Sunday, August 10, 2025

 *కరుడు కట్టిన కుల వ్యవ స్థ ని ఈ దేశం నేటికి భారం గా మోస్తోంది కులాన్ని అం టు కొని వస్తున్న ఉప కుల వ్యవస్థ వల్ల సమాజం జటి లంగా మారింది.* 

*కులాలు, ఉప కులాల మధ్య అంతరాలు అస మా నతలు రాతి గోడల్లా అడ్డు పడుతున్నవి*

*అత్యాధునిక సాంకేతిక, శాస్త్రీయ కాలంలో కూడా మన దేశ నిర్మాణం నాలు గు స్తంభాల కుల వ్యవస్థ మీద ఆధార పడి, వాటిని  పెంచి పోషిస్తు రాజకీయ పార్టీలు తమ స్వార్థరాజ్యా ధి కార కాంక్ష కొసం బూట కపు అమలుకు నోచు కోని వాగ్దానాలు, హామీలను ఇస్తూ మోసం చేస్తున్నారు*
 
దేశం లో  3000 కులాలు 25 వేల ఉప కులాలు, వేలాది జాతుల తో వర్ణాలతో సంక్లి ష్టం గా జఠిలంగా తయార యింది
   
*స్థిర నివాస జాతులు సం చార కుల జాతుల జీవితా లు రెండూ రైలు పట్టాల్లా నడుస్తున్నాయి కొన్ని కులా లు సంచారo చేయవు*

*పాతాళానికి నొక్కి వేయ బడ్డ కొన్ని ఉపకులాల బృందాలే ఈనాటికి సంచా ర జాతులు గా  పేర్కొంటూ ఇంకా ఇంకా తొక్కి వేయ బడు తున్నాయి* *అవి నేరస్థ జాతులుగా బ్రిటిష్ వాడి పాలనలో గుర్తింప బడ్డాయి.* 

ఆదే దృక్పథం ఇంకా వాళ్ల మీద నేటికి నిత్యం రుద్ద బ డుతూనే ఉంది. అంట రాని కులాలు గా చెప్పబడుతున్న కులాల సమాజం కూడా అంటు కోకూడని ఉప కులా లు కూడా కొన్ని వున్నాయి.
ఈ కులాలు అనాదిగా మైళ్ళ కు మైళ్ళ లోతున దిగ పడి తొక్కివేయ బడి గిజ గిజ లా డుతున్నాయి

కుల అస్తిత్వం నేపథ్యం గా కుల గణన చేయాలని సం ఖ్యా పరంగా రిజర్వేషన్లు అమలు కావాలని ఉవ్వెత్తున ఉద్యమాలు లేస్తున్న సంద ర్భం లో వీళ్ళ గురించి తెలు సు కోవడం అత్యవసరం. 

కులగణన లో వీళ్ళ కులాలు గుర్తింప పడ్డాయా ? 
వీళ్ళ చిరునామాలు, బతుకు లు 90% శాతం సమాజానికి తెలియదు తెలిసినా వారిని గుర్తించ లేరు. గుర్తించి నా వారిని ఈ దేశ పౌరు లుగా గౌరవించి ఆదు కోలేరు చూ సినా వారి ఆర్థిక సామాజిక కుల అస్తిత్వo కారణం గా చూడ లేని తత్వం రాజ్య మే లు తోంది

వీళ్లను ఏ ప్రభుత్వాల బతు కు పథకాలు దరి చేరవు. ఆర్థిక సహకారం అందదు. బ్యాంకు రుణాలకు ఆమడ దూరం పెడు తారు. ఏ రాజ కీయ మ్యానిఫెస్టో లో  వాళ్ళ ని పట్టించు కోరు. వాళ్లుఎన్న టికీ ఓటర్ల యంత్రాలుగా మా త్రమే  గుర్తిస్తారు 

ఈ నాటి వరకు ప్రభుత్వ పా లకుల కరుణా కటాక్షాలు వీళ్ల పై పడ లేదు. 
 
అందుకే వాళ్ళని ప్రత్య క్షంగా కలుద్దాం. నేరుగా వాళ్లతో సంభాషిద్దాం !
 వాళ్ళ హక్కుల కోసం, అస్తి త్వం కోసం నిల బడదాం !
మీరు వాళ్లని కలుసు కోగలిగే ధైర్యం ఉంటే, చేవ గలిగి ఉం టేనే రండి....International Day of the world's indi genous people peoples Day ## 
ఆగస్ట్ 9,వ తేదీని యునెస్కో ప్రకటించింది 
ఈ సందర్భాన్ని పురస్క రిం చు కొని ఒక రోజు ముందే  
*8 ఆగస్టు 2025 సాయం త్రం 4 గంటల నుండి పబ్లి క్ గార్డెన్స్ లోని తెలుగు విశ్వ విద్యాలయం లోని ఆడి టోరియం బయట 6, గంటల నుండి ఆడి టోరి యం లోపల వాళ్ళని ఆలింగనం చేసు కుందాం*

*వాళ్ల మాటలు విందాం. వాళ్ళ సంగీతాన్నిప్రేమిద్దాం వాళ్ళ పాటని విందాం ! వాళ్ళ బతుకు వీరోచిత పో రాటాల గురించి తెలుసు కుందాం! వినడమే కాదు ఏ మైనా చేయ గలిగితే చేద్దాం!*

*ఒక మంచి సమాజాన్ని నిర్మించ డానికి అందరం కలిసి కృషి చేద్దాం*
 
       *ముఖ్య గమనిక*
 ఆదివాసీలు, జానపద చేతి వృత్తుల వారు తయారు చేసి న ఎక్కడా చూడ లేని దీపాల ప్రదర్శన ఉంటుంది. వాటిని మీరు, మీ పిల్లలు, మీ స్నేహి తుల తో కలసి చూడాలని ఆహ్వానిస్తున్నాం.

*సమావేశ  నిర్వహణ*
ప్రో, జయధీర్ తిర్మల్ రావు..
              *మరియు*
తెలంగాణ జానపద సకల కళల పరిరక్షణ JAC..
మురళీ ధర్ దేశ్ పాండే

No comments:

Post a Comment