Wednesday, August 6, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

           *విచిత్ర బంధాలు*
              ➖➖➖✍️
  *విపర్యయ వ్యామోహాలు __!!*



*కంటికి రెప్పల్లా బిడ్డల్ని కాపాడుకోవడం చివరగా వారు అంటించే అగ్నిలో కాలి బూడిదై పోవడం..!*

*ఆస్తిపాస్తు లంటూ క్షణం తీరిక లేకుండా శ్రమించి సంపదను ప్రోగుచేయడం*

*ఆ ఆస్తుల కారణంగానే ఆత్మీయు లనుకున్నవారు మరణించినా మేము ముఖం చూడము" అని దూరంగా పారిపోవడం !!*

*ఎవరి విషయంలో నైనా ఇవి మామూలే!*

*ఎన్నడైనా ఇవి వాడిపోయే పూలే..!*

*ఎన్ని ఉన్నా  ఎందరున్నా                 ఏవీ ఎవరూ కూడా తోడు రారు! అనే వివేకం మనిషికి రావడం లేదు.* 

*పైగా నీడలన్నీ నిజాలుగా గోచరిస్తాయి !!*

*మరణంతో ముగిసిపోయే బాంధవ్యాలను పెనవేసుకొని మనిషి మురిసి పోతున్నాడు.*

*కేవలం అవసరాలను మాత్రమే తీర్చి అసంతృప్తిని మిగిల్చిపోయే ధనాన్ని _ ప్రోగు చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాడు !!*

*చేసే ఉద్యోగంలో సమస్యల ఉద్వేగం తప్ప సుఖశాంతులు లేవని తెలుస్తున్నా హోదాను మననం చేసుకుంటూ .. మరిగిపోతూ ఉంటాడు.*

*"తొండ పరుగు కంచె వరకే" అన్నట్లు _ ఈ అప్రస్తుత, అసందర్భ ప్రవర్తన లన్నీ _తుదిశ్వాస వరకే !!*

*తెర పడిందా !*

*మళ్ళీ నాటకం మొదలుకొస్తుంది..!*

*కాకపోతే _ప్రదేశము ‘కాలము,  రంగస్థలము’ మారుతుంటాయి అంతే!*

*ఇదంతా ‘మాయాకార్యము’.              మాయలో ఉన్నంతవరకు ఈ వేదనలు తప్పవు.*

*మాయను దూరం చేసి… మహిమను సమీపించన వారికే బాధలు తీరుతాయి; బరువులు తగ్గుతాయి*✍️
          
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment