Tuesday, August 17, 2021

శ్రీ దత్తాత్రేయ స్వామి 24 గురువులు

🕉️శ్రీ దత్తాత్రేయ స్వామి 24 గురువులు🕉️

📚✍️ మురళీ మోహన్

🙏 దత్తుడు త్రిమూర్తి స్వరూపమైన విశ్వగురువు. శిష్యునికి భగవంతుని వెలుగు ఎవరి ద్వారా వస్తుందో వారే గురువు.


గురువులో గకార సిద్ధివాచకం, రకార పాపనాశకం, ఉకార విష్ణువాచకాలు ఉన్నాయి.


గురువులో రెండు ఉకార వాచకాలు పాపనాశనాన్ని చేసి సిద్ధిని ఇచ్చే వ్యాపకత్వముతో కూడి శుధ్ధి చేయువారు గురువు.అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం ఎవరి ద్వారా కలుగుతుందో వారు గురువు (వారు లేదా వాటి ద్వారా)మరో అర్థం ఎవరి నుంచి మేలు పొందినా వారిని గురువు అనాలి. అంటే మేలు చేసినవారు కూడా గురువే


దత్తాత్రేయుడికి 24 మంది గురువులు.. వీరంతా లోకంలో ఉన్నవారే.


ఇలా ప్రతి ఒక్కరి నుంచి ఒక్కో విషయాన్ని గ్రహించి వారిని/వాటిని తన గురువులుగా దత్తాత్రేయుడు స్వీకరించారు.


దీనిలో పరమార్థం మనం మన చుట్టు ఉన్న ప్రకృతిలోని జీవులు, వస్తువులోని మంచిని గ్రహించి జీవనాన్ని సన్మార్గంలో నడుపుకోవాలని తెలియజేస్తుంది.


దత్తాత్రేయ అవతారంలో ఎందరినో ఉద్దరించాడు.ఆధ్యాత్మిక సిద్ధి, యోగవిద్యను ఎందరికో ఉపదేశించాడు. వీరిలో ప్రహ్లాదుడు,యదురాజు, పరుశరాముడు,కార్తవీర్యార్జునుడు,మహాసతి మదాలస పుత్రుడైన అలర్క వీరిలో ప్రధానమైన వారు.


ఇక అవధూత పరంపరకు ఆద్యుడు. దత్తాత్రేయున్ని అవధూత శిరోమణి, ఆదిగురువు అని కూడా పిలుస్తారు.అవధూత అంటే స్వస్వరూపంగా అవస్థితమైన మహాత్ముడు. దీనిగురించి గోరక్ష సిద్ధాంతంలో విశేషంగా పేర్కొన్నారు.


ॐॐॐॐॐॐॐॐॐ

దత్తాత్రేయుని 24 మంది గురువులు.

ॐॐॐॐॐॐॐॐॐ

యాదవ వంశానికి మూలపురుషుడైన యదువు అనే రాజు దత్తాత్రేయుని చూచి స్వామీ మీరెలా సదానంద, చిదానంద స్వరూపులై ఉండ గలుగుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు దత్తాత్రేయుల వారు ఇలా సెలవిచ్చారు.


యదు రాజా ! నేను సమస్త ప్రకృతిని పరిశీలించి అన్నింటి నుండీ జ్ఞానం సంపాదించాను. చెప్తాను విను.


ప్రకృతిలో నాకు 24 మంది గురువులున్నారు. కొన్నింటి నుండి ఎలా ఉండాలో తెలుసుకున్నాను, కొన్నింటి నుండి ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను.


ఆ విధంగా తానే స్వయంగా దేవతలు, రాజులు, మహర్షులకి ఎందరికో గురువైనప్పటికీ, అహంకారం లేకుండా సృష్టిలోని ప్రతీ అణువు నుండి నేర్చుకుంటూ శిష్యుడు కూడా అయ్యాడు.


జగత్తుకూ, ప్రకృతికీ తానే గురువైనా మనందరిలో ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించడానికి జగద్గురువైన దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని 24 తత్త్వాలను తన గురువులుగా ప్రకటించుకున్నారు అవి...

1)🎇 ఆకాశం

2) 🌏భూమి

3) 🔥అగ్ని

4) 💦జలం

5) 🌬️వాయువు

6) 🌞సూర్యుడు

7) 🌝చంద్రుడు

8)🐦 పావురం

9) 🐍కొండ చిలువ

10) 🐝తేనెటీగ

11) 🦋భ్రమరం ( తుమ్మెద )

12) 🌊సముద్రం

13) 🦅రాబందు

14) 🕷️సాలీడు

15)🐘 ఏనుగు

16) 🦌జింక

17) 🐟చేప

18) 👼పసి పిల్లవాడు

19) 🧏‍♀️కన్య

20) 🐍పాము

21) 🤠లోహపు పనివాడు

22) 🐻ఎలుగుబంటి

23) 🧛‍♀️వేశ్య

24) 🦗చిమ్మట

ఇవన్నీ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు , పంచ తన్మాత్రలు, మిగిలిన నాలుగు మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారాలకు ప్రతీకలు. ఆ ఙ్ఞానమూర్తి అవ్యక్త రూపంలో వీటన్నిటిలో ఉన్నట్టుగా చెప్తారు.


ఈ ప్రకృతి తత్త్వాలను దత్తాత్రేయుడు ఎలా గురువుగా స్వీకరించాడో... తెలుసుకుందాం.

🕉🌞🌏🌙🌟🚩

1. మొదటి గురువు - 🌏భూమి:-

దత్తాత్రేయుడు తాను భూదేవి నుండి ఓర్పు వహించడం, కర్తవ్య నిర్వహణా ధర్మం, కార్య నిర్వహణలో ఎన్ని కష్టానష్టాలు వచ్చిన ఓర్చుకోని నిలబడడం, తన ధర్మం తాను తప్పకపోవడం లాంటి ఎన్ని విషయాలనో తాను గ్రహించానంటాడు జగద్గురువైన దత్తాత్రేయుడు. భూదేవి కన్నా ఓర్పు ఈ విశ్వంలో ఎవరికి ఉంటుంది. మానవుడు దుర్మార్గుడు ఎన్ని అకృత్యాలకు పాల్పడినా ఓర్పు వహించి భరించేదే భూమాత.


మనం ఎన్నో తప్పులు చేసి భూదేవిలో భాగమైన ఈ ప్రకృతి నడిచే సక్రమమైన వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసి ఉత్పాతాలు సృష్టించినా ఉపేక్షించి, కొడుకు ఎన్ని తప్పులు చేసినా కన్నతల్లి తన కడుపులో దాచుకున్నట్టు, ఓర్పుతో మనని ఉద్ధిరించే ప్రయత్నం చేస్తుంది తల్లి భూదేవి. ఇంకా భూదేవి నుండి నేర్చుకోవాల్సిన గుణం క్షమా గుణం.


భూమిపై ఉండే పర్వతాలు మరియు వృక్షాల లాగా ఇతరులకు ఎలా ఉపయోగపడాలో నేర్చుకోవలంటాడు దత్తాత్రేయుడు.

2. రెండవ గురువు - 🌬️వాయువు:-

గాలి మనకు ప్రవిత్రత, వాసన లేని గుణం అంటే ఎలాంటి విపరీత భావాలూ లేకపోవడం మరియు అందరిలో తొందరగా కలిసిపోవడం లాంటి ఎన్నో గుణాలు నేర్పుతుంది. గాలి అన్నిటితో కలిసినా తన సహజలక్షణాన్ని ఎలాగైతం కోల్పోదో మనిషి కూడా అలాగే మనం కూడా ఎంతమందితో కలిసినా మన సహజ లక్షణాన్ని కోల్పోకూడదు.


ఎలాగైతే గాలి అదుపు తప్పి అతివేగంతో వీచి ప్రకృతిలో మహా విధ్వంసం సృష్టిస్తుందో అలాగే అదుపు లేని మనస్సు కూడా అలాగే ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తుంది, అలాంటి మనస్సుని పరమాత్మ వైపు మరల్చడం చాలా కష్టం. అందుకే మన మనస్సుని సాధ్యమైనంత వరకు మన అదుపులో పెట్టుకొని పరమాత్మ వైపు నడిపించే ప్రయత్నం చేయాలి.

3. మూడవ గురువు - 🎇ఆకాశం

🙏విశ్వమునంతా కప్పి ఉంచే ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది. కొన్నిసార్లు ఆకాశాన్ని మబ్బులు కమ్మి దాన్ని కనబడకుండా చేస్తాయి. అయినా ఆకాశం ఆ మబ్బుల చేత ప్రభావంఏ కాదు. తన స్థితిని తాను విడచిపెట్టదు. అలాగే ఆత్మకూడా ఈ ప్రాపంచిక విషయాల చేత కప్పబడినా తన అసలు స్థితిని మరవకూడదని దత్తాత్రేయ స్వామి అంటారు.


ఆకాశం విశ్వంలో ప్రతి చోట వ్యాపించి ఉంది. దానికి కనపడని వస్తువూ, విషయమూ లేదు. అలాగే పరమాత్మ కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయన చూడని విషయమూ, ఆయనకు తెలియని విషయమంటూ లేదు.


ఆకాశం మనకు నీలి రంగులో కనిపించినా, అసలు ఆకాశానికి రంగేలేదు. అలాగే పరమాత్మ ఒక రూపంలో మనకు కనబడ్డా రూపరహితుడు ఆ పరమాత్మ. ఎలాగైతే ఆకాశంలో ఎలాంటి పదార్థం ఉండకుండా పూర్తి ఖాళీగా ఉంటుందో, అలాగే ఒక ఙ్ఞాని తన ప్రవచనాలలో కూడా ఎలాంటి భావాలను ఉంచుకోకూడదని అంటాడు దత్తుడు.


4. నాలుగవ గురువు - 💦జలము:-

ఋషి లేదా ఙ్ఞాని జలము లాంటి వాడు. ఙ్ఞాని నీరుగా స్వచ్ఛమైన మనసు కలవాడు. నీరులాగా కోమలమైన గుణం కలిగి, ఎలాగైతే నీరు సరిగా ప్రవహిస్తున్నప్పుడు మంచి మంచి శబ్దాలు చేస్తుందో అలాగే ఙ్ఞాని కూడా తన నోటి ఎన్నో మంచి మాటల ధారలను ప్రవహింపజేస్తాడు.


ఎలాగైతే నీటిలోని మురికి బట్టలు కాసేపటికి శుభ్రమవుతాయో అలాగే మలినమైన మనస్సు గల మనం మహాత్ముల ( ఙ్ఞానుల ) సాంగత్యం కలగగానే మన మనసులు నిర్మలమవుతాయి. ఎలాగైతే నీరు ఎలాంటి అహం భావము లేకుండా జాతి, కుల, మత బేధాలు లేకుండా అందరి దాహార్తిని తీరుస్తుందో అలాగే ఙ్ఞాని కూడా కుల, మత, జాతి, వర్ణ బేధాలు విడిచిపెట్టి అందరికీ సమానంగా ఙ్ఞానాన్ని పంచాలి. అందుకే ఙ్ఞాని సమత్వ బుద్ధి కలిగి అందరిలో ఙ్ఞాన దీపాలను వెలిగించాలి.



✍️ మురళీ మోహన్

5. ఐదవ గురువు - 🔥అగ్ని:-

అగ్ని సమస్తాన్ని కబళించి ఆహారంగా స్వీకరిస్తుంది. అపవిత్ర పదార్థాలను స్వీకరించినా కానీ తాను మాత్రం పవిత్రంగానే ఉంటుంది. అలాగే మనం కూడా సమస్తమైన ఙ్ఞానాన్ని నేర్చుకోవాలి కానీ మనం అపవిత్రులం కాకూడదు. అగ్ని నుండి ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలంటాడు దత్తాత్రేయుడు.


ఙ్ఞాని కూడా అగ్నిలా పవిత్రుడు. ఎలాంటి కల్మషమూ లేని వాడు. ఙ్ఞాని అరిషడ్వర్గాలకు అతీతుడు.

6. ఆరవ గురువు - 🌝చంద్రుడు:-

చంద్రుడు కృష్ణ పక్షంలో తన కళలు క్షీణిస్తున్నా చల్లటి వెన్నెల వెలుగును ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఙ్ఞాని కూడా తనకు ఏం జరుగుతున్నా ఇతరులకు మంచి చేసే ప్రయత్నమే చేస్తాడు. మహాత్ములు కూడా గుణంలో చాలా చల్లనివారు.


చంద్రుడు శుక్ల పక్ష, కృష్ణ పక్షాల్లో పెరిగుతూ , క్షీణిస్తున్నా తన అసలు గుణ స్వరూపాలలో మార్పు చెందడు. అలాగే మహాత్ములు కూడా వారు పుట్టినప్పటి నుండి మరణించే వరకు వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా వారి యొక్క సహజ గుణంలో, స్వభావంలో మార్పును రానివ్వరు.

7. ఏడవ గురువు - 🌞సూర్యుడు:-

🙏సూర్యుడి ప్రతిబింబం ఎన్ని పదార్థాల్లో కనిపించినా సూర్యుడు మాత్రం ఒక్కడే. అలాగే పరమాత్మ కూడా ఎన్ని రూపాల్లో కనిపించినా పరమాత్మ మాత్రం ఒక్కడే. ఇలా సూర్యుడి నుండి చాలా విషయాలు నేర్చుకోవాలంటాడు దత్తాత్రేయుడు.


సూర్యుడు తన వేడిమితో సముద్రాలలో ఉన్న నీటిని ఆవిరి చేసి వర్షం రూపంలో మళ్ళీ ఆ నీటిని భూమికి చేరేటట్టు చేస్తాడు. కానీ ఈ మొత్తం ప్రక్రియలో సూర్యుడు ప్రత్యక్షంగా నీటిని అంటడు కదా. అలాగే మహాత్ములు కూడా మన నుండి ప్రాపంచిక పదార్థాలు స్వీకరించినా. వాటిపై మోజు పెంచుకోక మరల వాటిని ఏదో రూపకంగా మనకే ఇచ్చివేస్తారు.

8. ఎనమిదవ గురువు - 🐦పావురం:-

దీనికి సంబంధించిన విచిత్రమైన కథ ఒకటి ఉంది. ఒక అడవిలో పావురాల జంట నివసిస్తూ ఉండేది. వాటికి కొంత కాలం తరువాత సంతానంగా రెండు పావురాలు జన్నించాయి. శైశవ దశలో ఉన్న ఆ పావురాల కోసమని ప్రతిరోజూ ఈ పావురాల జంట ఆహారం తీసుకొని వచ్చేవి.


అలా ఒకనాడు పిల్లల కోసం ఆహారం తేవడానికి వెళ్ళిన పావురాల జంట తిరిగి వచ్చెసరికి తమ సంతానం వేటగాడి వలలో ఉండడం చూసి చాలా దుఃఖించాయి. ప్రాణప్రదంగా పెంచుకున్న వాటిని వీడి ఉండలేక ఆ పావురాల జంట కూడా అదే వలలో పడి వేటగాడికి ఆహారంగా మారాయి.


మనిషి కూడా ప్రాపంచిక విషయాలపై బాగా ఆసక్తి పెంచుకొని పరమాత్ముని మార్గం నుండి వైక్లబ్యమును పొందుతారు. మోక్ష మార్గాన్ని విడిచి ఐహిక విషయసుఖాలకై ప్రాకులాడతారు. పుత్రులు, మిత్రులు, భార్య , బంధువులే కాకుండా పరమాత్మ అనేవాడు ఒకడున్నాడనే ధ్యాస కూడా ఉండకుండా ప్రాపంచిక సుఖాలలో మునిగితేలుతూంటాడు.అప్పుడు సద్గురువు లేదా ఆ పరమాత్మనే ఆశ్రయించి మోక్ష ప్రాప్తికై ప్రయత్నించాలి.ఆ పావురాల జంట లాగా మనిషి మూర్ఖంగా ప్రవర్తించ కూడదని హితవు పలుకుతాడు దత్తాత్రేయుడు.



9. తొమ్మిదవ గురువు -🐍 కొండచిలువ:-

కొండ చిలువ తనకు ఎదురుగా ఏది వచ్చినా దానిని మింగేస్తుంది. అది మంచిదో, కాదో, చేదుగా ఉందా, తియ్యగా ఉందా అసలు తినవచ్చో, తినకూడదో అని కూడా చూడదు.


అలాగే మనిషి కూడా తన జీవితంలో వచ్చిన సుఖదుఃఖాలు, లాభనష్టాలు లాంటి ద్వంద్వాలు ఎన్ని వచ్చినా చలించక సమానంగా స్వీకరించాలంటాడు దత్తాత్రేయుడు.

10. పదవ గురువు - 🐝తేనెటీగ:-

తేనటీగ పువ్వుల నుండి ప్రతి రోజూ తేనెను సేకరిస్తుంది. కానీ ఈ మొత్తం ప్రక్రియలో అది పువ్వులకు ఎటువంటి హాని కలిగించకుండా తన పని తాను చేసుకుపోతుంది.


అలాగే మహాత్ముడు లేదా ఋషి కూడా ఆన్ని గ్రంథాల నుండి ఙ్ఞానాన్ని సంపాదించాలి. ఇల్లిల్లూ తిరిగి భిక్ష స్వీకరిస్తున్నప్పుడు గృహస్థులను ఇబ్బందులకు గురిచేయకూడదంటాడు దత్తుడు. ఙ్ఞాని తేనెటీగ లాగా పిసినారి వాడై ఉండకూడదు.




11. పదకొండ గురువు - 🐻ఎలుగుబంటి:-

తేనెటీగలు తాము సేకరించిన తేనెను భద్ర వరచుకుంటాయి. కానీ ఆ తేనెని ఎప్పుడు కూడా తినవు, అసలు ఇతరులకు వాడే ప్రయత్నమే చేయవు. అలా దాచిన తేనెని అడవి ఎలుగుబంట్లు తింటాయి.


యోగి అనే వాడు ఎప్పుడూ ఏదీ దాచుకునే ప్రయత్నం చేయకూడదు. తరువాతి క్షణానికి కూడా ఏదీ దాచుకోకూడదంటాడు దత్తుడు. తినడానికి నోరుని, తిన్న అన్నాన్ని భద్రపరచుటకు కడుపును మాత్రం ఉపయోగించాలి.. అలా కాకుంటే వస్తువుల మీద వ్యామోహం పుడుతుందేమో అని దీనిలో అంతరార్థం. యోగి పిసినారి వాడై ఉండకూడదు.


పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోని మనం, పోయే ముందు కూడా ఏమీ తీసుకెళ్ళం. అందుకే వస్తువ్యామోహం వద్దంటాడు దత్తాత్రేయుడు. ఎలాగైతే తేనె లేనిదే తేనెటీగలకు గుర్తింపు లేదో, ఆత్మ లేనిదే శరీరానికి కూడా గుర్తింపు ఉండదు. సమయం వచ్చినప్పుడు ఎలాగైతే ఎలుగుబంటి తేనెని తీసుకెళ్తుందో, అలాగే మరణ కాలం వచ్చినప్పుడు యముడు కూడా మనని తీసుకెళ్తాడు.


అప్పుడు మనతో పాటు మనం ఏమీ తీసుకెళ్ళలేం. చచ్చినప్పుడు తనతో పాటు ఏదైనా వస్తువును తీసుకెళ్ళిన మనిషి ఎవడైనా ఉన్నాడా? అందుకే వస్తువ్యామోహం తగ్గించి పరమాత్మ పైన ప్రేమను పెంచుకోవాలంటాడు దత్తాత్రేయుడు.



12. పన్నెండవ గురువు - 🦅రాబందు:-

దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. ఒక అడవిలో ఒక రాడందు చనిపోయిన పశుపక్షాదుల శవాలపై ఆధారపడి జీవిస్తూండేది. ఒకనాడు యథా ప్రకారం ఒక పశువు యొక్క శవంలోని మాంసం కొంత తిని, మరికొంత తన నోట కరచుకొని తన గూటిపైపుకు ప్రయాణించ సాగింది.


కానీ అది ప్రయాణిస్తున్న మార్గంలో బాగా ఆకలిగా ఉన్న గ్రద్దలు మాంసపు ముక్కను పట్టుకెళుతున్న ఈ రాబందును చూశాయి. వెంటనే ఆ మాంసపు ముక్క కోసం ఈ రాబందుపై దాడి చేశాయి. ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేక ఆ రాబందు ఆ మాంసపు ముక్కను వదిలేసింది. ఆ గ్రద్దలు ఆ మాంసపు ముక్కపై పడి తమ ఆకలిని తీర్చుకున్నాయి. మాంసపు ముక్క వదిలాక గానీ రాబందు తప్పించుకొని తనను తాను కాపాడుకో గలిగింది.


మనిషి ఎప్పటివరకైతే ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడతాడో అప్పటి వరకు తాను సుఖపడడు సరికదా తన చుట్టూ ఉన్నవారికి కష్టాలు, దుఃఖాలు తెచ్చిపెడతాడు. ఎప్పటివరకైతే ప్రాపంచిక వస్తువుల వెనుక పరిగెత్తుతాడో అప్పటివరకు తాను సుఖపడడు. ఎప్పుడైతే తాను ఆ విషయాలపై వ్యామోహాన్ని వదిలిపెడో అప్పుడే పరమపదాన్ని చేరుకోవడంలో ముందుకు సాగుతాడు.


మనం చూసిన కథలో ఎంతవరకైతే రాబందు తన దగ్గర మాంసం ముక్క ఉంచుకుందో అప్పటివరకు తాను ఆ గద్దల చేత వెంటాడబడింది. కానీ ఆ మాంసపు ముక్కని వదిలిపెట్టిన క్షణాన అది రక్షింపబడింది. అలాగే మనిషి కూడా ఎంతవరకైతే తాను ప్రాపంచిక వస్తువిషయాలపై మక్కువ పెంచుకుంటాడో అప్పటివరకు తాను ఈ భవసాగరంలో మునుగితేలుతూనే ఉంటాడు. కానీ వాటిపై వ్యామోహం వదలగానే అమితమైన ప్రశాంతతను పొంది పరమాత్మను చేరడంలో ముందుకు సాగిపోతాడు.


జీవి తను పరమాత్మను చేరడంలో కూడా పరమాత్మ సాయాన్నే అర్థించాలి. ఆయన కృపలేనిదే ఆయనను చేరడం అసంభవం. భాగవతంలో కుంతీదేవి శ్రీకృష్ణుడితో " పరంధామా! ఈ భవసాగరంలో మునిగితేలుతూ వీటిపై ఆసక్తి పెంచుకున్న మేము నిన్ను ఎలా చేరుకుంటామయ్యా! ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఈ మనిషి జన్మ ఎత్తలేము. ఎత్తినా నిన్ను చేరటంలో కొంతమాత్రమే ముందుకుపోగలుగుతాం. నిన్ను చేరాలంటే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి తండ్రి? కాస్త దయ చూపించవయ్యా!! " అని ఆర్తితో వేడుకుంది.


అప్పుడు కృష్ణుడు కుంతీదేవితో " అమ్మా కుంతీదేవి! బాధపడకు. నన్ను చేరటానికి ఎందుకంత శ్రమ? భక్తితో పిలిచే ఒక్క పిలుపు చాలు! నేను మీకు వశుడనైపోతాను. సాధ్వీ! భక్తి ఉంటే నన్ను చేరటంలో నేనే మీకు సహాయపడతాను. వేరే ఏ శక్తి అవసరం లేదు. కేవలం భక్తి ముఖ్యం " అని సెలవిస్తాడు. కానీ మనకు కనీసం ఒక్క క్షణమైనా భక్తితో పరమాత్మపై దృష్టి కేంద్రీకరించడం కష్టతరమైన విషయంగా మారిపోయింది.


మనం రోజూ చదివే స్తోత్రాలవలన దేవుడు మనకు వశుడైపోతాడనుకోవడం కన్నా మూర్ఖత్వం ఉండదు. ఆ స్తోత్రాలు చదివేటప్పుడు భక్తి ఇంకా ఆర్తి ముఖ్యం. అంతేగానీ పొగడ్తలకు లొంగేవాడు పరమాత్ముడెందుకవుతాడు? స్తోత్రం చదివితే చదివిన ఫలం లభిస్తుందేమో గానీ పరమాత్మ లొంగుతాడా? పరమాత్మ లొంగేది కేవలం భక్తికి, ఆర్తికి మరియు మనకు ఆయన మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ వలన మాత్రమే.






13. పదమూడవ గురువు -🌊 సముద్రం:-


సముద్రం నిశ్చలంగా ఉంటుంది. కేవలం ప్రకృతి ప్రకోపించినప్పుడు తప్పించి అది సంవత్సరంలో ఎక్కవ సమయం ప్రశాంతంగానే ఉంటుంది. బాగా వర్షాలు పడి నదుల్లోని ఎక్కువగా నీరు చేరినా లేదా కరువు కోరల్లో చిక్కి నదులు ఎండినా సముద్రాల్లో నీరు పెరగదు, తరగదు.


అలాగే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు సంభవించినా కానీ మహాత్ములు చలించరు. ఎందుకంటే వారు ఎప్పుడూ బ్రహ్మానందంలోనే ఉంటారు. అలాంటి నిశ్చలతను అలవరచుకోవాలంటాడు దత్తాత్రేయుడు. అలాగే మహాత్ముల యొక్క ఙ్ఞానాన్ని కూడా పరీక్షించలేము. ఎందుకంటే సముద్రంలో దాగిన ముత్యాలు మనకు చూడగానే కనిపిస్తాయా ? ఓపికతో వెతికితే గానీ కనిపించవు. అలాగే మహాత్ముల సాంగత్యం ఫలం చేత వారి మనఃఙ్ఞానాన్ని మనం తెలుసుకోగలము.🤘

🕉🌞🌏🌙🌟🚩



14. పద్నాలగవ గురువు - 🐞మిణుగురు పురుగు:-

మిణుగురు పురుగు అగ్నిచేత ఆకర్షించబడి దాని చుట్టూనే తిరుగుతూంటుంది. అలా తిరుగుతూ నే అది ఒకానొక క్షణంలో దానిలోనే పడి అగ్నికి ఆహుతైపోతుంది.


అలాగే మూర్ఖుడైన మనిషి కూడా ప్రాపంచిక విషయాలకు మరియు ఐహిక సుఖాలకు లోలుడై పరమాత్మను చేరలేక జననమరణ చక్రాలలో తిరుగాడుతూనే ఉంటాడు. ఎన్నటికీ మోక్షకారకమైన పరమపదాన్ని చేరుకోలేడు.


అందుకే మనిషి కూడా తన కోరిబకలు, వాంఛలు మరియు ఇంద్రియాలపైన నిగ్రహము పెంచుకోవాలి.



15. పదిహేనవ గురువు -🐘 ఏనుగు:-

సాధారణంగా ఏనుగును చాలా విధాలుగా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ముందుగా తవ్విన ఒక పెద్ద గొయ్యిని ఆకులతో ఎవరూ గర్తుపట్టకుండా కప్పివేస్తారు. ఆ తరువాత గొయ్యి వెనకాల వైపు చెక్కతో చేసిన ఒక ఆడ ఏనుగును నిల్చోబెడతారు. అటు వెళుతున్న ఏ మగ ఏనుగైనా ఆ ఆడఏనుగు బొమ్మను చూసి ఆకర్షించబడి దాని దగ్గరకు వెళదామనుకొని ముందు గొయ్య ఉందని చూసుకోకుండా దానిలో పడిపోతుంది. ఇలా అంత పెద్ద ఏనుగు కూడా కామ వాంఛ చేత పట్టుపడిపోతుంది.


అలాగే మనిషి కూడా తన కామవాంఛలను అదుపులో ఉంచుకోవాలని చెప్తాడు దత్తుడు. అలా కామవాంఛలను అదుపులో పెట్టకోకపోవటం చేతనే నేటి ప్రపంచంలో ఆడ పిల్లలపైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి. అలా తన వాంఛలను అదుపులో పెట్టుకోలేనివాడు తన బాగుపడడు సరికదా ఇతరులను బాగా బతకనివ్వడు. తరువాత అనేకానేక బాధలను పడతాడు.



16. పదహారవ గురువు -🦌 జింక:-

🙏మంచి సంగీతానికి జింక వశమైపోతుందంటారు. జింకను పట్టుకోవటానికి వేటగాళ్ళు మంచి సంగీతాన్ని వాయించేవారట. ఆ సంగీతము విని మైమరిచి వేటగాడికి సులువుగా దొరుకిపోతుంది.


అందుకని సాధకుడు ఎప్పుడు ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలి. లేకుంటే సాధకుడనే జింక అరిషడ్వర్గాలనే వేటగాడికి చిక్కుతాడు. అలా అయితే భగవన్మార్గము కోసం మళ్ళీ ఎంతో వేచి ఉండాల్సి వస్తుంది. అరిషడ్వర్గాలను జయించాలంటే నిగ్రహం, ఓపిక, భక్తి, ఆర్తి, ప్రేమ మొదలైనవి ముఖ్యంగా పరమాత్మ పైన నమ్మకం అత్యవసరం.



17. పదిహేడవ గురువు -🐟 చేప:-

🤘చేపకు తన మీద తనకు నియంత్రణ లేకపోవటం చేత గాలానికి చిక్కుతుంది. అలాగే చేప తన నివాసమైన నీటిని వదిలి బ్రతకలేదు. అలాగే మనిషికి కూడా తన ఇంద్రియాల మీద నియంత్రణ ఉండాలి. లేకుంటే అనేక చిక్కులలో పడిపోతాడు. అలిగే మనిషి కూడా తన నిజ స్థావరాన్ని వదల కూడదు. తన నిజ రూపాన్ని కూడా మరవకూడదు. అలా మరిస్తే తిప్పలు తప్పవంటాడు దత్తాత్రేయుడు.



18. పద్దెనిమిదవ గురువు -🧛‍♀️ వేశ్య:-

🤘దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. పింగళ అనే పేరు గల ఒక వేశ్య నివసిస్తు ఉండేది. అమె తన వేశ్యా వృత్తి చేత తన దగ్గరకు వచ్చే గ్రాహకుల కోరికలను తీర్చి వారిని సంతృప్తిపరచేది. అలా చాలా కాలం తరువాత పింగళ తన వేశ్యా వృత్తిని వదిలేసి ప్రశాంతంగా భగవన్మార్గంలో బ్రతుకుదామని నిశ్చయించుకుంది. అనుకున్నట్టే అదే ప్రయత్నం చేసి తన వేశ్యా వృత్తిని వదిలి భగవంతుణ్ణి చేరింది.


తన కోసం తను బ్రతకకుండా ఇతరుల శ్రేయస్సుకై బతికేవాడే మహాత్ముడు. సుఖం కోసం పింగళ, పింగళ ఇచ్చే సుఖముకై గ్రాహకుల ఎదురుచూసేవారు. కానీ పింగళ గ్రాహకులను నిజంగా ప్రేమించదు. గ్రాహకులు పింగళను ప్రేమించరు. కానీ ఇద్దరూ కలవగానే ప్రేమ అనే నాటకాన్ని మొదలుపెడతారు. ప్రపంచం ఇలా ప్రేమ నాటకాలు ఆడేవారు ఎంతమంది లేరు.


పింగళ లాగా మనిషి కూడా తన సుఖాలను త్యాగం చేసినప్పుడే బ్రహ్మంనందాన్ని పొందుతాడు. అసలైన సచ్చిదానంద స్వరూపాన్ని చేరతాడు. అలా అన్ని వదిలినప్పుడే అసలైన ప్రశాంతతను పొందుతాడు. ఇక అప్పుడు ఎటువంటి బాధలు, ఇబ్బందులు ఉండవు ఎందుకంటే అన్ని తానే అయినవాడిలో తాను లీనమైపోతాడు కాబట్టి ఇక తనకు తను కాకుండా ప్రపంచంలో ఏమి కనిపించదు. ఇదే అద్వైత తత్త్వం.





19. పంతొమ్మిదవ గురువు - 👼 పసిపిల్లవాడు.


పసిపిల్లలు ఎటువంటి కల్మషం లేనివారై శుద్ధమైన, పవిత్రమైన మనస్సు కలిగి ఉంటారు. కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు వారు కాబట్టి భగవంతునితో సమానులు. వారు సాధుస్వభావులు. ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ చూపరు. కానీ నేటి మానవుడు అరిషడ్వర్గాలతో పరిపూర్ణుడు.


మనిషి కూడా ఒక పసిపిల్లవాడిలోని మంచి గుణాలును తెలుసుకుని వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. మన మనస్సు గ్లాసు వంటిది. ఒకవేళ దానిలో మట్టి చేరిన తరువాత దానిలో పాలు పోసినా, నీరు పోసినా లేదా అమృతం పోసినా వ్యర్థమే. అలాగే మన మనస్సు కూడా కల్మషం లేకుండా ఉండాలి. లేకుంటే దానిలో ఎంత ఙ్ఞాన ప్రవాహం జరిగినా వృథాయే. అలా మనస్సుని సాధ్యమైనంత వరకు ఎలాంటి కల్మషముల చేత పాడు కాకుండా చూసుకోవాలి.


ఐహిక విషయాలపై మక్కువ పెంచుకున్నవాడికి ఎంత చెప్పినా వాడికి ఙ్ఞానం అంటదు. ఎందుకంటే వాడికి శ్రద్ధ లేదు కదా. ' శ్రద్ధావాన్ లభతే ఙ్ఞానం ' అంటుంది భగవద్గీత. ఒకవేళ అలా కల్మషమయమైనా దానిని సద్గురువైన భగవంతుడినే ఆశ్రయించి బాగుచేయాలంటాడు దత్తాత్రేయుడు. అందుకే మనిషికి భక్తి అనేది చాలా ముఖ్యం.



20. ఇరవైయవ గురువు -🧏‍♀️ కన్య:-

దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉంది. ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమార్తె ఉండేది. ఒకసారి కొంతమంది వారి ఇంటికి ఆతిథులు రావలసి వచ్చింది. కానీ ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ పనులకై వెళ్ళారు. అతిథుల కోసం అన్నం వండుదామని బియ్యాన్ని చెరగడం మొదలుపెట్టింది.


కానీ అలా చేసేటప్పుడు తన గాజులు బాగా చప్పుడు చేయటం మొదలుపెట్టాయి. కానీ అతిథులకు ఆ శబ్దం వలన ఇబ్బందిగా ఉంటుందేమో అని ఒక్కొక్కటిగా తన గాజులు తీసివేయటం మొదలుపెట్టింది. చివరికి ఒక్కో చేతికి కేవలం ఒకే గాజు మిగిలాయి. అలా మళ్ళీ చెరగడం మొదలు పెట్టాక శబ్దం రావటం ఆగిపోయాయి.


ఆ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, సాధన అనేది ఏకాంతంగా సాగాలి. అప్పుడే మనం చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. అనేక తత్త్వాలు లేదా వాదనలు ఓకే చోట ఉండలేవు. చాలా రకాల తత్త్వాలు భోధించే మహాపురుషులు ఒకేచోట ఉండలేరు. వారి భావనలను తప్పని మనం అనలేం. ఎందుకంటే భగవంతుని చేరుటకై అనేకానక మార్గాలున్నాయి. అందుకే మహాత్ములు కేవలం ఏకాంతానికే ప్రాముఖ్యం ఇస్తారు.


మనం ఈ భవబంధాలను కూడా బాగా వంట బట్టిచ్చుకొని వాటి కోసమే పరితపించకూడదు అంటాడు దత్తాత్రేయుడు. వాటికే అత్తుక్కొని ఉండకూడదు. వాటిని పుస్తకాలకు వేసే అట్టలలాగా మాత్రమే ఉంచి తరువాత సమయం వచ్చినప్పుడు వదిలేయాలి. కానీ అలా కాకుండా మనం మాత్రమే వాటినే శాశ్వతం అనుకొని వాటికై పరితపిస్తాము.



21. ఇరవైఒకటవ గురువు -🐍 పాము:-

పాము ఎప్పుడూ ఏకాంతంగా ఇతర జంతువుల సహవాసం కోరదు. తన జీవితంలో ఎక్కువ భాగం ఏకాంతంగానే గడుపుతుంది. అలాగే మహాత్ములకు, ముముక్షువులకు ఏకాంతం అవసరం. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందు ఉదాహరణలో కూడా చూశాం.


పాము ప్రతిసారీ తన కుబుసమును అంటే పాత చర్మాన్ని వదిలి కొత్త చర్మాన్ని ధరిస్తుంది. అలాగే ఆత్మ కూడా తన జననమరణ చక్రంలో ఎన్నో శరీరాలను ధరించి వదిలేస్తు ఉంటుంది. శరీరానికే మరణం కానీ ఆత్మకు కాదు. కానీ మనం మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోక ఈ శరీరాన్ని ఎంతగానో ప్రేమిస్తాం.


చివరికి మరణ సమయంలో కూడా మనం ఈ శరీరాన్ని వదలడానికి ప్రయత్నం చేయము. యమభటుల ప్రయాస వలన కానీ మన ఆత్మ శరీరం నుండి వడివడదు. ఈ విషయం మనకు భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. అందుకే ఙ్ఞాని ఎప్పుడు మరణం గురించి భయపడడు. ఈ జననమరణ చక్రం నుండి ఎలా బయటపడాలో ఆలోచిస్తూంటాడు.



22. ఇరవై రెండవ గురువు -🤠 లోహపు పనివాడు :-

🤘తన పని చేస్తున్నప్పుడు లోహపు పనివాడు ఎంత శ్రద్ధతో చేస్తాడో అంత బాగా తయారవుతాయి పనిముట్లు. ఒక పనిముట్టును అద్భుతంగా తీర్చిదిద్దాలంటే ఆ పని మీద పట్టు, చేయాలనే ఆసక్తి ఉండాలి. లేకుంటే ఆ పని ఎంత చేసినా లాభం ఉండదు. అలాగే మనిషి కూడా ఏ పని చేసినా శ్రద్ధతో, అమితాసక్తితో చేయాలి. పూజ కూడా ఏదో తంతుగా, తూతూ మంత్రంగా చేస్తారు చాలా మంది. కానీ అలా చేస్తే ఫలితం ఉంటుందా అనేది మనం ఆలోచించాలి.


పూజను ఒక ప్రక్రియగా భావిస్తారే తప్ప దాని మీద ప్రేమతో చేయరు. పూజ చేసేటప్పుడు కూడా శ్రద్ధాలోపం చాలా చూస్తూంటాం. ఎలాగంటే వారు పూజలో చదివేదొకటి చేసేదొకటి. ఉదాహరణకు శ్రద్ధలేని ఓ వ్యక్తి పూజలో ఉన్నప్పుడు పుష్పం సమర్పయామి అని అంటూనే ఒక పండును ప్రసాదంగా పెట్టాడట. ఒక్క పూజ అనే కాదు ఎన్నో పనుల్లో చాలా మంది ఇలాగే చేస్తారు.


మనసు ఒకటి ఆలోచిస్తుంది చేతలు ( చేసే పని ) మాత్రం వేరేగా ఉంటాయి. అలా చేస్తున్నప్పుడు ఒక్కోసారి ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే ఏ పనిచేసినా శ్రద్ధ, ఆసక్తి, శ్రమ అనేది ముఖ్యమంటాడు దత్తాత్రేయుడు.


23. ఇరవై మూడవ గురువు -🕷️ సాలెపురుగు:-

👉 సాలెపురుగు తన గూడు ఎంతో అందంగా మరియు ఎంతో నైపుణ్యంతో నిర్మిస్తుంది. దాన్ని కట్టడానికి ఎంతగానో శ్రమిస్తుంది. అలా నిర్మించాక ఆ సాలీడులో చాలా కాలం నివసించి తరువాత అవే సాలెపురుగులు తమ సాలీడును తామే తినేస్తాయి.


భగవంతుడు కూడా అంతే, ఈ మాయా సృష్టిని తానే నిర్మించి, ఆ సృష్టితో ఆటలాడి కొంత కాలం తరువాత మళ్ళీ తనలోనే లయం చేసుకుంటాడు. కానీ మనం మాత్రం ఈ సృష్టే నిజమనుకుని భ్రమిస్తూంటాం. కాని ఇదంతా అసత్యమే కేవలం సచ్చిదానంద బ్రహ్మము మాత్రమే సత్యమంటాడు దత్తాత్రేయుడు.


24. ఇరవైనాలుగవ గురువు - 🐛 గొంగళి పురుగు:-

👉గొంగళి పురుగు చిన్నగా ఉన్నప్పుడు దానిని పట్టుకున్న కందిరీగ దానిని తన గూటిలో దాచుకుని దానిని బంధించి దాన్ని కుడుతుంది. ఆ తరువాత దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. అలా ఎందుకు తిరుగుతుందో అర్థం కాక భయపడిన గొంగళి పురుగు కాసేపటికి తనను తాను కందిరీగగా భావించుకుంటుంది. ఆ గొంగళి పురుగు కూడా తరువాత క్రమంగా అలా అలా తను కూడా కందిరీగగా మారిపోతుంది.


ఎవరైనా పదే పదే ఒకరి గురించి ఆలోచిస్తూ, ఎప్పుడు వారి గుర్తులే మనసులో ఉంచుకొని పదే పదే వారిని స్మరిస్తుంటారో అలాంటి వారు కొన్నాళ్ళకి వారు ఎవరినైతే ఊహించుకుంటారో, తాము వారు ఒకటేనని భావిస్తారు. ఇలాంటి సంఘటనలు మనం చూసేవుంటాం. అలాగే సాధకుడు కూడా ఎప్పుడూ పరమాత్మను గురించి ఆలోచిస్తే తన పరమాత్మలో లీనమౌతాడు. అందుకే మనిషనే వాడు మోక్ష ప్రాప్తికై ప్రయత్నించాలంటారు దత్తాత్రేయులు.🙏

🕉🌞🌏🌙🌟🚩

🙏

Source - Whatsapp Message

దేశ సేవ

🍁దేశ సేవ🍁

✍️ మురళీ మోహన్

👌శౌరికి చిన్నతనం నుంచి దేశసేవ చేయాలని కోరిక, వాడు కూడలి దగ్గర పిల్లలకు దేశసేవ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. 'స్వయంగా సంపాదించే మార్గం చూసుకో! నాతో పొలం పనులకు రా!' అంటూ వాడిని కోప్పడేవాడు తండ్రి.. అయితే శౌరికి తండ్రి స్వార్థపరుడిలా కనిపించాడు. ప్రతివాడు దేశం గురించి కూడా ఆలోచించాలి! స్వార్థం మానుకోవాలి! అనేవాడు. కొందరు ఊరి పెద్దలు 'ఇక్కడి మూర్ఖులకు నీ ఉపన్యాసాలు అర్థంకావు'. రాజధానికి వెళ్ళి రాజుగారిని కలుసుకో! అక్కడ నీ శ్రమకి గుర్తింపు లభిస్తుంది! అన్నారు.

శౌరి రాజధానికి వెళ్ళాడు. ఉద్యానవనంలో రాజు గారిని కలిశాడు. దేశసేవ చేయడానికి ఊరువదిలి వచ్చాను! అన్నాడు. తన గురించి అంతా చెప్పాడు. రాజు శౌరిని అభినందించాడు. కొన్నాళ్ళు నా అతిధిగా వుండు! అన్నాడు. మర్నాడు శౌరి సత్రం ఖాళీ చేశాడు. రాజుగారు వాడిని విడిదికి తీసుకువెళ్ళాడు. అది చాలా విశాలమైన భవంతి. ఇంటినిండా సేవకులు వాళ్ళు ముందుగదిని అలంకరిస్తున్నారు. 'ఈ భవంతిలో విశ్రాంతి తీసుకో!' నేను నాలుగు రోజులలో వస్తాను! అని వెళ్ళిపోయాడు రాజు. లోపలి గదిలోకి అడుగుపెట్టి, నిర్ఘాంతపోయాడు శౌరి, లోపల ఇరవై గదులు వున్నాయి. అన్నీ బూజు పట్టి ఉన్నాయి. పైగా గబ్బిలాల కంపు! పరదాలు చిరిగి తలుపులు విరిగి, గచ్చులు పగిలి వుంది! పెరడంతా పిచ్చిమొక్కలు! శౌరి పనివాళ్లతో 'లోపలి గదులు శుభ్రం చేయండి!' అన్నాడు. నాలుగు రోజులలో మొత్తం భవంతి శుభ్రపడింది. కొత్తపరదాలు కిటికీలు అమిరాయి పెరడు శుభ్రపడింది. పూల మొక్కలు, పళ్ళ మొక్కలు నాటబడ్డాయి. ఆరోజు రాజుగారు శౌరి ని చూడవచ్చారు. ఆయన భవంతిని చూసి, 'అద్భుతంగా వుంది! భవంతి స్వరూపమే మారిపోయింది!' అంటూ శౌరిని మెచ్చుకున్నాడు. 'వీళ్ళు ఇరవై గదులను పాడుపెట్టారు ముందుగదినే అలంకరిస్తూ కూర్చున్నారు ముందుగది ఎంత అందగా వున్నా ఏం లాభం! ఇల్లంతా భూతాలకొంపలా ఉన్నప్పుడు' అన్నాడు శౌరి.

నీ నుంచి ఈ జవాబే నేను ఆశించాను, దేశం అంటే రాజధాని నగరం మాత్రం కాదు! ముందుగదిని అలంకరించినట్లుగా రాజధానినే అభివృద్దిపరచుకుని ప్రయోజనం లేదు. నువ్వు అన్ని గదులు బాగుపరిచావు. అలాగే దేశంలో ఊళ్ళన్నీ బాగుపడాలి! అప్పుడే దేశం బాగుపడుతుంది అన్నాడు రాజు. శౌరి శ్రద్దగా ఆయన మాటలు వింటున్నాడు. రాజుగారు మళ్ళీ నోరు విప్పారు. ప్రతివాళ్ళు తమ ఇంటిని, ఊరుని బాగు చేసుకోవాలి! అదే నిజమైన దేశసేవ! అందుకు రాజధానికి రావలసిన పనిలేదు! అందరూ కలిసి బంజరు భూముల్ని సాగులోకి తీసుకురండి. చదువురాని వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పండి. పూడికలు తీయండి! రహదారులు బాగు చేయండి! రోడ్లు వెంట చెట్లు నాటండి. శ్రమ దానానికి మించిన దేశసేవ లేదు. దేశసేవ పేరుకోసం కాదు. దేశం కోసం చేయాలి! అన్నారు. శౌరి కళ్ళముందు తెరలు తొలగి పోయాయి. ఈ రోజే మా ఊరికి వెళతాను ఉపన్యాసాలు మాని నడుంకట్టి పని చేస్తాను. అప్పుడు మానాన్న సంతోషిస్తాడు. మా ఊరు, వాడా బాగుపడుతుంది. అంటూ రాజుగారి వద్ద సెలవు తీసుకున్నాడు శౌరి.

Source - Whatsapp Message

అడుగుల వెనక ‘రహస్యం’

👫 అడుగుల వెనక ‘రహస్యం’👫

✍️ మురళీ మోహన్

🤘ఇద్దరు వ్యక్తుల్ని..రెండు కుటుంబాల్ని ఒక్కటి చేసేదే పెళ్లి. హిందూ సంప్రదాయంలో పెళ్లి సమయంలో జరిగే పలు క్రతువులకు ప్రత్యేకమైన అర్ధాలు..పరమార్ధాలు ఉన్నాయి.

వివాహకార్యక్రమం అయిన తరువాత వధూవరుల కొంగులు ముడివేసి ..వధువు చిటికెన వేలును వరుడు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు వేస్తారు. దీనినే సప్తపది అంటారు ..

ఈ ఏడు అడుగులు వేయించడం వెనుక ఆంతర్యం ఏంటంటే….?

"ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు".. మొదటి అడుగుతో ఇద్దరిని ఒక్కటి చేయమని …

"ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు" రెండవ అడుగుతో ఇద్దరికీ శక్తిని ప్రసాదించమని..

“త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు" మూడవ అడుగుతో వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించమని..

"చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు" నాల్గవ అడుగుతో ఆనందం ప్రసాదించమని..

"పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు" ఐదవ అడుగుతో పశుసంపద కలిగించమని..

"షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు " ఆరవ అడుగుతో ఆరు రుతువులు సుఖములు ఇవ్వమని..

"సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు" ఏడవ అడుగుతో విష్ణువు గృహస్థాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమివ్వమని..
వధూవరులు అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు వేసి విష్ణువును ప్రార్ధిస్తారు.🙏

Source - Whatsapp Message

నిత్యయుక్తులు అంటే ఉదాహరణ సహితంగా ?

🍁నిత్యయుక్తులు అంటే ఉదాహరణ సహితంగా ?🍁

🤘 మురళీ మోహన్

🙏నిత్యయుక్తా :- ఎప్పుడో రోజులో కొద్దిసేపో, వారానికి ఒకరోజో కాదు. నిత్యము, నిరంతరము భగవంతుని యందే ఉండాలి. రోజూ ఒక గంటో - రెండు గంటలో డ్యూటీ లాగా భగవంతుని స్మరిస్తే అది నిజమైన భక్తికాదు. నిజమైన ఉపాసన కాదు.
పూజ చేసేటప్పుడో, భజన చేసేటప్పుడో, జపధ్యానాలు చేసేటప్పుడో, దేవాలయంలో కూర్చున్నప్పుడో, లేదా ఇలా సత్సంగాలలో పాల్గొన్నప్పుడో భగవంతుని యందు మనస్సు పెట్టి మిగిలిన సమయాలలో ఇక భగవంతుని స్మరణయే లేకుండా ఉంటే అది నిత్యభక్తి కాదు, అతడు నిత్యయుక్తుడు కాదు. సర్వకాల సర్వావస్థలలోను భగవత్ స్మరణను విడిచిపెట్టరాదు. నిజంగా భగవంతుడెప్పుడూ మనను విడిచి ఉండటం లేదు. మనం కూర్చున్నా, పడుకున్నా, నిద్రపోయినా, బస్సులో ఉన్నా, విమానంలో ఉన్నా, ఏం చేస్తున్నా చివరకు చనిపోయినా సరే ఆయన మనలోనే స్థిరంగా ఉన్నాడు. కాని మనమే ఈ ప్రాపంచిక విషయాలకోసమో, భోగాల కోసమో ఆయనను విడిచిపెడుతున్నాం. అలా ఉండకూడదని భగవానుని ఉపదేశం.
పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్నన్, అశ్నన్, గచ్ఛన్, స్వపన్, శ్వసన్ - కంటూ, వింటూ, తింటూ, తిరుగుతూ, తెస్తూ, ఇస్తూ, లేస్తూ, కూర్చుంటూ సర్వకాల సర్వావస్థలలోను చిత్తం భగవదాయత్తమై ఉండాలి. అంతటా ఆ భగవంతునే చూస్తూ, నిరంతరమూ ఆ భగవంతుని చింతించటమే నిత్యయుక్తః అంటే. అట్టి భక్తుడే శ్రేష్టతముడు అని భగవానుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు.
తేనెటీగ పుష్పాలలోని మకరందాన్ని పీల్చుకుంటుంది. ఈగ కొద్దిసేపు బెల్లం మీద వాలుతుంది. కొద్దిసేపు పెంటకుప్పల మీద వాలుతుంది. పేడపురుగు ఎప్పుడూ పెంటకుప్పలలోనే ఉంటుంది. ఒకవేళ దానిని తెచ్చి పుష్పాలలో వేస్తే చచ్చి ఊరుకుంటుంది. మనం తేనెటీగలాగా ఎల్లప్పుడూ భగవంతునిలోనే చరించాలి. ఈగలాగా కొద్దిసేపు భగవంతునిపైన, కొద్దిసేపు ప్రపంచవిషయాల మీద వ్రాలకూడదు.
నిరంతరము శ్రీకృష్ణుని యందే మనస్సు నిల్పిన గోపికలు నిత్యయుక్తులు. శ్రేష్టభక్తులు. ఒక్క క్షణం కూడా శ్రీకృష్ణుని స్మరించకుండా ఉండలేరు. తమ తిండితిప్పలు మరచిపోతారే గాని శ్రీకృష్ణుని మాత్రం మరచిపోరు. రాత్రింబవళ్ళు అనే తేడా లేకుండా నిత్యము, నిరంతరము శ్రీకృష్ణ సందర్శనాభిలాషులై తపించిపోతూ ఉంటారు. ఆయన కనిపించకపోతే వారికి నిముషమొక యుగంలా ఉంటుంది.
ఒక గోపికకు కృష్ణుని చూడాలనే తపన అధికమైంది. పెద్దల చాటున ఉండవలసిన ఆ గోపిక, స్వతంత్రించి కృష్ణ దర్శనానికి పోయే అవకాశం లేక తపనపడి పోతున్నది. ఎలాగో మనసు బిగబట్టుకొని సాయంకాలం వరకు వేచి ఉన్నది. సాయంత్రం గోధూళి వేళ అయింది. గోవులను తోలుకుంటూ కన్నయ్య వస్తున్నాడు. ఆ గోధూళిలో మసకమసకగా అప్పుడప్పుడు కనిపించి కనుమరుగై పోతున్నాడు కన్నయ్య. అతడిని దర్శించాలంటే నందుని ఇంటికి పోవాలి. ఇదే సరైన సమయం. ప్రమిద - వత్తి తీసుకొని ముట్టించుకొని వచ్చేందుకని నందుని ఇంటికి బయలుదేరింది. నందుని ఇంట ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ ఊరి వారంతా సంధ్యవేళ అక్కడికి వెళ్ళి దీపం ముట్టించుకొని వస్తుంటారు. ఆ గోపిక అలాగే నందుని ఇంట ప్రవేశించి దీపం గూటి వద్దకు వెళ్ళింది. దీప దర్శనంతో పాటు దివ్యమంగళ విగ్రహం ఆ శ్రీకృష్ణుని కన్నులారా దర్శించింది. నందుని ఇంటిలో ఆ సజీవ దీపాన్ని చూస్తూ ఈ నిర్జీవ దీపాన్ని మరచింది. దీపం వద్ద వత్తిని పెట్టి వెలిగించాలనుకున్నది. కాని ఆమె పరధ్యానంతో - శ్రీకృష్ణ ధ్యానంతో తనవ్రేలును పెట్టింది. అగ్నికి దయ ఎక్కడుంటుంది? వ్రేలు కాలిపోతున్నది. ఆ సమయంలో ఆమె దేహాన్నే కాదు, ప్రపంచాన్నే మరచింది. ఆమె మనస్సు మనస్సులో లేదు, ఆమెలో లేదు, ప్రపంచంలో కూడా లేదు. భక్తితో కరిగిపోయిన ఆమె మనస్సు భగవంతునిలో లీనమై పోయింది. ఇది చూస్తున్న యశోద ఒక్క పరుగున వచ్చి ఏమిటమ్మా! ఇది? నిద్రపోతున్నావా? రాత్రి నిద్రపోకుండా మేలుకొని ఉన్నావా? అని ఆమెను కదిపి మందలించింది. అప్పుడు కదిలింది ఆమె మనస్సు. ఆమెకు కాలం తెలియలేదు. వ్రేలు కాలటం తెలియలేదు. బాధ తెలియటం లేదు. తన కృష్ణ సందర్శన కుతూహలం నెరవేరింది. ఇలా గోపికలు నిరంతరం కృష్ణస్మరణలో తరించారు.🙏

Source - Whatsapp Message

త్రికరణాలు

🔴 త్రికరణాలు🔴

✍️ మురళీ మోహన్

🙏మనలో చాలామంది, ఆధ్యాత్మిక సాధన చేయాలని తపిస్తారే తప్ప- అందుకు కావలసిన, ఉండవలసిన సులువులు, మెలకువలు పట్టించుకోరు. చాలావరకు... తెలియదు కూడా. ప్రాథమికంగానే, పునాది దశలోనే తెలుసుకోవలసిన, అనుసరించవలసిన సూత్రాలను విస్మరిస్తూ ఉంటారు. అవి సాధారణంగానే కనిపిస్తున్నా మన ఆధ్యాత్మిక ప్రగతికి అసాధారణంగా దోహదపడతాయి. కొన్నిసార్లు పురోగతికి అవే ప్రథమ ప్రాధాన్యమూ కావచ్చు. అలాంటివాటిలో త్రికరణాలను ఏకీకరణం చేయడం ఒకటి.

ఇది సాధారణమైన సాధన కాదు. అత్యంత ప్రముఖమైన, అత్యవసరమైన సాధన. సాధనలో మనకు ఏకాగ్రత ముఖ్యం. ఏకాగ్రత అంటే మనసును పరిపరి విధాల పోనివ్వని, ధ్యేయంవైపు మాత్రమే నడిపించే అత్యంత జాగరూకత. అన్ని కరణాలను ఏకోన్ముఖం, ఏకీకృతం చేసే కీలక వ్యవహారం. సూర్య కిరణాలను ఏక కోణంలోకి మళ్లిస్తే ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. అదే విధంగా మనలోని సర్వ కర్మేంద్రియాల వ్యవహారాన్ని నిలుపుదల చేసి, సర్వ జ్ఞానేంద్రియాల వ్యాపారాన్ని ఆపేసి, మనోదృష్టిని మాత్రం ధ్యేయపరం చేసి, నిశ్చలమైన బాహ్యాంతఃకరణాలను కాలాతీత క్రియలో నిలిపిఉంచడమే- ఏకాగ్రత ధ్యానం, ధ్యేయం.

త్రికరణాలు అంటే- మనో వాక్కాయకర్మలు. మనసు, వాక్కు, చేసే కర్మ. ఒక బండికి ఎన్ని ఎద్దులు కట్టినా, ఎన్ని పగ్గాలు బిగించినా అన్నీ ఒకవైపు, ఒకే వైపు లాగితే బండి బరువుకు అతీతంగా ఆ వైపే పయనిస్తుంది. మూడు పగ్గాలతో మూడు వైపులా లాగితే బండి ఒక్క అంగుళం కదలకపోగా, విచ్ఛిన్నమయ్యే ప్రమాదమూ ఉంది. మనం ఒక విషయాన్ని గురించి మనసులో ఒకరకంగా ఆలోచించి, వాక్కుతో మరోరకంగా చెప్పి లేదా మాట్లాడి, శరీరంతో మరోరకంగా చేస్తే ఆ విషయంమీద మనకు పట్టు ఉండదు. అంటే సత్యాన్ని మనం మూడు రకాలుగా విభజించామన్న మాట. అలాంటప్పుడు ఆ విషయంమీద మనకు, మనసుకు అధికారం ఉండదు. తగిన విధంగా మలచుకునే అవకాశం ఉండదు. ఏకీకృతం కాని త్రికరణాలను (మనసు, శరీరం, వాక్కు) సమన్వయం చేయడం ఎంతో శ్రమ అయిపోతుంది. ఏకాగ్రం చేయవలసిన మనసును మనంగా మూడు రకాలుగా చీల్చవలసిన అగత్యం ఏర్పడుతుంది. ఎందుకంటే వాక్కునైనా, దేహాన్నయినా అదుపు చేయవలసింది, ఆడించవలసింది మళ్ళీ మనసే. ఈ చాంచల్యం, ఈ పని విభజన మనసును చిరాకుపరుస్తాయి. మన ధ్యేయం మనసును ప్రశాంతంగా ఉంచడం. మరోదారి లేకుండా చేసి ఏకోన్ముఖం చేయడం మనసులోని అంశాన్నే కాయం చేస్తే దాని గురించే వాక్కు మాట్లాడితే (వెల్లడిస్తే) మనసుకు విచలితం అయ్యే బాధ తప్పుతుంది. దానికి ఈ చిందులు వేసే బాధలనుంచి, రంగులు మార్చే బాధ్యతల నుంచి విముక్తి కలిగిస్తే ప్రశాంతంగా స్థిమితపడి ధ్యానంవైపు మళ్లుతుంది. శ్వాసను అనుసరించమని ఆ వైపు మళ్లిస్తే బుద్ధిగా మళ్లుతుంది.

సహజంగానే ఎంతో చంచలమైన మనసుకు మళ్ళీ మనమే మూడు దారులు చూపి మూడురకాల కుప్పిగంతులు వేయించడం తగదు. అత్యంత బలీయమైన మనసును మనమే ఇలా బలహీనపరచడం మన ధ్యేయానికే గొడ్డలిపెట్టు. నిజానికి ప్రారంభ సాధకులకు చాలామందికి ఈ సులువు సూత్రం తెలియదు. సాధనకు అత్యంత కీలకమైన ఈ అంశాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా సాధనలో ముందుకు వెళ్తాం. ఈ సూత్రం ఆధ్యాత్మిక సాధనకో, ఏకాగ్రతకో మాత్రమే కాదు- సాధారణ జీవన వ్యాపారంలోనూ త్రికరణాల ఏకీకరణను ఒక ఉన్నతస్థాయి సంస్కారంగా పరిగణిస్తారు. ఏ కార్యసాధనకైనా అది ఉత్తమ ఉపకరణంగా ఉపయోగపడుతుంది.👍

Source - Whatsapp Message

ఆ బాలుడే తరువాతి కాలంలో చాణక్యుడిగా ప్రసిద్ధి పొందాడు.

👌ఒక చిన్న బాలుడు తన తల్లితో కలిసి నివసించేవాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ బాలుడు అన్ని విషయాలలో చాలా చురుకుగా, తెలివిగా మరియు చూడడానికి అందంగా ఉండేవాడు. ఆ బాలుని తల్లి ఎప్పుడూ విచారంగా ఉండేది.

ఒకరోజు ఆ బాలుడు తల్లిని , ఎందుకమ్మా ఎప్పుడూ విచారంగా ఉంటావు? అని అడిగాడు. దానికి ఆమె ” ఒక జ్యోతిష్కుడు నీకు ఉన్న ప్రత్యేకమైన పలువరుస (పళ్ళు) కారణంగా నీకు చాలా కీర్తి, ప్రతిష్టలు వస్తాయి అని చెప్పాడు” అని చెప్పింది. దానికి ఆ బాలుడు అందులో విచారించవలసినది ఏముంది? నాకు కీర్తి రావడం నీకు ఇష్టం లేదా? అని అడిగాడు. బాబూ; ఏ తల్లి తన కొడుకు గొప్పవాడు కావాలని కోరుకోదు? నాకు ఇష్టమే, కాని నీకు వచ్చే కీర్తి,ప్రతిష్టల కారణంగా నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతావేమో అని భయంగా ఉంది,అని చెప్పింది.

అదివిన్న బాలుడు కూడా ఏడవడం ప్రారంభించాడు. కొంతసేపటి తరువాత ఇంటి నుండి బయటకు వెళ్ళి ఒక పెద్ద రాయి తీసుకుని తన పలువరుస(పళ్ళు) ఊడిపోయేలా కొట్టుకోసాగాడు. అతని నోటి నుండి రక్తం కారసాగింది.

ఇంటినుండి బయటకు వచ్చిన ఆ తల్లి అది చూసి ఆశ్చర్యంతో, బాధతో ఎందుకలా కొట్టుకుంటున్నావని ఆ బాలుని అడిగింది. అప్పుడు ఆ బాలుడు ఈ పలువరుస(పళ్ళు) కారణంగా నేను నీకు దూరమౌతానంటే, అలాంటి పలువరుస(పళ్ళు) నాకు వద్దమ్మా, నేను నీకు సేవ చేస్తూ నీ ఆశీస్సుల వల్ల మాత్రమే జీవితంలో పైకి రావాలని కోరుకుంటున్నాను అన్నాడు.
ఆ బాలుడే తరువాతి కాలంలో చాణక్యుడిగా ప్రసిద్ధి పొందాడు.🙏

Source - Whatsapp Message

Monday, August 16, 2021

మూర్ఖులతో వాగ్వివాదాలు వద్దు

#మూర్ఖులతో వాగ్వివాదాలు వద్దు

గడ్డి నీలం రంగులో కదా ఉండేది?" అని ఒక గాడిద పులిని అడిగింది.

దానికి పులి, నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి?.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది" అని జవాబిచ్చింది.

గాడిద ఏడ్చావులే! గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని వాదించింది..

అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది...

ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి....

దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది.

అక్కడికి చేరుకోగానే.....
పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా

గాడిద.. వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా ఉండేది.. అవునా కాదా? మీరే చెప్పండి " అంది.

అవును! గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం

అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ
చూడండి మహారాజా! అలా అని నేను ఎంత చెప్పినా ఈ పులి ఒప్పుకోవడం లేదు, అలా కాదని నాతో వాదిస్తుంది,
దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది

అవును, పులికి తప్పకుండా శిక్ష పడవలసిందే..
పులిని ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచండి!!"
అని ఆదేశించింది సింహం

పెల్లుబికిన ఉత్సాహంతో రంకెలేసుకుంటూ అడవంతా పరిగెత్తడం మొదలెట్టింది గాడిద ..

పులి నీరసంగా....
సింహం దగ్గరకు వెళ్ళి

అదేమిటి మహారాజా! గడ్డి ఆకుపచ్చ రంగులో కదా ఉండేది?" అంది

"అవును గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది!"
అంది సింహం

"మరి నాకెందుకు శిక్ష విధించారు మహారాజా?"
అంది పులి

దానికి సింహం , "గడ్డి నీలం రంగులో ఉంటుందా? లేక ఆకుపచ్చ రంగులో ఉంటుందా?
అనే విషయం గురించి నిన్ను శిక్షించడం జరగలేదు.

బుద్ధిలేని ఒక గాడిదతో వాదించి, మరలా దానికి తీర్పు ఇవ్వమని నా దగ్గరకు వచ్చినందుకు
నీకు శిక్ష పడింది.." అంది

#నీతి

గాడిదలతో వాగ్వివాదాలు పెట్టుకోకండి..

మనస్సులో ఏదో ద్వేషము , అసూయ , విషమును నింపుకుని అయిన దానికి , కాని దానికి ప్రతీ దాన్నీ మూర్ఖంగా ప్రశ్నిస్తూంటారు...కొందరు కావాలని వాదిస్తూంటారు...కొందరు ప్రతీ విషయంలో రంధ్రాన్వేషణ చేసి వాగ్వివాదం చేస్తూంటారు.

మూర్ఖుల ఉచ్చులో పడకూడదు.

శుభసాయంత్రం 🙏🙏🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

🥀మంచి చేసే అలవాటున్న వారికి, అవే లక్షణమున్న వారికి మనసు హాయిగా ఉంటుంది..సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయం అవుతుంది..

🍃🥀పనికిరాని వస్తువులు ఇంటికి బరువు.పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు.అన్యాయంగా పరులసొమ్ము ఆశించేవాడు భూమికి బరువు..

🍃🥀పక్క వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి పది తప్పులను వెతికే మనం మన జీవితంలో వందతప్పులున్నయనే విషయాన్ని గాలికి వదిలేస్తాం..

🍃🥀జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుందో తెలుసా మనకు ఉన్న వాటితో తృప్తి గా ఉండటం నేర్చుకున్నప్పుడు..*

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

సిరి సంపదలు

💥సిరి సంపదలు💎
🕉️🌞🌎🌼🏵️🚩

✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు

'ధనమూలమిదం జగత్’ అని రాజధర్మాలను బోధిస్తూ విశ్వామిత్రుడు రాముడితో పలికినట్టు ధనం చుట్టూనే లోకం భ్రమిస్తోంది. అయినప్పటికీ “ధర్మబద్ధంగా సంపాదించిన ధనమే సంపదయని, సంసార పోషణార్థమే ఆర్జించాలన్న” వేదవాక్కును శిరసావహిస్తూనే ధనార్జన చేయాలి.

“ మాయకు గురిచేసి మోహాల వెంట పరిగెత్తించే సిరిసంపదలను సద్వినియోగం చేయాలని’ రామాయణం బోధించగా, అందుకు విరుద్ధంగా భోగలాలసుడై పరస్త్రీని కాంక్షించి నాశనమయ్యాడు రావణుడు. ధర్మానికి ప్రతిరూపమైన రాముణ్ణి ఆశ్రయించి స్వర్ణలంకకు రాజయ్యాడు విభీషణుడు.

సిరి సంపదలను, శరీర భాగాలను తృణప్రాయంగా భావించి దానమిచ్చిన పురాణ పురుషులున్నారు. మూడడుగుల నేల కోరిన వామనుడు సామాన్యుడు కాదని తెలిసినప్పటికీ దానమిచ్చిన బలి చక్రవర్తి కథను భాగవతం, కపట బ్రాహ్మణుడని తెలిసినా కవచ కుండలాలను దానమిచ్చిన కర్ణుడి కథను భారతం వివరించి ఆదర్శ జీవన విధానాన్ని బోధించాయి.

“ఎంత వగచినా మరణించిన వారిని దక్కించుకోలేనట్టే, ఎంత రోదించినా పోయిన సంపదను నిలుపుకోలేమని” భీష్ముడు ధర్మరాజుకి ఉపదేశించినట్టు ఆశామోహాలు తొలగించుకుని యోగ జీవితం గడిపిన వారున్నారు. భార్యాబిడ్డలు, రాజభోగాలను త్యజించిన శుద్దోధనుడు వైరాగ్యంతో గౌతమ బుద్ధుడై, ఆధ్యాత్మిక సంపదను లోకానికి అందించి జన హృదయాల్లో కొలువయ్యాడు.

‘సంపద ప్రారంభంలో సుఖాన్ని, మధ్యలో భయాన్ని, చివర్లో పశ్చాత్తాపాన్ని’ కలిగిస్తుందని చాటే సంఘటనలు చరిత్రలో జరిగాయి. వజ్రవైడూర్యాలను తన అంతిమ యాత్రలో దారి పొడుగునా జల్లమని విశ్వవిజేత అలెగ్జాoడర్ ఆదేశించడం, యుద్ధ కాంక్షతో రక్తాన్ని ఏరుల్లా పారించిన అశోకుడు శాంతి సందేశాలు వినిపించడం వారి మనోపరివర్తనకు, పశ్చాత్తాపానికి నిదర్శనాలు.

“ధనం పుట్టింది భోగాల కోసం కాదని, ఇతరులకు సహాయం చేస్తూ ఆనందించడానికని’ శంకరాచార్యులు బోధించిన సత్యాన్ని గ్రహిస్తే కొందరికి మాత్రమే పరిమితమైన సంపద అనేకులకు దక్కి అసమానతలు తొలగుతాయి.

“దుర్వినియోగమైన ద్రవ్యం ఉపద్రవాలను కొని తెచ్చినట్టే, సద్వినియోగమైన ధనం దివ్యమైన ఉపకరణంగా మారుతుందన్న”గురువుల బోధనలు సమాజానికి దారి దీపాలు. యోగ్యమైన పద్ధతిలో ధనాన్ని వ్యయం చేయమనే కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి.

“ఇతరుల బాధలను గమనించకుండా స్వార్థబుద్ధితో సంపాదించేవారు దోషులేనని” భగవద్గీత, “మనిషిలో లాలస, దురాశకు మూలకారణమైన సంపదలను అవసరానికి మించి కూడబెట్టరాదని” భర్తృహరి సుభాషితం తెలుపడంతో ఔచిత్యాన్ని గ్రహించి ఆచరించాలి మానవులు.

‘సంతోషాన్నిచ్చేది సంపద లేక వైభవం కాదనియు, ప్రశాంతమైన మనసు, వృత్తి మాత్రమేననియు, సంపద వివేకికి బానిస, మూర్ఖునికి యజమాని అవుతుందనియు’ పెద్దలు చెప్పిన సత్యాన్ని గ్రహించి, సంపదలను దానధర్మాలకు, పరోపకారానికి వెచ్చిస్తూ మానవ జన్మకు సార్ధకత కల్పించాలి.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Tuesday, August 10, 2021

జీవిత సత్యాలు.

జీవిత సత్యాలు.

కొందరు వ్యక్తులు మనల్ని తక్కువగా చూస్తారు.

ఉద్దేశపూర్వకంగా అవమానిస్తారు. అది వారి సహజస్వభావం. ఇటువంటి పరిస్థితి ఎవరినైనా ఇబ్బంది పెడుతుంది.

మానసికంగా కుంగదీస్తుంది. అలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

మనకు ఎన్నో ఆశలు,ఆశయాలు ఉంటాయి.కలలు కంటుంటాం కాని అపజయాలు ఎదురవుతుంటాయి.

భయపెట్టే సంఘటనలు చోటు చేసుకుంటాయి.

వాటిని దూరంగా నెడుతూ అనుకున్నవి సాధించగలగాలి.

మన స్థాయిని, విలువలను, గౌరవాన్ని తగ్గించే పనులకు దూరంగా ఉండాలి. అటువంటి ఆలోచనలే మనసులోకి రానివ్వకూడదు.అందుకే మనం మంచిదిశగా నడవాలి.

మంచివారితో కలిసి నడవాలి.మన నడక మరెందర్నో ప్రభావితం చెయ్యాలి. మనవెంట పదిమంది నడవాలి..

మానస సరోవరం 👏

Source - Whatsapp Message

మంచిమాట

మంచిమాట

గెలవాలి, ఎదగాలి అనే లక్ష్యం ఎంత కష్టాన్నైనా సునాయాసంగా జయిస్తుంది . బలహీనమైన మొక్క బలమైనా బండరాయిని చీల్చి బలవంతమైనా వృక్షంలా మారింది. మరి కొండను సైతం పిండి చేయగల యుగంలో నేనేమీ చేయలేనని నిరాశ చెంది నీ అడుగులు ఆపకు నేస్తం...

ఏమో రేపు నువ్వు కూడా పెద్ద వటవృక్షం అవుతావేమో ప్రయత్నించు.

పోరాడితే పోయేదేమీ లేదు గెలిస్తే విజయం వరిస్తుంది. లేకుంటే అనుభవం వస్తుంది,

ఆ అనుభవం రేపటి విజయానికి దారి చూపుతుంది...

మానస సరోవరం 👏

Source - Whatsapp Message

నేటి జీవిత సత్యాలు.

నేటి జీవిత సత్యాలు.

ఎక్కువ ఎవరి కోసమూ ఆలోచించకు...వాళ్లకే అలుసై పోతావు.
ముందుగా నా వాళ్ళు అని..ఆలోచించడం తగ్గించు .
ఎవరి నుంచి ఏం ఆశించకు..జీవితం బాగుంటుంది..
మనం అంటే దూరంగా ఉండే వాళ్ళని,
మనం కూడా దూరంగా ఉంచాలి..

వాళ్ళ కోసం త్యాగాలు చేయడం,
ఆలోచనలు చేయడం టైం వేస్ట్...
అతి మంచితనం అతిగా అర్ధం చేసుకోవడం,
మళ్ళీ వాళ్లకి మన జీవితం లోకి...వచ్చే ఛాన్స్ ఇవ్వడం సూసైడ్ తో సమానం...

తన ఆలోచన వరకు తను కరెక్ట్ అంతేగానీ,
తాను ఆలోచించినదంతా కరెక్ట్ అని అంటుంటే మాత్రం..
అలాంటి మనిషి కుత్సితాలకి నువ్ బలి ఐపోతున్నావు అని అర్థం...
నేటి సమాజంలో..
మంచోని మాటల కన్నా,
ముంచెటోని మాటలే,
ఎక్కువ నమ్ముతున్నారు,
చిత్రంగా..

మిత్రమా...నేడు..

మోసం చేసోటోడ్ని తెలివైనోడంటున్నారు..
క్యారెక్టర్ కుళ్ళి పోయిన పర్వాలేదు...కాని, కరెన్సీ ముఖ్యం అదే నేటి సమాజ పరిస్థితి...

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

టెక్నాలజీ కంపెనీలు మన బ్రెయిన్‌ని ఎలా హైజాక్ చేస్తున్నాయో.

టెక్నాలజీ కంపెనీలు మన బ్రెయిన్‌ని ఎలా హైజాక్ చేస్తున్నాయో.
---------------------
🎊💦🌹💧💎⛱️

“నేను చాలా అపరాధ భావంతో ఉన్నాను” - ఈ మాట అన్నది ఎవరో కాదు, ఫేస్బుక్ సంస్థలో యూజర్లని పెంచే విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్న ఛామత్ అన్న మాటలు ఇవి. “యూజర్ల యొక్క ప్రవర్తనను హైజాక్ చేయడం కోసం, బ్రెయిన్‌లో విడుదలయ్యే డోపమిన్ రసాయనాన్ని ఆసరాగా చేసుకుని ఆల్గారిథమ్స్ రూపొందించాం, ఇప్పుడు అది సమాజాన్ని అడిక్షన్ వైపు నెట్టేస్తోంది” అంటూ స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో జరిగిన ఒక సెమినార్‌లో అతను అభిప్రాయం వెల్లడించారు.

మళ్లీమళ్లీ రోజుకు కొన్ని వందల సార్లు మనం ఫోన్ ఓపెన్ చేసి, ఫేస్బుక్, వాట్సప్, టిక్ టాక్, పబ్‌జీ వంటి వాటికి బానిసలుగా మారామంటే దీని ప్రధాన కారణం మన బ్రెయిన్ లో వివిధ న్యూరో ట్రాన్స్‌మిటర్ ద్వారా విడుదలయ్యే డోపమిన్ అనే రసాయనం. చాలామంది తమ ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతే, అది దొరికేటంత వరకూ చాలా ఆందోళన చెందుతారు. 73 శాతం మంది ఇదే తరహా ప్రవర్తన కలిగి ఉంటారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఒక స్మార్ట్ఫోన్ వినియోగదారుడు రోజుకి మూడు నుండి ఐదు గంటల పాటు ఫోన్ మీద టాపింగ్, టైపింగ్, స్వైపింగ్ చేస్తూ గడుపుతున్నాడు.

డోపమిన్ ఇలా!

ఒక పని మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తోంది అంటే దానికి ప్రధాన కారణం మన బ్రెయిన్ లో ఉత్పత్తి అయ్యే డోపమిన్ అనే రసాయనం. రుచికరమైన ఆహారం తిన్నప్పుడు, శారీరక వ్యాయామం చేసినప్పుడు, సెక్స్‌లో పాల్గొన్నప్పుడు, మరీ ముఖ్యంగా సమాజంలో ఇతరులతో మెరుగైన సంబంధబాంధవ్యాలు కలిగి ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండానే మన బ్రెయిన్‌లో ఈ డోపమిన్ విడుదలవుతుంది. మనల్ని సంతోష పెడుతుంది కాబట్టి దీనిని ప్లెజర్ హార్మోన్ అంటారు. ఆ సంతోషంలో మనం చేసే పని అడిక్షన్ స్థాయికి వెళ్లిందన్న విషయం కూడా గుర్తించలేం. పబ్‌జీ, టిక్‌టాక్ వంటి యాప్స్ అడిక్షన్ గురించి ఇటీవల పలు మార్లు టీవీ చర్చల్లో నేను పాల్గొన్నప్పుడు వాటికి అలవాటు పడిన అనేకమంది నుండి “మేం అడిక్ట్ అవలేదు.. చాలా సంతోషంగా ఉన్నాం” అనే స్పందన స్వయంగా విన్నాను. అడిక్షన్ ఏదైనా ఒక మాదిరి సంతోషాన్ని అందిస్తుంది. ఆ సంతోషం చాలు అనుకుంటున్నారు కాబట్టే వాటిని మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు. గేమ్ ఆడేటప్పుడు ఒక లెవల్ దాటినప్పుడూ.. స్క్రీన్ మీద మీరు ఏదో సాధించినట్లు ఫ్లాష్ అయ్యే గ్రాఫిక్స్ చూసినప్పుడూ.. టిక్ టాక్ వీడియోలకు పెద్ద మొత్తంలో వచ్చే కామెంట్లు, లైక్‌లు చూసినప్పుడు మన బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే డోపమిన్ మళ్లీ మళ్లీ అదే పని చేసేలా ప్రేరేపిస్తుంది.

రివార్డులకి స్పందిస్తూ

ఒక పని చేస్తే దానికి తగిన నజరానా లభిస్తుంది అనుకున్నప్పుడు.. బ్రెయిన్‌లోని డోపమిన్ ఉత్పత్తి చేసే పాత్‌వే‌లు యాక్టివ్ గా పనిచేయడం మొదలుపెడతాయి. ఒక ప్రవర్తన, దాని ద్వారా ఓ నజరానా ఆశించడం - ఈ రెండు రకాల పనులు ఎప్పటికీ తెగని ఓ ప్రవాహంలా అలా కొనసాగుతూనే ఉంటాయి. ఈ కారణంచేతే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఎప్పటికప్పుడు ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్స్ మారుస్తారు. అలా మార్చిన వెంటనే వందల కొద్ది లైక్స్ కోసం ఆశపడుతుంటారు. అలా లైక్స్ వచ్చిన వెంటనే బ్రెయిన్‌లో డోపమిన్ తగినంత స్థాయిలో విడుదల అవుతుంది. అప్పటికి సంతృప్తి అన్పిస్తుంది. మరికొంత సమయం తరువాత మళ్లీ అదే స్థాయిలో, లేదా అంతకంటే మరింత ఎక్కువ మోతాదులో డోపమిన్ రసాయనం కావాలి అనిపిస్తుంది. దానికోసం, మరిన్ని లైకులు సాధించడం కోసం.. మనం ఏంటి, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అన్న విషయం మర్చిపోయి క్రేజీగా ఫొటోలు తీసుకుని అప్లోడ్ చేస్తూ ఉంటాం. కేవలం లక్షలాది మంది తమ వీడియోలు చూస్తే చాలు.. లైకులు, కామెంట్లు రాస్తే చాలు.. అనే ఓ బలమైన మోటివేషన్ కొద్దీ చాలామంది మహిళలు అసభ్యకరమైన వీడియోలు టిక్ టాక్ లో చేస్తున్నారంటే కారణం వారికి డోపమిన్ స్థాయిలు సరిపోవడం లేదు. పరోక్షంగా అది అడిక్షన్ అయిపోయినట్లు గ్రహించాలి. మనం ఫేస్‌బుక్, వాట్సప్, మెసెంజర్ వంటి సోషల్ మీడియా యాప్స్‌లో నవ్వుతూ ఉండే స్మైలీలు, హార్ట్ సింబల్స్ చూసినప్పుడు, మనం బాగా దగ్గర అనుకుంటున్న వ్యక్తులు మనకు పాజిటివ్‌గా స్పందించినప్పుడు, అలాగే ఆత్మీయుల నుండి మెసేజ్ వచ్చినప్పుడు తెలియకుండానే రివార్డ్ వచ్చిన అనుభూతి కలిగి మెదడులో డోపమిన్ విడుదల అవుతుంది. కావాలంటే మీకు మీరు గమనించండి. కొంతమంది వ్యక్తులు ఇచ్చే లైక్‌ల కన్నా మీరు బాగా ఆత్మీయంగా భావించేవారు మీ ఫేస్బుక్ పోస్ట్‌కి కొట్టే ఒక లైక్ మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. మీరెప్పుడు పోస్ట్ పెట్టినా వాళ్లు లైక్ కొట్టాలి అన్పిస్తుంది. వాళ్ళు బిజీగా ఉండి ఎప్పుడైనా లైక్ కొట్టకపోతే.. ఒత్తిడి తట్టుకోలేక ఫోన్ చేసి “అర్జెంటుగా లైక్ కొట్టు” అని చెప్పే వారు కూడా లేకపోలేదు!

టెక్ కంపెనీల తెలివి

ఈ రోజు మనం వాడుతున్న ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సప్, టిక్ టాక్, పబ్‌జీ వంటి అన్ని రకాల అప్లికేషన్లు చాలా తెలివిగా డిజైన్ చేయబడ్డాయి. అవి సక్సెస్ కావడం కోసం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు మిగతా అన్ని పనులు పక్కన పెట్టి అధిక సమయం వాటిమీద గడిపేలా ప్రేరేపించడం కోసం అవి తమ అల్గారిథమ్స్‌ని వ్యూహాత్మకంగా తయారు చేసుకున్నాయి. 1930వ సంవత్సరంలో వేరియబుల్ రివార్డ్ స్కెడ్యూల్స్ అనే అంశం కనుగొనబడింది. ఎలుకల మీద జరుపబడిన ప్రయోగంలో.. వాటి ఊహకి అందని వేర్వేరు సందర్భాల్లో వాటికి నజరానా అందించే విధంగా ఏర్పాటు చేసినప్పుడు ఎలుకలు ఒకటే పని మళ్లీ మళ్లీ ఉత్సాహంగా చేయడం మొదలు పెట్టాయి. అదే తమకు రివార్డ్ వస్తుంది అని అవి ముందే ఊహించినప్పుడు అవి పెద్దగా స్పందించలేదు. టెక్నాలజీ కంపెనీలు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తాయి.

మీరు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేసినప్పుడు అది వెంటనే అందరికీ కనిపించదు. ఒకసారికి కొద్ది మంది చొప్పున దశలవారీగా మీ ఫ్రెండ్స్‌కి చూపించబడుతుంది. దీంతో వేర్వేరు సందర్భాల్లో లైక్స్ వస్తుంటాయి. ఒకేసారి పోస్ట్ వేలాదిగా ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ చూపించబడి.. వారందరూ కేవలం పది నిముషాల్లో అన్ని లైకులు కొడితే మీకు ఫేస్‌బుక్‌తో పనిలేదు. దాన్ని పక్కన పెట్టి వేరే పనిలో పడతారు. ఈ ప్రమాదం గుర్తించబట్టే, తమ ప్లాట్‌ఫాం మీద వినియోగదారులు ఎక్కువ సమయం గడపడం కోసం ఫేస్‌బుక్ లాంటి సర్వీసులు అన్నీ న్యూస్‌ఫీడ్‌ని రకరకాల సిగ్నల్స్ ఆధారంగా మార్చడం, ఇన్‌స్టాగ్రామ్ వంటివి అయితే కొన్ని సందర్భాలలో మీకు వచ్చిన లైకులను కొంత సమయం పాటు ఆపేసి ఒకేసారి చూపించడం.. మళ్ళీ కొంత గ్యాప్ ఇవ్వటం చేస్తుంటాయి.
సంతోషం వస్తోంది కదా, ఇంకేం కావాలి?

ఫేస్‌బుక్, టిక్‌టాక్‌లు వాడినప్పుడు డోపమిన్ విడుదల కావడం, సంతోషంగా అనిపించడం జరుగుతోంది కదా? ఏ మనిషికైనా కావాల్సింది సంతోషమే కదా. ఆ డోపమిన్ ఎలా విడుదలైతే ఏంటి? అనే ఆలోచన కొంతమందికి కలుగుతుంది. నిజమే.. ఎవరైనా సంతోషం కోసమే బ్రతుకుతున్నాం. అయితే మనల్ని సంతోషంగా ఉన్నట్లు భ్రమింపజేసి, పరోక్షంగా మన డోపమిన్ స్థాయిలు పెంచేసి టెక్నాలజీ కంపెనీలు తమ వ్యాపారాన్ని చేసుకుంటున్నాయి. ఆ తాత్కాలికమైన సంతోషం మాయలో పడిపోయి.. మన కెరియర్ వదిలేస్తున్నాం, కుటుంబం వదిలేస్తున్నాం, చుట్టూ ఉన్న మనుషులతో గడపడం మానేస్తున్నాం, నాలుగు గోడల మధ్య లైకులు చూసుకుంటూ ఒంటరిగా బ్రతికేస్తున్నాం. ఇవంతా మనం నిజమైన సోషల్ లైఫ్‌ని నాశనం చేస్తున్నాయి. మనం జీవితంలో ఎదగకుండా అడ్డుకుంటున్నాయి. ఒకప్పుడు సంవత్సరం మొత్తం కష్టపడి ఫస్ట్ ర్యాంక్ సంపాదించి ఆ విషయం పేరెంట్స్ తో షేర్ చేసుకున్నప్పుడు, వారి నుండి వచ్చే ఒక మెచ్చుకోలుతో ఒక కుర్రాడికి అతని బ్రెయిన్‌లో డోపమిన్ లెవల్స్ పెరిగేవి. మళ్లీ మళ్లీ కష్టపడి మరింత సాధించాలి అనే భావన కలిగేది. ఇప్పుడు సంవత్సరం కష్టపడకుండానే, ఫేస్ బుక్ లో ఒక ఫోటో అప్లోడ్ చేస్తే వేలాది మంది లైక్ లు కొడితే, అప్పుడు విడుదల అయ్యే డోపమిన్ సరిపోతున్నప్పుడు.. ఒక ప్రశంస కోసం సంవత్సరం పాటు కష్టపడాలి అనే భావన చాలా తక్కువ మందిలో ఉంటుంది. పరోక్షంగా టెక్నాలజీ కంపెనీలు మనల్ని బానిసలుగా చేసి మన నిజమైన లక్ష్యాలకు దూరం చేశాయి.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Thursday, August 5, 2021

కురుక్షేత్ర యుద్ధం రహస్యం

కురుక్షేత్ర యుద్ధం రహస్యం

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. దుర్యోధనుడు భంగమైన ఊరువులతో తన మృత్యువుకై ఎదురుచూస్తున్నాడు. పాండవులు దుర్సోధనుణ్ణి ఆ తటాకంవద్దే వదిలిపెట్టి తమ తమ రథాలపై తిరుగు ప్రయాణమయ్యారు. బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గదాయుద్ధాన్ని ఖండిస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయినట్లుందక్కడ. కనుచూపుమేరలో అన్నీ శవాలే కనిపిస్తున్నాయి. ఎన్నో అక్షౌహిణీల సైన్యం, అశ్వాలు, రథాలు, గజములు.. అంతా విగతమై పడివున్నాయి. ఆ రోజే మరణించిన శకుని శల్యాదుల శవాలను తీసుకెళ్ళేవారులేక అనాధల్లా పడున్నాయి. అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సాహంతో ఉప్పొంగుతోంది. అప్రయత్నంగా తన మీసాలమీద చెయ్యివేసి, "బావా చూసావా కౌరవులు ఎలా నశించారో?" అని అన్నాడు. శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు.
అర్జునుడు తన గాండివాన్ని ఒక్కసారి తడుముకున్నాడు. ఒక్కసారి భీష్మ, ద్రోణ,కర్ణాది మహావీరులూ, శత్రువులంతా ఎలా తన అస్త్రశస్త్రాలకి బలైంది తనకళ్ళకు కనపడినది. తను జయించాడు...కర్ణ వధానంతరం ఇక తనని ఎదిరించగలిగిన మేటి విలుకాడే ఈ భూమి మీదే లేకుండాపోయాడు.
అన్ని రథాలు రణరంగం మధ్యలో ఉన్న భీష్ముడి అంపశయ్య దగ్గరకు చేరాయి. ధర్మరాజు ఒక్క ఉదుటన రథం కిందకు దూకి - "పితామహా.. పితామహా.. మేము జయించాం... కౌరవులందరూ నిహతులైనారు.." అన్నాడు. భీష్ముడు దుఃఖం పొంగుతుండగా కళ్ళు మూసుకున్నాడు.

"అయితే నాయనా నూర్గురు సోదరులని చంపినట్టేనా.." అన్నాడు. భీమసేనుడు వెంటనే అందుకున్నాడు. అవును పితామహా... సుయోధనుడి ఊరువులను ఇప్పుడే భంగపరిచాను. గదా యుద్ధంలో తనకు ఎదురు లేదనుకున్న సుయోధనుడు నా చేతిలో హతుడైనాడు. నా ప్రతిజ్ఞలు నేరవేర్చుకున్నాను. ఇక రాజ్య లక్ష్మి మా వశమైంది.."

"కురురాజ్యం అయితే ఇప్పుడు పాండవరాజ్యం అయ్యిందన్నమాట"

"అవును పితామహా.. ఇప్పుడు పాండవుల పరాక్రమాలు ప్రపంచానికి విదితమయ్యాయి.." అని నకులుడన్నాడు. నాడు కురురాజ్యసభలో చేసిన ప్రతిజ్ఞలు అన్నలు నెరవేర్చారు పితామహా అని సహదేవుడాన్నాడు.భీష్ముడు నలుదిక్కులా కలయజూశాడు.

"అర్జునా. పిలిచాడాయన నెమ్మదిగా."చెప్పండి పితామహా.."

"నీవేమి చెప్పవేం..??"

"చెప్పేదేముంది పితామహా... నేను గెలిచాను.. మిమ్మల్ని పడగొట్టాను,కర్ణుణ్ణి వధించాను, ద్రోణుణ్ణి కూలగొట్టాను. ఇక రాజులమై అఖండ కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాము."

"మంచిది నాయనా.. అవును వాసుదేవుడేడి..?" ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి గంగాతనయునికి నమస్కరించాడు.

"పరంధామా.. నాకెందుకయ్యా నమస్కరిస్తావు. ధర్మపక్షపాతివై ధర్మం పక్షాన నిలిచావు, ఆయుధంపట్టకుండా యుద్ధాన్ని నడిపావు. ఈ గెలుపంతా నీదేకదా ముకుందా... నీకే మేమంతా నమస్కరించాలి."

ఆ మాటలువింటూనే అర్జునిడికి ఎక్కడలేనికోపం వచ్చింది. ఇదేమిటి పితామహుడు ఇలా అంటున్నాడు. యుద్ధం చేసిందంతా నేను.. నా ధనుర్విద్యతో ఎంతమంది సైనికులు మట్టిగరిచారు. ఎంతటి మహావీరులు నేలకొరిగారు. శ్రీకృష్ణుణ్ణి పొగిడితే పొగిడాడు కానీ నా గురించి ఒక్క మాటైనా అన్నాడా తాత అని మనసులో అనుకున్నాడు.

అంతా భీష్ముడికి నమస్కరించి తమ గుడారాల వద్దకు చేరారు. అందరు తమ తమ రథాలు దిగారు. శ్రీకృష్ణుడు మాత్రం తన పార్ధసారథి స్థానం నుంచి దిగకుండా అర్జునుణ్ణి దిగమని సైగ చేసాడు. అర్జునుడు దిగగానే వాసుదేవుడు ఒకసారి రథం పైన ఉన్న ధ్వజం వైపు చూసాడు. ఝండా పై ఉన్న కపిరాజు హనుమంతుడు ఒక్కసారిగా దూకి రథంముందు వినయంగా నమస్కరిస్తూ నిలబడ్డాడు.

"శ్రీరామచంద్రా... వాసుదేవా.. పరంథామా నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా పార్ధుడి రథంపై ధ్వజమై నిలిపి నీవు లోకానికి ప్రసాదించిన భగవద్గీతాసారం విని నీ విశ్వరూప సందర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చావు. నీకు నా భక్తి పూర్వక ప్రణామాలు దేవదేవా.." అంటూ ప్రణమిల్లాడు హనుమంతుడు. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడి రథంపైనుండి దిగాడు. నెమ్మదిగా కొంతముందుకి వచ్చి రథంవైపు చూసి తన పిల్లనగ్రోవినెత్తి సైగచేసాడు.

అంతే... ఫెళ ఫెళ మంటూ శబ్దం చేస్తూ రధం కుప్పకూలిపోయింది. రథచక్రాలు తునాతునకలయ్యాయి. రథాశ్వాలు భీకరమైన అరుపు అరుస్తూ నేలకొరిగాయి. అందరూ భయకంపితులై చూస్తుండగానే రథం అశ్వాలతో సహా భస్మమైపోయింది. ఆ భయానకమైన చప్పుడు విని ధర్మరాజు "అర్జునా అర్జునా" ఏమైంది అంటూ పరుగు పరుగున వచ్చాడు.

అర్జునుడు కూడా భయపడుతూ "బావా వాసుదేవా" అంటూ కృష్ణుడి వద్దకు చేరాడు. "నీకేమికాలేదు కదా బావా.. ఏమిటిలా జరిగింది.." అన్నాడు ఖంగారుగా. ఆ మాటలు వింటునే కృష్ణుడు చిన్న చిరునవ్వు నవ్వాడు. పక్కనే వున్న హనుమంతుడు గట్టిగా నవ్వాడు.

"ఆంజనేయా.. నా ఖంగారు నీకు పరిహాసంగా తోస్తున్నదా.." అన్నాడు అర్జునుడు. హనుమంతుడు మరింత గట్టిగా నవ్వి ఇలా అన్నాడు -"పార్థా నవ్వక ఏమి చెయ్యమంటావు. నిన్ను కాపాడిన పరమాత్ముణ్ణి నీవు పరమార్శిస్తుంటే నాకు నవ్వొచ్చింది."

"బావ నన్ను కాపాడాడా.?"

"అవును అర్జునా... ఈ రథం ఇప్పుడు కూలిపోలేదు... భీష్ముని బాణ ధాటికి నీ రథ చక్రాలు ఏనాడో కూలాయి. కర్ణుని అస్తాలకి నీ అశ్వాలు ఎప్పుడో మరణించాయి. నీ గురువు ద్రోణుడు ఆగ్రహజ్వాలల్లో నీ రథం అప్పుడే తునాతునకలయ్యింది. బ్రహ్మాస్త్రం ధాటికి నీ రథం యావత్తూ బూడిదయ్యింది."|

"మరి..?"

"నీ రథం పైన సాక్షాత్తు ఆది విష్ణువే ఉన్నాడు. ఆ పరమాత్ముడి ఆజ్ఞలేక అన్నీ అలాగే నిలిచి ఉన్నాయి. ఇప్పుడు వాసుదేవుడు రథంనుండి కిందికి దిగడంతో ఆ అస్త్రాలు పనిచేసాయి. నీ రథం ముక్కలైంది. నువ్వు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్న మహావీరుల అస్త్రాలు నీ పైన పనిచెయ్యలేదంటే దానికి కారణం తెలుసా! అవి నిన్ను చేరాలంటే నీ కన్నా ముందు ఆసీనుడైన ఆ పరంథాముణ్ణి దాటి రావాలి కాబట్టి.."

హనుమంతుడు ఈ మాటలనగానే పాండవులకు తమ అజ్ఞానం ఏమిటో బోధపడింది. పితామహుడు భీష్ముడు విజయాన్ని శ్రీకృష్ణుడికి ఎందుకు ఆపాదించాడో అర్థం అయ్యింది. అయిదుగురూ ఒక్కసారిగా శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డారు.

"పరమాత్మా.. మా అజ్ఞానాన్ని మన్నించు తండ్రి.." అన్నాడు అర్జునుడు మనస్ఫూర్తిగా.శ్రీకృష్ణుడు మళ్ళి మనోహరంగా చిరునవ్వు నవ్వాడు.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Wednesday, August 4, 2021

ఈరోజు మంచిమాట.

ఈరోజు మంచిమాట.

కొన్ని బంధాలు ఎందుకు కలుస్తాయో.. ఎందుకు విడిపోతాయో ఎప్పటికి అర్థం కాదు.

కొన్ని బంధాలు అలా వచ్చి ఇలా వెళ్ళినప్పటికి అవి ఎప్పటికీ చెరగని గుర్తులా నిలిచి పోతాయి...

ఏ బంధం ఏ వరసలో ముడి పడుతుందో...కాలం ఎవరిని ఎలా దూరం చేస్తుందో ఎవరూ చెప్పలేరు..

ఎవరూ చెప్పలేని సమాధానాలు ఎన్నో మనసు కు దగ్గర అయి కొందరే మనకు జ్ఞాపకాలుగా మిగిలి పోతారు.

మరి కొందరి వల్ల ఏర్పడిన మనో వేదన ఎప్పటికీ మర్చిపోలేము..ఏ కారణాల వల్ల అయిన కానీ విడిపోయిన ..ముడిపడిన బంధాలు.. ఎన్నో ఎన్నెన్నో....

ఎన్నో గాయాలు ఎన్నో మధుర భావనలు.. ఎన్నో ఘర్షణలు సంఘర్షణలు;!

అన్నింటిని ఎదుర్కొంటేనేగా జీవితము...లేకుంటే అర్ధరహితమేగా!!

🌄 శుభోదయం చెప్తూమీ మానస సరోవరం

Source - Whatsapp Message

7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు

🪐7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు🪐


🪐1వ ప్రశ్న
ప్రపంచంలో ఏది పదునైనది?
జ: చాలా మంది కత్తి అని చెప్పారు.
గురువు: కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.

🪐2వ ప్రశ్న:
మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?
జ: చాలా మంది చంద్రుడు ,సూర్యుడు, గ్రహాలూ.
గురువు: మనకు అత్యంత దూరంలో వున్నది. గడిచిపోయిన కాలం. ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము, ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.


🪐3వ ప్రశ్న:
ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది?
జ: చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి ఇలా ఎన్నో అంటారు.
గురువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే.

🪐4వ ప్రశ్న:
ప్రపంచంలో కఠినంగా, బరువుగా ఉండేది ఏది ?
జ: చాలామంది,వజ్రము ఇనుము,ఏనుగు అని చెప్పారు.
గురువు: కఠినమైనది అనేది "మాట ఇవ్వడం" మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.

5వ ప్రశ్న:
ప్రపంచంలో తేలికైనది ఏది?
జ: దూది,గాలి,ఆకులు అని చెప్పారు
గురువు: ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.

🪐6వ ప్రశ్న:
మనకు దగ్గరగా వున్నది ఏది?
జ: తల్లి తండ్రులు, స్నేహితులు,బంధువులు అని చెప్పారు.
గురువు: మనకు దగ్గరగా ఉండేది మన చావు.
అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం. అది పుట్టుకతోనే మనవెంట వచ్చింది.

🪐7వ ప్రశ్న:
ప్రపంచంలో సులువైనది ఏది ?
జ: తినడం ,పడుకోవడం, తాగడం,తిరగడం.
గురువు: ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు ఏదీ లేదు.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Tuesday, August 3, 2021

నీ మనసే నీకు అద్దం!

నీ మనసే నీకు అద్దం!

ఒక బౌద్ధ భిక్షువు తానెక్కడికి వెళ్ళినా తనవెంట ఒక అద్దాన్ని తీసుకుపోతూండేవాడు. అది అందరికీ విచిత్రంగా ఉండేది. అతను సర్వసంగ పరిత్యాగి. ప్రపంచంలోని మోహాలన్నింటికీ అతీతుడు. తన రూపురేఖలకు ప్రాధాన్యమివ్వడు. అటువంటివాడికి రోజంతా తనవెంట అద్దాన్ని తీసుకువెళ్ళాల్సిన అగత్యమేమిటి?
అదే ప్రస్తావనను ఆ వూరివారు పూజారి దగ్గర తెచ్చారు. తనకే చిత్రమనిపిస్తూంటే ఇక వూరివారి సందేహాలను ఆయనేమి తీర్చగలడు? ఎవరికీ ఆ భిక్షువును అడిగే ధైర్యం లేక ఆ పూజారినే అడిగి తెలుసుకొమ్మని ఒత్తిడి చేశారు. ఆయన కూడా తన కుతూహలాన్ని ఆపుకోలేక ఒకరోజున 'స్వామీ! మీరు మరోలా తలంచకపోతే నాకో సందేహం ఉంది, అడగాలనుకుంటున్నాను' అన్నాడు. 'మనసులో సందేహాలకు మనిషి తావివ్వకూడదు... సందేహం నిజాన్ని తెలుసుకోనివ్వదు సరికదా, మరొక అబద్ధాన్ని నిజమని భ్రమింపజేస్తుంది. నీ సందేహమేమిటో అడుగు నాయనా!' అన్నాడు భిక్షువు. 'ఈ లోకంలోని మోహాలన్నింటినీ జయించిన మీరు రోజంతా మీ జోలెలో అద్దాన్ని పెట్టుకుని తిరుగుతున్నారెందుకు? మీకు అద్దంతో పనేమిటి?' అని పూజారి అడిగాడు.

భిక్షువు కొన్ని క్షణాలపాటు నిశ్చలంగా అతనివైపు చూసి తన జోలెలోని అద్దాన్ని బయటకు తీసి 'నేను రోజూ భిక్షకు వెడుతుంటాను. కొందరు ఆదరణతో భిక్ష వేస్తారు. కొందరు మళ్ళీ రమ్మని చెబుతారు. మరికొందరు తలతిప్పుకొని వెళ్ళిపోతారు. ఇంకొందరు ఛీ కొడతారు. నేను ఏ చెట్టు కిందనో కాసేపు ధ్యానంలో కూర్చుంటాను. కొందరికది అభ్యంతరం ఉండదు. ఇంకొందరు ఏం పని లేదా అని హేళన చేస్తుంటారు. మరికొందరు పోపొమ్మంటారు. ఎవరు నిరాదరించినా, చీదరించుకున్నా, తూలనాడినా తప్పకుండా నా ముఖాన్ని అప్పుడీ అద్దంలో చూసుకుంటాను. అద్దంలోని నా ప్రతిబింబం- 'వీటన్నింటికీ మూలం నువ్వే! లోకంలో ఆదరించినవారున్నట్టే నిందించేవారూ ఉంటారు... ఎవరు ఆదరించినా పొంగిపోకు. ఎవరు చీదరించుకున్నా కుంగిపోకు అని నాకు సాంత్వననిస్తుంది. నన్ను అనుక్షణం అంటిపెట్టుకుని ఉండేది నా అంతరాత్మ. దాన్ని నా అంతః చక్షువులతో దర్శించగలిగేవరకూ నాకు మార్గదర్శిగా నిలిచేది నా ప్రతిబింబమొక్కటే! నా సమస్యకు మూలాన్ని మాత్రమే కాదు- దానికి పరిష్కారాన్నీ చెబుతుంది నా ప్రతిబింబం. అందుకే ఈ అద్దాన్ని నా వెంట తీసుకువెడుతుంటాను' అన్నాడు.

'నీకు మనసులో దేనికైనా బాధగా ఉన్నప్పుడు, ఎవరిమీదనో కోపంగా ఉన్నప్పుడు, పరిస్థితులపై చిరాగ్గా ఉన్నప్పుడు... ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి నీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకో! దానివల్ల నీకెంతో సాంత్వన కలుగుతుంది' అని తత్వజ్ఞానులు బోధించేది ఈ ధర్మసూక్ష్మంతోనే. మనమెక్కడికి వెళ్ళినా మనవెంట ఉండేది మనసొక్కటే! ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక్కసారి మనం మన మనసులోకి చూసుకోగలిగితే ఎంతో ప్రయోజనముంటుంది. అది అనుభూతి చెందినవారికే అర్థమవుతుంది!

Source - Whatsapp Message

Monday, August 2, 2021

నిజమైన ఆనందం

నిజమైన ఆనందం

పదేళ్ల వయసున్న విహారి ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్నాడు. ఆ రోజు విహారి పుట్టిన రోజు. ప్రతి ఏడాది విహారి పుట్టినరోజుని ఘనంగా జరుపుతారు. ఇరుగుపొరుగు పిల్లలని, వీధిలో, బడిలో ఉండే స్నేహితులని పిలుస్తారు. కొత్త దుస్తులు, సైకిలు, ఖరీదైన చాక్ లెట్స్, స్నేహితులకు పంచడానికి కామిక్స్ పుస్తకాలు ముందే కొన్నారు. ఆ రోజు ఉదయమే విహారికి ఇష్టమైన పులిహోర, బొబ్బట్లు చేసింది అమ్మ.
పిలిచిన సమయానికి స్నేహితులు అందరూ వచ్చారు. వాళ్ళ మధ్య పుట్టినరోజు జరుపుకున్నాడు విహారి. అమ్మా నాన్న , స్నేహితులు ఇచ్చిన బహుమతులను అందుకుని వాళ్లకు ధన్యవాదాలు చెప్పాడు.
ఆ రోజు సాయంత్రం అమ్మానాన్నలు గుడికి తీసుకువెళ్లారు విహారిని. గుడి మెట్ల దారిలో చాలా మంది బిచ్చగాళ్ళు కూర్చుని బిచ్చం అడుగుతున్నారు. అమ్మ ఇచ్చిన చిల్లరను ఒక్కొక్కరికి వేస్తూ మెట్లెక్కుతున్నాడు విహారి. అలా వెళుతున్నవాడల్లా ఒక్కసారిగా ఆగి నాన్నవైపు తిరిగాడు. “నాన్నా ! ఒకటడుగుతాను. కాదనకూడదు మీరు” అన్నాడు విహారి.
“ ఈవేళ నీ పుట్టినరోజు కదా. కాదని చెప్పనులే. ఏమి కావాలో అడుగు” తిరిగి అడిగాడు నాన్న.
“ నాతో రండి” అనేసి అమ్మానాన్నల చేతులు పట్టుకుని గుడి బయట ఉన్న బట్టల దుకాణానికి తీసుకెళ్లాడు. మారు మాట్లాడకుండా అనుసరించారు వారిద్దరూ.
ఒక ఫేంటు , షర్టు తీయించి వాటి ధరను నాన్నకు చూపించి దుకాణం యజమానికి ఆ డబ్బు ఇమ్మన్నాడు విహారి.
అప్పుడు మాత్రం “ మళ్ళీ ఇవెందుకు? కొత్తవి తొడుక్కున్నావు కదా” అని అడిగాడు విహారి నాన్న.
“కాసేపట్లో మీకు తెలుస్తుంది”అని విహారి అన్నాడు తప్ప కారణం చెప్పలేదు. దుకాణం వాడికి డబ్బులిచ్చేసి మళ్ళీ గుడి మెట్లు ఎక్కారు.
మెట్ల చివర్లో కూర్చున్న బిచ్చగాళ్ళలో విహారి వయసే ఉన్న కుర్రాడు ఉన్నాడు. వాడికి ఒంటి మీద చినుగుల నిక్కరు తప్ప మరేమీ లేదు. నేరుగా ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లి దుకాణంలో కొన్న కొత్త దుస్తుల్ని వాడికిచ్చి “నువ్వు తొడుక్కుంటే చూడాలని ఉంది” అన్నాడు విహారి.
ఆ అబ్బాయి వాటిని అందుకుని మురిసిపోతూ ఉన్నపళంగా అటు తిరిగి కొత్త దుస్తులు వేసుకున్నాడు. ఆ దుస్తులలో మురిసిపోతూ విహారి వైపు చూసాడు. కృతజ్ఞతగా చూసాడు విహారి వైపు. ఆ అబ్బాయి కళ్ళలో కనబడిన వెలుగుకు విహారి కూడా ఎంతో మురిసిపోయి ‘రోజూ ఇవి వేసుకో నా దగ్గర బోలుడు పాత దుస్తులున్నాయి. మళ్ళీ వచ్చినప్పుడు నీకు ఇస్తాను” అని చెప్పి అమ్మనాన్నల వైపు తిరిగాడు. వారిద్దరిని గట్టిగా హత్తుకుని ఒక్కొక్కరి బుగ్గల మీద అనేకసార్లు ముద్దు పెట్టాడు విహారి.
ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో బహుమతుల్ని అందుకున్నప్పుడు ఇలా చేయలేదు విహారి. ఇంత సంతోషం కూడా విహారిలో కనబడలేదు. ఆశ్చర్యంగా కొడుకు ముఖాన్ని చూస్తూ చాలాసేపు ఉండిపోయారు అమ్మానాన్నలు.
‘పెద్దలు బహుమతిగా ఇచ్చింది తీసుకున్నప్పుడు పిల్లల ముఖాల్లో నవ్వు మాత్రమే కనిపిస్తుందని, పిల్లలు కోరినది దక్కినప్పుడు, వాళ్ళు ఏదైనా చేద్దామనుకుంటే సాయం దొరికినప్పుడు నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారని విహారి అమ్మానాన్నలకు తెలిసింది. గుండె లోతుల్లోంచి పుట్టేదే అసలైన ఆనందమని తెలుసుకున్నారు. అప్పటినుంచి విహారి చెప్పే విషయాలను విని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ , సహకారం అందించడానికి ప్రాధాన్యత ఇచ్చారు.
ఆ రోజు రాత్రి విహారి పడుకోబోయే ముందు తన డైరీలో “నేను కోరింది చేసే మంచి అమ్మానాన్నలు దొరకడం నా అదృష్టం. ఈ పుట్టినరోజు నాడు మాత్రం ఇంతవరకు ఎరుగని ఆనందం పొందాను” అని వ్రాసుకున్నాడు.

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

నేటి జీవిత సత్యం.

నేటి జీవిత సత్యం.

జీవితం అంటేనే ఆటుపోట్ల సమాహారం. అందులో ఎప్పుడూ విజయాలే ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఒకోసారి పరాజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ పరాజయాలనే పరమపదసోపానాలుగా మల్చుకుంటే బతుకు కావడికుండలాగా సమంగా సాగిపోతుంది. ఇంతకీ ఆ పరాజయాలు నేర్పే పాఠాలు ఏమిటో!

డబ్బు విలువ నేర్పుతుంది
చాలా పరాజయాలు ధననష్టంతోనే ముడిపడి ఉంటాయి. అప్పటి వరకూ ఈ చేతికి తెలియకుండా ఆ చేతితో ఖర్చుపెట్టేసిన బంగారుబాబులకి దరిద్రం ఎప్పుడైనా, ఎవరినైనా వరించవచ్చని తెలిసొస్తుంది. నిజంగా అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బు లేకుండా పోవచ్చునని అర్థమవుతుంది. వెరసి... డబ్బు విలువ తెలిసొస్తుంది.

మనుషుల విలువ నేర్పుతుంది
‘విజయానికి బంధువులు ఎక్కువ’ అని పెద్దలు అంటూ ఉంటారు. కాస్తంత కష్టం రాగానే తుపాకీ దెబ్బకి కూడా దొరక్కుండా మన చుట్టుపక్కల జనాలంతా కనిపించకుండా పోవచ్చు. అలాంటి కష్ట సమయాల్లోనే ఎవరు మనవారో, ఎవరు కాదో అర్థమవుతుంది. ఇతరుల దృష్టిలో మన విలువ ఏమిటో తెలిసొస్తుంది. ఎవరి తత్వం ఏమిటో బోధపడుతుంది.

వినయం విలువ నేర్పుతుంది
అంతాబాగున్నప్పుడు ఎగిరెగిరి పడుతూ ఉంటాము. మనంతటి వాడు లేడని మిడిసి పడుతూ ఉంటాము. ఒక్కసారి ఎదురుదెబ్బ తగిలితే కానీ మనం కూడా సాధారణ మనుషులమే అని తెలిసిరాదు. కష్టాలకీ, కన్నీళ్లకీ, పరాజయాలకీ, పరాభవాలకీ ఎవ్వరూ అతీతం కాదని తెలిసొస్తుంది. అంతేకాదు! ఇతరులని కూడా ఇక నుంచి గౌరవంగా చూడాలనీ, వినయంతో మెలగాలనీ అనిపిస్తుంది.
లక్ష్యం విలువ నేర్పుతుంది
కష్టపడితే ఏదీ కాళ్లదగ్గరకి రాదు. అలా వచ్చేదానికి విలువ ఉండదు. లక్ష్యం ఎంత అసాధ్యంగా ఉంటే దాని ఛేదనలో అంత తృప్తి ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఆ లక్ష్యాన్ని తప్పిపోయినప్పుడు దాని విలువ ఏమిటో తెలిసొస్తుంది. దాన్ని ఏలాగైనా ఛేదించి సాధించాలన్న పట్టుదలా పెరుగుతుంది.

జీవితం విలువ నేర్పుతుంది
అప్పటివరకూ ఎడాపెడా సాగిపోయిన జీవితం పరాజయంతో ఒక్కసారిగా నిలిచిపోయినట్లు అవుతుంది. ఆ క్షణంలో మనకి కాలం, కష్టం, కరుణ, దురలవాట్లు, సంతోషం, అడ్డంకులు, ప్రణాళికలు... వంటి అనేక విషయాల గురించి అవగాహన ఏర్పడుతుంది. మన వ్యక్తిత్వం గురించీ, ఆలోచనా విధానం గురించి ఒక స్పష్టత కలుగుతుంది.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

మానవ జన్మ... జ్ఞానం... మోక్షం.....

మానవ జన్మ... జ్ఞానం... మోక్షం.....

మనిషి జన్మ లభించింది. సరేగానీ ఈ జన్మ దేనికోసం లభించింది ? దీని వల్ల ఏం ప్రయోజనం ? అని ఆలోచించే వారు ఎందరు ?

మనిషి జన్మ అనేది దేవుడికి చేరువ కావడానికి ఒక
మార్గం, అవకాశం దొరికింది అనుకోవాలి. భక్తి మార్గంలో ఉంది వైరాగ్యం చెంది భగవంతుడిని చేరుకోవడానికి మానవ జన్మ తప్పించి మరో జన్మలో లేదు.
అయినా పూర్వ జన్మ పుణ్య ఫలం తో సాలీడు, ఏనుగు, పాము, నెమలి వంటివి దేవుడిని పూజించి ముక్తి పొందినట్టు పురాణ గ్రంధాలు తిరగేస్తే తెలుస్తుంది.

కానీ మనిషిగా పుట్టిన వారందరూ భగవంతుడికి దగ్గరయ్యే మార్గాన్ని ఏ మేరకు ఉపయోగించుకుంటున్నారు ?

మనిషి పుట్టినప్పటి నుంచి తానూ చెయ్యవలసిన మంచిపనులు చెయ్యక తప్పదు. సంసార సాగరంలో ఈదుకుంటూ పోవలసిందే. ఇందులో మరో దారి లేదు. ఒక్కో దశలో ఎన్ని పనులు చెయ్యాలో విడిగా చెప్పక్కర్లేదు.

అయితే ఎన్ని పనులు చేసినా చివరికి అప్పటి వరకు వెన్నంటే వచ్చిన బంధపాశాలను విడిచిపెట్టి భగవత్ ధ్యానంలో లీనమైపోవాలి.

ఒక చెట్టు విషయానికి వద్దాం.

ఒక చెట్టున మొగ్గ వచ్చింది. అది పువ్వైంది. ఆ తర్వాత కాయ అయ్యింది. అనంతరం అది పండు అయ్యింది. కొంతకాలానికి అది నేల రాలుతుంది.

అయితే ఇక్కడో విషయం గమనించాలి.

పిందేగానో, కాయగానో ఉన్నప్పుడు దానిని కొమ్మ నుంచి కోసి వేరు చేస్తున్నప్పుడు అది ఉన్న చోటునుంచి నీరు కారుతుంది. కాయ మొదలు లోను నీటి తడి చూడవచ్చు. కానీ పండు రాలినప్పుడు కొమ్మలోను నీటి తడి ఉండదు. పండు రాలిన చోట కూడా నీటి తడి ఉండదు. కానీ కాయ కోస్తున్నప్పుడు నీటి తడి ఉండటానికి కారణం, అయ్యో మరిన్ని రోజులు నన్ను అంటిపెట్టుకుని ఉంటే అది పండు అయ్యేది కదా అని చెట్టు కొమ్మ కంట తడి పెడుతుంది. కనుక అక్కడ నీటి తడిని చూడవచ్చు.
అలాగే కాయ మొదలులోను ఆ నీటి తడి ఉంటుంది. అయ్యో ముందుగానే నన్ను చెట్టు కొమ్మ నుంచి వేరు చేసేసారు కదా అని కాయ కూడా బాధపడుతుంది. కానీ ఒండు విషయంలో అలా కాదు....కాయ పంది రాలుతున్నప్పుడు చెట్టు కొమ్మనా నీటి తడి కనిపించాడు. పండు మొదలు లోను నీటి తడి ఉండదు. రెండింటిలోను ఓ పరిపక్వత వస్తుంది. దాని బంధం అయిపొయింది కనుకే పండు రాలిపోయినట్టు చెట్టు కొమ్మ అనుకుంటుంది. పండు కూడా తన కాలం ముగిసినట్టు అనుకోవడంతో అటూ ఇటూ రెండువైపులా బాద అనేది ఉండదు.

అలాగే మనిషి జీవితం కూడా....సంసార చక్రంలో ఉండి కుటుంబ వ్యవహారాలు సాగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి అర్ధంతరంగా పక్కకు తప్పుకుంటే అటు కుటుంబ సభ్యులకూ బాదే. మధ్యలోనే దూరమవుతున్నామని అతనికీ బాధే.... రెండువైపులా ఆందోళన, ఆవేదనా ఉంటాయి....

అయితే ఆ వ్యక్తే తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి క్రమంగా బంధపాశాలను త్యజిస్తూ నెమ్మది నెమ్మదిగా జ్ఞానమార్గం వైపు అడుగులు వేస్తూ అందులో మునిగి తేలినప్పుడు అటు అతనికీ ఇటు కుటుంబ సభ్యులకూ బాధ ఉండదు.

రెండువైపులా కన్నీరు కార్చడం అనేది ఉండదు.

జ్ఞానమనేది ఏదో ఒకే రోజులో వచ్చేది కాదు. నెమ్మది నెమ్మదిగా రావాలి...అలాగే అలవడుతుంది కూడా. అంతేతప్ప తాను జ్ఞాని అని ముందే చెప్పుకుంటే దానిని కడ దాకా కొనసాగించగలడా అనేది ప్రశ్నార్ధకమే.

అందుకే మెల్లమెల్లగా దాని వైపు అడుగులు వేసి దైవ మార్గంలో అడుగులు సారించాలి.

అప్పుడు తప్పకుండా మనమనుకున్నది నెరవేరుతుంది. మోక్షం తనంతట అదే వరిస్తుంది. అందులో అనుమానం అక్కరలేదు.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

చిన్ని కథ

ఈ చిన్ని కథ ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు వస్తుందన్న చిరు ఆశతో పంపుతున్నాను.

" అమ్మా ! రేపటి లోపు నీ నిర్ణయం తేల్చాలి.మీ ఇద్దరికీ మధ్య నేను నలిగిపోతున్నాను. నా మాట విని నాయనమ్మను వృద్ధాశ్రమానికి పంపి నువ్వు, నేను, నా భార్య కలిసుందాం. అత్తగారినే కాక అత్త గారి అత్తగారిని కూడా చూడాలంటే ఏ అమ్మాయి ఒప్పుకుంటుందమ్మా చెప్పు.. అలా నువ్వు నాయనమ్మని పంపిస్తేనే ఉష నన్ను పెళ్లి చేసుకుంటుంది. లేకపోతే నా ప్రేమ విఫలమే " అన్నాడు శశి.

తల్లీ కొడుకుల మాటలు ఎంత వినకూడదు అనుకున్నా చెవిన పడుతూనే ఉన్నాయి పూర్ణమ్మకి. వినపడాలనే గట్టిగా మాట్లాడుతున్నాడని అర్ధం కాకపోలేదు ఆవిడకి.

నిమిషం మౌనం తరువాత...

స్వరూప మాట్లాడుతోంది " శశి ! నీ పెళ్ళికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు. పెళ్లి అయ్యాక నువ్వు, నీ భార్య కలిసి ఉండండి విడిగా.. నేను, మా అత్తగారు ఇక్కడే ఉంటాం. నా నిర్ణయం ఇదే !

పంతొమ్మిదేళ్ళ వయసు నుండి నాకు ఆవిడతో అనుబంధం. నాకు తల్లి వంటిది. మీ నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోతే ఆవిడే మనకి పెద్ద దిక్కుగా నిలబడింది. ఈ రోజు ఆవిడ జవసత్వాలుడిగాయని ఆవిడని మనకి పనికి రాని వస్తువుగా చూడలేను. అలా చేస్తే నన్ను మీ నాన్న క్షమించరు పై నుండి. మీ నాన్న కోసం కాకపోయినా నాలోని తల్లి ఆ తల్లిని వదలలేదు.

అలాగని నువ్వు మనసు పడిన అమ్మాయి నుండి దూరం చేయలేను. తల్లిగా నేనెపుడు నిన్ను వదలలేను. నువ్వెక్కడ ఉన్నా నీ క్షేమమే కోరుకుంటాను.

ఒక్కటి మాత్రం ఆలోచించుకో... ఇవాళ నాయనమ్మ ఉంటే పెళ్లి చేసుకోనని చెప్పిన అమ్మాయి.. నేను నీతో వచ్చేస్తే రేపు పెళ్లి అయ్యాక నన్ను కూడా పొమ్మంటే ?? అందుకే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. ఆ అమ్మాయి ప్రేమ పొందాలంటే నువ్వు నీ ప్రేమానుబంధాలను తాకట్టు పెట్టాల్సినందుకు మాత్రం బాధగానే ఉంది.

ఇప్పటికే ఆలస్యం అయింది. పడుకో " అని చెప్పి బయటికి వచ్చేసింది.

బయటికి వచ్చిన కోడలులో తల్లి కనిపించింది పూర్ణమ్మకి !! ఏ జన్మ ఋణానుబంధమో అనుకుంది మనసులో !!



పదిహేనేళ్ళ క్రితం

పండగకి వచ్చిన పూర్ణమ్మ ఇద్దరు కూతుళ్లు తన దగ్గరకి అంటే తన దగ్గరకి రమ్మంటూ గొడవ పెట్టారు.

అప్పటికే పూర్ణమ్మ కొడుకు పోయి ఏడాది దాటింది. స్వరూప తన భర్త ఉన్నపుడు ఆడపడుచులకు ఎలా మర్యాద చేసేదో అలానే చేసేది అయన లేకపోయినా కూడా.

సరే... కొన్నాళ్ళు కూతుళ్ళ దగ్గర ఉండి వద్దామని వెళ్ళింది పూర్ణమ్మ.వెళ్లిన నాలుగో రోజే... అడిగింది పెద్ద కూతురు అమ్మని. అమ్మా ! ఎలాగూ నువ్వు బంగారం వేసుకోవట్లేదు కదా.. ఎప్పుడో ఇచ్చేదేదో మాకు ఇప్పుడే ఇచ్చేస్తే మేమైనా వేసుకుంటాం కదా! చెల్లిది కూడా అదే అభిప్రాయం. కావాలంటే మాట్లాడు అని ఫోన్ కలిపి ఇచ్చింది.

చిన్న కూతురు " అమ్మా ! నీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తావు. ఎప్పటికైనా ఇవ్వాల్సిందే గా.. అక్క చెప్పింది కరెక్టే..వదినకి ఎలాగూ ప్రభుత్వ ఉద్యోగం ఉంది కనుక ఇల్లు మా ఇద్దరికీ ఇస్తే మా దగ్గరే ఉండొచ్చు నువ్వు చివరి వరకు. కోడలి దగ్గర కన్నా కూతురి దగ్గరే బాగుంటుంది నీ జీవితం.. నిన్ను చూడడానికి మాకేం అభ్యంతరం లేదు మేము చెప్పినట్టు చేస్తే ! " అని ముక్తాయింపు ఇచ్చింది.

మరునిమిషమే...

పూర్ణమ్మ లోనికి వెళ్లి తన పెట్టె తెచ్చుకుని వచ్చేసింది కోడలి దగ్గరకి.

తరువాత పెద్ద కూతురు పూర్ణమ్మ ఇంటికి వచ్చి మరీ స్వరూప ని నానా మాటలు అనింది. నీ మాయ మాటలతో మా అమ్మని మోసం చేస్తున్నావు అంటూ.

పూర్ణమ్మ " నా కోడలిని మనవడిని వదిలే ప్రసక్తి లేదు. నా కొడుకుని వీళ్ళలో నే చూసుకుంటున్నాను. నా ఓపిక ఉన్నంత వరకు నా కొడుకు బాధ్యత నేను నెరవేర్చుతాను. మీరు అడిగినట్టు మీకు కావాల్సిన బంగారం ఇచ్చేస్తాను.. నువ్వు వెళ్లొచ్చు " అని మొహం మీద తలుపేసేసింది.

అత్తగారే తనకి కొండంత అండ అనుకుంది స్వరూప చెమ్మగిల్లిన కళ్ళతో...



ప్రస్తుతం

నాన్న చనిపోతే అమ్మా, నాయనమ్మ తనని ఏ లోటు లేకుండా ఎలా పెంచారో గుర్తుకొస్తూనే ఉంది శశికి.

పొద్దునే శశి " నాయనమ్మా !! నీ మనవడికి పిల్లని వెతికే బాధ్యత నీ మీద ఉండగా హాయిగా నిద్ర పోతున్నావా.. " అంటూ ఆవిడని లేపుతుంటే అయోమయంగా చూస్తున్నారు పూర్ణమ్మ, స్వరూప.

ఫోన్ లో రికార్డు అయిన కాల్ వినిపించాడు వారికి

" ఉషా ! నిన్ను బాధపెడుతున్నందుకు క్షమించు. కానీ నువ్వు చెప్పినట్టు అందరినీ వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటే బాధ పడేది నేను !! కన్న తల్లి ప్రేమను, పెంచిన నాయనమ్మ ప్రేమను వదిలేయగలిన నాకు.. రేపు భార్య ప్రేమను కూడా వదిలేయగలిగేలా నా మనసు మారిపోతుందేమో !! ఆ రోజున నా లాంటి వాడివల్ల నువ్వే బాధపడతావు. నీ ప్రేమ కోసం నా వారి ప్రేమను త్యజించగలిగే త్యాగశీలిని కాదు నేను. నాతో పాటు నా కుటుంబాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించగలిగితేనే నాకు నీతో పెళ్ళికి అంగీకారం !! ".

కాల్ ముగిసింది... అత్తాకోడళ్ళ కళ్ళల్లో ఆనందబాష్పాలు !!!

"మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించండమ్మా " అంటూ వారి పాదాలపై పడ్డాడు శశి.

బంధాలను కలుపుకుంటూ వెళ్ళాలి గానీ బదిలీ చేసుకుంటూ కాదు.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

ఎవరు గొప్ప

💧ఎవరు గొప్ప💦


బిడ్డలని నవమాసాలు కడుపులో పెట్టుకుని మోస్తుంది అమ్మ..
ఆ బిడ్డలని నూరేళ్లు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాడు నాన్న..
ఇరువురిలో ఎవరు గొప్ప..

గోరుముద్దలు తినిపించి ఆకలి తీర్చేది అమ్మ...
చేయి పట్టి నడక నేర్పేది నాన్న..
ఇరువురిలో ఎవరు గొప్ప...

జన్మనిచ్చినదొకరు.. జన్మప్రదాతలు ఇంకొకరు ఇరువురిలో ఎవరు గొప్ప...

అమ్మ ప్రేమ మాటల్లో కనపడుతుంది...
నాన్న ప్రేమ బాధ్యతలో కనిపిస్తుంది....
ఇరువురిలో ఎవరు గొప్ప...

అమ్మ గుండె అయితే ఆ గుండె నిరంతరం సాఫీగా పనిచేయడానికి రక్తాన్ని అందించే నరాలే నాన్న.....
ఇరువురిలో ఎవరు గొప్ప...

ఆకాశంలాంటి మన జీవితానికి సూర్యచంద్రులే అమ్మానాన్నలు వారిలేకపోతే మనజీవితాలు శూన్యం.. నిత్య అంధకారమే..
వారిలో ఎవరు గొప్ప అని కాక వారిని మనమెంత గొప్పగా చూసుకున్నామనేదే ముఖ్యం...

తల్లితండ్రులని ప్రేమించలేని వాడు ఏ దేవుడిని పూజించలేడని గుర్తించండి..
సకల పుణ్యక్షేత్రాలు, ముక్కోటి పుణ్యతీర్ధాలు తల్లితండ్రుల పాదాలలోనే ఉంటాయని తెలుసుకోండి...
వారిని పూజించకున్నా పర్లేదు వృద్ధాప్యంలో వారికి పట్టెడన్నం పెట్టండి.. వారిని మనుషులుగా గుర్తించండి.. సముచిత గౌరవమివ్వండి..🙏

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Sunday, August 1, 2021

వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా

వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా🌹🕉

"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః " అంటే అర్ధం తెలుసా

SUN'DAY

MO(O)N'DAY

TUESDAY

WEDNESDAY

THURSDAY

FRIDAY

SATUR(N)DAY

అంటే ఏమిటో తెలుసా....? అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా? వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?

సూర్యహోర

చంద్రహోర

కుజహోర

బుధహోర

గురుహోర

శుక్రహోర

శనిహోర - అంటే

ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగము, ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టే, బ్రిటిష్ వాళ్లు వీటిని తమ క్యాలెండర్ లో పేర్లు మార్చి, వాటిని వారి విజ్ఞానంగానే ప్రపంచాన్ని నమ్మిస్తున్నారు,

సరే... ఇప్పుడైనా నిజమేమిటో తెలుసుకుందాం!

ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి! వారము - అంటే 'సారి' అని అర్ధము.

1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!

కాస్త విపులంగా....

భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే.ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.

మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః

అనగా...

పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి.

ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి?

ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా?

ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.

భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది.

ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.

ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి.

ఆ భాగాలను వారు "హోర" అన్నారు.

"అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది.

దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు.

ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.

హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.

ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది.

ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది.

కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.

మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు - మంగళవారం,

ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.

ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.

అయితే... ఈ విధానం వినడం కొత్త అయిన హేతువాద, నాస్తిక, పచ్చ బాబులకు... మొదటి రోజు సూర్యోదయ సమయానికి సూర్యహోర అవుతుందనుకుంటే కదా ఈ లెక్కలన్నీ...ఇలా వచ్చేది!

అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం.

వస్తున్నా... అక్కడికే వస్తున్నా...

ఎందుకనుకోవాలంటే - సూర్యుడి(ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి.

దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆగ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు.

అదే మొదటిరోజు.

అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.

ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే.

అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది.

అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.

ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది. ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా " ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?" అనే విషయం తెలియదు.

అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం!

కాబట్టి హేతువాదులని చెప్పుకునే కుహనా మేధావులారా! అన్యమత సంస్కృతులను మూఢాచారాలని నమ్మే కమ్మే వారాల పేర్లు ఇతరమత గ్రంథాల్లో ఇమడవు కదా!

మరి ఆ మాక్స్ ముల్లరూ, విలియం జోన్సూ, రిస్లే బాస్టెడూ ఎందుకు వీటిని తీసెయ్యలేకపోయారూ?

పేర్లు మార్చి, కాపీ కొట్టి ఇవి మావేనని ఎందుకు జబ్బలు చరుచుకుంటున్నారు??? ఎందుకంటే ఇవి బైబిల్ చట్రంలో ఇమడలేదు, తీసెయ్యడానికి కుదరలేద!

అదీ...భారతీయ ఋషుల గొప్పదనం!

నేటికైనా తెలుసుకోండి.. తెలియకపోయినా పాటించండి! సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతీదీ మనిషికి పనికొచ్చే సైన్సే తప్ప వేరే కాదు.!!

సేకరణ :
సనాతన భక్తి మార్గం టెలిగ్రామ్ /వాట్సాప్ గ్రూప్స్ 9666914117

Source - Whatsapp Message

కర్మఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు

కర్మ ఫలం తప్పదు

🙏అందర్నీ హెచ్చరించే మంచి వ్యాసం. అందరూ చదవాలని మనవి 🙏

కర్మఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు.
మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది. ఎందుకంటే? కర్మ బలీయమైనది.

పరీక్షిత్తు మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు.
కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు గొప్ప మంత్రవేత్త. రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు. దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.

తక్షకుడు కూడా బ్రహ్మణ వేషధారియై, కశ్యపుని చూసి మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం? అని అడిగాడు.
ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.

అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటూవేయబోయేది ఏదో నీటిపామో, బురద పామో అనుకుంటున్నావా? సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు తక్షకుడే స్వయంగా అయితేనో? అన్నాడు.

తక్షకుడైనా కానిమ్ము! అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! నా దగ్గర ఉన్నది గారడీవాడి పాముమంత్రమో, విషకీటక మంత్రమో అనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు కశ్యపుడు.

అంత గొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని అని నిజరూపం చూపించాడు తక్షకుడు.

అంతటా కశ్యపుడు, సర్పరాజా! నీకిదే నా ప్రణతి! దీనితోపాటే నా వినతి కూడా విను! మంత్రాధిష్ఠాన దైవానుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను! తక్షణం విషహరమంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను. ఇది నా దృఢవిశ్వాసం అని అన్నాడా కశ్యపుడు.

అపుడా తక్షకుడు, తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టునుచూడు! దీని ఊడలు ఏవో, మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా! లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విషశక్తి చూడు! అని ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు.

కశ్యపుడు అదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు. తక్షకుడు చెప్పినదాంట్లో ఆవగింజంతయినా అబద్ధంలేదు. ఆ మహా విషకీలలకు, చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి, అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు! అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశి నుంచి తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్రజపం చేసి అభిమంత్రించి
ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచినాడు.

చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహావృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది.

వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని మహామంత్రద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసినాను, నా అజ్ఞానాన్ని మన్నించండి! తమకు తెలుసో... లేదో, నిజానికి పరీక్షిత్తు శాపరూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే, అంతటి ధర్మమూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. త్వరలో కలిప్రవేశం జరగబోతోంది. అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం పరీక్షీతుని అంకం పరిసమాప్తం కావాలి! ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు.

ఇంతకూ తమకు కావలసింది.... అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా ధనమయ్యా! ధనం! అన్నాడు. అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపివేసినాడు.

ఇంతవరకూ కథ బాగుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది చాలా వున్నది.

మన తలరాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు.
ఓక వేళ కశ్యపుడు లాంటివాడు బయలుదేరినా వారిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం.
అదే మనం చేసుకొన్న పాపం,కర్మఫలం.
పాపకర్మ బలీయంగా వుంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, ఆఖరికి భగవంతుడు కూడా.

ఎందుకంటే వాడి కర్మ కలిసిరావాలి.
కౌశికుడు రాజును రక్షించుదామని బయలుదేరినా, పరీక్షిన్మహారాజు యొక్క పాపకర్మ అడ్డు పడినది.
ఏమిటి ఆ పాప కర్మ?
ఓక ముని మీద చచ్చిన పామును వేయడం.
మంచివారితో మహాత్ములతో చెలగాడటం.
కోరి కోరి తన మృత్యువును అహంకారంతో కొని తెచ్చుకొన్నాడు.

రాజు, మునిశాపం వలనో, తక్షకుడి కాటు వలనో చనిపోలేదు, కేవలం తన కర్మ చేతనే చనిపోయినాడు.

పరీక్షిత్తు మహారాజుకు, గ్రహముల వలన కీడు జరగలేదు. ఇక్కడ తక్షకుడు ఎంత నిమిత్తమాత్రుడో, అదే విధముగా గ్రహములు కూడా! మానవునికి, కర్మ ఫలము నొసగడంలో గ్రహముల యొక్క ప్రమేయం వుంటుంది.

మన పాపములు గ్రహముల రూపములో మనల్ని కర్మఫలం అనుభవింప జేస్తాయి.
నిజానికి ఏ గ్రహమూ మనల్ని ఏమీ చేయదు.
మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది.
కర్మ బలీయమైనది.

గోవిందా, నారాయణా, రామా,శివా!కాపాడు!కాపాడు!అని ప్రార్ధిస్తూ ఉంటాం. ప్రాణాపాయంలో వున్నవాడి జాతకం చూసి భగవంతుడు ఇలా అంటాడు. ఓయి, నీవు ఎప్పుడన్నా పుణ్యం చేశావా? నీ భార్య చేసిందా? నీ బిడ్డలు చేసినారా? నీ మిత్రులు నీకు పుణ్యం ధారపోసినారా? నీకు గురువుల అనుగ్రహం వున్నదా? నీవు చేసిన పుణ్యం లేదు, ఇతరులు నీకు ధారపోసిన పుణ్యం లేదు. మరి నేను ఎక్కడి నుంచి తెచ్చేది? అనుభవించు! నీ కర్మ అని అంటాడు.

మన పుణ్యపలం మన జాతకంలో గురురూపంలో కనిపిస్తుంది.
గురు అనుగ్రహం వున్నదా?
గురు దృష్టి వున్నదా?
శుభగ్రహ దృష్టి వున్నదా?
వుంటే బ్రతికిపోతాము. లేదా బాధ పడాలి, తప్పదు.
పాపం అంటే శరీరాన్ని తద్వారా మనసును బాధ పెట్టడమే.

"మనసు బాధ పడితేనే పాపకర్మ క్షయం అవుతుంది."
"మనసు సుఖ పడితే పుణ్యకర్మ క్షయం అవుతుంది" .

పాపానికి, పుణ్యానికీ కారణం మనస్సే. ఆ మనసు చలించకుండా వుంటే పుణ్యమూ లేదు,పాపమూ లేదు. అదే అకర్మ,వికర్మ,సుకర్మ.
కోరిక లేకుండా చేస్తే కర్మ మనసును పట్టుకోదు.

తాతముత్తాతలు చేసిన పుణ్యఫలం, పాపఫలం తప్పక పిల్లలకు వస్తుంది, వచ్చి తీరుతుంది.
ఆ పుణ్యమే మన సంతానాన్ని, మనుమలన్ని కాపాడుతుంది. మన వంశాన్ని కూడా కాపాడుతుంది.
ఇదే మన జాతకంలో రెండవ స్తానం, తొమ్మిదవ స్తానం స్పష్టంగా చెబుతుంది.

మనం చేసిన పాపాలు, ప్రారబ్ధం మన పితృదేవతలు చేసిన పుణ్యఫలితం వలన బ్రతికి బయట పడతాము.
వారి పుణ్యఫలం మనల్ని కాపాడుతుంది.
మనం చేసిన పుణ్యఫలం మన బిడ్డలను కాపాడుతుంది.

సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్షములు వున్న పరీక్షిత్తు అంతటి వాడు కూడా మాయలో పడ్డాడు గదా!
కలిపురుషున్ని నిలదీసిన వాడు కూడా అహంకారానికి లోనైనాడు. శ్రీకృష్ణ పరమాత్మ
చేత రక్షింపబడి, గర్భం నుండి బయటపడిన వాడు నేడు మృత్యువు నుండి ఎందుకు బయట పడలేదు.
అదే కర్మఫలం, కాల మహిమ.

కాలానికి, మాయకు ఎవ్వరూ అతీతులు కారు. దీనిలో మనం మరోకటి కూడా గమనించాలి.
తక్షకుడు విషనాగు అంటే ప్రారబ్దకర్మ. దానిని కూడా జయించింది మంత్రశాస్త్రం.
కాటు చేత పుష్పించిన మహావృక్షం కాలి బూడిద అయితే, మంత్రం మరలా దానిని చిగురింప జేసినది.
అంటే మంత్రం చేత ప్రారబ్దకర్మ తొలగబడుతుంది అని మనం తెలుసుకోవాలి.
మంత్రం ప్రాణం పోస్తుంది.
కానీ ఆ మంత్రం పనిచేయాలంటే ప్రారబ్ధకర్మ బాగుండాలి! అంటే మనం సత్కర్మలు మాత్రమే ఆచరించాలి!🙏అందర్నీ హెచ్చరించే మంచి వ్యాసం. అందరూ చదవాలని మనవి 🙏

Source - Whatsapp Message