🙏🏻 *రమణోదయం* 🙏🏻
*ఆకాశ ధ్యానం చేసే వాళ్ళల్లో, తర్వాత "ఈ ధ్యానం చేసే నేనెవర"నే లోదృష్టితో ఆకాశ ధ్యానాన్ని వదలి అంతర్ముఖమైన వారే జన్మరహితమైన ముక్తి పదవిని పొందుతారు. ఆకాశ ధ్యానం నుండి విడిపడలేని వారు జనన మరణ రూపమైన సుడిగుండంలో చిక్కుకుంటారు.*
ఆత్మలోనే అన్నీ వున్నాయి,
ప్రపంచం ఉన్నదనీ,అందులో నీ శరీరం ఉన్నదనీ, దానిలో నీవు ఉన్నావనీ తలంచడం తప్పు.
సత్యం తెలిసినప్పుడు, ఈ ప్రపంచం, దానికి
అవతల వుండేదీ, అన్నీ ఆత్మలోనే ఉన్నట్టు
అవగతమౌతుంది!
🌹🙏🏻 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.744)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment