Saturday, August 9, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
               *లోపలికి చూడు.!*

*సిలబస్ అయిపోయాక ఉపాద్యాయుడు పరీక్షలు పెట్టడం సహజం.*

*గీతా జ్ఞానం మొత్తం విన్నాక అర్జునుడు ఒంటరిగానే యుద్దము ఎదుర్కొనక తప్పలేదు. కాబట్టి జీవితమూ అంతే !*

*జీవితంలో గురువు జ్ఞానం చెప్పి వెళ్తాడు ఆ తరువాత జీవితాన్ని ఎదుర్కోవలసింది ఎవరికి వారే.*

*పరీక్షల్లో పక్కవాడి పేపర్ చూసి కాపీ కొట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఎంత తప్పో అలాగే గురువు పూర్తి జ్ఞానం చెప్పిన తరువాత కూడా అంతర్గత ఆత్మను వదిలేసి పక్కవాడు చెప్పింది, లేదా ఒక గుంపు అనుసరించే మార్గాన్ని అనుసరిస్తాను అనడం అంతకంటే తప్పు.*

*సబ్జెక్ట్ అర్థం కాకపోయినా కాపీ కొట్టి పాస్ అయినా వాడికి విషయం తెలియదు. అలాగే గురువు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం మానేసి ఇతరులు వెళ్ళే మార్గాన్ని అనుసరిస్తే* *అయిపోతుంది అనుకునే వాడి పరిస్తితి కూడా అంతే.*

*ఆత్మను అర్థం చేసుకోలేక కనిపించే వాడినల్లా అనుసరించి విఫలమౌతాడు. మనం ఎప్పుడూ ఒక్క విషయాన్ని జ్ఞప్తికి ఉంచుకోవాలి… మోక్షానికి ఎప్పుడూ గుంపులు, గ్రూపులు వెళ్లవు. ఒక్కడే వెళ్తాడు.*

*ఆ ఒక్కడికోసమే గురువు వస్తాడు. మిగిలిన వారికి గురువు జ్ఞానం చెప్పి కాస్త దగ్గరకు చేరుస్తాడు.*

*కాబట్టే ఆ జ్ఞానం అర్థం చేసుకొనేందుకు మనిషికి అనేక జన్మల సమయం పడుతుంది.*

*అందుకే ఆ ఒక్కడివి నువ్వు అయ్యేలా ఒక్కడిగానే నేర్చుకో!  నీకు నీ గురువు లోపలే ఉన్నాడు.*

*ఎప్పుడూ కూడా పక్కవాడి జ్ఞానం కాకుండా గురువు చెప్పినట్టు ఆత్మను అనుసరిస్తూ ఉంటాడో, అప్పుడు ఎటువంటి ఆడంబరం, ముందస్తు ప్రకటన లేకుండా అటువంటి వాణ్ని దేవుడు మోక్షానికి చేరుస్తాడు. ఆత్మను అనుసరించే వాడే  మోక్షానికి దగ్గర అవుతాడు.*
    
*నువ్వు ఎలా వుండాలి, ఎలా బ్రతకాలి అనేది నీలోపలి ఆత్మ చూసుకుంటుంది. ఇది ఎప్పుడూ నీకు జ్ఞాపకం ఉండాలి.*
 
*గురువు ఎన్ని సార్లు వచ్చినా ఆత్మ గురించే చెబుతాడు.*

*ఆయన పైన ఆధారపడకుండా మొత్తం జ్ఞానం నేర్పి ఆ జ్ఞానంతో మనకు మనమే ఆత్మతో స్వతంత్రంగా బ్రతికే విద్య నేర్పాలని చూస్తాడు.                  అది తెలిసిన వాడు ఆయన ఉన్నప్పుడూ ఆ తరువాత లేనప్పుడు కూడా ఎలా ఉండాలో అవగాహన చేసుకొని జీవిస్తాడు.*
     
*పక్కవాడు ఎలా వెళ్తే అలానే అని కాకుండా నీలోని ఆత్మ ఏం చెప్తోందో అని లోపలికి చూడు.*

*నీకు నువ్వు అంతర్గత మార్గం కనుక్కోలేని వాడివి పక్క వాడి మార్గం సరైందని భావించడం ఒక పెద్ద అజ్ఞానం.*

*జ్ఞానం మనల్ని స్వతంత్రున్ని చేస్తుంది. స్వతంత్రం అంటే దానర్థం మన ఇస్టానుసారం బ్రతకడం కాదు.*

*జ్ఞానంలో స్వతంత్రం అంటే     వేరొకరు చెప్పకనే నీకు నువ్వే ఏది ధర్మం - ఏది అధర్మం అని తేడా తెలుసుకునే స్థాయికి రావడము.*

*ఎలా ఉండాలనేది, ఎవర్ని అనుసరించాలి అనేది కూడా తెలిసిఉండటం.*

*ఆ స్థాయికి చేర్చాలనే గురువు ప్రతీ యుగాన జ్ఞానం చెప్తున్నాడు.*

*ఆ స్థాయికి వచ్చి అంతటి  జ్ఞానం నీకు రావాలంటే నీలోపలి ఆత్మ ద్వారానే జరగాలి. అందుకే ఆత్మను గుర్తించుకుని ఉన్నకర్మలు చేస్తూ ఉండు.*

*ధర్మాన్ని ఆచరిస్తూ జన్మలు లేకుండా చేసుకొని పరమాత్మను చేరే మార్గం పైన ధ్యాస ఉంచుకోవాలి. ఇది నీకు చెప్పేందుకే గురువు వస్తాడు. కానీ గుంపులో ఒకడిలా బ్రతకమని కాదు. గుంపులు, గందరగోళ అభిప్రాయాల నుంచి  పక్కకు జరిగి ఏకాంతంగానైనా ఆత్మను స్మరిస్తూ పరమాత్మ మార్గాన్నిఅన్వేషించు.*

*ఎప్పటికైనా వెళ్ళేది ఒక్కడివే కాబట్టి ఇతరులు చెప్పేది ఫాలో అయ్యేది విడిచిపెట్టి ఒక్కడివై ఆలోచించు. అన్వేషించు. అప్పుడే నీకు సంతృప్తి ఉంటుంది.*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🪸🌴 🪸🌴🪸 🌴🪸🌴

No comments:

Post a Comment