🚩 *_లంకలో సీతమ్మ కూర్చున్న అశోకచెట్టు ఏమైపోయింది? 🚩_*
😢😢😢😢😢😢😢😢
*‘‘గెడ కర్రల్లా ఉండి, కొమ్మలు రెమ్మలు లేని ఈ అశోక వృక్షం కింద సీతా దేవి ఏడాది పాటు ఎలా కూర్చుంది?”*
_[జీవితంలో మొదటి సారి నేడు అశోక వృక్షాలు అని పిలుస్తున్న వాటిని చూసినప్పుడు కలిగిన ప్రశ్న. ఇదే ప్రశ్నకు 'ఆంద్రవ్యాస' బిరుదాంకితులు శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్యగారి సమాధానం:.... అది తెలుసుకోబోయే ముందర కరోనా సమయంలో ఆయుర్వేదాన్ని అణగదొక్కేందుకు జరుగిన భయంకర కుట్రలో భాగంగా ఈ రహస్యాన్ని తెలియచేస్తున్నాము. గురుదేవుల ఆదేశంతో మేము దశాబ్దాల తరబడి చేసి పరిశోధనల్లో ఇది ఒకటి. ఈ సమయంలో మేము గతంలో వ్రాసిన వ్యాసాల నుంచీ సందర్భానుసారంగా మరోసారి తమ దృష్టికి తీసుకువస్తున్నాము. —-వింజమూరి వేంకట అప్పారావు🙏]_
----------------------
*‘‘నేడు అశోక వృక్షాలుగా చెలామణి అవుతున్నవి రామాయణ కాలం నాటి అశోక వృక్షాలు కానేకావు.”*
*విపులంగా వారు చెప్పింది ఇదే....*
*‘‘సీతా దేవి లంకలో అశోక వనంలో ఉంది. అశోకం అంటే శోకం లేనిది అని అర్థం. అంటే రాక్షసవాస్తుశిల్పి మయుడు కేవలం అందులో సంచిరిస్తే చాలు మానసికోల్లాసం కలిగే విధంగా ఆ అద్భుతమైన వనాన్ని తయారు చేశాడు. కేవలం కన్నులకు మాత్రమే అందంగా ఉండడమేకాదు. మధురమైన ఫలాలలతో నోటికి, పక్షుల కిల కిలారావాలతొ చెవులకు వినసొంపుగా ఉండేది. చక్కని ఆరోగ్యకరమైన గాలి, నీటి కొలనుల జలకాలు చర్మానికి తగలడం, మత్తెక్కించే పువ్వుల సువాసనలు ముక్కుకు చేరడంతో ఐదు జ్ఞానేంద్రయాలకు అత్యంత ఉల్లాసం కలిగించడం ఆ ఉద్యాన వనం ప్రత్యేకత. దీనికి మించి అనేక వనమూలికలను అందులో పెంచారు. వాటి వల్ల ఆరోగ్యం కూడా కలుగుతుంది.*
*అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మొక్కలు, చెట్లు భూమి నుంచి నీటిని పీల్చుకుంటాయి. ఆకాశం నుంచీ సూర్యరశ్మిని తీసుకుంటాయి. ఆకుల్లోని పత్ర హరితం ద్వారా పిండి పదార్థం తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియలోనే బాష్పోద్దీకరణం జరుగుతుంది. అంటే కొద్దిపాటి నీటి ఆవిరి కూడా అవి విడుదల చేస్తాయి. అవి విడుదల చేసే దానిలో ఆక్సిజన్ ఉంటుంది. ఇంత వరకూ అందరికీ తెలుసు. కానీ చెట్లు, మొక్కలు తమ వృక్షతత్త్వాలు ఉన్న నీటి ఆవిరిని విడుదల చేస్తాయి. అవే మనకు మొక్కల నుంచీ భిన్నమైన వాసనలుగా సున్నితంగా వస్తాయి. ఒకవేళ ఆ మొక్కలు, ఆ వృక్షాలు ఔషథ తత్త్వాలు ఉన్నవి అయితే కేవలం గాలి వల్లనే... దాన్ని పీల్చడం వల్లనే వైద్యం చేస్తాయి.*
*అశోక వననిర్మాణాన్ని పరిశీలిస్తే ఇదే తెలుస్తుంది. మయుడు ఒక వనంలో అంతర్గతంగా అనేక ఉపవనాలు కూడా సృష్టించాడు. ఉదాహరణకు సీతాదేవి అశోకవనంలో బంగారురంగులో ఉన్న అరటిచెట్ల ఉపవనంలో ఉందని హనుమంతుడు తిరిగి వెళ్లి వానరులను కలుసుకొన్నప్పడు చెబుతాడు.*
*మయుడు తాను నిర్మించిన వనం మానసికోల్లాసాన్ని కలిగించి దుఃఖ నివృత్తి చేసేది కనుక దానికి ఆ పేరు పెట్టాడు. ఇక్కడ గమనించాల్సింది ఏ మంటే అశోకవనంలో ఉన్న వృక్షాలన్నీ అశోకవృక్షాలే అవుతాయి.”*
*(అశోకం అనేది ఒక చెట్టు పేరు అవునా కాదా అనేది పరిశోధనాంశం. అది పక్కన పెడితే...)*
*అది వనసమూహానికి పెట్టిన పేరు అన్నదానిలో సందేశం లేదు. అన్నిటికీ మించి ఆయుర్వేదంలో ప్రతి చెట్టు, మొక్కకు పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల ద్వారానే వాటిని గుర్తించడం జరిగింది. ఇక సీతా దేవికి ఆశ్రయం ఇచ్చిన వృక్షం పేరు శింశుపా వృక్షం. ఇది కల్పవృక్షం, పారిజాత వృక్షం తరువాత మహోన్నతమైన వృక్షం. భారత నేపాళ దేశాల్లో ఇది హిమాలయ పర్వతప్రాంతాలలో విరివిగా ఉన్నాయని తెలుస్తోంది. ఇది కేవలం హైందవంలోనే కాక బౌద్ధంలో కూడా పవిత్రమైన చెట్టు. బుద్ధుడు పుట్టింది ఈ చెట్టు కిందే అని చెప్పేవారు కూడా లేకపోలేదు. జ్ఞానోదయం కలిగింది రావిచెట్టు క్రింద. బుద్ధుడి బోధనల్లో శింశుపా పేరు మీద బోధనలు కూడా ఉన్నాయి. కోసంబీ నగరంలో ఈ చెట్టు క్రింద కూర్చుని ఆయన బోధనలు చేశారట.*
*వాల్మీకి, కాళిదాసు వంటి అనేక మంది శింశుపావృక్షం గురించి వ్రాశారు.*
*సీతాదేవికి నీడ ఇచ్చిన వృక్షం శింశుపా వృక్షం.*
*ఈ శింశుపావృక్షం మాహాత్మ్యం కూడా చాలా మందికి తెలియదు.*
*కుట్రపూరితంగా భారతదేశంలో సరకా అశోకా చెట్ల స్థానంలో నకిలీ అశోక చెట్లు ప్రవేశపెట్టారని ఆయుర్వేద నిపుణులు ఆరోపిస్తున్నారు. దీనికి తగిన ఆధారాలు కూడా వారు చూపుతున్నారు. భారతదేశంలోని జలవనరులపై విరుచుకుపడుతున్న గుర్రపుడెక్క ఆకు భారత జన్యం కాదని అది విదేశీనీటిమొక్కగా ఉదాహరణ చూపుతున్నారు. ఒక అగ్రరాజ్యం నుంచీ గోధుమ గింజల రూపంలో భారతదేశంలో ప్రవేశించాయని చెబుతున్నారు. అలాగే బెంగాలీ అశోకా పిలిచే నేటి నిర్థక అశోక చెట్లు కూడా ఒక క్రమపద్ధతిలో కుట్రపూరితంగా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారని అంటున్నారు. ఇప్పుడు అశోక చెట్లుగా గెడకర్రలా పెరుగుతున్న చెట్లు సీతమ్మ చెట్లకు నకిలీలు మాత్రమే కాక ఆయుర్వేద మందుల్లో అశోకలేహ్యం, చూర్ణం, నెయ్యి వంటివాటిని కలుషితం చేస్తున్నాయని ఆయుర్వేదవైద్యులు చెబుతున్నారు. దాదాపు 150 నుంచీ 100 ఏళ్ల క్రితం సీతమ్మ అశోక చెట్లు ప్రతి ఇంటిలోనూ కొలువై ఉండేవని వీటిని క్రమపద్ధతిలో ప్రతి ఇంటి నుంచి మాయం చేయడంలో పక్కాప్రణాళికతో కూడిన దుర్మార్గపూరితమైన ద్రోహం జరిగిందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. నేడు దేశ వ్యాప్తంగా అసలైన అశోక ఆయుర్వేద మందులు దొరకని స్థితికి, అసలైన సరకా అశోక చెట్లు అంతరించే స్థితికి చేరడానికి వెనుక పరమకిరాతకమైన శతాబ్దాల పట్టపగటి దోపిడీ ఉందని ఆయుర్వేదులు చెబతున్నారు. పొలియల్థియా లాంగిఫోలియా అనే శాస్త్రీయనామం ఉన్న నకిలీ అశోకా చెట్లు నేడు చాలా హైందవ మత ఆశ్రమాల్లో కూడా చోటుచేసుకోవడం చూస్తే ఎంత భయంకరమైన కుట్ర జరిగిందో తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ ఉచిత మొక్కల పంపకాల్లో నిర్థకమైన ఈ రాక్షసచెట్లు విస్తరించాయి. చాలా మంది ఆయుర్వేద మందులు అమ్మే వారికి కూడా ఇవి నకిలీ అశోక చెట్లు అని తెలియనంతగా అసలు వాటి స్థానంలో వీటిని దొంగతనంగా భారతీయతలో ఎవరో బలవంతంగా చొప్పించారు.*
*సంస్కృత గ్రంథాలలో ఉన్న అద్భుతమైన విషయాలు వెలికి తీయకుంటే ప్రపంచాన్ని పాశ్చాత్యదేశాలు అల్లోపతి వైద్యం పేరుతో ఎలా విరుచుకు తింటాయో చెప్పడానికి ఈ ఒక్క చెట్టు చాలు. పెరటిలోని చెట్టు బెరడు తగ్గించే వ్యాథులకు అల్లోపతి మందుల ఫార్మాస్యూటికల్ రంగం వేలకోట్ల రూపాయలు కిరాతకంగా సొమ్ము చేసుకుంటోంది.*
*వాల్మీకి "రామాయణాన్ని" కేవలం పారాయణ గ్రంథంగా చెప్పలేదు. "జీవన విధానంగా" చెప్పారు.*
*సీతమ్మ ఆశ్రయించిన అశోక (శింశుపా) వృక్షాన్నే తామ్రపల్లవ అని కూడా అంటారు. దీని లేత చిగుళ్లు ఎర్రగా ఉంటాయి. దీని పూవుల కారణంగా హేమపుష్పఅని కూడా పిలుస్తారు. ఇది దక్షిణాదిలో విరివిగా ఉండి, తర్వాత హిమాలయ వ్యాప్తంగా నేపాల బర్మాలకు కూడా విస్తరించిందట.*
*ఆడవాళ్ళకు అమ్మ తరువాత అమ్మ వంటిది అశోక (శింశుపా) వృక్షం అనేవారు లేకపోలేదు. కనుకనే సీతాదేవి ఆ చెట్టు ఆశ్రయించిందని ఆయుర్వేదవైద్యులు అంటారు. అశోక అనే పేరు చెట్టు స్ర్తీల శోకాలను తీర్చుతుంది కనుక దీనికి ఆ పేరు వచ్చిందని ఆయుర్వేదులు అంటారు. సీతాదేవి ఈ వృక్షం క్రింద కొలువై ఉండడానికి కారణం ఈ వృక్షం ఆడవాళ్లకు వరం వంటిది, కేవలం స్త్రీల కోసమే పుట్టిన మహావృక్షరాజం అని సూచించడానికే అనేవారు లేకపోలేదు. ఈ చెట్టు బెరడు, ఆకులు, పూలు వైద్యానికి చాలా ముఖ్యమైనవి.*
*అశోకఘృత అంటే అశోకవృక్షం నుంచీ తయారు చేసిన నెయ్యి. ఇది రుతుకాలశూలను నివారిస్తుంది. రుతుకాలశూల అనేది కౌమారంలోకి వచ్చిన ఆడవాళ్లకు సర్వసాధారణ అంశం. ఆ సమయంలో వారు కడుపులో భయంకరమైన శూలకు లోనవుతారు. దీని నివారణకు సరకా అశోకా అద్వితీయమైన మందని ఆయుర్వేదులు అంటారు. ఈ అంశం మీద పేరు చెప్పడానికి ఇష్టపడని వారు ఒక భయంకరమైన నిజాన్ని కూడా చెప్పారు. రుతుమతి అయిన కన్యలు ఈ శూలను భరించలేక అల్లోపతి వైద్యుల దగ్గరకు వెళితే వారు వినాశనకరమైన సలహాలు ఇస్తారని చెప్పారు. ‘‘పెళ్ళి అయితే అన్నీ సర్దుకుంటాయమ్మా!” అని తప్పుడు సలహాలు ఇస్తారని, ఇటువంటి సలహాల వలన రుతుశూల భయం వలన కన్యల్లో విపరీతపు పోకడలకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని వారు ఒక తీవ్రమైన అంశం తెలియచేశారు. మనదైన వైద్యవిధానాన్ని నిర్లక్ష్యం చేయడం వలన కలిగే హైందవ జాతి అనర్థాలకు అత్యుత్తమ ఉదాహరణగా రుతుకాలశూలను తెలుపుతున్నారు. కేవలం ఆయుర్వేదంలోనే రుతుకాలశూలకు నివారణోపాయాలు ఉన్నాయని అనాది కాలంగా సరకా అశోకా దీనికి ఉపయోగిస్తున్నారని చెప్పేవారు లేకపోలేదు.*
*అంతేకాదు సరకా అశోకా లేదా ఇండికా ను ఇతర ఔషథాలతో కలిపి చందనాది తైలం తయారు చేసి పచ్చకామెర్ల వంటి వ్యాథికి కూడా చికిత్సలు చేస్తారు. పచ్చకామెర్లకు తెల్లోడి దగ్గర వైద్యంలేదు.*
*ఆడది ఉన్నంత కాలం అశోక శింశుపావృక్షం అవసరం ఉంది. భగసంబంధవ్యాథి చికిత్సలకు కల్పతరువు. ఆయుర్వేదం రెండు వృక్షాలను గుర్తించింది. అశోక వృక్షం, శింశుపా వృక్షాలను చికిత్సలలో ఉపయోగించింది. ప్రతీ ఇంటిలోనూ ఉండాల్సిన చెట్లలో అశోక వృక్షం ఒకటని కూడా ఆయుర్వేదం చెప్పింది. మామిడి, ఉసిరి, తులసి మొక్క, అరటి చెట్ల కన్నా... ముఖ్యమైనది శింశుపా వృక్షం. ఆడది ఉన్న ప్రతీ ఇంటిలోనూ ఈ వృక్షం ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది.*
*ఇంత ముఖ్యమైన చెట్టు నేడు అంతరించిపోతున్న వృక్షజాతిలో చేరితే, తోలుమందగించిన మన నేతలు నిద్రపోతున్నారు. రామ జన్మభూమి రాజకీయం చేశారు. సీతమ్మ చెట్టు ఏం పాపం చేసిందో కానీ భారతదేశంలో అంతరించిపోతోంది. ఆడవాళ్లకు అతి ముఖ్యమైన గృహవైద్య చెట్టు అంతరించిపోతుంటే అల్లోపతి వైద్య ఔషథాల రంగం వేలకోట్ల రూపాయల రాక్షస వ్యాపారం చేస్తోంది. మెనొరేజియా (బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం), ల్యూకొరియా (తెలుపు లేదా పసుపు బట్ట), డిస్మొనిరియా (రుతుకాలశూల), అన్ని రకాలమూత్ర సంబంధవ్యాధులు, గర్భకోశదౌర్బల్యం, రక్తవిరోచనాలు, వాంతులుడోకులు, రక్తసమస్యలు, డిస్యూరియా (మూత్రవిసర్జన సమస్యలు), మూత్రపిండాలలోని రాళ్లు, మూలశంకలు, నారపురుగు వంటి పరాన్నభుక్కులకు విరుగుడు, స్క్రోఫ్యులా (క్షయవంటి జబ్బులకు వచ్చేవాపులను), సమస్త కురుపులనూ ఈ చెట్టు బెరడు తగ్గిస్తుంది. ఈ చెట్టు ఆకులు కడుపునొప్పిని తగ్గిస్తాయి. ఈ చెట్టు పూవులు కాలేయ సంబంధ వ్యాథులను తగ్గిస్తాయి. అన్నిటికీ మించి ఆంగ్లేయులకు కూడా తెలియని సిఫిలిస్ అనే సుఖవ్యాథి చికిత్స ఈ వృక్షానికి పూచే పూవులే ఔషథాలు.*
*ఇవన్నీ నేడు కూడా స్త్రీలకు వచ్చే వ్యాధులనీ, దీనికి కేవలం సీతమ్మ చెట్టే మందని రామాయణం సూచిస్తోంది. ఆడదానికి తల్లివంటిదని సూచించడానికే సీతమ్మ ఈ చెట్టును ఎంచుకున్నదని ఆయుర్వేదవైద్యులు చెబుతారు.*
*నేటికీ అశోకారిష్టా పేరుతో ప్రముఖకంపెనీల నుంచీ స్త్రీల గుప్తవ్యాధులకు పనిచేసే ఔషథం అందుబాటులో ఉంది. ఇదే కాక అనేక ఇతర మందులు కూడా ఈ శింశుపా నుంచీ తయారు చేసినవి ఉన్నాయి. అన్నిటికీ మించి పెరట్లో ఉన్న చెట్టు పూవులు, బెరడు, వేళ్ళు, ఆకులతో ఆడవాళ్ళకు సంబంధించిన 90 శాతం రోగాలు నయమైపోతే.. ఆంగ్లవైద్యం దివాలా తీస్తుంది. కనుకనే భారతీయులను తెలివిగా అజ్ఞానపు ముద్దలు చేశారు. కనుక నేటికీ గడకర్రల్లా పెరిగి గాలికి ఊగుతున్న చెట్లు మనల్ని వెక్కిరిస్తున్నాయని తెలుసుకోవాలి.*
*ఇంత నీచంగా నికృష్టంగా భారతీయులను అభాగ్యులను చేసిన ఆంగ్ల వైద్యం నేడు ప్రపంచాన్నికరోనా పేరుతో విరుచుకు తింటోంది. జాతి సంపద, సాంస్కృతిక సంపద, వంశపారంపర్య సంపదను కాపాడుకోలేని వారు అభాగ్యులు. నేడు భారతీయులు అభాగ్యులు అయ్యారు. వీరిని అభాగ్యులుగా చేసింది ఎవరో ఒక సారి అంతా కరోనా సాక్షిగా ప్రశ్నించుకోండి. పంచమ వేదం ఆయుర్వేదం. దీన్ని పరిరక్షించుకోవడం అనంతసాహితి ధ్యేయం. కరోనా కష్టకాలంలో మహోన్నత విలువలతో వైద్యం చేయగలిగిన భగవంతుని ప్రసాదమైన వైద్యం ఆయుర్వేదం మాత్రమే..! కరోనాకు ఆయుర్వేదంలో చికిత్స ఉంది...*
------------------
*_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*
No comments:
Post a Comment