*భార్య మురిపెంగా, అడిగిందిలా..*
*"ఏమండీ ! మీరెపుడూ అమ్మ గురించే రాస్తారు, భార్య గురించి రాయరా?"*
*అంతే, అతని కలం పరుగులు తీసింది ఇలా ......*
*ఎవరో నీవు చందమామంత అందం లేదు కలువ భామంత సుకుమారం లేదు*
*సరస్వతీ దేవంత చదువు లేదు కనక మాలక్ష్మంత ధనం లేదు పార్వతీ దేవంత శౌర్యం లేదు*
*కానీ .......*
*కన్నుల నిండా వెన్నెల మనసు నిండా కరుణ*
*మాటల్లో తేనెలా కమ్మదనం ఆకలైతే కడుపు నింపే అమ్మదనం*
*ప్రేమలో నాలో ఐక్యమయ్యే కనకాంబరం*
*ఆకాశమంత నీకు నా బతుకంతా నీవైన నీకు రెండు అక్షరాల 'భార్య' పదం చాలునా ?*
*గృహస్తాశ్రమ ధర్మాలు నీతోనే వానప్రస్తాశ్రమ ధర్మం నీతోనే ధర్మేన అర్థేన కామేన నాతిచరామి నీతోనే*
*మా అమ్మ నాతో చెప్పిన మాట ఆ చేయి పట్టుకోరా*
*మీ అమ్మ నీతో చెప్పిన మాట ఆ చేయి విడువకమ్మా*
*అలా నా దీపమైనావు*
*నా ఇంటి మణిదీపమైనావు*
*నా జీవితపు మణి ద్వీపమైనావు*
*పాలేవో నీరేవో తెలియనంతగ కలిసాం*
*వెన్నెలైనా చీకటైనా కలిసి ఒక్కటై సాగాం*
*నాలో నీవు ... నీలో నేను అమరమైన ఈ అద్వైతంలో వేలకొద్దీ తీయని గురుతులే ఎగిరే సీతాకోక చిలుకల్లా*
*కమ్మని కవితలా .. మధుర గీతంలా .. మధు మాసంలా ..*
*అర క్షణంలో ఆవిరై పోయే కోపతాపాలు మరుక్షణంలో కలిసిపోయే అనుబంధాలు*
*అదే అదే నీవు నేర్పిన భార్యాభర్తల బంధాలు*
*గొప్ప బహుమతులు వద్దంటివి ప్రేమతో ఇచ్చే చిన్ని జ్ఞాపకాలు చాలంటివి*
*భూతల్లి పిలిచేవరకు కష్టమైనా సుఖమైనా*
*నీతోనే నీతోనే*
*కన్నుల్లో నిలిచావు కంటిపాపలా*
*గుండెల్లో ఉన్నావు గుండె సవ్వడిలా*
*"మన జీవన లీల ఆనంద హేల"*
*ఋణం ఉండి కలిసామో*
*ఋణం తీర్చుకోవడానికి కలిసామో?*
*తెలియదు కానీ*
*నీవో అద్భుతానివి*
*నేనో నిమిత్ర మాత్రుడను*
*ప్రతి ఇంటిలో*
*ప్రతి భర్తలో*
*ఆకాశమంత 'ప్రేమైన' నీకు*
*రెండక్షరాల 'భార్య' అను పదం చాలునా?*
No comments:
Post a Comment