రంగుల జిలుగుల తళకుల
మెరెసే దారపు పోగు కాదు రాఖీ..
అలంకారానికో ఆడంబరానికో
ముంజేతికి కట్టుకొనే తాడు కాదు రాఖీ...
అనురాగానికి ఆలంబనగా..
ఆప్యాయతకు గురుతుగా..
మమకారానికి సూచనగా..
అనుబంధానికి సంకేతముగా..
అన్నాతమ్ముళ్ళ క్షేమమెంచగా
అక్కచెల్లెండ్లు ప్రేమతో..
ఆత్మీయతతో...
*సోదరసోదరీ బంధం బలపడాలని*
*మదిని తలచి కట్టే రక్షా బంధనమే రాఖీ...*
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో...💐💐
No comments:
Post a Comment