🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*మన ఆరోగ్యం…!
*మధుమేహం అదుపులో ఉండాలంటే… ఇవి తినాలి. అవగాహనకోసం _ సలహాలు:*
➖➖➖✍️
```
డయాబెటిస్.. చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. దీన్నే మధుమేహం, షుగర్, చక్కెర వ్యాధి అని పిలుస్తారు. డాక్టర్లు సూచించిన మందులతో పాటు సరైన ఆహార పద్దుతులను పాటిస్తే మధుమేహాన్ని నియంత్రించవచ్చు.
రక్తంలోని చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు అధిక రక్త పీడనం వంటి సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు.```
*#షుగర్_పేషెంట్లకు_ఉత్తమమైన_ఆహారం:*
*1.-చేపలు:* ```మధుమేహ వ్యాధిగ్రస్తులు చేపలు తింటే చాలా మంచిది. హెర్రింగ్, సార్డైన్, సాల్మన్, అల్బకోర్ ట్యూనా, మాకేరాల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచుతాయి.
```
*2.-పప్పు_దినుసులు:* ```షుగర్ పేషెంట్ల డైట్ లో పప్పు దినుసులు ఎక్కువగా ఉండేలా చూడాలి. పప్పు దినుసుల నుండి లభించే ప్రోటీనులు, మాంసాహారం నుండి లభించే ప్రోటీనుల కంటే మేలైనవి. పప్పు దినుసులు ప్రోటీన్, ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి. ఈ మూలకాలు రక్తంలోని చక్కర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి.```
*3.-ధాన్యం:* ```మధుమేహం ఉన్నవారు గోధుమ, రాగి తప్ప వరి అన్నము తినరాదు అన్నది తప్పు అభిప్రాయం. వరి, గోధుమ, రాగి జొన్నలు, సజ్జలు మొదలైన ధాన్యాలలోనూ 70 శాతం పిండి పదార్థం ఉంటుంది. అందుకే ఏ ధాన్యం తినాలన్నది ముఖ్యంకాదు. ఎంత పరిమాణంలో తింటున్నాం అన్నదే ముఖ్యం.
```
*4.-కూరగాయలు:* ```అన్ని రకాల ఆకుకూరలు, వంకాయ, బెండకాయ, ఉల్లి పాయలు, అరటి పువ్వు, బ్రాసెల్స్ మొలకలు, క్యాబేజి, కాలిఫ్లవర్, పుదీన, బొప్పాయి, కరివే పాకు, బ్రకోలి, దోసకాయ, టర్నిప్, ముల్లంగి, బెంగుళూరు వంకాయ, అరటిపువ్వు, ములగకాయ, గోరు చిక్కుడు, కొత్తిమీర, పొట్లకాయ, టమాట , బ్రాడ్‌బీన్స్, తెల్ల గుమ్మడి, సొరకాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.```
*5.-బాదం:* ```ఎక్కువ పోషకాలను అందించే స్నాక్స్ కోసం చూస్తున్నారా.. అయితే వీటికి బాదం చాలా మంచివి. మీరు పని చేసే చోటకి బాదంలను తీసుకు వెళ్ళండి, ఖాళీ సమయాల్లో వీటిని తినండి.```
*6.-ఓట్స్:*``` శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, రక్తంలోని చక్కెర స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచే ఆరోగ్యవంతమైన ఫైబర్ ఓట్స్ లో పుష్కలంగా ఉంటుంది. ప్లెయిన్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ ఎక్కువ చక్కెరలను కలిగి ఉండకుండా, నెమ్మదిగా జీర్ణం అవుతాయి.```
*7.-బెర్రీస్:* ```బెర్రీస్ తక్కువగా కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉండటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా మంచివి.```
*భవిష్యత్తు లో మధుమేహం రాకుండా కొన్ని జాగ్రత్తలు అవగాహన కోసం సలహాలు:*```
మధుమేహం_అనేది_రెండు_రకాలుగా_సంక్రమిస్తుంది.
వారసత్వంగా వచ్చే మధుమేహం
మన అలవాట్ల వల్ల వచ్చే మధుమేహం
వారసత్వంగా వచ్చే ఆస్తులు వద్దు అనుకుంటే రాక పోవచ్చును ఏమో కానీ, వారసత్వంగా వచ్చే వ్యాధులు అనివార్యం. కాబట్టి మనం రాకుండా చూసుకోలేము, కానీ వచ్చిన తరువాత మన కంట్రోల్ లో ఉంచుకోవడము మాత్రమే మన చేతిలో ఉన్న విషయం.
```
*#ఇకపోతే_మనకు_భవిష్యత్తులో_మధుమేహం_రాకుండా_ఉండేందుకు.*```
1.-వీలైనంత వరకూ మన శరీరానికి వ్యాయామం ఇవ్వాలి.
2.-మీరు చేసే వృత్తి కి తగ్గట్టుగా మీ ఆహార అలవాట్లు చేసుకోవాలి. సిస్టమ్ వర్క్ అయితే walikng, రన్నింగ్ రెగ్యులర్ గా చేయండి. ఫిజికల్ వర్క్ అయితే కొద్దిగా యోగా చేయండి.
3.-రాగి సంగటి, అంబలి లాంటి ఫైబర్ ఫుడ్ ని వారానికి రెండుసార్లు ఖచ్చితంగా ఆహారంగా తీసుకోవాలీ.
4.-దేశీయ ఫలాలు ( Country Fruits) ఎక్కువ తినడం మంచిది.
5.-ముఖ్యం గా నేరేడు, ఉసిరికాయ, లాంటి సీజన్లో దొరికింది తినడం మంచిది.
6.-తెల్ల చక్కెర బదులు, బెల్లం, నాటు చక్కెర ఉపయోగించండి.
7.-గోదుమ, వరి అన్నం, ఇడ్లీ, చపాతీ తినడం తగ్గించి, మొలకలు కట్టిన విత్తనాలు ఎక్కువ తినడం స్టార్ట్ చేయండి.
8.-వర్క్ టెన్షన్ వదిలేసి 6 నెలలకు ఒకసారి అయినా ఫ్యామిలీ టూర్ వెళ్లి సంతోషంగా ఉండండి.
9.-చాలా ముఖ్యమైన విషయం అనవసరంగా టెన్షన్ అవడం, భయపడ్డం అదుపులో ఉంచేందుకు ప్రయత్నం చేయాలి.
10.-ఎందుకంటే మానసిక ప్రశాంతత లేకపోతే బి.పి, షుగర్ లు సులభంగా అటాక్ చేస్తుంది.
B.P. షుగర్ లు తోబుట్టువులా ఉంటాయి. ఏ ఒకటి వచ్చినా, ఇంకొకటి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.
వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నీళ్లు ఎక్కుగా తాగాలి. నిజానికి మధుమేహం విషయంలో ఆహార వ్యాయామాల వంటివి ముఖ్యమేగానీ వాటికంటే కూడా.. గ్లూకోజు నియంత్రణకు వైద్యులు చెప్పినట్టుగా మందులు వేసుకోవటం, క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవటం మరింత ముఖ్యం.✍️
ధన్యవాదములు 🙏
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment