*_కొన్ని యాపులు వాపులు.._*
*_మరికొన్ని తలవంపులు..!_*
పూర్వం జనం అప్పుల వల్ల మునిగేవారు..ఇప్పుడు యాపుల కారణంగా మునిగిపోతున్నారు..
_____________________
సూది కోసం సోదికెళితే
అన్న చందాన...
ఫోను పోయిందని
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే
ఉన్న లింకులన్నీ బట్టబయలు కావా మరి..!
________________________
రీఛార్జి అనే పదమే తెలియని
మనకి ఇప్పుడు టీవీ రీఛార్జి..
ఫోన్ రీచార్జీకే మొత్తం క్షవరం అయిపోతోంది..!
_______________________
అమెరికాలో ఉన్న కూతురు ముంబైలో ఉన్న నాన్నకి ఫోన్ చేసి పిడుగులాంటి వార్త చెప్పింది..నాన్నా ఇంగ్లాండ్ లో నీకు అల్లుడిని చూసానని..
తాను కూడా టెక్ అయిన తండ్రి లైట్ తీసుకుని ఇలా అడిగాడు...
పిల్లాడు ఎలా పరిచయం అయ్యాడని..
Face book లో..
కూతురి సమాధానం
కూల్ గా..
తండ్రి మరో అడుగు ముందుకేసి..ఇచ్చిన సలహా చూడండి..
సరేలే తల్లీ..
ఫేస్ బుక్కులో పరిచయం అయ్యాడు కదా..
వాట్సప్పులో మాట్లాడేద్దాం..
ట్విట్టర్లో పెళ్లి చేసేద్దాం..
ఇన్ స్టాగ్రాములో
సంసారం చేసేయి..
ఫ్లిప్ కార్ట్లో పిల్లల్ని
ఆర్డర్ చెయ్యి..
గూగుల్లో డౌన్ లోడ్ చేసుకో..
ఇవన్నీ జరిగాక కూడా అల్లుడు నచ్చకపోయినా..
నప్పకపోయినా
Olx లో అమ్మి పడెయ్యి..
ఇదీ వరస..
________________________
సురేష్..
No comments:
Post a Comment