Thursday, August 7, 2025

 *@ మెదడుకు పాలిష్..!@ 41
        తేది:6/08/2025
"""""""""""""''"""""""""""""""""""""""""
అబ్బే గతేడాది పెద్దగా కలిసి రాలేదు
కొత్త సంవత్సర
మైనా కలిసొస్తుందేమో చూద్దాం
మన చుట్టూ ఉన్న చాలా
మంది నోట ఏటా వినిపించే మాట ఇది 
ఆ తర్వాత అదే
పని.. అదే నిరాసక్తత...అంతా రొటీన్, మారేవి క్యాలెండర్
పేజీలు మాత్రమే అలా సంవత్సరాలకు సంవత్సరాలే
గడిచిపోతుంటాయి మరి మార్పెలా? అని ప్రశ్నించుకునే
వారికోసమే ఈ కథ,
ఆయనో బిజినెస్ మాగ్నెట్ ఒక విమానం దిగితే మరో
విమానం ఎక్కుతాడు ఒక సమావేశం తర్వాత మరో సమా
వేశం... బిజీ బిజీగా తిరుగుతుంటాడు
ఓ రోజు
సాయంత్రం ఇలాగే ఆఫీసు నుంచి బయలుదేరి వెళ్తుండగా
బూట్లు పాలిష్ చేసే వ్యక్తి దగ్గరకొచ్చాడు
'సార్... మీ
బూట్లు దుమ్ము కొట్టుకుపోయాయి పాలిష్ చెయ్యనా 
అన్నాడు 'వద్దు నాకంత సమయం లేదు' అని ఆ వ్యాపార
వేత్త బదులిచ్చాడు ఆ పెద్ద భవనం దాటే లోపల పాలిష్
చేసేవాళ్ళు మరికొందరు తారసపడ్డారు అందరికీ అదే
సమాధానం చెప్పి చివరి బ్లాక్ దగ్గరికి వెళ్లేసరికి ఓ చెప్పుల
స్టాండ్ కనిపించింది అక్కడో వ్యక్తి '97, 98, 99... ' అంటూ
లెక్క పెడుతున్నాడు అతడు వ్యాపారవేత్తను చూడగానే ఇలా
అన్నాడు సార్... మీరు బిజీగా ఉన్నట్లున్నారు మీకు అడ్డు
పడుతున్నందుకు క్షమించండి ఈరోజు నా పుట్టినరోజు
ఇవాళ నా దగ్గరకు వచ్చే వందో వ్యక్తికి ఉచితంగా బూట్
పాలిష్ చెయ్యాలని అనుకున్నాను ఆ వ్యక్తి మీరే నా
మాట నిలబెట్టుకునే అవకాశం ఇవ్వండి ప్లీజ్' అన్నాడు
వ్యాపారి కాదనలేకపోయాడు ఆ వ్యక్తి బూట్లు శ్రద్ధగా
పాలిష్ చేశాడు ఎంతగా అంటే... అవి సరికొత్తగా కనిపించేంతగా పాలిష్ పూర్తికాగానే వెళ్లిపోబోతూ 'నువ్వు సాధార
ణంగా ఎంత తీసుకుంటావు..? అని అడిగాడు వ్యాపారవేత్త
'ఇరవై రూపాయలు' అన్నాడతడు వంద రూపాయల నోటు
అతడి చేతిలో పెట్టి, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోయాడు బిజినెస్ మ్యాన్, ఆయన కనుమరుగయ్యేదాకా చూసి
ఆ బూట్ పాలిష్ వ్యక్తి వందనోటు భద్రంగా జేబులో
దాచుకుని '97, 98, 99...' అని మళ్లీ అరవ సాగాడు
ఈ కథ..
"మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక్క
నిమిషం చాలు"
అనే పుస్తకంలోనిది మనం ఏ పని చేస్తు
న్నామన్నది కాదు... దాన్నెంత సృజనాత్మకంగా చేస్తున్నామన్నదే ముఖ్యమని ఇది చెబుతోంది అందరికీ నచ్చిన పనో,
ఉద్యోగమో దొరక్కపోవచ్చు నైపుణ్యాలు తప్ప డిగ్రీ లేక
పోవచ్చు డిగ్రీ ఉంటే నైపుణ్యం లేకపోవచ్చు
అంతమాత్రాన నిరుత్సాహపడకూడదు చేతిలో ఉన్న విద్యకు తెలివి
తేటలు జోడించాలి స్మార్ట్ స్కిల్స్ సానపెట్టుకోవాలి
ప్రతికూలతలు ఎదురైతే సానుకూల వైఖరితో
మైండ్ ను
పాలిష్ చేసేయాలి అలా చేస్తేనే జీవితం నిత్యం
కొత్తగా మెరిసిపోతుంటుంది...*

No comments:

Post a Comment