Friday, August 8, 2025

 ఇటీవల ఓ విదేశీ పత్రికలో ప్రకటన వెలువడింది.

" మాతో ఉండటానికి వృద్ధ జంట కావాలి "

ఇది చూసి ఓ వృద్ధురాలు ఫోన్ చేసింది .

అడ్వర్టైజర్, "మీరేమీ చేయనక్కర్లేదు. మేం ఇద్దరం డాక్టర్లం. పనికి వెళ్తాం. మా అమ్మ ఈ మధ్యనే చనిపోయారు. మీ పని మాకు పెద్ద దిక్కుగా ఉండాలి. . ఇంట్లో అన్ని పనులకు పనిమనిషి ఉన్నది. కానీ “పిల్లలూ, ఈరోజు ఎందుకు ఆలస్యమయ్యావు.. తిన్నావా.. అని అడిగే వారు లేరు. మాకు జీవితం అర్ధ హీనంగా అన్పిస్తుంది.

పని నుంచి ఇంటికి రాగానే మాతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడేవాళ్లు కావాలి’’ అని ప్రకటనదారు చెప్పడంతో వృద్ధ దంపతుల కళ్లు చెమ్మగిల్లాయి.

కానీ దురదృష్టం ఏమిటంటే ఎవరి ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారో వారి గురించి పిల్లలు పట్టించుకోరు.

No comments:

Post a Comment