Wednesday, August 6, 2025

 *అంశం :-  పెళ్లనే కొత్త జీవితం ...*

*కోటిఆశలతో మొదలయ్యే పెళ్లనే కొత్త జీవితంలోకి*
*ఎన్నో ఊహలతో ఆనందాలతో ఆశలతోఆలోచనలతో అత్తింట అడుగుపెట్టినప్పుడు అక్కడ నీకు ఎదురయ్యే ‌ ప్రతిఅనుభవం చాలావిలువైనది ... అత్తిల్లనే కొత్త ప్రపంచంలో ‌... నీకు నీవే కొత్తగా ...*

*ఎవ్వరు నిన్ను తక్కువుగా...‌* *చిన్నచూపు చూసినా*
*చులకనగా* *చూసినా ...నిన్నునువ్వు* *చిన్నచూపు* *చూసుకోకు ...నువ్వెంటో ... నిన్ను నువ్వు బాగా తెలుసుకోని ... నువ్వంటే నీకే ప్రత్యేకమైన గౌరవంతో ఉన్నప్పుడు ... నువ్వంటే నీకు తెలుస్తుంది...*
*నిన్ను నువ్వు గౌరవించుకునేంత గొప్పగా ... అక్కడివారికి అదే గౌరవం నువ్వు ఇస్తున్నప్పుడు ...*

*కొత్తజీవితాన్ని మంచిగామొదలుపెట్టి‌... నిన్ను నీవు గౌరవించుకుంటూనే ... కుటుంబబాధ్యతలు మరవక ‌కుటుంబబాధ్యతను జీవితాంతం సక్రమంగానే మోస్తున్నప్పుడు ...ఆ బాధ్యతలనుండి బాధ్యతలేకుండా పక్కకితప్పుకోనప్పుడు ...*

*కొత్త జీవితంతో మొదలైన అదే గౌరవం జీవితాంతం* *కొనసాగిస్తూనే ...‌ ఆ కొత్తజీవితమే కడవరకుకూడా ... ‌ఎదుటివారికి అసూయపుట్టేలా బ్రతకగలవు ...*
*కోటిఆశల ఆనందాలను నిజం చేసుకోగలవు ...*

*బాధ్యతనువదలని ఏ స్త్రీ అయినా ఆ కోటిఆశల ఆనందాన్ని నిజం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ...*
*ఆ విజయంసాధించిన సంతృప్తి సంతోషం ఎప్పటికీ జీవితాంతం ‌సొంతమే...  అత్తింట్లో మొదలయ్యే కొత్త జీవితంలోని నీ కోటిఆశల ఆనందానికి ... అత్తింటి ...*
*ఆ ఇంటి ‌చూరునుండి బొట్టుబొట్టుగా కారే..*
*ఆ వర్షపుజల్లులే ... పూలజల్లులుగా ‌స్వాగతం కొత్తఇంటి బాధ్యతలకు మొదటిఅడుగుగా స్వాగతం.*

No comments:

Post a Comment