంకేతంగా మిస్డ్ కాల్స్..*
*నో ప్రొటో కాల్స్..!*

*_స్నేహమంటే_*

*ప్రాణం ఇచ్చే మనసు...*
*పట్టించుకోని వయసు..*
*కనిపించని ఆలుసు..*
*అసలు..స్నేహమే* 
*ఓ సొగసు..*
*అది స్నేహం చేసే* 
*ప్రతి ఒక్కరికి  తెలుసు!*

*_స్నేహమంటే.._*

*ఓ కులాసా..*
*ధిలాసా..*
*భరోసా..*
*భిన్న రుచుల సమోసా..*
*విభిన్న అభిరుచుల పిపాస..*

_మొత్తంగా.._
_బంధాల సుగంధం.._
_అందమైన అనుబంధం.._
_ఆహ్లాదం పంచే సుమగంధం.._
_తీయనైన మకరందం.._
_జీవిత పర్యంతం_ 
_వెన్నంటి ఉండే.._
_ఓ అద్భుతం..!_
______________________



🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment