1. అశ్వనీ నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
27 నక్షత్రములలో అశ్వని నక్షత్రము మొదటిది. ఇది కేతు గ్రహ నక్షత్రము. ఈ నక్షత్రానికి అధి దేవతలు అశ్విని దేవతలు. దేవగణ నక్షత్రము అది నాడి జంతువు గుఱ్ఱము దిక్కునైఋతి పురుషా జాతిఅడ్డరస వృక్షానికి నియంత్రణ నక్షత్రము. అశ్విని నక్షత్రము. అశ్విని నక్షత్రములో ఏ పాదములో జన్మించిన వారైనను, తానున్న వృత్తి ఉద్యోగాలలో ప్రథమ స్థానాన్ని కోరుకుంటారు. అందుకోసం విశేషంగా కృషి చేస్తారు. ఎంతో మందిని సలహాలు అడిగి చివరికి తన నిర్ణయాన్నే అమలు చేస్తారు. సంగీత వాయిద్యాల మీద, వనమూలికలు, ఆయుర్వేద వైద్యము, హోమియో వైద్యము, క్రికెట్, ధనూర్ విద్యలయందు ఆసక్తి ఉంటుంది. వైద్యరంగంలోనూ, క్రీడా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఆసక్తి కలిగి ఉంటారు. అవకాశం వస్తే ఆ రంగంలో పురోగతి సాధిస్తారు. జీవితంలో 24 సంవత్సరాలు వచ్చే వరకూ కష్ట సుఖాలతో సంబంధం లేకుండా గడిపేస్తారు. సహోదర, సహోదరీ వర్గం వలన చికాకులు ఎదురవుతాయి. స్వశక్తితో అంచలంచెలుగా ఎదుగుతారు. స్థిరాస్తుల సంపాదిస్తారు. భూమి మీద మోజు అధికం పరస్త్రీల యందు ఆసక్తి కలిగి ఉంటారు. పైకి కనిపిస్తున్న జీవితం వేరు అంతర్గత జీవితం వేరు సుమారుగా 60 సంవత్సరాలు వచ్చే వరకూ వీళ్ళ యోగానికి ఎటువంటి భంగం వాటిల్లదు. లంధువులలో ఒక వర్గం, స్త్రీలలో విభేధాలు వర్గ వైషమ్యాలు, కుల, మత, వర్గ వైషమ్యాలు అత్యున్నత స్థితికి వెళ్ళకుండా అడ్డుకుంటాయి. అంతరంగిక వర్గం సలహాలు స్వీకరించకుండా వుంటే మీరు గొప్పవాళ్ళు అవుతారు. గణపతి పూజ, గోపూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది. పూజలు తొందరగా ఫలిస్తాయి.
2. భరణీ నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
భరణీ నక్షత్రాధిపతి శుక్రుడు అధిదేవతే యముడు మనుష్యగణము. మధ్యనాడి జంతువు ఏనుగు స్త్రీ జాతికి చెందెనీ నక్షత్రము దేవదారు వృక్షానికి నియంత్రణ నక్షత్రము. భరణీ నక్షత్రంలో పుట్టిన వారు అందంగా ఉంటారు. పరిశుభ్రతకు అధిక ప్రాముఖ్యతనిస్తారు. వీరు నిర్ణయాలను సమయానుకూలంగా మార్చుకుంటారు. ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే నోటితో అంత కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్థించుకుంటారు. ధనంపట్ల, స్త్రీల పట్ల మోజు లేనట్లు నటిస్తారు. వీరి అంతర్యం వేరే విధంగా ఉంటుంది. విలాసవంతమైన, ఆధునాతనమాన వింత వస్తు సామాగ్రిని కొనుగోలు చేయడం వారు ముందుంటారు. అలంకరణలు, విదేశీ సుగంధ పరిమళాల పట్ల ఎక్కువ ఆసక్తి, భార్య వల్ల అదృష్టం కలిసివస్తుంది. విబేధాలు కూడా సంభవం. వీరిక్ స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది. ప్రేమ కూడా వాళ్ళ మీదే ఉంటుంది. సంఘంలో ప్రతిష్ఠ, గౌరవం వ్యక్తిగత సంపాదన కలిగి ఉంటారు. అనేక మందికి జీవనాభివృద్ధి కలిగిస్తారు. వృద్ధాప్యంలో సుఖించడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించుకుంటారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోరు. దీని వల్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించడానికి ఆటంకాలు ఎదురవుతాయి. వీరు నిత్యం మహాలక్ష్మిదేవి పూజ చేయడం వల్ల, సంవత్సరానికి ఒక్కసారైనా, ఇంద్రాణీ హోమం చేయించడం వల్ల మంచి జరుగుతుంది. వీళ్ళ పట్ల సమాజంలో భయంతో కూడిన గౌరవం ఉంటుంది. వీళ్ళను నమ్మి భాగస్వాములుగా చేర్చుకోవచ్చు. వీరి వ్యూహ రచన చాలా గొప్పగా ఉంటుంది. సలహాదారులుగా గొప్పగా రాణిస్తారు.
3. కృత్తిక నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
కృత్తిక అగ్ని నక్షత్రము ఇది రవి గ్రహ నక్షత్రము అధి దేవత అగ్ని దేవుడు. రాక్షస గణములోని ఈ నక్షత్రము అంత్యనాడిలోకి చెందినది. జంతువు మేక ఇది పురుష నక్షత్రము. నియంత్రణ వృక్షము జూదంబర వృక్షము. ఈ నక్షత్రంలో ఏ పాదములో జన్మించినను. బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. మంచి పోషణ పెంపుదల ఉంటుంది. కుటుంబపరంగా స్థిరాస్తులు క్రమంగా తగ్గిపోకాయి. వైద్య విద్య అత్యున్నత అధికారము ఇచ్చే చదువు, అన్య భాషల యందు నేర్పరితనము విశేషమైన పోటీ తత్వము కలిగి ఉంటారి, చిన్న విషయాలకే అబద్దాలు ఆడే మనస్తత్వము, స్త్రీలతో విబేధాలు జీవితంలో చెప్పుకోదగిన ప్రభావాన్ని చూపిస్తాయి. అన్నింటా ఆధిక్యత కొనసాగారని ప్రయత్నించే ఫలితాలు మూడు వంతులు ఫలిస్తాయి. ఒక వంతు వికటిస్తాయి. అలమానాన్ని సహించలేరు. ఇతరుల సలహాలు స్వీకరించరు. స్వశక్తి అనేక స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మంచి జీర్ణశక్త కలిగి ఉంటారు. అయిన మధుమేహ వ్యాధి పొంచి ఉంటుంది. సంతానాన్ని సమదృష్టిలో చూస్తారు. క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దురభ్యాసాలు కూడా ఒక పద్ధతి కలిగిఉంటాయి. స్నానానికి, పరిశుభ్రతకు, వస్త్ర ధారణకు మంచి ప్రాముఖ్య నిస్తారు. అనేక అధికార పదవులు కలిగి ఉంటాయి. విశేషంగా దాసం చేసే గుణం ఉంటుంది. అపాత్రదానం ఎక్కువ. సందర్భాన్ని బట్టి అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఈ నక్షత్రంలో పురాతన వస్తువుల మీద మక్కువ కలిగి సేకరిస్తారు. స్త్రీ ఆధిపత్యం వలన జీవితంలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేయలేరు. మధ్యవర్తిత్వము బాగా చేయగలరు. స్నేహానికి ప్రాణం ఇస్తారు.
4. రోహిణి నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది చంద్రగ్రహమునకు ఇష్టమైన నక్షత్రము. రోహిణి ప్రియయా చంద్రహా అన్నారు. సర్ఫయోనికి చెందిన ఈ నక్షత్రమునకు అధిదేవత బ్రహ్మ అంత్యనాడి, మనుష్యగణము, నియంత్రణ వృక్షము జంబు (నేరేడు) వృక్షము. ఈనక్షత్రములో జన్మించిన వారు మానసిక దృఢత్వము కలిగి క్రీడల యందు, సాహస క్రీడల యందు మంచి ప్రవేశము కలిగి గుర్తింపు పొందుతారు. జీవితంలో అడుగడుగునా స్త్రీల ఆధిపత్యము, సహాయ సహకారాలు అండదండలు అన్ని మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. వీళ్ళ వ్యక్తిగత సామర్థ్యము వలన, అదనపు వైవిధ్య లక్షణముల వల్ల, ముంచి ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. మాతృ వర్గం మీద విశేషమైన అభిమాణం కలిగి ఉంటారు. దూరప్రాంత ప్రయాణాలు విదేశాలలో చదువు. అధునాతన విద్యల యందు రాణిస్తారు. జల సంపద కలిగి భూ సంపదను సంపాదిస్తారు. ఎన్ని విషయాల్లో విమర్శలు వచ్చినా వాటిని మనస్సులోనే ఉంచుకొని తాను అనుకున్న విధానం అమలు చేస్తారు. తొందరగా కోపం రాదు. చిరునవ్వుతో ఉంటారు. విదేశీ సంబంధిత ఎగుమతి, దిగుమతి వ్యాపారాలలో పురోగతి ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. జీవితంలో ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి. అపనిందలు, ఆరోపణలు జీవితంలో ఒక భాగం అవుతాయి. రోహిణి నక్షత్ర జాతకులు హాస్య ప్రియులు, కళాప్రియులు, కళారంగంలో మంచి స్థితిని సాధిస్తారు. ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ అవార్డులు పొందుతారు. గురు మహార్దశ శని మహార్దశ యోగిస్తాయి. సంతానంతో బేధాభిప్రాయాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో క్రీడలలో ఎక్కువ శాతం విజయం సాధిస్తారు. ప్రేమ వివాహాలు అచ్చిరావు. భార్యా, భర్తల అన్యోస్త బాగుంటుంది. వీలైనంత వరకు జీవితంలో సుఖపడటానికి, తన ప్రక్కవాళ్ళను సుఖపెట్టడానికే ప్రయత్నిస్తారు. వంశానికి కుటుంబానికి మంచి పేరు తీసుకొని వస్తారు. తాను అనుకున్న విధంగా సంతానాన్ని తీర్చిదిద్దుతారు. గజ ఈతగాళ్ళు అవుతారు.
కళారంగంలో మంచి స్థితిని సాధిస్తారు. ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ అవార్డులు పొందుతారు.
5 . మృగశిర నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
మృగశిర దేవగణ నక్షత్రము మధ్యనాడి సర్పయోని అది కుజ గ్రహ నక్షత్రము నియంత్రణ వృక్షము చంద్ర. ఈ నక్షత్రంలో పుట్టిన వారు అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు. ఉన్నత వ్యాపార సంస్థలు, స్థిరాస్తులు వంశపారంపర్యంగా వస్తాయి. బాల్యం విలాసవంతంగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. సహాయం చేసే గుణం ఉంటుంది. చెప్పుడు మాటలు విని మంచి వాళ్ళను దూరం చేసుకుంటారు. అంతర్గతంగా స్త్రీలతో స్నేహ బంధాలు ఉంటాయి. వస్తు నాణ్యతను చక్కగా నిర్ణయిస్తారు. ఇతరులు చెప్పే విషయాలు పూర్తిగా వినరు. ఆధునిక విద్యలతో రాణిస్తారు. దేశభక్తి బంధు ప్రీతి ఎక్కువ. దూర ప్రాంత విషయాలు, ప్రేమ వివాహాలు లాభిస్తాయు. జీవితం పట్ల కనీసమైన క్రమశిక్షణాయుతమైన ప్రణాళిక ఉండక గొప్పగా రాణిస్తారు. నరములకు సంబంధించిన వైద్యంలో, కీళ్ళ ఎములకలకు సంబంధించిన వైద్యంలో రాణిస్తారు. సంగీతంలో ప్రఖ్యాతి వస్తుంది. అభిరుచులు కలిగిన పనులు చేస్తారు. ఇది వృథా ఖర్చుగా చాలా మంది భావిస్తారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవం అంతర్గతంగా ఉంటుంది. జీవితంలో త్వరితంగా పైకి వస్తారు. పుత్ర సంతానం విషయంలో కొంత శ్లేషము ఉంటుంది. ఋణాలు త్వరగా చేస్తారు. త్వరగా తీరుస్తారు. దైవభక్తి అధిక, అనారోగ్యం జీవితానికి ఆటంకం కాదు. ఆయుర్భావ కాలం ఎక్కువ. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అర్చన వల్ల ఉన్నత స్థితికి చేరుకుంటారు. పోటీ ప్రపంచంలో దైవానుగ్రహం ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది.
6. ఆరుద్ర నక్షత్రములో జన్నించిన వారి సాధారణ లక్షణములు
ఇది రాహుగ్ర నక్షత్రము అధిదేవత రుద్రుడు ఆది నాడి మనుష్య గణము. నియంత్రణ వృక్షము రేల, శుసకయోని ఈ నక్షత్రమందు జన్మించిన వారికి వాక్ చాతుర్యం, జ్ఞాపకశక్తి, అద్భుతమైన హాస్య సంభాషణలు చేయగలరు. వ్యాపార పరంగా నైపుణ్యం ఉంటుంది. అనేక రంగాల్లో పరిచయముగా మీ నిపుణత కూడా ఉంటుంది. ఇతరులు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఇటుక రాళ్ళ వలె ఉపయోగపడతారు. కృష్ణుజ్ఞత వీరి జీవితంలో అడుగడుగునా వృతిరేక ప్రభావం చూపిస్తుంది. ఎన్నిసార్లు జారిపడినా పట్టువదలక ఉన్నత స్థితి సాధిస్తారు. కీర్తియోగం ఎప్పుడూ వెన్నంటి యుంటుంది. ఆర్థిక పరమైన విషయాలపై సరియైన సమయంలో మంచి నిర్ణయాలు చేయలేదు. తప్పుడు సలహాలు, శక్తిసామర్థ్యాలు పట్టుదల ప్రతీకార వాంఛ, పలుకుబడి మొండితనం జీవితంలో ఉత్థాన పతనాలకు, ఒడిదుడుకులకు కారణం అవుతాయి. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తారు. అవమానాన్ని సహించరు. లౌకికం తక్కువ, జీవితంలో కావలసిన వన్నీ వాటికవే ఏర్పడుతాయి. తల్లిదండ్రుల వల్ల, సహోదరీ, సహోదరుల పట్ల విశేషమైన ప్రేమ కలిగి ఉంటారు. రాత్రి పూట ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇన్ఫిరియారీటి కాంప్లెక్స్ కొంతకాలం వేధిస్తుంది. అందులో నుండి సుపిరీయారిటీ కాంప్లెక్స్ కి వస్తారు. ఎంతమంది వీడి వెళ్ళి పోయినా, అసాధారణ శక్తి సామర్థ్యాలు, తెలివి తేటలతో ఏ క్షణంలో నైనా సమాజంలో ఉన్నత స్థాయి సాధిస్తారు. సామూహిక జనాన్ని నమ్మించగల శక్తి సమ్మోహన శక్తి ఉంటుంది. స్త్రీల పట్ల గౌరవం కలిగి ఉంటుంది. సంపూర్ణ ఆయురాభవం కలిగియుంటారు.
7. పునర్వసు నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది గురు గ్రహ నక్షత్రము అధి అధి దేవత దేవత అధిపతి అధిపతి పురుష పురుష జాతికి చెందిన ఈ ఈ న నక్షత్రము దేవగణ నక్షత్రము ఆది నాడి
మార్జల యోని నక్షత్ర నియంత్రణ వృక్షము "వెదురు” ఈ నక్షత్రములో జన్మించిన వారు ఇతరుల విషయాలకై అనవసరపు దృష్టి సారించరు. అవసర సమయంలో ఆదుకునే గుణం ఉంటుంది. సువర్ణం పట్ల మోజు ఉంటుంది. ధనూర్ విద్య, షూటింగ్ అలసట కలిగిన క్రీడల పట్ల ఆసక్తి, అభిప్రాయాలు మాటలు స్పష్టంగా ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థాయి వర్గానికి నాయకత్వం వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పరిచయాలను కార్యసిద్ధికి ఉపయోగించుకుంటారు. సొంత పనులకంటే ఇతరుల పనులు బాగా నెరవేర్చగలుగుతారు. సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉంటాయి. అవి ప్రాథమిక దశలోనే సర్దుబాటు చేసుకోవటం వలన మేలు జరుగుతుంది. చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పడం అతి జాగ్రత్తలు నమ్మి ఇతరుల మీద కార్యాభారం అప్పగించని స్థితి మొదలైనవి. ధైర్యం లేని వ్యక్తిగా ప్రచారం జరిగే అవకాశం ఉంది. సువర్ణము, భూమి, ఆయుర్వేద వైద్యం, ఎగుమతి దిగుమతులు లాభిస్తాయి. సౌకర్య వంతమైన ఉద్యోగాలలో స్థిర పడతారు. సంతానానికి సంబధించిన క్లేశం కొంతకాలం ఇబ్బంది పెడుతుంది. మొత్తం మీద సమస్యలను పరిష్కరించగల వ్యక్తిగా, స్వయం శక్తి, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది.
8. పుష్యమి నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది శని గ్రహ నక్షత్రము అధి దేవత బృహస్పతి పురుష జాతికి చెందిన ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము మధ్య నాడి
నియంత్రణ వృక్షము పిప్పలి, మేకయోని ఈ నక్షత్రములో జన్మించిన వారు బాల్యము నుండి యవ్వనము వరకు కష్టపజి ఒక స్థాయికి చేరుకుంటారు. తదుపరి వ్యాపార రంగంలో గాని, రాజకీయ సినీరంగాల్లో గానీ రాణిస్తారు. విస్తృతమైన పరిధి, విస్తృతమైన ప్రజాభాహుళ్యమును నియంత్రించు నటువంటి వృత్తి ఉద్యోగాలకు ఎంపికవుతారు. పోటీ పరీక్షలలో విజయం సాధించి ఉన్నతి స్థితి సాధిస్తారు. యవ్వనం వచ్చినప్పటి నుంచి అదృష్టానికి దగ్గరిగా జాతకం నడుస్తుంది. వీరి ప్రజా సంబంధాలు, స్నేహ సంబంధాలు పటిష్టంగా ఉంటాయి అధికంగా ఉంటాయి. ఎగుమతి, దిగుమతి, వ్యాపారాలు లాభిస్తాయి, తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచనలు చేయకుండా ముఖ్యమైన నిర్ణయాలు చేయుట ప్రత్యేక లక్షణం. మంచి దాన స్వభావం నిర్మొహమాటంగా మాట్లాడేతత్వం కలిగి ఉంటారు. మంచి సలహాదారులు వీళ్ళకి లభిస్తారు. ఒకరిద్దరు తప్పుడు సలహాదారులు దగ్గరవుతారు. వాళ్ల వల్ల సంస్థలోను వ్యక్తిగత జీవితంలోను, ప్రజా జీవితంలోను కొన్ని అపశృతులు దొర్లుతాయి. మచ్చలేని మనుషులుగా పేరొందిన తప్పుడు సలహాదారుల వల్ల కొంత అపఖ్యాతి మూటకట్టుకుంటారు. జీవితంలో గొప్ప విజయాలు అపజయాలు కూడా ఉంటాయి. స్థాయి తక్కువ వ్యక్తులతోటి పోరాడ వలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా ఇబ్బంది కరమైన అంశముగా మారుతుంది. నైతిక విలువ లేని వైరివర్గం, బంధువర్గం ఇబ్బందులకు గురి చేస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. ఆర్థికంగా మంచి స్థితి సాధించగలరు. సామాజిక వర్గ సమీకరణలు ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టానికి కారణం అవుతాయి. వైవాహిక జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఆధ్యాత్మిక రంగంలో మంచి మనశ్శాంతిని పొందగలుగుతారు. దైవ కార్యాలు చేస్తారు.
9. ఆశ్లేష నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది బుధ గ్రహ నక్షత్రము అధిదేవత సర్పములు రాక్షస గణములకు చెందిన ఈ నక్షత్రము అంత్యనాడి మార్చ్ల యోని
నక్షత్ర నియంత్రణ వృక్షము నాగకేసరి. ఈ నక్షత్రములో జన్మించిన వారు వివిధ రకాల సౌఖ్యాలను కోరుకుంటారు. ఏదో విధంగా కోరికలను తీర్చుకోగలుగుతారు. నట్టుదల ప్రతీకారం స్పష్టమైన భావాల రాజకీయ యోచన కలిగి ఉంటారు.
స్త్రీల వల్ల, పెద్దల వల్ల జీవిత్ లో చెప్పుకోదగిన ఇబ్బందులు ఎదురౌతాయి. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. అత్యున్నత విద్యాభ్యాసం పూర్తి చేస్తారు. కష్టపడి సుఖవంతమైన జీవితం ఏర్పరచుకున్న అపార్థాలు, అపోహల వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. నమ్మకం లేని వ్యక్తుల తోటి సహజీవనం చేయాల్సివస్తుంది. సంతాన వరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. భూమి సంబంధమైన, గృహ సంబంధమైన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో నిపుణతను నిరూపించుకోగలరు. వర్గ రాజకీయాలు సమర్థవంతంగా నడపగలరు. " యూనియన్లలో ప్రజా జీవితంలో మంచి పేరు వస్తుంది. ఉన్నతాధికారుల వల్ల సమాజంలో ఉన్నత స్థానాలలో వున్న వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వయస్సు గడుస్తున్న కొద్ది సుఖవంతమైన జీవితానికి దగ్గరవుతారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ఓర్పును ప్రదర్శిస్తారు. ఎంత కాలమైనా వేచి ఉంటారు. నమ్మక ద్రోహులు స్నేహితులు కావడం దురదృష్టకరంగా పరిణమిస్తుంది. స్థిరాస్తులు దక్కించుకోగలుగుతారు. గనులు, పాల వ్యాపారం, పెట్రోలు బంకులు, వస్త్ర వ్యాపారం ఆయుర్వేద మందులు వనమూలికలు, కాంట్రాక్టులు లాభిస్తాయి. అర్హులైన వారికి దానం చేస్తారు. వివాదాస్పదమైన విషయాల జోలికి తొందరగా వెళ్ళరు. జీవితం స్థిరంగా నడుస్తుంది.
10. మఖ నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
-ఇది కేతు గ్రహ నక్షత్రము అధి దేవతలు పితృదేవతలు రాక్షస గణానికగి చెందిన ఈ నక్షత్రము అంత్యనాడి మూషిక
యోని నియంత్రణ వృక్షము మర్రి. ఈ నక్షత్రములో జన్మించిన వారు ప్రతి విషయంలోను జాగ్రత్తగా ఉంటారు.
సాహసోపేతమైన నిర్ణయాలు చేయరు. పొదుపు, జీవితం పట్ల అభద్రతాభావం ఉంటుంది. ఇతరులకు ఎప్పుడూ మంచి
విషయాలు నూరి పోస్తుంటారు. వీళ్ళు చెప్పే జాగ్రత్తలు, సూచనలు హేళనకు గురిఅవుతారు. ఆపదకు ముందు జాగ్రత్తలు
చెబుతారు. ఆపద వస్తే మాత్రం ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన వస్తువులు ప్రతి నిత్యం ఉపయోగించే
చిన్న చిన్న వస్తువులు సైతం భద్రంగా దాస్తారు. వాటిని ఎవరైనా ముట్టుకున్నా, ఉపయోగించినా ఊరుకోదు. ఎన్నో ఏళ్ళ నుండి వాడుతున్న వస్తువులైనా వీరి దగ్గర కొత్త వస్తువుల వలె ఉంటాయి. ఇతరుల సొమ్మును ఆశించరు. ఇతరులకు తన సొమ్మును ఇవ్వరు. గణతంలోనూ, అడ్మిస్ట్రేషన్లోనూ నిపుణత పద్ధతి కలిగి ఉంటారు. నిద్ర లేమిని భరించలేదు. ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడతారు. తన వారిని ఇంకొకరు గుర్తు చేసే స్థితి తెచ్చుకోరు. అన్యాయార్జితం మాత్రం స్వీకరించరు. జరిగిపోయిన సంఘటనలు మరిచిపోరు. వాటిని తలచుకొని బాధపడతారు. జీవితంలో దేనికే లోటు ఉండదు. అయినా సంతృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సౌమ్యులు సంతానయోగం, గృహోపయోగం అర్ధిక యోగం, విదేశీయాన యోగం మొదలైనవి కలిసి వస్తాయి. స్పెక్యులేషన్ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉంటే మంచి స్థితికి (ఆర్థికంగా) పొందగలరు.
11. పుబ్బ నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది శుక్ర గ్రహ నక్షత్రము అధిదేవత "భర్ణుడు" మనుష్య గణ నక్షత్రము. మధ్యనాడి, మూషిక యోని, నియంత్రణా వృక్షము మోదుగ. ఈ నక్షత్రము నందు జన్మించిన వారు ఆకస్మిక అదృష్టానికి దగ్గరగా ఉంటారు. చేతికి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోని తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటారు. అర్హత లేని వారికి కూడా మన మనిషి అనుకుంటే అందలం ఎక్కిస్తారు. ఇతరుల అభిప్రాయాలు ఖాతరు చేయరు. ప్రజలు ఏమనుకుంటున్నారన్న భావన సమాజ స్పృహ ఉండదు. అలాగని సమాజానికి వ్యతిరేకం కాదు. దాన ధర్మాలు, అన్నదాన సత్రాలు, విద్యాదానం చేతనయినంత వరకు వ్రాస్తారు. మీరు ఒక ఉత్తరం వ్రాసినా, సివిల్ క్రిమినల్ కేసులను ఎదుర్కొంటారు. తాను కష్టపడి సాధించుకున్న స్థానాన్ని శత్రు వర్గానికి చేజేతులా స్వయంకృతాపరాధాలతో అప్పజెప్పుతారు. కొందరు స్నేహితుల ఉచ్చునుండి జీవితాంతం బయటపడలేరు. పైకి కనిపిస్తున్న జీవితం కాకుండా రహస్య జీవితం గడుపుతారు. వేరు ప్రాంతంలో గడిపిన జీవిత కాలము గోప్యంగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు సైతం నళ్ళి లోపాలను ఎదురుగా చెప్పలేరు. ఆ అవకాశం వారు ఆర్థిక విషయాల పురోగతి బాగుంటుంది. అన్యభాషలు సైతం ఆనర్గళంగా మాట్లాడతారు. తన జీవిత శైలికి భిన్నంగా సంతానాన్ని వేరు రంగాల్లో ప్రోత్సహిస్తారు. మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంటుంది. దేశ విదేశాలలో మంచి పరిచయాలు ఉంటాయి. స్నేహానికి వీరి జీవితం అంకితం సమాజ సేవలో మంచి చురుకైన పాత్ర పోషిస్తారు.
12. ఉత్తర నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది రవి గ్రహ నక్షత్రము అధిదేవత ఆర్యముడు, మనుష్య గణమునకు చెందిన ఈ నక్షత్రము ఆదినాడి,గో యోని నియంత్రణా వృక్షము, జువ్వి, ఈ నక్షత్ర మందు జన్మించిన వారు తండ్రి ద్వారా ప్రయోజనాలు పొందుతారు. సహాధర వర్గం బలంగా ఉంటారు. నైతిక బాధ్యతలు అధికం, సకాలంలో వివాహం, ఉద్యోగం, లేక వ్యాపారం ఉంటుంది. అదృష్టానికి దగ్గరగా జాతకం నడుస్తుంది. స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలిసి వస్తాయి. గుప్తంగా ధనం, స్థిరాస్తులు అధికంగా ఉంటాయి. తనకు అంతగా పరిచయం లేని రంగంలో ఉన్నత స్థితి సాధిస్తారు. పరోపకారం చాలా తక్కువ. చౌకగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. సంపాదనలో బంధుత్వానికి పాపభీతికి చోటు ఉండదు. డబ్బు విషయంలో ఉదార స్వభావులని భావిస్తారు. ఆచరణలో పైసా ఖర్చు బెట్టరు. ఖచ్చుబెట్టిన దానికి వందరెట్లు ప్రతిఫలం ఉంటే ఖర్చు చేస్తారు. అతరులను అవమానించడం వీళ్ళకు అత్యంత సంతోషకరమైన పని, సంతానం వల్ల చిక్కులువ్యాపార, సాంకేతిక రంగాల్లో ఆర్థిక పరమైన వ్యాపారాల్లో (వడ్డీ వ్యాపారం) మంచి పట్టు సాధిస్తారు. రాజకీయంగా ప్రవేశం చేస్తే ఉన్నత పదవులే వస్తాయి. మంచి సలహాదారుల వల్ల లాభం పొందుతారు. స్థిరాస్తులు వంశ పారంపర్యంగా లభిస్తాయి. స్వంతంగా అంతకంటే ఎక్కువ కూడబెడతారు. సంతానం వల్ల ప్రఖ్యాతి ఆధ్యాత్మిక రంగంలోని వారి వల్ల మోసపోతారు. అన్యభాషలు నేర్చుకుంటారు. సాంకేతిక విద్య ఆధారంగా ఇతర రంగాల్లో ప్రవేశించి ఆ రంగంలో ప్రముఖులుగా రాణిస్తారు. చదివిన చదువులకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఉద్యోగంలో బదిలాలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలు వస్తాయి. రాజకీయ నాయకులతో సంబంధాలు జాగ్రత్తగా నడపాలి. వాళ్ళ వలన ఉపయోగం, నష్టం సరిసమానంగా ఉన్నాయి. విదేశీ పౌరసత్వం లభిస్తుంది. కఠినమైన మనస్తత్వం ఉంటుంది. జీవితంలో కనీస అవసరాలను నెరవేర్చుకుంటారు. కుటుంబ సభ్యుల మీద మినహా ఇతరులపై ప్రేమాభిమానాలు తక్కువ. జీవితంలో జాగ్రత్త, భయం, పొదుపు, విజ్ఞానం సరిసమానంగా ఉంటాయి.
17 . అనూరాధ నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు --
SP Spipotishs Tendram Ph. 0949671214
ఇది శని గ్రహ నక్షత్రము, అధి దేవత సూర్యుడు, దేవగణ నక్షత్రము, మధ్యనాడి, జింకయోని, నియంత్రణా వృక్షము పొగడ. ఈ నక్షత్రములో జన్మించిన వారు జలసంబంధమైన క్రీడల యందు ప్రవేశం ఆసక్తి కలిగి ఉంటారు. నైతిక ధర్మం, పెద్దలు వృద్ధుల పట్ల గౌరవం భక్తి కలిగి ఉంటారు. అవసరమైన మేరకు మాత్రమే ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. కాస్త ఆలస్యంగా జీవితంలో స్థిరపడతారు. పెద్దల ద్వారా స్వల్పంగా అయినా ఆస్తులు వస్తాయి. ప్రేమ వివాహాలు చేసుకుంటారు. ఎలాంటి సర్టిఫికెట్ లేకుండా కొన్ని విద్యలలో పురోగతి కలిగి ఉంటారు. విద్య పట్ల ఆసక్తి, ఉన్నత విద్యలు, అభ్యసించి అధికార పదవులు పొందుతారు. కుటుంబ ప్రతిష్ఠ కొరకు ప్రజా జీవితంలో పదవులు చేపడతారు. కీలక సమయంలో బందువర్గం నుండి నమ్మక ద్రోహం ఎదురవుతుంది. బంధువుల్లో ఒక వర్గంతో దీర్ఘ కాల పోరాటం జరుగుతుంది. తల్లిమీద విశేషమైన అనురాగం, తండ్రి పద్ధతులు నచ్చవు. సహోదరీ, సహోదర వర్గం బాధ్యతలు నెత్తిన వేసుకుంటారు. యంత్రాలు, వాహనాలు, గృహాలు, భూములకు సంబందించిన వ్యవహారాలు లాభిస్తాయి. విదేశీ యానము,దూర ప్రాంత ఉద్యోగం, విద్యా, విధానం మీద కలిసి వస్తాయి. సలహాలు చెప్పి మార్గాలు చూపి అనేక మంది పురోగతికి పునాది వేస్తారు. ఎందరు ఆత్మీయులు ఉన్నా ఏకాంతంగా ఉన్న అనుభూతి, సాహిత్య, కళారంగాలను వైరాగ్యం, వేదాంతం మిశ్రితం చేసి చూస్తారు. అలాంటి ప్రయోగాలు చేస్తారు. వైద్య విద్యలో రాణిస్తారు. సంతానం వల్ల ప్రఖ్యాతి కలుగుతుంది. ఎవ్వరిపట్ల శాశ్వత బంధం ఉన్నట్లుగా భావించదు స్పెక్యులేషన్ లాభించదు. ఒకసారి లాభాలు పొందిన రంగంలో తిరిగి ప్రవేశించరు. నికరంగా, నిలకడగా ఉండే వృత్తి, వ్యాపార ఉద్యోగాలలో స్థిరపడతారు. వృద్ధాప్యంలో అన్ని విధాలుగా బాగుంటుంది.
18. జ్యేష్ఠ నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది బుధ గ్రహ నక్షత్రము అధి దేవత ఇంద్రుడు, రాక్షస గణము ఆది నాడి, నక్షత్ర యోని, హరిణి, నియంత్రణ వృక్షము విష్టి ఈ నక్షత్రములో జన్మించిన వారు. రహస్యాలు కాపాడు కొనడానికి ఇతరుల రహస్యాలు తెలుసుకొనడానికి ప్రయత్నిస్తారు. చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా పరిశీలించి, లోపాలను ఎంచుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా జీవిస్తున్నారన్న విమర్శలు వస్తాయి. తనకు శక్తి లేక పోయినా కార్యం సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాన్ని హక్కులుగా వాడుకుంటారు. విమర్శలు సహించలేరు. ఓరకమైన ఆత్మ న్యూన్యతా భావం ఉంటుంది. ఎదుటి వాళ్ళు సరదాగా చేసిన వ్యాఖ్యలు కూడా తమను కించ పరచడానికేసని వీరి ఉద్దేశ్యము. మిత్ర బేధం కల్పించడంలోను, తప్పుడు సలహాలు ఇచ్చి ప్రజలలో అపఖ్యాతి పాలు చేయడంలోను అందెవేసిన చేయి. నమ్మిన స్నేహితులు కూడా వీళ్ళని అలాగే మోసం చేస్తారు. తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు. విశేషమైన దైవ భక్తి ఉంటుంది. సమాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటారు తన జోలు దానంత వరకు ఏ సమస్య అయినా వీరికి అందమైన ద్వీపము. భాషలకు భాష్యాలు వ్రాయ గలిగిన పాండిత్యం, సౌకర్యవంతమైన ఉద్యోగం అన్యోస్య దాంపత్యం. కొందరికి సంతాన నష్టం ఉంటుంది. అయినా సంతాన ప్రాప్తికి వంశ వృద్ధికి ఇబ్బంది లేదు. అన్నమాట, ఇచ్చిన వాగ్ధానం నిలబెట్టుకోరు. సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. శాశ్వత విరోధం, శాశ్వత మిత్రత్వం ఉండదు. సాంకేతిక వైద్యవిద్యలలో ఓ ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల పట్ల మోజు, విహారయాత్రల పట్ల ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం బాగుంటుంది.
19. మూల నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది కేతు గ్రహ నక్షత్రము అది దేవత నిరుతి రాక్షస గణము ఆదినాడి, శునక యోని, నియంత్రణా వృక్షము వేగిస, ఈ సక్షత్రములో జన్మించిన వారు శక్తి వంతులు అసాధారణమైన ప్రతిభా విశేషాలు వీరి స్వంతము. చిన్నతనంలో బంధువుల ఆత్మీయుల నిరాదరణకు లోను అవుతారు. జీవితంలో ప్రతిమెట్టునూ స్వయం కృషితో రూపొందించుకుంటారు. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడానికి అవసరమైనన్ని తెలివితేటలూ ఉంటాయి. ఎక్కిన, వచ్చిన ప్రతిమెట్టునూ దిగి కృతజ్ఞతలు చెప్పరు. జీవితంలో సాగిపోవడమే ధ్యేయం. అభివృద్ధి, అధిపత్యమే లక్ష్యం. బంధుత్వాలకు, స్నేహాలకు, నైతిక ధర్మానికి, దైవభీతికి తావు ఉండదు. కుటుంబం కోసం, పెద్దల కోసం మాత్రం కొన్ని త్యాగాలు చేస్తారు. అణుకువగా ఉండి సంసారం అన్యోన్యంగా ఉందనిపించుకుంటారు. ఆర్థిక సంబంధాలు, వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. తాను పడు కష్టాలు ఇతరులు పడుతుంటే సాయం చేయరు. తనకు తెలిసినా మంచి మార్గాలు, సూచనలు, వేరొకరికి చెప్పరు. రవి, చంద్రకుజ దశలు యోగిస్తాయి. స్త్రీ సంతానం పట్ల మానసిక సంతోషం వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు. శుభకార్యాలు చేయడం కష్టతరమైన యజ్ఞంగా మారుతుంది. కీలక సమయాల్లో బంధువర్గం అండదండలు నాయానో, భయానో, సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. డాక్యుమెంట్స్ పరంగా మోసపోయే అవకాశం ఉంది. భాగస్వాములు లెక్కల్లో మోసం చేస్తారు. ఆకస్మికంగా ప్రజా జీవితంలోకి వస్తారు. స్త్రీ దేవతా అర్చన ఉపావాస లాభిస్తుంది. ఆకాశయానం లాభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన, దానగుణం, సామాన్యం.
20. పూర్వాషాఢ నక్షత్రములో జన్నించిన వారి సాధారణ లక్షణములు
ఇది శుక్రగ్రహ నక్షత్రము, అధి దేవత గంగ మనుష్యగణమునకు చెందిన ఈ నక్షత్రము మధ్యనాడి, వానర యోని నియంత్రణా వృక్షము నెమ్మి. ఈ నక్షత్రము నందు జన్మించిన వారు ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉందురు. విలాసవంతమైన జీవితాన్ని కోరుకొని సాధిస్తారు. స్త్రీలు జీవితంలో ఉత్థాన, పతనాలకు కారణం అవుతారు. పూర్వీకుల ఆస్తులు హరించుకుపోయి కొంత భారం మాత్రం మిగిలుతాయి. బాల్యంలో బంధువర్గం కుటుంబాన్ని మోసం చేస్తారు. పుట్టిన ప్రాంతానికి దూరంగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనేక రకాల కారణాలను చూసి అనుభవించి అనుభవం గడిస్తారు. స్నేహితుల సహాయ సహకారులతో మంచి స్థానం సాధిస్తారు. స్నేహితులతో ఉమ్మడిగా జీవితంలో చెప్పుకోదగిన విజయాలు సాధిస్తారు. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాల్లో ఖ్యాతి, రాణింపు. కొంత కాలం తర్వాత మీకున్న రంగంలోనే మీ స్నేహిత వర్గం ఉన్నత సాధించే మిమ్ములను దూరంగా ఉంచుతారు. మీ ఓర్పుకి సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎదురవుతాయి. ఎక్కువకాలం ఓర్పు వహించలేరు. సమాజంలో గౌరవం, స్థానంలో భయం చోటు చేసుకుంటుంది. ఏ రంగంలోనయినా ఓటమిని అంగీకరించరు. సహోదర వర్గం వల్ల అపఖ్యాతి, నమ్మిన సేవకాజనం మోసం చేస్తారు. సహోదరీ వర్గం అన్ని విధాలుగా అండగా నిలుస్తారు. ఆధ్యాత్మిక విషయాలంటే ఆసక్తి, స్వామీజీల పట్ల సదభిప్రాయం, దైవ భీతి ఉంటుంది. విదేశీయానం. అక్కడ వ్యాపారాలు, వ్యవహారాలు బాగుంటాయి. సంతానం మీద ఎవ్వరి నీడ పడకుండా జాగ్రత్త వహిస్తారు. వ్యక్తిగత విషయ వ్యాపార రాజకీయ, ఉద్యోగ అధికార సంబంధమైన న్యాయస్థానాలకు సంబంధించిన అంశాల నీడలు ఏవీ కుటుంబం మీద ప్రభావం చూప కుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ జీవితం వేరు సామాజిక జీవితం వేరు. వీటి మధ్య గోడ నిర్మిస్తారు. ఇది మంచికి దారి తీస్తుంది.
21. ఉత్తరాషాఢ నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది రవిగ్రహ నక్షత్రము, అధి దేవత విశ్వే దేవతలు, మానుష్య గణమునకు చెందిన ఈ నక్షత్రము అంత్యనాడి, ముంగిస యోని, నియంత్రణా వృక్షము పనస. ఈ నక్షత్రములో జన్మించిన వార సాధారణ జీవితంతో ఆరంభములు జీవితంలో మంచి స్థితిని చేరుకుంటారు. ఆరుదైన అవకాశాలు లక్ష మందిలో ఒక్కరికి లభించే వీరికి లభిస్తాయి. వీరు మిత భాషలు, వినయం, విధేయత కలవారు. స్వజనులతో ప్రేమగా ఉంటారు. స్నేహాలు, పరిచయాలు వినోదంగా భావిస్తారు. సెంటిమెంట్స్ను కీలక సమయంలో లెక్క చేయరు. అన్యాయమైన ప్రవర్తన గలిగిన వారికి అండగా నిలబడవలసి వస్తుంది. అందరూ తప్పించుకోలేని అనేక కారణాలు ఉంటాయి. ప్రలోభాలకు లొంగరు. బంధుత్వానికి, బంధానికి కట్టుబడి అనేక కష్టనష్టాలు అనుభవిస్తారు. నిందలు పడతారు. ఇతరుల అభిప్రాయాలు ప్రచారాలు ఎంత కఠినంగా ఉన్నా స్వజనులకు అండగా ఉంటారు. సరియైన సమయంలో నిజం చెప్పే అవకాశం వచ్చినా చెప్పరు. విద్యారంగంలో, వ్యాపారరంగంలో గొప్ప ఫలితాలు సాధిస్తారు. రాహుదశ యోగిస్తుంది. పూలతోటలు, పాలు, పాడి పంటలకు చెందిన వ్యాపారాలు లాభిస్తాయి. విదేశీ యాన ప్రయత్నాలు లాభిస్తాయి. మరికొందరికి అవకాశం కల్పిస్తారు. భూమి, వ్యాపారం, గనుల వ్యాపారం, శీతలపానీయాలు, ఔషధ సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి. సంతానం మంచి తెలివి తేటలు గలిగి ఉంటారు. చదువు విజ్ఞానంతో తల్లిదండ్రులను మించి పోతారు. కొందరికి అలస్యంగా సంతానం, అల్ప సంతానం సంభవం దేవుడి పట్ల అచంచల విశ్వాసం ఉంటుంది. సేవా సంస్థలకు దేవాలయాలకు శక్తికి తగిన విధంగా సేవచేస్తారు. ధన వ్యయం చేస్తారు. తెలిసిన వాళ్ళకు అప్పుకూడా ఇవ్వరు. ఆర్థిక రహస్యాలు దాచుకోవడంలో వీరికి వీరే సాటి.
22. శ్రవణా నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది చంద్రగ్రహ నక్షత్రము, అధి దేవత మహా విష్ణువు, దేవగణమునకు చెందిన ఈనక్షత్రము అంత్యనాడి, వానర -యోని, నక్షత్ర నియంత్రణా వృక్షము జిల్లేడు. ఈ నక్షత్రములో జన్మించిన వారు ఎక్కువగా విని వీలైనంత తక్కువగా మాట్లాడుతారు. తీర్పులు చక్కగా చెబుతారు. అంతర్గత ఆలోచన మేధస్సు, ఎవ్వరికీ అర్ధం కాదు. ఓర్పు ఉంటుంది. దానికి కూడా ఓ హద్దు ఉంటుంది. చనువుగా మాట్లాడే స్వభావం ఉంటుంది. అయితే నెత్తికెక్కించుకోరు. ఎవరికి ఏ విధమైన మర్యాద ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చూసి నేర్చుకోవాలి. ఆభరణాలు, విలువైన వస్తువులు, స్థిరాస్తులు కొద్దిగా సంప్రాప్తిస్తాయి. అధికంగా స్వార్జితమే ఉంటుంది. మనోధైర్యంతో నిబ్బరంతో సాహసతవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. విజయాలు సాధించి అఖండ ఖ్యాతిని పొందుతారు. ఊహ తెలిసినప్పటి నుండే ధనానికి ఇబ్బంది పడరు. జీవితంలో అంచెలంచెలుగా పైకి వస్తారు. శత్రు వర్గం ప్రతికోణంలోనూ ఇబ్బంది పెడుతుంది. ఓ బలమైన వర్గానికి నాయకత్వం వహిస్తారు. బంధుప్రీతి, స్నేహితులకు సహాయం చేయడం వంటివి చేస్తారు. ఒకరికి చేసిన సహాయాన్ని మరొకరికి చెప్పడు. కుడి చేత్తో చేసే పని ఎడం చేతికి తెలియ నివ్వరు. చదువు పట్ల శ్రద్ధ, సమాజంలో గౌరవ స్థానం, వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచు కొన్నది. సందర్భానుసారంగా వ్యూహం మార్చుకుంటారు. మొండి వాళ్ళని అందరూ అనుకుంటారు కాని సున్నితమైన, విశాలమైన మనస్సును గ్రహించలేదు. వ్యావారంలో ప్రాథమికంగా భాగస్వాముల వల్ల నష్టపోయినా తదుపరి వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. ప్రతిష్ఠ నిలబెట్టుకుంటారు. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకుంటారు. బాల్యంలో జీవితానికి, జీవితంలో చేరుకున్న అంతస్తులకు ఎంతో తేడా. ఎంతో అభివృద్ధి. దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. అడుగడుగునా దైవం కాపాడుతారు. దైవభక్తి, గుప్త దానాలే ఇందుకు కారణం. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. సంతానం పల్ల ప్రఖ్యాతి లభిస్తుంది.
23. ధనిష్ఠ నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది కుజగ్రహ నక్షత్రము అధి దేవత అష్టవసుడు రాక్షస గణమునకు చెందిన ఈ నక్షత్రము మధ్య నాడి సింహయోని నక్షత్ర నియంత్రణా వృక్షము జమ్మి. ఈ నక్షత్రమందు జన్మించినవారు మంచి బుద్ధి కుశలత గలిగిన వారు. తెలిపి తేటల్ని సక్రమమైన మార్గంలో ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలు పెద్దగా శ్రమ లేకుంజా అంది వస్తాయి. అండగా నిలబడే ఐలవంతులైన వ్యక్తులు, జీవితంలో ప్రతి సంఘటనలోను ఆదుకుంటారు. అధికారులుగా, వ్యాపార వేత్తలుగా, రాజకీయ నాయకులుగా రాణిస్తారు. మంచి వాక్ చాతుర్యం ఉంటుంది. రహస్యాలు దాచలేరు. దానగుణం ఉంటుంది. మూర్ఖమైన నిర్ణయాలు తీసుకొని నష్టపోయి స్వజనులను కష్టపెడతాడు. అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచే ఆత్మీయులను దూరం చేసుకుంటారు. ధనం పొదుపు చేయాలని భావిస్తారు. ఆచరణలో సాధ్యం కాదు.అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో నిలబడదు. స్థిరాస్తుల రూపంలోనే నిలబడతాయి. మేధావులుగా భావిస్తారు. తప్పులేదు. కాని ఇతరులతో సంప్రదించకుండా కనీసం ఆత్మీయ వర్గంతో సంప్రదించకుండా చేసే నిర్ణయాలు నష్టం తెస్తాయి. దుష్టులను భాగస్వాములుగా ఎన్నుకొని వ్యావారం వాళ్ళకి అప్పజెప్పుతారు. ఫలితాలు కూడా తగినట్లుగానే ఉంటాయి. మధ్యవర్తి సంతకాల వల్ల కోర్టు తీర్పుల వల్ల నష్టపోతారు. పైసాకు చెల్లని వ్యక్తిత్వం లేని మనుషులను నెత్తికెక్కించుకొని అపై అందలం ఎక్కించి కష్టాలు కొని తెచ్చుకుంటారు. చదువు సంస్కారం ఉపయోగపడి మంచి అధికారిగా రాణిస్తారు. దర్వ్యసనాలకు దూరంగా ఉంటేనే జీవిత పురోభివృద్ధి. సంతానాన్ని గారాబం చేయడం సహజం అందులో అతి పనికి రాదు. పెంపకంలో లోపాలు ఉన్నా సంతానం బాగుపడతారు. కుటుంబానికి ప్రఖ్యాతి తెస్తారు. శని, బుధ, మహర్దశలు, శుక్ర మహర్దశ యోగిస్తాయి.
24. శతభిష నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది రాహు గ్రహ నక్షత్రము అధి దేవత వరుణ దేవుడు, రాక్షస గణమునకు చెందిన ఈ నక్షత్రము ఆదినాడి, అశ్వయోని, నియంత్రణా వృక్షము అరటిచెట్టు. ఈ నక్షత్రములో జన్మించిన వారికి అన్నిరంగాల్లో స్నేహితులు ఉంటారు. వీళ్ళ వలన ఉపయోగాలు ఆశించరు. వాళ్ళకు ఎక్కువగా సహోదరి, న్యాయ పరమైన, రాజకీయ పరమైన చిక్కులు తెచ్చుకుంటారు. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం కలుగుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అధిక మొత్తంలో ధనాన్ని త్వరగా సంపాదిస్తారు. ఎగుమతి వ్యాపారం కలిసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంతకాలం కలుసుబాటు. మధ్య వర్తిగా, కమీషన్ ఏజెంట్, బిజినెస్ ప్రమోటర్స్గా రాణిస్తారు. పురాతన సంపద వల్ల లాభాలు చిక్కులు వస్తాయి. వీలునామా వల్ల లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంత కాలం ఇబ్బందులు సంభవం. శని మహర్దశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు అధిగ మిస్తారు. ఆర్థిక సహాయం ఎల్లవేళలా ఎవరికో ఒకరికి చేయాల్సి వస్తుంది. జూదం వల్ల జీవితంలో అపశృతులు, సంతానం మంచి స్థితి సాధిస్తారు. వాళ్ళ కోసమే జీవితంలో అనేక సౌఖ్యాలు త్యాగం చేస్తారు. వివాహాది శుభకార్యాలు మొండికి బడతాయి. పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. కోరికలు, అవసరాలు అనంతాలు ఒకదాని వెంట ఒకటి పుట్టుకొస్తాయి. ఇది మీ విషయంలో నిజం అవుతుంది. పొదుపుగా ఉంచడం ఆత్మీయంతో అన్ని విషయాలు అరమరికలు లేక తెలియజేయడం వల్ల మేలు జరుగుతుంది ఎవరి మెప్పుకోసమో సొంత వారిని దూరం చేసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన నైతిక ధర్మం ఎల్లవేళలా కాపాడుతుంది.
25. పూర్వాభాద్ర నక్షత్రములో జన్నించిన వారి సాధారణ లక్షణములు -
ఇది గురు గ్రహ నక్షత్రము అధి దేవత అజైక పాదుడు. మానుష్య గణమునకు చెందిన ఈ నక్షత్రము అదినాడి సింహయోని నియంత్రణా వక్షము మామిడి.
ఈ నక్షత్రములో జన్మించిన వారు గురువు వల్ల, మేధావుల పట్ల సలహాదారుల వల్ల మంచి స్థితిని సాధిస్తారు. చాలా రంగాలకు సంబంధించి అవగాహన హరిజ్ఞానం ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవ్వరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరణి ఇందువల్ల కష్టాల నెదుర్కొంటారు. అన్నీ తనకే తెలుసునన్న భావన మంచికి దారి తీయదు. స్నేహాలు, విరోధాలు, వెంటవెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వల్ల నష్టం కలుగుతుంది. సమయం వచ్చే వరకు వేచి ఉండే ఓర్పు ఉండదు. నిజాయితీ, సత్ప్రవర్తన ఉద్యోగపరంగా వృత్తి పరంగా ఉంటుంది. నిజాయితీ పరులకు అందరూ విరోధులేనని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. వీరి శక్తిని ఇతరులు చెబితే తప్ప సద్వినియోగం చేసుకోలేరు. కళా సాహిత్యరంగాల్లో రాణిస్తారు. దేశదేశాలు విహరిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. కాని ధనం ఎప్పటికప్పుడు జీవితంలో అదృష్టం వల్ల పైకి వచ్చారన్న ప్రచారం ఉంటుంది. సంతానాన్ని అతి గారాబం చేస్తారు. లేకపోతే విచక్షణా రహితంగా బాదుతారు. ఆర్థికంగా స్థిరత్వం సాధించిన తదుపరి దాన గుణం ఉంటుంది. తనకు మాలిన దానం చేయరు. పిసినారులు కారు. దైవభీతి ఉంటుంది. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయ పదవులను సద్వినియోగం చేసుకుంటారు. అధిపత్య పోరు ప్రతిచోటా ఇబ్బందిపడుతుంది. వైవాహిక జీవితం అన్యోన్యత సామాన్యం.
26. ఉత్తరాభాద్ర నక్షత్రములో జన్నించిన వారి సాధారణ లక్షణములు
ఇది శని గ్రహ నక్షత్రము, అధి దేవత అహిర్బుద్న్యుడు. మానుష్య గణమునకు చెందిన ఈ నక్షత్రము మధ్యనాడి గోవు యోని, నక్షత్ర నియంత్రణావృక్షము వేప ఈ నక్షత్రములో జన్మించిన వారు వినయ విధేయతలు కలిగి ఉంటారు. పెద్ద, చిన్న వయస్సు తారతమ్యాలను గమనించి మసలుకుంటారు. చదువు మీద మంచి స్థాయి సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం, విదేశీ విద్యాభ్యాసం, అధికార పదవులు కలిసి వస్తాయి. వివాహ జీవితం బాగుంటుంది. ఎప్పటికి చక్కని వ్యూహరచనతో, పొదుపుగా సంసారాన్ని కొనసాగిస్తారు. హెచ్చులు చెప్పుకొనడం ఇతరులను కించరచడం చేయరు. ఇతరులకు అనవసరం రూపాయి ఖర్చు చేయరు. ఇతరుల సొమ్ము పైసా కూడా ఆశించరు. భూమి వాహన మీద హోదాలు కలిసి వేస్తాయి. కుటుంబ చరిత్ర వల్ల తండ్రి వల్ల మేలు కలుగుతుంది. సంతానం వల్ల ప్రఖ్యాతి వస్తుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు అన్ని విషయముల పట్ల అవగాహన కలిగి ఉంటారు. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించలేరు. మంచి స్నేహ స్ఫూర్తి కలిగి ఉంటారు. ఉన్నతమైన స్థానాలలోని వ్యక్తులకు ఇష్టులుగాను, సలహాదారులుగా ఉంటారు.
27. రేవతి నక్షత్రములో జన్మించిన వారి గారి సాధారణ లక్షణములు
ఇది బుధ గ్రహ నక్షత్రము, అధి దేవత, పూషణుడు, దేవగణ నక్షత్రమునకు చెందిన ఈ నక్షత్రము అంత్యనాడి, గజయోని, నియంత్రణా వృక్షము విప్ప. ఈ నక్షత్రములో జన్మించిన వారు. కనిపించని మేధావులు, ఆడంబరం తక్కువ. గణితంలో మంచి ప్రజ్ఞ కలిగియుంటారు. దౌర్జన్యం, తగాదులకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞానం గ్రంధులను -పఠిస్తారు. వేద వేదాంగాలసారాన్ని తెలుసుకోవాలన్న తపన ఉంటుంది. ఇతరుల ధనానికి ఆశపడదు. కష్టపడేతత్వం, తొందరగా కోపం రాని తత్వము. ప్రశాంతంగా, నిబ్బరంగా సమాధానాలు చెప్పడం అన్ని సమస్యలన్ని పక్కనబెట్టి చక్కగా నిద్రించడం, స్నానం పట్ల మక్కువ వీరి లక్షణాలు ఆర్థికంగా మంచి స్థితిని జీవిత మధ్య భాగం నుండి సాధిస్తారు. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల ఎత్తుల నుండి తప్పించుకుంటారు. ముఖ్యమైన ఘట్టాలలో వెన్నుదన్నుగా ఉంటే -ఆత్మీయ వర్గం ఉండదు. ఒక సందర్భంలో ఉన్నా వాళ్ళ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. దూరప్రాంతాలు సందర్శిస్తారు. అక్కడ చదువుకునే యత్నాలు స్థిరపడే యత్నాలకు బంధువుల నుండి మంచి సహకారం లభిస్తుంది. వినూత్నమైన వ్యాపారాలలో కీలకమైన అధికార పదవులలో రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. కుటుంబాన్ని, నమ్ముకున్న వాళ్ళను పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తారు. సహాయం చేస్తారు. వివాహ జీవితం ఆరంభంలో కొన్ని ఒడిదుడుకులుంటాయి. తదుపరి సర్దుకుపోతారు. వీరి జ్ఞాపకశక్తి, సాహిత్యరంగంలో అభిరుచి. పాడిపంటలకు సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతానం ప్రేమగా గౌరవంగా చూస్తారు. మంచితనంతోనే జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు.ఇది రాహు గ్రహ నక్షత్రము అధి దేవత వరుణ దేవుడు, రాక్షస గణమునకు చెందిన ఈ నక్షత్రము ఆదినాడి, అశ్వయోని, నియంత్రణా వృక్షము అరటిచెట్టు. ఈ నక్షత్రములో జన్మించిన వారికి అన్నిరంగాల్లో స్నేహితులు ఉంటారు. వీళ్ళ వలస ఉపయోగాలు ఆశించరు. వాళ్ళకు ఎక్కువగా సహోదరి, న్యాయ పరమైన, రాజకీయ పరమైన చిక్కులు తెచ్చుకుంటారు. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం కలుగుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అధిక మొత్తంలో ధనాన్ని త్వరగా సంపాదిస్తారు. ఎగుమతి వ్యాపారం కలిసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంతకాలం కలుసుబాటు. మధ్య వర్తిగా, కమీషన్ ఏజెంట్, బిజినెస్ ప్రమోటర్స్గా రాణిస్తారు. పురాతన సంపద వల్ల లాభాలు చిక్కులు వస్తాయి. వీలునామా వల్ల లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంత కాలం ఇబ్బందులు సంభవం. శని మహర్దశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు అధిగ మిస్తారు. ఆర్థిక సహాయం ఎల్లవేళలా ఎవరికో ఒకరికి చేయాల్సి వస్తుంది. జూదం వల్ల జీవితంలో అపశృతులు, సంతానం మంచి స్థితి సాధిస్తారు. వాళ్ళ కోసమే జీవితంలో అనేక సౌఖ్యాలు త్యాగం చేస్తారు. వివాహాది శుభకార్యాలు మొండికి బడతాయి. పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. కోరికలు, అవసరాలు అనంతాలు ఒకదాని వెంట ఒకటి పుట్టుకొస్తాయి. ఇది మీ విషయంలో నిజం అవుతుంది. పొదుపుగా ఉంచడం ఆత్మీయంతో అన్ని విషయాలు అరమరికలు లేక తెలియజేయడం వల్ల మేలు జరుగుతుంది ఎవరి మెప్పుకోసమో సొంత వారిని దూరం చేసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన నైతిక ధర్మం ఎల్లవేళలా కాపాడుతుంది.
25. పూర్వాభాద్ర నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది గురు గ్రహ నక్షత్రము అధి దేవత అజైక పాదుడు. మానుష్య గణమునకు చెందిన ఈ నక్షత్రము అదినాడి సింహయోని నియంత్రణా వక్షము మామిడి.
ఈ నక్షత్రములో జన్మించిన వారు గురువు వల్ల, మేధావుల పట్ల సలహాదారుల వల్ల మంచి స్థితిని సాధిస్తారు. చాలా రంగాలకు సంబంధించి అవగాహన హరిజ్ఞానం ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవ్వరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరణి ఇందువల్ల కష్టాల నెదుర్కొంటారు. అన్నీ తనకే తెలుసునన్న భావన మంచికి దారి తీయదు. స్నేహాలు, విరోధాలు, వెంటవెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వల్ల నష్టం కలుగుతుంది. సమయం వచ్చే వరకు వేచి ఉండే ఓర్పు ఉండదు. నిజాయితీ, సత్ ప్రవర్తన ఉద్యోగపరంగా వృత్తి పరంగా ఉంటుంది. నిజాయితీ పరులకు అందరూ విరోధులేనని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. వీరి శక్తిని ఇతరులు చెబితే తప్ప సద్వినియోగం చేసుకోలేరు. కళా సాహిత్యరంగాల్లో రాణిస్తారు. దేశదేశాలు విహరిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. కాని ధనం ఎప్పటికప్పుడు జీవితంలో అదృష్టం వల్ల పైకి వచ్చారన్న ప్రచారం ఉంటుంది. సంతానాన్ని అతి గారాబం చేస్తారు. లేకపోతే విచక్షణా రహితంగా బాదుతారు. ఆర్థికంగా స్థిరత్వం సాధించిన తదుపరి దాన గుణం ఉంటుంది. తనకు మాలిన దానం చేయరు. పిసినారులు కారు. దైవభీతి ఉంటుంది. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయ పదవులను సద్వినియోగం చేసుకుంటారు. అధిపత్య పోరు ప్రతిచోటా ఇబ్బందిపడుతుంది. వైవాహిక జీవితం అన్యోన్యత సామాన్యం.
26. ఉత్తరాభాద్ర నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది శని గ్రహ నక్షత్రము, అధి దేవత అహీద్బుద్న్యుడు. మానుష్య గణమునకు చెందిన ఈ నక్షత్రము మధ్యనాడి గోవు యోని, నక్షత్ర నియంత్రణావృక్షము వేప ఈ నక్షత్రములో జన్మించిన వారు వినయ విధేయతలు కలిగి ఉంటారు. పెద్ద, చిన్న వయస్సు తారతమ్యాలను గమనించి మసలుకుంటారు. చదువు మీద మంచి స్థాయి సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం, విదేశీ విద్యాభ్యాసం, అధికార పదవులు కలిసి వస్తాయి. వివాహ జీవితం బాగుంటుంది. ఎప్పటికి చక్కని వ్యూహరచనతో, పొదుపుగా సంసారాన్ని కొనసాగిస్తారు. హెచ్చులు చెప్పుకొనడం ఇతరులను కించరచడం చేయరు. ఇతరులకు అనవసరం రూపాయి ఖర్చు చేయరు. ఇతరుల సొమ్ము పైసా కూడా ఆశించరు. భూమి వాహన మీద హోదాలు కలిసి వేస్తాయి. కుటుంబ చరిత్ర వల్ల తండ్రి వల్ల మేలు కలుగుతుంది. సంతానం వల్ల ప్రఖ్యాతి వస్తుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు అన్ని విషయముల పట్ల అవగాహన కలిగి ఉంటారు. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించలేరు. మంచి స్నేహ స్ఫూర్తి కలిగి ఉంటారు. ఉన్నతమైన స్థానాలలోని వ్యక్తులకు ఇష్టులుగాను, సలహాదారులుగా ఉంటారు.
27. రేవతి నక్షత్రములో జన్మించిన వారి గారి సాధారణ లక్షణములు
ఇది బుధ గ్రహ నక్షత్రము, అధి దేవత, పూషణుడు, దేవగణ నక్షత్రమునకు చెందిన ఈ నక్షత్రము అంత్యనాడి, గజయోని, నియంత్రణా వృక్షము విప్ప. ఈ నక్షత్రములో జన్మించిన వారు. కనిపించని మేధావులు, ఆడంబరం తక్కువ. గణితంలో మంచి ప్రజ్ఞ కలిగియుంటారు. దౌర్జన్యం, తగాదులకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞానం గ్రంధులను -పఠిస్తారు. వేద వేదాంగాలసారాన్ని తెలుసుకోవాలన్న తపన ఉంటుంది. ఇతరుల ధనానికి ఆశపడదు. కష్టపడేతత్వం, తొందరగా కోపం రాని తత్వము. ప్రశాంతంగా, నిబ్బరంగా సమాధానాలు చెప్పడం అన్ని సమస్యలన్ని పక్కనబెట్టి చక్కగా నిద్రించడం, స్నానం పట్ల మక్కువ వీరి లక్షణాలు ఆర్థికంగా మంచి స్థితిని జీవిత మధ్య భాగం నుండి సాధిస్తారు. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల ఎత్తుల నుండి తప్పించుకుంటారు. ముఖ్యమైన ఘట్టాలలో వెన్నుదన్నుగా ఉంటే -ఆత్మీయ వర్గం ఉండదు. ఒక సందర్భంలో ఉన్నా వాళ్ళ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. దూరప్రాంతాలు సందర్శిస్తారు. అక్కడ చదువుకునే యత్నాలు స్థిరపడే యత్నాలకు బంధువుల నుండి మంచి సహకారం లభిస్తుంది. వినూత్నమైన వ్యాపారాలలో కీలకమైన అధికార పదవులలో రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. కుటుంబాన్ని, నమ్ముకున్న వాళ్ళను పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తారు. సహాయం చేస్తారు. వివాహ జీవితం ఆరంభంలో కొన్ని ఒడిదుడుకులుంటాయి. తదుపరి సర్దుకుపోతారు. వీరి జ్ఞాపకశక్తి, సాహిత్యరంగంలో అభిరుచి. పాడిపంటలకు సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతానం ప్రేమగా గౌరవంగా చూస్తారు. మంచితనంతోనే జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు.
ఇది రాహు గ్రహ నక్షత్రము అధి దేవత వరుణ దేవుడు, రాక్షస గణమునకు చెందిన ఈ నక్షత్రము ఆదినాడి, అశ్వయోని, నియంత్రణా వృక్షము అరటిచెట్టు. ఈ నక్షత్రములో జన్మించిన వారికి అన్నిరంగాల్లో స్నేహితులు ఉంటారు. వీళ్ళ వలస ఉపయోగాలు ఆశించరు. వాళ్ళకు ఎక్కువగా సహోదరి, న్యాయ పరమైన, రాజకీయ పరమైన చిక్కులు తెచ్చుకుంటారు. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం కలుగుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అధిక మొత్తంలో ధనాన్ని త్వరగా సంపాదిస్తారు. ఎగుమతి వ్యాపారం కలిసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంతకాలం కలుసుబాటు. మధ్య వర్తిగా, కమీషన్ ఏజెంట్, బిజినెస్ ప్రమోటర్స్గా రాణిస్తారు. పురాతన సంపద వల్ల లాభాలు చిక్కులు వస్తాయి. వీలునామా వల్ల లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంత కాలం ఇబ్బందులు సంభవం. శని మహర్దశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు అధిగ మిస్తారు. ఆర్థిక సహాయం ఎల్లవేళలా ఎవరికో ఒకరికి చేయాల్సి వస్తుంది. జూదం వల్ల జీవితంలో అపశృతులు, సంతానం మంచి స్థితి సాధిస్తారు. వాళ్ళ కోసమే జీవితంలో అనేక సౌఖ్యాలు త్యాగం చేస్తారు. వివాహాది శుభకార్యాలు మొండికి బడతాయి. పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. కోరికలు, అవసరాలు అనంతాలు ఒకదాని వెంట ఒకటి పుట్టుకొస్తాయి. ఇది మీ విషయంలో నిజం అవుతుంది. పొదుపుగా ఉంచడం ఆత్మీయంతో అన్ని విషయాలు అరమరికలు లేక తెలియజేయడం వల్ల మేలు జరుగుతుంది ఎవరి మెప్పుకోసమో సొంత వారిని దూరం చేసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన నైతిక ధర్మం ఎల్లవేళలా కాపాడుతుంది.
25. పూర్వాభాద్ర నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది గురు గ్రహ నక్షత్రము అధి దేవత అజైక పాదుడు. మానుష్య గణమునకు చెందిన ఈ నక్షత్రము అదినాడి సింహయోని నియంత్రణా వక్షము మామిడి.
ఈ నక్షత్రములో జన్మించిన వారు గురువు వల్ల, మేధావుల పట్ల సలహాదారుల వల్ల మంచి స్థితిని సాధిస్తారు. చాలా రంగాలకు సంబంధించి అవగాహన హరిజ్ఞానం ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవ్వరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరణి ఇందువల్ల కష్టాల నెదుర్కొంటారు. అన్నీ తనకే తెలుసునన్న భావన మంచికి దారి తీయదు. స్నేహాలు, విరోధాలు, వెంటవెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వల్ల నష్టం కలుగుతుంది. సమయం వచ్చే వరకు వేచి ఉండే ఓర్పు ఉండదు. నిజాయితీ, సత్ ప్రవర్తన ఉద్యోగపరంగా వృత్తి పరంగా ఉంటుంది. నిజాయితీ పరులకు అందరూ విరోధులేనని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. వీరి శక్తిని ఇతరులు చెబితే తప్ప సద్వినియోగం చేసుకోలేరు. కళా సాహిత్యరంగాల్లో రాణిస్తారు. దేశదేశాలు విహరిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. కాని ధనం ఎప్పటికప్పుడు జీవితంలో అదృష్టం వల్ల పైకి వచ్చారన్న ప్రచారం ఉంటుంది. సంతానాన్ని అతి గారాబం చేస్తారు. లేకపోతే విచక్షణా రహితంగా బాదుతారు. ఆర్థికంగా స్థిరత్వం సాధించిన తదుపరి దాన గుణం ఉంటుంది. తనకు మాలిన దానం చేయరు. పిసినారులు కారు. దైవభీతి ఉంటుంది. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయ పదవులను సద్వినియోగం చేసుకుంటారు. అధిపత్య పోరు ప్రతిచోటా ఇబ్బందిపడుతుంది. వైవాహిక జీవితం అన్యోన్యత సామాన్యం.
26. ఉత్తరాభాద్ర నక్షత్రములో జన్మించిన వారి సాధారణ లక్షణములు
ఇది శని గ్రహ నక్షత్రము, అధి దేవత అహీద్బుద్న్యుడు. మానుష్య గణమునకు చెందిన ఈ నక్షత్రము మధ్యనాడి గోవు యోని, నక్షత్ర నియంత్రణావృక్షము వేప ఈ నక్షత్రములో జన్మించిన వారు వినయ విధేయతలు కలిగి ఉంటారు. పెద్ద, చిన్న వయస్సు తారతమ్యాలను గమనించి మసలుకుంటారు. చదువు మీద మంచి స్థాయి సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం, విదేశీ విద్యాభ్యాసం, అధికార పదవులు కలిసి వస్తాయి. వివాహ జీవితం బాగుంటుంది. ఎప్పటికి చక్కని వ్యూహరచనతో, పొదుపుగా సంసారాన్ని కొనసాగిస్తారు. హెచ్చులు చెప్పుకొనడం ఇతరులను కించరచడం చేయరు. ఇతరులకు అనవసరం రూపాయి ఖర్చు చేయరు. ఇతరుల సొమ్ము పైసా కూడా ఆశించరు. భూమి వాహన మీద హోదాలు కలిసి వేస్తాయి. కుటుంబ చరిత్ర వల్ల తండ్రి వల్ల మేలు కలుగుతుంది. సంతానం వల్ల ప్రఖ్యాతి వస్తుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు అన్ని విషయముల పట్ల అవగాహన కలిగి ఉంటారు. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించలేరు. మంచి స్నేహ స్ఫూర్తి కలిగి ఉంటారు. ఉన్నతమైన స్థానాలలోని వ్యక్తులకు ఇష్టులుగాను, సలహాదారులుగా ఉంటారు.
27. రేవతి నక్షత్రములో జన్మించిన వారి గారి సాధారణ లక్షణములు
ఇది బుధ గ్రహ నక్షత్రము, అధి దేవత, పూషణుడు, దేవగణ నక్షత్రమునకు చెందిన ఈ నక్షత్రము అంత్యనాడి, గజయోని, నియంత్రణా వృక్షము విప్ప. ఈ నక్షత్రములో జన్మించిన వారు. కనిపించని మేధావులు, ఆడంబరం తక్కువ. గణితంలో మంచి ప్రజ్ఞ కలిగియుంటారు. దౌర్జన్యం, తగాదులకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞానం గ్రంధులను -పఠిస్తారు. వేద వేదాంగాలసారాన్ని తెలుసుకోవాలన్న తపన ఉంటుంది. ఇతరుల ధనానికి ఆశపడదు. కష్టపడేతత్వం, తొందరగా కోపం రాని తత్వము. ప్రశాంతంగా, నిబ్బరంగా సమాధానాలు చెప్పడం అన్ని సమస్యలన్ని పక్కనబెట్టి చక్కగా నిద్రించడం, స్నానం పట్ల మక్కువ వీరి లక్షణాలు ఆర్థికంగా మంచి స్థితిని జీవిత మధ్య భాగం నుండి సాధిస్తారు. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల ఎత్తుల నుండి తప్పించుకుంటారు. ముఖ్యమైన ఘట్టాలలో వెన్నుదన్నుగా ఉంటే -ఆత్మీయ వర్గం ఉండదు. ఒక సందర్భంలో ఉన్నా వాళ్ళ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. దూరప్రాంతాలు సందర్శిస్తారు. అక్కడ చదువుకునే యత్నాలు స్థిరపడే యత్నాలకు బంధువుల నుండి మంచి సహకారం లభిస్తుంది. వినూత్నమైన వ్యాపారాలలో కీలకమైన అధికార పదవులలో రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. కుటుంబాన్ని, నమ్ముకున్న వాళ్ళను పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తారు. సహాయం చేస్తారు. వివాహ జీవితం ఆరంభంలో కొన్ని ఒడిదుడుకులుంటాయి. తదుపరి సర్దుకుపోతారు. వీరి జ్ఞాపకశక్తి, సాహిత్యరంగంలో అభిరుచి. పాడిపంటలకు సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతానం ప్రేమగా గౌరవంగా చూస్తారు. మంచితనంతోనే జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు.
No comments:
Post a Comment