*నిశ్శబ్దంగా చరిత్ర సృష్టించిన నందిని అగర్వాల్*. కేవలం 19 ఏళ్లకే ప్రపంచపు పిన్న వయస్కురాలైన చార్టర్డ్ అకౌంటెంట్. ఈ రోజుల్లో డ్యాన్స్ వీడియోలు, గ్లామర్, స్టార్ కిడ్స్ గురించి నిత్యం హడావిడి జరుగుతున్న వేళ, భారత దేశం లోని మధ్యప్రదేశ్లో నివసించే నందిని అగర్వాల్ తన మౌనయాత్రలో చరిత్రను రాసింది. కేవలం 19 ఏళ్ల వయసు లోనే, ఆమె ప్రపంచం లోనే అతి పిన్న వయస్కురాలైన చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యింది. అంతేగాక, అత్యంత కఠినమైన CA ఫైనల్ పరీక్షను అత్యధిక మార్కులతో ఉత్తీర్ణమైంది. ఈ విజయానికి ఎలాంటి పెద్ద పార్టీలూ లేవు, సోషల్ మీడియా హడావిడీ లేదు. ఉన్నది ఒక్కటే, నిరంతర కృషి, నిరాహంకార శ్రమ, అర్హత మరియు అంకితభావం. నందినికి గుర్తింపు రావాల్సిన సమయం ఇది. ఆమె కీర్తిని కోరలేదు, ఆమె జీవిత ప్రయాణం, లక్ష్య సాధన, పట్టుదల ప్రతి యువతికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ముఖ్యంగా, తక్కువ వయసులో కలలు కన్న ప్రతి భారతీయ అమ్మాయికి ఆమె ఒక మార్గ దర్శకురాలు.
No comments:
Post a Comment