*@ ఫైవ్ స్టార్ ఇచ్చారా..! @ 37
తేది: 29/7/2025
""""""""""""""""""""""""""""""""""""""""""
ఈరోజు కూర బాగుంది దోశ అదిరిపోయింది...
పచ్చడి వాసనకు నోరూరిపోతోంది పలావ్ స్పైసీగా భలే
కుదిరింది...
ఇలాంటి మాటలు మీ ఇంట్లో వినిపిస్తుంటాయా
వినిపిస్తుంటే సరే...
లేదంటే డైనింగ్ టేబుల్ శుభ్రం
చేస్తూనో, వంట గది గడప దగ్గరో ఓ మనిషి ఇలాంటి
చిన్న మాటల కోసం వెయిట్ చేస్తుంటారని గుర్తుపెట్టు
కోండి ప్రేమగా వండి పెట్టి, అంతే ప్రేమగా వడ్డించే
ఇల్లాలు మీ నుంచి కోరుకునేది ఇలాంటి మాటలనే నాకు
ఇలాంటివి అలవాటు లేవు అయినా ఇంట్లో కూడా
రోజూ ఇవన్నీ చెబుతూ కూర్చుంటామా అని అంటారేమో
ఈ మాట అనే ముందు ఓసారి
మీ ఫోన్ లో జోమాటో
స్విగ్గీ యాప్ లు ఓపెన్ చేసి మీరు గతంలో ఆర్డర్ పెట్టిన
ఫుడ్ ఐటెమ్ ను మెచ్చుకుంటూ ఆయా రెస్టారెంట్లకు
ఎలాంటి కామెంట్లు పెట్టారో చూడండి ఫుడ్ ఎలా
ఉంది రివ్యూ ఇవ్వొచ్చుగా అని నోటిఫికేషన్
వచ్చిందనో
ఫుడ్ తెచ్చిన అబ్బాయి అడిగాడనో ఫైవ్ స్టార్
రేటింగ్ ఇచ్చేస్తారే మరి ఇంటి వంటకు ఆ గౌరవం
ఇవ్వడానికి మాటలు రావేం..! బిడ్డ రోజంతా కష్టపడి
చదువుకుని వచ్చాడు మంచి టిఫిన్ ఏదైనా చేసి పెడదామనుకునే తల్లి, భర్త మధ్యాహ్నం ఎలా తిన్నారో ఏమో
రాత్రి పూట అయినా బాగా తినాలని తాపత్రయపడుతూ
అన్నీ వేడివేడిగా వడ్డించే భార్య,
అన్నకి రుచిగా వండి
పెట్టాలని ప్రయత్నించే చెల్లి,
తమ్ముడికి ప్రేమతో నచ్చింది
చేసి పెట్టే అక్క ఎవరైనా కానివ్వండి తమ కష్టానికి
ప్రతిగా కోరుకునేది ఆ చిన్న ప్రశంసే
ఈ రోజు వంట
బాగుందోయ్
ఫుడ్ సూపర్ అమ్మా అనే మాటలే
వారికి ఫైవ్ స్టార్ రేటింగ్ తో సమానం
ఆహారం బాగాలే
కపోతే ముఖం చిట్లించుకోవడం ఎంత బాగా వచ్చో...
బాగున్నప్పుడు బాగుందని చెప్పడమూ అంత
బాగారావాలి
"ఫుడ్ ఈజ్ లవ్" అన్నమాట వినలేదూ
ప్రేమగా ఎవరు వండిపెట్టినా నోరారా ప్రశంసించినప్పుడే
పెట్టినవారికి తిన్నవారికీ మధ్య బంధం బలవడుతుంది
మన తాతలు, నాన్నలు గతంలో చేసింది
మనకు
చేయమని చెబుతున్నది
ఇదే కదా..!
ఫుడ్ బాగాలేకపోయినా బాగుందని చెప్పాలా..?
అని
అనుకోవచ్చు అప్పుడు గుర్తు చేసుకోవాల్ళింది మీరు
రీసెంట్ గా వెళ్లిన రెస్టారెంట్ ని అంతగా బాగాలేని ఫుడ్ ని
కూడా 'అద్భుతం' అంటూ ఉదారంగా పదికి పది
మార్కులూ వేయలేదూ? అటువంటప్పుడు ఆమె కష్టాన్ని
ప్రేమనూ గుర్తించామని చెప్పేందుకు అయినా మన ఇంటి
స్టార్ కి మనం 5 స్టార్ రేటింగ్ ఇవ్వొద్దు
అది ఎలా...
మాటల్లోనా,చేతలతోనా...
ఎలా ఇస్తారన్నది మీ ఇష్టం....
ఫలితం బ్రహ్మాండంగా ఉంటుందని
వేరే చెప్పాలా...!*
No comments:
Post a Comment