Saturday, June 27, 2020

దేహం ఒక రథం, ఆత్మ రథ సారథి

ఒక కారు ఉంది, ఇంజను కండిషన్‌లో ఉంది. వీల్స్‌, స్టీరింగ్‌, బ్రేకు, గేర్స్‌ అన్నీ బాగున్నాయి. కొంత దూరం ఆ కారు నడిపి డ్రైవర్‌ దిగి వెళ్లిపోయాడనుకుందాం. కారును అతను ఎక్కడ వదలి వెళ్లాడో అక్కడే ఉంటుంది. అంగుళం కూడా అటూఇటూ కదలదు. ఎందువల్ల? దానిని నడిపే డ్రైవరు దిగిపోయినందువల్ల. అట్లే మానవదేహం కూడా. ఈదేహం ఆ కారువంటిదైతే, దీనిని కదిలించే చైతన్యం డ్రైవరు వంటివాడు. చైతన్యం శరీరం నుంచి వెడలిపోతే డ్రైవరు కారు దిగిపోయినట్లే. అయితే ప్రాకృతికంగా కారులో మరో డ్రైవరు ఎక్కి నడిపించవచ్చు. కాని భగవంతుడిచ్చిన ఈ దేహంలో మరో డ్రైవరు ఆ స్థానాన్ని ఆక్రమించ వీలులేదు. ఆత్మ, దైవశక్తి లేక చైతన్యము ఉన్నంత వరకే మనదేహానికి విలువ. ఆ తదుపరి అంతకన్న పనికిరాని వస్తువు మరొకటిలేదు.

మన కళ్లు చూస్తున్నాయి, నోరు మాట్లాడుతున్నది, కాళ్లూచేతులు చలనాత్మకంగా ఉన్నాయి. చెవులు వింటున్నాయి, మనస్సు ఆలోచనలను రేకెత్తిస్తున్నది. ఈ పనులన్నింటినీ మన దేహమే చేస్తున్నదనుకుంటాం. కానీ, కాదు దేహంలో గల చైతన్య శక్తి శరీరావయవాలచే, అంగాలచే, ఇంద్రియాలచే ఆ విధంగా పని చేయిస్తున్నది. దేహం నుండి ఆ చైతన్యం వెళ్లిపోయిన మరుక్షణం చలనశీలమైన దేహం నేలకూలుతుంది. చలనరహితమవుతుంది. దేహంలోని ఏ అవయవమూ పనిచేయదు. అప్పటి వరకు ‘ఫలానా’ వారు అని పిలువబడిన, గౌరవింపబడిన దేహం ‘ఫలానా’ వారి పార్థివ దేహమవుతుంది. శవంగా మారుతుంది. అంత్యక్రియలకు సిద్దం అవుతుంది. శాశ్వతంగా ఈ లోకంనుండి కనుమరుగవుతుంది. ఆ క్షణం వరకు శరీరాన్ని లోనుండి పనిచేయించిన చైతన్యమే భగవంతుడు.

దేహం ఒక రథం
ఆత్మ రథ సారథి

ఆ చైతన్యాన్నే ‘ఆత్మ’ అని కూడా అంటాం.

‘ఆత్మానాం రథినం విద్ధి, శరీరం రథమేవ తు’ అంటుంది కఠోపనిషత్‌.

ఈ ధర్మసూక్ష్మాన్ని అవగాహన చేసుకొని గాఢంగా విశ్వసించగల్గితే దేవుని దర్శనార్థం అక్కడకు ఇక్కడకు పోనవసరం లేదు. గుళ్లు గోపురాలకు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం అంతగా ఉండదు. ఈ భావన స్థిరపడినపుడు ఎవరూ మనకు పరాయి వారు కాదు. అందరూ దైవస్వరూపులే. మానవదేహం కదలాడే దేవాలయం వంటిది. ప్రతి దేవాలయంలో దైవ ప్రతిమ ప్రతిష్ఠింపబడి ఉన్నట్లుగా, ప్రతీ దేహంలో చైతన్య స్వరూపంగా ఆత్మతత్వం వ్యాపించియుంటుంది. అందుకే ఎవరిని గౌరవించినా, ఆదరించినా భగవంతుని గౌరవించినట్లే. ఎవరిని కించపరచినా, కష్టపెట్టినా, నష్టపెట్టినా భగవంతునికి అపరాధం గావించినట్లే. ఒక్క మానవ దేహంలో మాత్రమేగాదు... ఈ భూమిపై ఉన్న 84లక్షల జీవరాశుల్లోను భగవత్‌ చైతన్యం తొణికిసలాడుతూ ఉంటుంది. ఒక చిన్న చీమను పరిశీలించండి. ఏదో పెద్దపని ఉన్నట్లు అటూ ఇటూ హడావుడిగా తిరుగుతుంటుంది. ఆ చిన్న చీమలోనున్న ఆ కదలాడే శక్తి ఆత్మతత్వమే.

దేవుడెక్కడనుచు దేవులాడగనేల
దేవుడుండు తనదు దేహమందె, దేవుడే తానయ్యు
దేవుని వెదకుట, తన్నుతా వెదకునట్లుగాదె!

అని భగవాన్‌ సత్యసాయిబాబా వారు చెప్పేవారు.

కాబట్టి మనలో ఉన్న ఆత్మ అనే దేవుడిని తెలుసుకోవడానికి ధ్యాన సాధన చేయాలి.
నేను ఎవ్వరు? అని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని రమణ మహర్షి చెప్పేవారు.
నిన్ను నీవు తెలుసుకున్నపుడు అంతా నీకు అర్థం అవుతుంది అని రమణ మహర్షి భోధించేవారు.

అహం బ్రహ్మాస్మి అంటే నేను దేవుడిని.
తత్వమసి అంటే నువ్వు కూడా దేవుడివే.
సర్వం ఖల్విదం బ్రహ్మ. అంటే మన అందరిలోనూ, అన్ని జీవుల్లోనూ దేవుడు ఉన్నాడు.
ఇదే వేదాలు మరియు ఉపనిషత్తులు సారాంశం.
యోగులు యోగ ద్రుష్టి తో చెప్పినవి కూడా ఇదే.

Source - whatsapp sandesam

తిలక ధారణ

శ్రీనివాస సిద్ధాంతి.9494550355.

తిలక ధారణ

కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్త్భుం' అనే శ్లోకం వినని వాళ్లుండరు. సంస్కృతంలో ' తిలకమ్ ' అని, తెలుగులో ' బొట్టు ' అని అర్థం. మన నుదుటిలో జ్ఞాన నేత్రం ఉండేచోటు అంటే రెండు కనుబొమల మధ్య ఆజ్ఞాచక్రానికి తగులుతూ ఎఱ్ఱని కుంకుమ బొట్టు ప్రతినిత్యం పెట్టుకోవాలని యోగశాస్త్రం చెబుతోంది. మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులున్నాయి. ఇవి ప్రాణశక్తిని ప్రవహింపజేసే అదృశ్య నాళికలు. వీటన్నింటికీ కేంద్ర స్థానం లలాట భ్రూమధ్యభాగం, అంటే కనుబొమల మధ్య స్థానం. ఈ స్థానంలోంచి ప్రాణశక్తి కిరణాలు ప్రసారవౌతాయి.

ఈ ప్రాణశక్తి కిరణాలు వ్యర్థం కాకుండా ఆపగల మహత్తరమైన శక్తి, కుంకుమ, విభూతి, గంధం, కస్తూరి, చందనం వంటి పదార్థాలకు ఉంది

ఇవి దృష్టి దోషాలను కూడా నివారిస్తాయి. అందుకే మహర్షుల బోధనల వలన నుదుటిపై బొట్టు ధరించడం మనకు సంప్రదాయంగా మారింది. కంకుమలో పసుపు ఉంటుంది. రెండు గుణాలు కలిగిన ఈ కుంకుమను నుదుట గంధం ధరించి దానిపై కుంకుమ ధరిస్తే మంచి ఫలితాలుంటాయి. గంధం జ్ఞానానికి సంకేతం.యోగశాస్త్రం ప్రకారం ఈ రెండు కనుబొమల మధ్యన ఆజ్ఞాచక్రం ఉండే చోట మనం పెట్టుకునే కుంకుమ వేలి ఒత్తిడివలన ఒకరకమైన ఉత్తేజం ఏర్పడుతుంది.

నొసటిమీద ఎర్రని కుంకుమ బొట్టు ముతైదువతనాన్ని సూచిస్తుంది. మనస్తత్వ శాస్తర్రీత్యా ఎర్రని కుంకుమ ఒక ప్రత్యేకమైన వర్గ ఫలం కలిగి ఉంది. నొసటిమీద కుంకుమ పెట్టుకోవడం మన భారతీయుల ప్రాచీన సంప్రదాయం. బొట్టు ధరించడం మగవారికీ అవసరమే.భగవంతుడు సంచరించే షుఘుమ్ననాడి ఎక్కడ రెండు కనుబొమల మధ్య వుంటుందో అక్కడ ఆజ్ఞాచక్రస్థానంలో కుంకుమ ధరించడం వలన భగవంతుని స్మరించిన వారవౌతాము. ముఖానికి ఆభరణం తిలకం.

పద్మపురాణంలో, ఆగ్నేయపురాణంలో పరమేశ్వర సంహితలో స్ర్తిలు, పురుషులు అనే భేదం లేకుండా నొసటిమీద కుంకుమ ధరించడం వలన భర్త ఆయుష్షు పెరుగుతుందని, లక్ష్మీనివాసమైన నుదుటిపై బొట్టు ధరించే వేళ ' ఊర్థ్వపుండ్రం లలాటేతు భర్తురాయుష్యవర్థకమ్ లలాటే కుంకుమం చైవ సదా లక్ష్మీ నివాసకమ్ ' అనే మంత్రం చెప్పుకుంటూ బొట్టుపెట్టుకోవాలని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే అంత్యప్రాసల కవి ఆరుద్ర 'నూరేళ్ళ పెట్టు నొసటి బొట్టు అది నోచే నోముల కలిమి పెట్టు'' అన్నాడు. జ్ఞానదాతయైన శ్రీకృష్ణుడు కస్తూరి తిలకంతోనే శోభించాడు. అలాంటి జ్ఞానాన్ని పొందడానికి పురుషులు సైతం బొట్టు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

బొట్టు శుభానికి సంకేతం. శుభకార్యాలను ఆహ్వానించడానికి మహిళలకు బొట్టు ఇవ్వడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీ. బొట్టును జగన్మాత సౌందర్య చిహ్నంగా భావిస్తారు. నాగరికత ముసుగులో ఈనాడు యువత కుంకుమ బొట్టుకు దూరవమవుతూ ప్లాస్టిక్ స్టిక్కర్లకు దగ్గరౌతోంది. ఈ ప్లాస్టిక్ స్టిక్కర్ల వలన రకరకాల చర్మవ్యాధులకు గురి అవుతున్నారు. హిందూ ధర్మశాస్త్రాల్లో ఉన్న కొన్ని ఆచారాలను, వాటి వెనుక ఉండే వైజ్ఞానిక విషయాలను నేటి యువతులు తెలుసుకోవలసిన అవసరం ఎంతగానో వుంది.కుంకుమబొట్టు మేధస్సును పెంచి వృద్ధిపరచే సాధనంగా మన పూర్వీకులు భావించారు. ఈ కుంకుమ బొట్టు స్ర్తిల ముఖారవింద ఆకర్షణతోపాటు ఆరోగ్యసూత్రాలు దాగి ఉన్నట్లు, హిందూ స్ర్తి నుదుటి బొట్టు లేకపోవడం ముఖం కళావిహీనంగా అగుపిస్తుంటుంది. ప్రాచీన కాలంనుండి ఆచారంగా వస్తోన్నది.

పూజాదికాలలో, వివాహ శుభకార్యాలలో ఏ శుభకార్యాలలోనైనా కుంకుమ ధరించడం సంప్రదాయంగా వస్తోంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతలు, శుభాలు కలిగిస్తుంది. నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాల, తపస్సుకాని నిష్ఫలవౌతాయని, మహర్షులు, సాధువులు, దేవతా ఉపాసకులు నుదుట తిలకం ధరించేవారు. నిత్య నైమిత్తిక కామ్యకర్మలు, శ్రాద్ధకర్మలు నుదుటిన బొట్టులేకుండా చేయడం వలన నిష్ఫలమవుతాయని మన ధర్మశాస్త్రాల్లో కూడా పేర్కొనబడింది.

ఫోను ద్వారా కూడా జాతకములు తెలియజేయబడును

లక్ష్మీ లలిత వాస్తుజ్యోతిష నిలయం.
ద్వి స్వర్ణ కంకణ సన్మానిత.
జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి
9494550355

Source - whatsapp sandesam

Friday, June 26, 2020

పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...🚶🏿‍♀
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది📚

కానీ ఎందుచేతో ఈ పద్యం జన
బాహుళ్యం లో లేదు

కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,
సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు
ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)📚⚖

1.కార్యేషు యోగీ 💰:
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి🏹

2. కరణేషు దక్షః 🤺:-
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.🏌🏾

3. రూపేచ కృష్ణః🙏:-
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.👌

4. క్షమయా తు రామః🏹:-
ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరి
పాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి

5. భోజ్యేషు తృప్తః🍲🥘🍛
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.

6. సుఖ దుఃఖ మిత్రం🤼‍♂:-
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.⛹🏼🎻

ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు 🏇🏼ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు. 🙏

Source - whatsapp sandesam

శకుని మాయా పాచికల కథాకమామిషు

🎭శకుని మాయా పాచికల కథాకమామిషు 🎭

🎲 మనలో చాలా మందికి తెలుసు శకుని ఎవరో..! దుర్యోధనుని దురాలోచనలకు ఇతడు సహాయం చేస్తుండేవాడు. కురుక్షేత్ర యుద్ధానికి పరోక్షంగా కారకుడయ్యాడు.
అయితే, ఇదంతా చేయడానికి అతని అసలు వ్యూహం వేరే ఉంది. అసలు అతను ఎప్పుడూ కౌరవుల మేలు కోరుకోలేదు. కౌరవుల మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. అందుకే కురు వంశానికి చెందిన పాండవులు, కౌరవుల మధ్య యుద్ధాన్ని కోరుకున్నాడు...అసలు శకుని కురువంశం యొక్క నాశానాన్ని ఎందుకు కోరుకున్నాడు..? ఆ కథేంటో చూద్దాం..

శకుని చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన ఇలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకునేలా చేసింది.
శకుని అసలు పేరు “సుబలోత్తముడు" అంటే రాజు సుబలుడుకు చెందిన కొడుకులలో ఉత్తముడని అర్ధం. శకుని చిన్నప్పటినుండే చాలా తెలివిగల వాడు. వాస్తవానికి అతనికి అంగ వైకల్యం లేదు. చిన్నప్పుడు అతని తండ్రే అతడి తొడ ఎముక విరిచేశాడు.
శకుని గాంధారికి తమ్ముడు. గాంధారి జ్యోతిష్యం ప్రకారం ఆమెని ఎవరైతే మొదట వివాహం చేసుకుంటారో అతను వెంటనే మరణిస్తాడు. దీన్ని నివారించేందుకు గాంధారిని మేకపోతుకిచ్చి పెళ్లి చేసారు. తరువాత ఆ మేక పోతుని చంపేశారు. ఈ రహస్యం గాంధారి కుటుంబానికి మాత్రమే తెలుసు. గాంధారి తండ్రయిన సుబలుడు గాంధార రాజ్యానికి రాజు. అతనికి వంద మంది కొడుకులుండేవారు. గాంధారి ఒక్కటే కూతురు. అతను గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశాడు. ధృతరాష్ట్రుడికి చిన్నప్పటి నుంచే చూపు లేదు. తన భర్త చూడలేని ప్రపంచాన్ని తనూ చూడకూడదని గాంధారి నిర్ణయించుకుంది.
చివరకు ఒకరోజు గాంధారి మొదట వివాహ రహస్యం గురించి ధృతరాష్ట్రుడికి తెలిసింది. దీంతో చాలా ఆగ్రహానికి గురయిన ద్రితరాష్ట్రుడు మొత్తం సుబలుడి కుటుంబాన్ని చెరసాలలో బంధిస్తాడు. వాళ్లకి రోజూ గుప్పెడు అన్నం మాత్రమే పెట్టేవాడు. ఇదంతా తన కుటుంబాన్ని పస్తులుంచి చంపే ప్రణాళిక అని తెలుసుకున్న సుబలుడు, ఆ గుప్పెడు అన్నం అందరిలో చిన్న కొడుకైన శకునికి పెట్టేవాడు. అలా చేస్తే కనీసం అతనన్నా తన కుటుంబం యొక్క ప్రతీకారం తీర్చుకుంటాడని తన చిన్న కొడుకుకే అన్నం పెట్టేవాడు.
తన వంశం కొనసాగడానికి తన చిన్న కొడుకైన శకునిని విడిచిపెట్టాల్సిందిగా సుబలుడు ధృతరాష్ట్రుడిని వేడుకున్నాడు. గాంధారి కూడా తన తమ్ముడ్ని విడ్చిపెట్టాల్సిందిగా తన భర్తని వేడుకుంది. ధృతరాష్ట్రుడు వారిద్దరి విన్నపాన్ని అంగీకరించాడు. చివరికి శకునిని చెరసాల నుండి విదిచిపెట్టాడు. అయితే అతను విడుదలయ్యే సమయానికి తన తోబుట్టువులందరూ చనిపోయారు. తన తండ్రి సుబలుడు కొన ఊపిరితో ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గమైన చర్యకు పూనుకున్న ధృతరాష్ట్రుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని, అతని వంశాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలని తన చిన్న కొడుకు చేత ప్రమాణం చేయించుకున్నాడు. అలాగే తన శరీరంలోని ఏదైనా ఎముకను తీసుకుని పాచికలు తయారు చెయ్యాలని సూచించాడు. ఆ పాచికలు తను ఎలా కోరుకుంటే అలానే చూపిస్తాయాని శకునితో సబలుడు చెప్తాడు. తండ్రి తనకు చెప్పిన మాటలే శకుని తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. చివరికి అతని తండ్రికిచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. తన పాచికల మహిమతో పాండవులు కౌరవుల మధ్య గొడవలకు కారణమయ్యాడు. కురుక్షేత్ర యుద్ధానికి పరోక్ష కారకుడయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత అతను కోరుకున్న విధంగానే కురు వంశం దాదాపుగా నాశనం అయిపొయింది. శ్రీకృష్ణుడు,పాండవులతో కలిపి మొత్తం 12 మంది మాత్రమే బ్రతికారు. 😌

source - whatsapp sandesam

పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?

🍂 పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?


🤔 ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదాని శాస్త్రం చెప్తుంది.
కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితి లో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత ఔదార్యానికి తలవంచాలిగా?
కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి, కన్యాదాత మీద పడి అరవాడనికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది?దానం ఇస్తున్నవాడిని ఇంకా ఇంకా కట్నాలు, కానుకలు, లాంచనాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెఫ్ఫారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి?
"సీతారాములలా ఉండండి!" అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామకళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు, దశరథ మహారాజుని అడుగుతారు "మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా?" అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా? "అయ్యా! ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది" అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్ర ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు.
అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు!
అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది.
తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? "పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!" అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు.
కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్ళి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు - ఇలాంటివి మన ధర్మానికి తెలియదు.

Source - whatsapp sandesam

గర్భములో శిశువు పిండ రూపంలో భగవంతుని ప్రార్థిస్తాడా? ఎలా?

గర్భములో శిశువు పిండ రూపంలో భగవంతుని ప్రార్థిస్తాడా? ఎలా?

🌹 స్త్రీ గర్భములోనే శేషన దు:ఖముతో జీవుడు ప్రవేశిస్తాడు. ఫలదీకరణము జరిగిన తరువాత శిశువు పరిణామక్రమము.
ఒక రోజుకు ఖలిలమౌతాడు.
ఐదు రోజులకు బుద్భుదాకారము పొందుతుంది.
పది రోజులకు బదరీఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు.

ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది.
రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడుతాయి.
మూడు నెలలకు గోళ్లు, రోమాలు, చర్మము, లింగము, నవరంధ్రములు ఏర్పడుతాయి.
నాలుగు నెలలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి.
ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడుతాయి.
ఆరు నెలలకు జరాయువు, మావిచేకప్పబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు.

మాతృ భుక్తాన్న పానీయాలచే క్రమక్రమంగా వృద్ది చెందుతూ దుర్గంధ భూయిష్టమైన మల మూత్రాల గుంటలో ఉన్న పురుగులు, సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా, ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్చబోతాడు. నరకయాతన, నరకాను భవము జీవుడు మాతృ గర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది.

తల్లి తీసుకునే ఆహారములోని, దుస్సాహాలైన కట్వాములు (ఉప్పు) లవణాది పదార్థముల వలన సర్వాంగాల యందు వేదన కలుగుతూ ఉంటుంది. మావి చేత ప్రేవుల చేత చుట్టబడి వక్రీభూతమై పృష్ఠశిరోధరుడై, అధశిరస్కుడై తల్ల కిందులుగా ఉంటాడు. పంజరంలో పక్షి లాగా జీవుడు గర్భంలో బంధింప బడి ఉంటాడు.

అప్పుడు భగవంతుని దయ వలన, పూర్వ జన్మలలో చేసిన పాపములు గుర్తొస్తాయి. అపుడు గత జన్మలో చేసిన పాప పుణ్యముల కారణంగానే కదా ఈ జన్మమునకు వచ్చింది, అని బాధ పడుచూ ఉంటాడు. కర్మ ఫలితం అనుభవించడానికే కదా మరలా ఈ జన్మ అని గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు.

అలా పరితపిస్తూ జీవుడు బంధభూతాలైన సప్తధాతువులు కలిగి, భగవంతుని మీద కృతజ్ఞతతో (మరలా మానవ జన్మ ఇచ్చినందుకు) గద్గద స్వరంతో భగవంతుని ప్రార్థించడం గర్భంలోనే ప్ర్రారంభిస్తాడు.

గత జన్మలలో చేసిన పాపపుణ్యముల సంఘాతమే కదా ఈ మానవజన్మ. అని తలంచుచూ భగవంతునికి మాతృ గర్భంలో ఉన్నప్పుడే మాట ఇస్తాడు. ప్రమాణం చేస్తాడు.
ఓ శ్రీహరీ నీ మాయచే మోహితుడు కావడం వలన బిడ్డలు, భార్య, అహంకారము, మమకారము, కామము వీటియందు పడి, సంసార నిమగ్నుడనై, సంసారమే బ్రతుకని మంచి, చెడులను విడచి ధర్మము, అధర్మము అని చూడకుండా, ధన సంపాదనే ధ్యేయంగా, చేయకూడని, చెప్పుకోలేని పాపములు జరగడానికి కారకుడయ్యాను.

అలా సంపాదించిన ధనము, భాగ్యములను నా భార్యాబిడ్డలు అనుభవించుచున్నారే కానీ నన్ను గురించి పట్టించుకోవడం లేదు. నేను సంపాదించిన ఆస్తిపాస్తులు బిడ్డల పాలు పాపములు మాత్రం నా పాలు అయినది.

ఓ భగవంతుడా ఈ దుర్గంధముతో ఈ గర్భములో ఇక ఉండలేను. దయచేసి నన్ను బయటపడవేయుము. నేను బయటపడితే ఈ సారి పాపకృత్యముల జోలికిపోను. నన్ను నమ్ముము. మీ చరణారవిందములను విడువను. ఎల్లప్పుడూ మీ చరణాలనే స్మరిస్తూ ఉంటాను. ఈ సారైనా ముక్తి పొందడానికి ప్రయత్నము చేస్తాను.

ఈ సారి నాకు సంసారబంధములను కట్టబెట్టవద్దు. పొరపాటున కూడా సంసారము జోలికి పోను. పరాత్పరా ఈ మల మూత్ర కూపములోని దుర్గంధమును భరిచలేక, మరియు జఠరాగ్ని రూపంలోని వేడి వలన మాడిపోవుచున్నాను. భరించలేకున్నాను. నన్ను బయట పడవేయుము. మిమ్ములను మరచిపోను అని ప్రార్థిస్తాడు జీవుడు.

మరి మాతృ గర్భంలో భగవంతునికి ఇచ్చిన మాటను మనము నిలబెట్టుకుంటున్నామా? ఆలోచించండి. మీరే తగు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మనము విజ్ఞులము.🤔

🕉️🌷🕉️🌷🕉️🌷🕉️🌷

Source - whatsapp sandesam

పుట్టలో పాలు పోస్తే పిల్లలు పుడతారు అనే దాని వెనక సైన్స్

అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు పుడతారు అనే దాని వెనక సైన్స్
అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు ఎలా కలుగుతారనే పెద్ద సంశయము.

🐍 పంచమి/నాగుల చవితి నాడు పుట్టలకు పూజ చేయించడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు.
పాము పుట్టలని పాములు ఎర్పరచవు, చెదలు ఏర్పరుస్తాయి.
వాటిలో ఈ పాములు చేరి వానాకాలములో పిల్లలను పెట్టి, వేరే చోటికి వెళ్తాయి.
చెదపురుగు పుట్ట పెట్టేటప్పుడు దాని నోటి నుంచి ఒక ద్రవము వస్తుంది.
ఆ ద్రవము మెత్తటి మట్టినందు కలిసి అది గట్టి పడుతుంది.
ఎంత గట్టి పడుతుంది అంటే వానలు వచ్చినా ఆ మట్టి కరుగదు.
ఈ మెత్తటి మట్టిలో రాయి రప్పలు ఉండవు. ఇదే దీని విశిష్టము.
వానాకాలములో ఈ పుట్టలందు సంచరించు పాముల నుండి విడుదల అగు రేతస్సు, రజస్సు ఈ మట్టిలో కలిసి ఉంటుంది.

పాము గుడ్లు పెట్టి అది పిల్లలను చేయదు.
ఎండ వేడికి అవి పిల్లలగును. ఇది ప్రకృతి నియమము.
ఈ మట్టిలో కలిసిన ఈ పదార్దములు మనము పోయు పాలు, తేనే, వివిధ రకాల ఫలములు కలిసి సువాసనల వెదజల్లును.
ఆ వాసనలు వలన మన శరీరమునందు తగు హార్మోనులు ఉత్పత్తి అయి పిల్లలు పుట్టుటకు దోహద పడుతుంది
ఆయుర్వేద శాస్త్రములో నాగు పాము కుబుసములో అరటిపండు కలిపి మందుగా వాడుట ఉంది.
ఇది ప్రయోగశాలలో పరిశీలించడం జరిగింది అదులో తెలిసిన విషయమే ఏమితంటే చర్మ రోగాలు నయము చేయుటలో ఈ మట్టి ఎంతో ఉపయోగ పడును.

ప్రత్యేకముగా నాగరు అనే చర్మ వ్యాధికి. ఇది ప్రకృతి సిద్ధమైన వైద్య.
రావి చెట్టుకింద ప్రతిష్ఠించబడిన నాగవిగ్రాహాలకి కూడా పూజచేస్తుంటారు.
ఆయుర్వేద శాస్త్రములో గర్భము నిలువకున్న ఈ చెట్టు వేరుతో తయారు చేసిన మందులు వాడుతారు.
అంతే కాక ఈ వృక్షము అరుణోదయ కాలములో దాని వేళ్ళ నుండి ఘనీభుతమైన అమ్ల జనకములు విడుదల చేస్తాయి.
దీనిని ఒజోన్స్ అంటారు. ఈ ఒజోన్స్ మనోహరమైన వాసనలు మానవుడి ఆరోగ్యం మరియు స్త్రీలమీద మంచి ప్రభావము చూపిస్తాయి.
అందువలన రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేయడం మొదలైన నియమాలు చేసారు.
40 రోజుల పాటు ఉదయమునే రావి చెట్టు ఆలింగనము, ప్రదక్షిణాలు చేసిన జననేంద్రియ దోషములు తొలగి, గర్భము ధరించుటకు సహాయకారిగా ఉంటుందని విశ్వసిస్తారు.
నాగుపాము మనిషి వెన్ను పాము ఆకారములో ఉంటుంది.
నాగ ప్రతిమను శాస్త్రోక్తముగా రావి చెట్టు మొదలులో ప్రతిష్ఠిస్తారు.

ప్రతిష్ఠించేసమయంలో పంచరత్నాలు, పంచాపల్లవములు, నవధాన్యములు, గో పంచాకాలతో ప్రతిష్ఠించుతారు.

నాగ ప్రతిమ చేసిన రాయి పురుష జాతిథి అయి ఉండాలి.
రత్నముల ద్వారా చెట్టునుండి విసర్జించబడిన ఒజోన్స్ శిలా ముఖంతరముగా మానవుని శరీరమీద ప్రభావము చూపుతుది.
అందువలన పంచమి/నాగుల చవితి నాడు నాగంద్రుని పూజించడం మన హిందు సంప్రదాయం.
వీనిని తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా మంచి ఫలితములు తప్పక పొందవచ్చును.

దేవాలయములో నాగా అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.
చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు, రాయి - రప్ప, చెట్టు -చేమ, వాగు-వరద, నీరు -నిప్పు, అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కుతి హిందువులది .
మానవ దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే.
వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానువు.
వాసుకి పమేస్వరుడి కంఠాభరణం.
వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు.
ఈ విధంగా బ్రాహ్మణులూ, ఋషులు, మునులు ... మానవజాతిని సన్మార్గములో పయనించేటట్లు చేసారు.🙏

Source - whatsapp sandesam

పంచకోశములు

పంచకోశములు

👌 ఈ స్థూల శరీరానికి 5 శుక్ష్మ కోశాలు ఉంటాయి. వాటిని పంచ కోశాలు అంటారు.
1 . అన్నమయ కోశం
2.ప్రాణమయ కోశం
3. మనోమయ కోశం.
4.విజ్ఞాన మయ కోశం
5. ఆనందమయ కోశం.

ముందుగా అన్నమయ కోసం గూర్చి తెలుసుకుందాము.
ఈ అన్నమయ కోశం భౌతిక ఆహారం మీద ఆధారపడి .ఆ ఆహారం యొక్క గుణము మీద శరీర ఆరోగ్యం అనేది ఆ ఆహార తత్వం మీద ఆధారపడి ఉంటుంది.ఆహారం మూడు గుణాలు కలిగి ఉంటుంది. సాత్విక ఆహారం, రజోగుణ ఆహారం, తమోగుణ ఆహారం.
సాత్విక ఆహారం తాజా కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు. వీటిని పచ్చిగా అన్నా తినవచ్చు, వండుకుని అన్నా తినవచ్చు. వండిన ఆహారం సుమారు రెండు గంటల లోపు భుజించిన దానిని సాత్విక ఆహారం. అందురు.
రజోగుణ ఆహారం. మసాలా దినుసులు కలిగిన ,మరియు కారం కలిగిన ,మాంసాహారం రజో గుణం కలిగిన ఆహారం.
తమోగుణ ఆహారం మాంసాహారం, నిల్వ ఉన్న ఆహారం తమోగుణ ఆహారం .

ఏవిధమైన ఆహారం తీసుకుంటే దానికి సంబంధించిన గుణాలు ఈ శరీరానికి వస్తుంది. దీని నుండి మనస్సు ప్రభావితం అవుతుంది.
సాత్వికాహారం తీసుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
రజోగుణ ఆహారం తీసుకుంటే మనస్సు అలజడిగా ఉంటుంది.
తమోగుణ ఆహారము తీసుకుంటే మనస్సు, శరీరము కూడా అనారోగ్య స్థితికి చేరుకుంటుంది.

2. ప్రాణమయ కోశం.
ఇది ఆక్సిజన్ మీద ఆధారపడి ఉంటుంది. పీల్చుకునే గాలి శుభ్రంగా ఉంటే శరీరము ఆరోగ్యముగా ఉంటుంది. అందుకు యోగా ప్రాణాయామం చేయవలసి ఉంటుంది. ఆక్సిజన్ లోకూడా పూర్తి ప్రాణశక్తి అన్ని చోట్లా దొరకదు. ప్రకృతి మద్య వృక్షాల నుండి దివ్యమైన ప్రాణ శక్తి అందుతుంది. ముఖ్యముగా రావి, మర్రి, వేప ,తులసి వృక్షాల నుండి దివ్యమైన ప్రాణ శక్తి అందుతుంది. అందుకే దేవాలయములకు వెళ్లి అక్కడ ఉండే వృక్షముల చుట్టు ప్రదక్షిణలు చేస్తే బాగుంటుంది, అంటారు. పర్వతాల మధ్య ప్రాణ శక్తి దివ్యంగా ఉంటుంది. అందుకే తీర్థయాత్రల పేరిట కేదార్నాథ్, భద్రినాద్, హిమల పర్వత శ్రేణులు మద్య సంవత్సరానికి ఒక సారి ఐనా తిరిగి రమ్మంటారు.

3. మనోమయ కోశం.
ఇది మనస్సుపై ప్రభావం చూపుతుంది. తీసుకునే ఆహారం మీద ఆధార పడి ఉంటుంది. చేసే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. శరీరంలో మనస్సు చాలా ముఖ్యం. మనసులోనే గమ్మత్తుమొత్తం ఉంది. నిరంతర బయట ప్రపంచం చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. దీనిని తీసుకుని వచ్చి అంతర్ముఖం చేస్తే అధ్బుతమైన ఫలితాలను చేకూరుస్తూ ఉంటుంది. అందుకే దినకి జంపం, ధ్యానము అలవాటు చేయాలి. గుఱ్ఱములను కల్లేము ద్వారా అదుపు చేయునట్లు మనస్సుకి సాధన అనే కళ్లెం వెయ్యాలి. అప్పుడు మనస్సు కి శాంతి లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యముగా ఉంటుంది. శరీరము ఆరోగ్యంగా ఉంటే జీవితంలో దేనినైనా సాధించవచ్చు. అందుకే మనోమయ కోశం అత్యంత ముఖ్యమైనది.

4. విజ్ఞాన మయ కోశం.
ఇది మనస్సు తీసుకునే జ్ఞానముపై ఆధారపడి ఉంటుంది. భౌతిక, ఆధ్యాత్మిక పరిజ్ఞముపై అంచేస్తుంది. భౌతిక పరమైన ఆలోచన చేస్తే భౌతికంగా ఎలా ఏదగాలి అను దానిపై పెంచేస్తుంది. ఆధ్యాత్మికంగా ఆలోచన పెడితే దానిలో పరిజ్ఞానము. సంపాదిస్తుంది. నీ ఆత్మకు ఎదుగు దలకు పనికి వచ్చేది విజ్ఞానము.ఆత్మ ఎదుగుదలకు పనికి రానిది అజ్ఞానము. విజ్ఞానము అంటే జ్ఞానము పెంచునది.అని అర్థం. ఏ జ్ఞానము ఉండాలి అంటే నేను ఎవరు అని తెలుసుకునే జ్ఞానం విజ్ఞానం. ఇది తెలిస్తే జీవితంలో ఉండే కష్టాలు చెక్ పెట్టినట్లు.

5. ఆనందమయ కోశం.
క్రింద నాలుగు కోశాలు యొక్క శుభ్రత మీద ఆధార పడి ఉంటుంది. ఇది భగవంతునితో సమానమైనది. నిత్యం ఇది అనందమ్ కలిగి ఉంటుంది. సాధనతో మాత్రమే దీనిని గూర్చి తెలుసుకోగలం. ఎవరైతే నిత్యం భగవంతుని గూర్చి ఆలోచిస్తూ ఉంటారో వారీ కోశం లో ఆనందంగా ఉండగలరు.🌹

Source - whatsapp sandesam

జీవన యోగం

జీవన యోగం

ప్రపంచానికి భారతదేశం అందించిన అపూర్వమైన కానుక యోగా. దైనందిన జీవితంలో మనం ఉపయోగించే ‘యోగా’ అనే మాటకు ప్రాచీనమైన ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. చిత్తవృత్తుల్ని నిరోధించడం యోగమని పతంజలి యోగసూత్రం చెబుతోంది. మనోనాశనానికి, వాసనాక్షయానికి చేసే పురుష ప్రయత్నం యోగమని, జీవాత్మ పరమాత్మల ఐక్యం యోగమని భగవద్గీత పేర్కొంటున్నది. మనిషి బంధానికి గాని, మోక్షానికి గాని కారణం మనసే. ఆ మనసును అదుపులో పెట్టుకోవడానికి మన రుషులు నిర్దేశించిన అనేక మార్గాల్లో ప్రధానమైనది యోగదర్శనం.
శరీరం పరిశుభ్రంగా, రోగరహితంగా, దృఢంగా ఉండేటట్లు చూసుకోవాలి. మనసుకు పట్టిన మాలిన్యాన్ని తొలగించుకోవాలి. మన దేహం, మనసు రెండూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య చక్కని సమన్వయం నెలకొని మనిషి సంపూర్ణ వ్యక్తిత్వం గలవాడిగా రూపొందుతాడు. యోగదర్శనంలోని అష్టాంగ యోగమార్గం అతి సామాన్యుడికి కూడా కైవల్య సాధనకు అనువైన మార్గంగా యోగశాస్త్ర పండితులు చెబుతున్నారు.

శరీరంలోని వివిధ అంగాలు ఎలా కలిసి పని చేస్తున్నాయో, అదే విధంగా అష్టాంగయోగం అంటే ఎనిమిది అంగాలు విడివిడిగా, సమైక్యంగా పనిచేస్తున్నాయి. ఆ అంగాలు యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. యమ నియమాలు సమాజ శ్రేయస్సుకు; ఆసనాలు దేహ దారుఢ్యానికి; ప్రాణాయామ ప్రత్యాహారాలు మానసిక వికాసానికి; ధారణ, ధ్యాన, సమాధులు ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తాయి. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం అనే విధులు ఆచరిస్తే మనోవాక్కర్మల్లో పరిశుద్ధత కలుగుతుంది. ఇతరుల పట్ల ద్వేషభావం నశించి, నిర్మలదృష్టితో చూడగలుగుతాం. ఇంద్రియ నిగ్రహం అలవడుతుంది.

శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనే అయిదింటినీ నియమాలంటారు. ఇవి కూడా వ్యక్తుల నిత్య కృత్యాలకు సంబంధించినవే. సద్గుణాలు మనసులో చోటు చేసుకుని అంతఃశౌచం, శరీరాన్ని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంవల్ల బాహ్యశౌచం నెలకొంటాయి. దుఃఖానికి తావివ్వకుండా సంతృప్తితో జీవించడమే సంతోషం. శరీరం యథేచ్ఛగా సంచరించకుండా నిరోధిస్తూ నిశ్చలమైన మనసును దైవం మీద కేంద్రీకరించి చేసేది తపస్సు.

వేదాధ్యయనం, సద్గ్రంథ పఠనాలను స్వాధ్యాయం అంటారు. సర్వ కర్మల్నీ ఈశ్వరార్పణ గావించడం, స్వస్థ చిత్తంతో ఉండగలగడం ఈశ్వర ప్రణిధానం.

యోగం అనగానే మనకు గుర్తుకు వచ్చేవి ఆసనాలు. స్థిరంగా, సుఖంగా ఉండేది ఆసనం. రోగ నివారణకు, నిరోధానికి, ఆరోగ్యప్రాప్తికి ఆసనాలు ఉపకరిస్తాయి. యోగంలో ప్రాణాయామం కీలకమైన అంగం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మన అధీనంలో ఉంచుకోవడం ప్రాణాయామం. ప్రాణమంటే జీవం, శక్తి. ఆయామమంటే వాయువులో విరామం కలగజేయడం ద్వారా ప్రాణ విస్తరణ. శరీరంలోని నాడుల్ని శుద్ధి చేయడానికి, శరీర భాగాలు ఉత్తేజితం కావడానికి, మానసిక ఒత్తిడి దూరం కావడానికి ప్రాణాయామం అవసరం.

శరీరం, ప్రాణం, మనసుల ఏకీకరణ- తద్వారా భగవంతుణ్ని ప్రార్థించడం నిజమైన ధ్యానం. జీవాత్మ పరమాత్మల ఐక్య సంబంధం వల్ల ఇతర సమస్త సంకల్పాలు నశించి ఏర్పడే నిర్వికార స్థితి సమాధి. యోగానికి సంబంధించిన శారీరక, మానసిక ప్రక్రియలు రెండూ వ్యక్తి సమగ్ర వికాసానికి తోడ్పడతాయి. మితమైన, హితమైన ఆహార సేవనంతో పాటు యోగ సాధన చేస్తే మనిషి ఆలోచనల్లో మార్పు వస్తుంది. సమాజోపయోగకర గుణాలు పెంపొందుతాయి. నిత్య జీవితంలో యోగాభ్యాసాన్ని ఒక వ్యాపకంగా అలవాటు చేసుకోవడం మేలైన జీవన విధానం.🙏

Source - whatsapp message

ధర్భల మహిమ, గ్రహణ కాలంలో దర్భలు ఎందుకు వాడాలి

ధర్భల మహిమ
గ్రహణ కాలంలో దర్భలు ఎందుకు వాడాలి

🌾🌾🌾🌾🌾🌾🌾

తులసి, ధర్భలు, బిల్వదళములు వున్న స్ధలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.

ఒక విధమైన గడ్డి జాతికి చెందిన ధర్భ మొక్కలు
శ్రీ రాముని స్పర్శ చేత పునీతమై , ఆ ధర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతున్నది.
ధర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ. జలాన్ని శుభ్రపరుస్తుంది. విషానికి విరుగుడు గుణం కలది.

గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో ధర్భలు వేసి వుంచడం గమనించవచ్చును.

ధర్భలని సంస్కృతం లో 'అగ్ని గర్భం' అంటారు.
కుంభాభిషేకాలలోను యాగశాలలో ని కలశాలలోను‌ ,బంగారు, వెండి తీగలతో పాటుగా
ధర్భలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు.

ధర్భలలో కూడా స్త్రీ , పురుష , నపుంసక జాతి ధర్భలని మూడు రకాలు వున్నాయి. పురుష జాతి దర్భలు అడుగు నుండి చివరికొసదాకా సమానంగా వుంటాయి. పై భాగంలో దళసరిగా వుంటే అది స్త్రీ ధర్భ గా గుర్తిస్తారు. అడుగున దళసరిగా వున్న ధర్భను నపుంసక ధర్భ గా తెలుసుకోవచ్చును.
ధర్భల దిగువ భాగంలో బ్రహ్మకు , మధ్యస్థానంలో మహావిష్ణువుకు , శిఖరాన పరమశివునికి నివాసంగా భావిస్తారు.

దేవతలను తలచుకొని యిచ్చే తర్పణాలు ధర్భ కొసలతోను, మానవులను తలచి యిచ్చే తర్పణాలలో ధర్భల మధ్యభాగం నుండి, పితృదేవతలను తలచుకొని యిచ్చే తర్పణాలలో ధర్భను మడిచి కొసలతోనూ తర్పణాలు సమర్పించడం విధాయకంగా వుంది.

వైదికకార్యాలలో , "పవిత్రం" అనే పేరుతో
ధర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు .ఈ వ్రేలిలో కఫనాడి వుండడం వలన యీ ఉంగర ధారణవలన కఫం శుభ్రం చేయబడుతోంది.

ప్రేత కార్యాలలో ఒక ధర్భతోను, శుభ కార్యాలలో రెండు ధర్భలతోను, పితృ కార్యాలలో మూడు ధర్భలతోను , దేవ కార్యాలలో నాలుగు ధర్భలతోను‌, ఆ ధర్భ ఉంగరాన్ని ముడి వేస్తారు.
దేవతారాధన, జపం, హోమం, దానం తర్పణం వంటి కార్యాలలో ధర్భతో చేసిన 'పవిత్రం'అనే యీ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి.

ధర్భగడ్డిలో పులుపు, క్షార గుణాలు వుండడం వలన
రాగి విగ్రహాలను , బూడిద ధర్భలు ఉపయోగించి శుభ్రపర్చాలని శిల్ప శాస్త్రం చెప్తోంది.
ఇందు వలన శిల్పాలలోని ఆవాహన మంత్ర శక్తి తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా వుంటాయని శాస్త్రజ్ఞులు చెపుతారు.

ఆదివారమునాడు కోసిన ధర్భలను ఒక వారముపాటు ఉపయోగించవచ్చును. అమావాస్యనాడు కోసి తీసుకుని వస్తే
ఒక మాసం వరకు ఉపయోగించవచ్చును.
పౌర్ణమినాడు కోసి తెస్తే పదిహేను రోజులు ఉపయోగించ వచ్చును.

శ్రావణమాసం లో కోసిన ధర్భలైతే తీసుకుని వస్తే ఒక ఏడాది ఉపయోగించ వచ్చును. భాద్రపద మాసంలో తీసుకుని వస్తే ఆరు మాసాలు ఉపయోగించ వచ్చును. శ్రాధ్ధ కార్యాలకోసం తెచ్చిన ధర్భలను ఏ రోజు కా రోజే ఉపయోగించాలి. తిరునల్లారు శైవక్షేత్రంలో ధర్భలే స్ధల వృక్షం. ఈ క్షేత్రంలో నెలవైయున్న ఈశ్వరుని పేరు ధర్భారణ్యేశ్వరుడు.

సుఖీభవ !
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Source - whatsapp sandesam

పతంజలి యోగసూత్రాలు

🙏 పతంజలి యోగసూత్రాలు

పతంజలి యోగసూత్రాలు నాలుగు అధ్యాయాల సంకలనము. సతమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అనే నాలుగు అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు. శరీర ధారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకి, రోగనిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగము వివరిస్తుంది.

సమాధిపద ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి పరమానంద స్థితిని సాధించడము దీనిలో వివరించబడింది.
సాధనపద కర్మయోగాన్ని, రాజయోగాన్నిసాధన చెయ్యడము ఎలాగో దీనిలో వివరించబడినది. ఎనిమిది అవయవాలను స్వాధీనపరచుకోవడం ఎలా అని రాజయోగములో వివరించబడింది.
విభూతియోగము జాగరూకత, యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో దీనిలో వివరించబడినది.
కైవల్యపద మోక్షసాధన ఎలా పొందాలో దీనిలో వివరించబడింది. ఇది యోగశాస్త్రము యొక్క ఆఖరి గమ్యము.
అష్టాంగయోగము

1 యమము
అహింస హింసను విడనాడటము.
సత్యము సత్యము మాత్రమే పలకటము.
అస్తేయ దొంగ బుద్ది లేకుండా ఉండటము
బ్రహ్మచర్యము స్త్రీ సాంగత్యానికి దూరముగా ఉండటము.
అపరిగ్రహ వేటినీ స్వీకరించకుండా ఉండటము.
2. నియమము
శౌచ శుభ్రము.
సంతోష ఆనందంగా ఉండటము.
తపస్య తపస్సు.
స్వధ్యాయన అంతర్దృష్ఠి.
ఈశ్వరప్రాణిదాన ఈశ్వర శరణాగతి.
3.ఆసన
4.ప్రాణాయామ
5.ప్రత్యాహార
6.ధారణ
7.ధ్యానము
8.సమాధి
ఇవి అష్టాంగపదయోగములోని భాగములు.

సంప్రదాయంలో యోగా

ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్లు పురాణాలలో వర్ణించబడి ఉంది. లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాసినియే, మహా విష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించబడినది. తాపసులు తమ తపసును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన. ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. బుద్ధ సంప్రదాయంలో, జైన సంప్రదాయంలోను, సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సింధు నాగరికత కుడ్య చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు.

భగవద్గీతలో యోగములు

భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి "యోగము" అనే పేరు ఉంది. ఇక్కడ "యోగం" అనే పదం సామాన్య యోగాభ్యాసం కంటే విస్తృతమైన అర్ధంలో, జ్ఞాన బోధ లేదా మార్గం అనే సూచకంగా వాడబడింది.

అర్జునవిషాద యోగము: యుద్ధ భూమిలో తాతలు తండ్రులు, సోదరులు, గురువులు,మేనమామలు మొదలైన ఆప్తులను శత్రు సేనలో చూసిన అర్జునుడు వారిని వధించవలసి వచ్చినందుకు అర్జుని కమ్ముకున్న విషాదము గురించిన వర్ణన.

సాంఖ్య యోగము:- ఆత్మ స్వరూపము గుణగణాల వర్ణన.

కర్మ యోగము:- కర్మ చేయడంలో నేర్పు,దానిని యోగములా మార్చుకోవడం ఎలా అని చెప్పే యోగము.

జ్ఞాన యోగము:- నర,నారాయణూల జన్మలు,భగవంతుని జన్మలోని శ్రేష్టమైన గుణాలు.జ్ఞాన సముపార్జన మార్గాల వివరణ.

కర్మసన్యాస యోగము:- కర్మలను ఫలితాలను సన్యసించి భగవంతునికి అర్పించి ఆయన ఇచ్చిన దానిని ప్రసాదంగా స్వీకరించడం ఎలా అన్న వివరణ.

ఆత్మసంయమ యోగము:- ధ్యానము,ఏకాగ్రతల ద్వారా మనోనిగ్రహము సాధించడము,ఆహారనియమాలు,సాధనా ప్రదేశము ఏర్పాటు వర్ణన.యోగి గుణగాణాల వర్ణన,భగవంతుని సర్వవ్యాఇత్వము,యోగభ్రష్టత ఫలితాల వర్ణన.

జ్ఞానవిజ్ఞాన యోగము:- భగవంతుని,ఉనికి,గుణగనాలు,ప్రకృతి,మాయని జయించడము.మోక్షగామి గుణగణాల వర్ణన.

అక్షరపరబ్రహ్మ యోగము:- బ్రహ్మతత్వము,ఆధ్యాతకత,కర్మతత్వము,ఆది దైవతము,ఆది భూతముల వర్ణన.జీవుని జన్మలు,జీవ ఆవిర్భావము,అంతము,పుణ్యలోక ప్రాప్తి,అత్యకాలములో భగవన్నామస్మరణ ఫలం.

రాజవిద్యారాజగుహ్య యోగము:- మోక్ష ప్రాప్తి వివరణ.భగవతత్వము,స్వర్గలోకప్రాప్తి,దేవతారాధనా వాటిఫలము,భక్తుల గుణగణాల వర్ణన.

విభూతి యోగము:-భగవంతుని చేరే మార్గము.భగవంతుని విశ్వ వ్యాపికత్వము వర్ణన.

విశ్వరూపసందర్శన యోగము:- విశ్వరూపము గురించిన విస్తారమైన వర్ణన.

భక్తి యోగము:- భక్తి యోగ వర్ణన.భగవంతుని ప్రియము పొందలిగిన భక్తుని గుణగణాల వర్ణన.

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము:- ప్రకృతి పురుషులు,క్షేత్రము క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానము తెలిపేది.

గుణత్రయవిభాగ యోగము:- సత్వగుణము,రజోగుణము,తామసగుణము వివరణ,వారి ఆహారవ్యవహారాల వర్ణన.

పురుషోత్తమప్రాప్తి యోగము:- భగవంతుని స్వరూపము తత్వము పురుషోత్తముని చేరే మార్గము వివరణ.

దైవాసురసంపద్విభాగ యోగము:- దైవీగుణసంపద,అసురీగుణసంపద కవారి ప్రవృత్తి,ప్రవర్తన ఆలోచనాదుల వర్ణన.

శ్రద్దాత్రయవిభాగ యోగము:- సత్వ,రాజసిక,తామసికములనబడే మూడు విధములుగా గుర్తించిన శ్రద్ధలను గురించిన వివరణ.

మోక్షసన్యాస యోగము:- మోక్ష ప్రాప్తికి కావలసిన జ్ఞానము,సన్యాసము గురించిన వర్ణన. 🙏

Source - whatsapp sandesam

హిందువుల్లో అంతమంది దేవుళ్ళు ఎందుకని?

హిందువుల్లో అంతమంది దేవుళ్ళు ఎందుకని కొందరి వాదం.

🤘 ఒకసారి ఒక ఆంగ్లేయుడు సత్యశోధన కోసం అనేక మత గ్రంధాలు శోధించాడు అయన స్వతహాగా క్రీస్టియన్. అన్ని మతాలు వెదికి చివరికి హిందూ సనాతనధర్మం లో ఉన్న రామాయణ, భారత, భాగవత, పురాణాలు, వేదాలు ఉపనిషత్తులు చదివాడు. ఎన్నో ఏళ్ల నుండి తను చేస్తున సత్యాన్వేషణ హిందూ సనాతన ధర్మం వలన లభించింది అని అన్నాడు.

తరువాత మనం పైన వేసిన ప్రశ్నకి అయన ఇలా సమాధానం చెప్పాడు.
తల్లి తన బిడ్డకి ఆకలి వేసినప్పుడు చేతిలో గరిటెలు పట్టుకుని అన్నపూర్ణా దేవిలా మారుతుంది. అమ్మా ఈ లెక్క నాకు అర్థం కాలేదు అంటే పుస్తకం తీసుకొని ఇలా చెయ్యమని సరస్వతి అవుతుంది. అమ్మ ఖర్చులకి డబ్బులు కావాలంటే తన చేతితో డబ్బు ఇచ్చి లక్ష్మిదేవిలా మారుతుంది. ఏదైనా తప్పు చేస్తే దండించి ఆదిపరాశక్తి లా మారిపోతుంది.

ఇలా ఎదురుగా ఉన్న తల్లి వివిధ సందర్భాలలో వివిధ రకాలైన అవతారాలు ధరిస్తుంటే, తను సృష్టి చేసిన దేవుడు తన పిల్లల కోసం ఎన్ని అవతారలైనా ధరిస్తాడు. అందుకే హిందూ మతంలో ఇన్ని మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. అన్నాడు.

అలానే కాకుండా హిందూ ధర్మంలో ఉండి ఏమి లేదు అనుకునేవారు కూడా సరిగ్గా ఆరాధిస్తే ఆ ఫలితం తెలుస్తుంది. ఎలాగంటే

మంచు చూడడానికి మనకి ఒకేలా కనిపిస్తుంది. కాని ఆ మంచులో నివసించేవారు చెప్పే మాట "మంచులో మొత్తం 47 రకాలు ఉన్నాయి" అంటారు. దూరంగా ఉండే మనకి ఒకటే. కాని దగ్గరకి వెళ్లి పరిశీలించిన వారికే తెలుస్తుంది.

ఇటు తనవారికి సందేశం ఇచ్చాడు. మరో ప్రక్క అశ్రద్ధ చేస్తున్న మనకీ సందేశం ఇచ్చాడు. విలువలు తెలుసుకోక పొతే కూలబడేది మనమే. మన సంప్రదాయాలు అశ్రద్ధ చేయకండి.🤘

Source - whatsapp message

జూన్ 21వ తేదీ రోజునే అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం ఎందుకు నిర్వ‌హిస్తున్నారో తెలుసా?

జూన్ 21వ తేదీ రోజునే అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం ఎందుకు నిర్వ‌హిస్తున్నారో తెలుసా.?


🙏 జూన్ 21. అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం. 2015వ సంవ‌త్స‌రం నుంచి దీన్ని నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా 150కి పైగా దేశాల్లో ఉన్న ప్ర‌జ‌లు యోగా డేలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో ఈ సారి కూడా దీన్ని అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, సినీ తారలు, వాళ్లు, వీళ్లు అని తేడా లేకుండా జ‌నాలంద‌రూ యోగా డేలో పాల్గొని త‌మకు వ‌చ్చిన యోగాస‌నాలు వేశారు. అయితే మీకు తెలుసా..? జూన్ 21వ తేదీనే యోగా డేగా ఎందుకు నిర్ణ‌యించారో..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

ఏడాదిలో ఉండే 365 రోజుల్లోనూ జూన్ 21వ తేదీకి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అదేమిటంటే… ఈ రోజున స‌హ‌జంగానే ప‌గ‌టి స‌మ‌యం ఎక్కువ‌. ఎందుకంటే , ఇదే రోజున ద‌క్షిణాయ‌నం ప్ర‌వేశిస్తుంది. ఇదే రోజున శివుడు (ఆదిగురువు, ఆది యోగి) యోగా గురించిన విజ్ఞానాన్ని దేవ‌త‌ల‌కు చెప్పాడ‌ట‌. ఇక ఈ రోజు నుంచి యోగాతోపాటు ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌కు అనుకూలంగా ఉంటుంద‌ట‌. ఈ క్ర‌మంలో జూన్ 21వ తేదీని వీటికి ఆరంభంగా భావిస్తారు. అందుకే ప్ర‌ధాని మోడీ ఈ అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ 27 సెప్టెంబ‌ర్‌ 2014వ తేదీన ఐక్య‌రాజ్య స‌మితి స‌మావేశంలో ప్ర‌సంగించారు. క‌నుక అదే రోజును అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వంగా గుర్తించాల‌ని భార‌త ప్ర‌తినిధి అశోక్ ముఖ‌ర్జీ 11 డిసెంబ‌ర్ 2014వ తేదీన అదే ఐక్య‌రాజ్య స‌మితిలో ఓ డ్రాఫ్ట్ రిజ‌ల్యూష‌న్ పెట్టారు.

ఈ క్ర‌మంలో స‌ద‌రు డ్రాఫ్ట్ రిజ‌ల్యూష‌న్‌కు అనుకూలంగా 177 దేశాల‌కు చెందిన ప్ర‌తినిధులు ఓటు వేశారు. జూన్ 21వ తేదీన అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం నిర్వ‌హించాల‌నే విష‌యాన్ని వారు స‌మ‌ర్థించారు. దీంతో ఇక ఆ త‌రువాత ఏడాది అంటే 2015 నుంచి జూన్ 21వ తేదీన ఇంట‌ర్నేష‌న‌ల్ యోగా డేను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. అదీ… ఈ తేదీ రోజున యోగా డే పెట్ట‌డం వెనుక ఉన్న అస‌లు క‌థ‌. ఈ క్ర‌మంలోనే ఇదే తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు యోగా డేను పాటిస్తున్నారు..!🙏

Source - whatsapp sandesam

విత్తులాంటి వాడు కొడుకైతే మహా వృక్షంగా మలిచే తోటమాలి నాన్న!

👌తన కలెక్టర్ కొడుకును చూడడానికి ఛాంబర్ లోకి వెళ్ళాడు ఓ తండ్రి.

కలెక్టర్ ఐన తన కొడుకు భుజం మీద చేయి వేసి. "ప్రపంచం లో అత్యంత శక్తివంతుడు ఎవరు?" అని అడిగాడు .

అప్పుడు ఆ కలెక్టర్ సమాధానమిచ్చాడు..
ప్రపంచంలో అత్యంత శక్తి వంతుడిని నేనే అని.

ఆ తండ్రి ముఖం పాలిపోయింది. మా నాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అనే జవాబు వస్తుందని ఆశించాడు.

నిరాశగా వెనక్కుతిరిగి ఛాంబర్ లోనుంచి బయటకు వెళ్తూ మరొక్కసారి ఆలోచించమన్నాడు.

అప్పుడు ఆకొడుకు మానాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అని బదులిచ్చాడు. ఆశ్చర్యంతో తండ్రి అన్నాడు...

ఇంతకు ముందు నిన్ను నీవే శక్తివంతునిగా చెప్పావు, ఇప్పుడేమో నన్ను శక్తివంతుడు అంటున్నావేం అన్నాడు...!!

నాన్నా అప్పుడు నీ చేయి నా భుజం మీద ఉండింది. అందుకే అప్పడు నేనే శక్తివంతమైన వాన్ని. ప్రపంచంలో ఏకొడుకు భుజంమీద తండ్రి చేయి ఉంటుందో ఆకొడుకే అత్యంత శక్తివంతుడు కాదా నాన్నా?!

తండ్రి కళ్ళలో నీళ్ళు!


తోటలో నాటిన విత్తు మొలకెత్తడం సహజం.

ఆ విత్తును మొలకగా, చెట్టుగా, మహావృక్షంగా మలచడం తోటమాలి గొప్పదనం.

విత్తులాంటి వాడు కొడుకైతే మహా వృక్షంగా మలిచే తోటమాలి నాన్న!🙏

Source - whatsapp sandesam

ద్రౌపది పతి వ్రత ఎలా అయిందో తెలుసా మీకు

#ద్రౌపది పతి వ్రత ఎలా అయిందో తెలుసా మీకు

#ఐదుగురు భర్తలు ఉన్న ద్రౌపతి పతివ్రతా ఎలా అయిందో తెలుసా? ఎందుకు మీకా సందేహం…ద్రౌపతి నిజంగా పతివ్రతే. అదెలాగండీ..ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది కానీ…అయిదుగురు భర్తలు గల ద్రౌపతి పతివ్రత ఎలా అవుతుందండీ? #అబ్బ..ఎందుకండీ అంత కోపం..కాస్త శాంతంగా ఉంటే, మీ సందేహానికి సరైన సమాదానం నేను చెప్తాను కదా. ఇంద్రుడే ఐదు రూపాలుగా పాండవులుగా జన్మించాడు. అతని భార్య శచీదేవి.. #ద్రౌపతిగా జన్మించింది.

#ముందుగా ఒక చిన్న లెక్క. ఒక రూపాయికి వంద పైసలు.,పది పైసలు పది..,పావలాలు (ఇరవై ఐదు పైసలు) నాలుగు..,అర్థరూపాయిలు రెండు.అలాగే పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పూర్తి ఇంద్రుడు కాజాలడు. పంచపాండవులు, #ద్రౌపతి, నవమాసాలు మాతృ గర్భంలో ఉండి యోనిజులుగా జన్మించిన వారు కాదు. వీరందరూ #అయోనిజులే. ద్రౌపతి యఙ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణజన్మురాలు. ఇక ధర్మరాజాదులు కుంతి, మాద్రులకు ఎలా జన్మించారో జగతికి తెలిసిన కథే. కానీ… అలా జన్మించడానికి వెనుక ఉన్న అసలు #కథ చాలా మందికి తెలియదు. ఆ అసలు కథ ఏమిటంటే..

#త్వష్ట్రప్రజాపతి కుమారుడైన ‘త్రిశిరుని’ ఇంద్రుడు సంహరించాడు. ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించి స్వర్గలోకాధిపత్యార్హతను కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు దేవగురువు #అయిన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్య పాతకం పోయే మార్గం చెప్పమని అర్థించాడు. ‘మహేంద్రా.. ఎంతటి పాపమైనా తపస్సుతో తొలగిపోతుంది. కనుక తపస్సు చెయ్యి. అయితే.. బ్రహ్మహత్య #దోషంతో ఉన్న నీకు, ప్రస్తుతం దైవీకశక్తులు ఏవీ తోడుగా ఉండవు. అటువంటి నిన్ను సంహరించడం రాక్షసులకు పెద్ద కష్టం కాదు. కనుక, నీ పంచ ప్రాణశక్తులలో నాలుగు ప్రాణశక్తులను నీకు #నమ్మకమైన మిత్రుల దగ్గర దాచివుంచి, ఒక ప్రాణశక్తిని నీదగ్గర ఉంచుకుని తపస్సు చేసి బ్రహ్మహత్యపాతక పరిహారం చేసుకో’ అని సలహా ఇచ్చాడు. గురుదేవుని ఆదేశంతో మహేంద్రుడు తన నాలుగు ప్రాణశక్తులను యమడు, వాయువు, #అశ్వినీదేవతల దగ్గర దాచి తపస్సు ప్రారింభించాడు.

#పాండురాజు భార్యలు🍂🌹🍀

#పాండురాజు భార్యలైన కుంతి, మాద్రులు… దూర్వాసుడు అనుగ్రహించిన సంతాన సాఫల్య మంత్ర మహిమతో పంచపాండవులకు తల్లులయ్యారు. కుంతి ప్రార్థనకు ప్రసన్నులైన యముడు, వాయువు, ఇంద్రుడు తమ దగ్గర ఉన్న #మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా..ధర్మజ, భీమ, అర్జునులు జన్మించారు. ఇక మాద్రి ప్రార్థనకు ప్రసన్నులైన అశ్వినీదేవతలు తమ దగ్గరున్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా..నకుల, #సహదేవులు జన్మించారు.

#కనుక., పంచపాండవులు ఐదుగురు కలిస్తేనే ‘ఇంద్రుడు’. ఏ ఒక్కరు తగ్గినా.. పరిపూర్తి ఇంద్రుడు కాజాలడు. ఇక..ఇంద్రుడు బ్రహ్మహత్యపాతక నివారణకై తపస్సు చేస్తున్న కాలంలో, అతని భార్య శచీదేవి, అసురుల ఆగడాలకు భయపడి, తన భర్త #తిరిగి వచ్చేవరకు తనకు ఆశ్రయం ఇమ్మని అగ్నిదేవుని అర్థించి ఆయన నీడలో కాలం గడుపుతోంది. తన భర్త అయిన మహేంద్రుడు ఐదురూపాలతో భూలోకంలో జన్మించాడు అని తెలుసుకున్న శచీదేవి..యఙ్ఞకుండం నుంచి ద్రౌపతిగా #జన్మించి, పంచపాండవులకు అర్థాంగి అయింది. భౌతికంగా పాండవులు ఐదుగురుగా కనిపిస్తున్నా.. నిజానికి వారందరూ కలిసి ఒక్కరే. ఒక్కరితో (ఒకే భర్త అయిన ఇంద్రునితో) ధర్మబద్ధమైన సంసారయాత్ర సాగించిన ‘ద్రౌపతి’(శచీదేవి) #కచ్చితంగా పతివ్రతే.🍀🌻🌼

Source -whatsapp sandesam

మనం మంచి నీళ్ళు ఎప్పుడు , ఎంత , ఎలా త్రాగాలి ?

మనం మంచి నీళ్ళు ఎప్పుడు , ఎంత , ఎలా త్రాగాలి ?

అన్ని రోగాలకి చికిత్సకంటే , రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానము అంటారు మహర్షి వాగ్భటాచార్యుడు .

"భోజనాంతే విషం వారీ" , అంటే భోజనం చివర నీరు త్రాగటం "విషం"తో సమానం . మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది . అక్కడ అగ్ని ( జఠరాగ్ని ) ప్రదీప్తమవుతుంది . ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది . ఇది ప్రధానమైన విషయం .

భోజనం తిన్న తరువాత నీళ్ళు త్రాగితే జఠరాగ్ని చల్లబడుతుంది . ఇక తిన్న ఆహారము అరగదు . అది కుళ్ళి పోతుంది . కుళ్ళిన ఆహారం నుండి వచ్చిన విషయవాయువులు శరీరమంతటా వ్యాపిస్తాయి . ఆ విషయవాయువుల వలన 103 రోగాలు వస్తాయి . ఆ కుళ్ళిన ఆహారం వల్ల వచ్చేది కొలెస్ట్రాల , ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు.

నీరు త్రాగే విధానం :--
నీటిని గుటక గుటకగా త్రాగాలి . ఒక్కొక్క గుటక నోటిలో నింపుకంటూ చప్పరిస్తూ త్రాగాలి . వేడి వేడి పాలు త్రాగే విధంగా నీటిని త్రాగాలి . నీరు ఎపుడు త్రాగినా ఈ విధంగానే త్రాగాలి . ఇది నీరు త్రాగే సరైన విధానం . గటగటా నీరు త్రాగడం సరైన విధానం కాదు.

ఫలితము :---
నీటిని గుటక గుటక చప్పరిస్తూ త్రాగితే నోటిలోన వున్న లాలాజలంతో నీరు కలిసి పొట్టలోకి చేరుతుంది . పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి . లాలాజలం పొట్టలోని ఆమ్లాలతో కలిసి న్యూట్రల్ అవుతుంది . అసలు నోటిలో లాలాజలం తయారయ్యేది పొట్టలోకి వెళ్ళటానికి , లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికి . అపుడు మనం జీవితాంతం ఏ రోగాల బారినపడకుండా ఆరోగ్యంగా జీవించ వచ్చును.

ఎప్పుడు త్రాగాలి : ----
బ్రేక్ ఫాష్ట్ లేక భోజనమునకు గంట ముందు నీళ్ళు త్రాగాలి .
బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం చేసిన గంట న్నర తరువాత త్రాగాలి . (ఆహారం జఠర స్ధానంలో గంటన్నర వరకు అగ్ని ప్రదీప్తమై ఉంటుంది). అపుడు ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది‌ .

భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్ఛును . భోజనం ముగించాక గొంతు శుద్ధి కోసము , గొంతు సాఫీగా ఉంచటానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును .
# ఉదయం బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం తరువాత పండ్లరసాలు త్రాగవచ్ఛును .
# మధ్యాహ్న భోజనం తరువాత మజ్జిగ త్రాగవచ్చును .
# రాత్రి భోజనాంతరము పాలు త్రాగవచ్చు .

ఈ క్రమాన్ని ముందు వెనుకలుగా చెయ్యవద్దు . ఎందుకంటే ఆయారసాలను పచనం చేసే ఎంజైమ్స్ ఆ సమయాల్లో మాత్రమే మన శరీరంలో ఉత్పన్నమవుతాయి .

నీరు ఎంత త్రాగాలి : --
మీరున్న బరువును 10 తోటి భాగించి 2 ను తీసివేస్తే వచ్చినది మీరు త్రాగవలసిన నీటి శాతం చూసుకొని త్రాగండి . ఉదా: మీరు 60 కిలోల బరువు వుంటే 60 ని 10 చే భాగించితే 6 వస్తుంది . దీనిలో నుండి 2 తీసివేస్తే 4 వస్తుంది. మీరు 24 గంటల్లో 4 లీటర్ల నీరు త్రాగవలెను .

ఎలా త్రాగాలి :--
# ఎల్లప్పుడూ సుఖాసనంలో కూర్చొని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగాలి .
# నిలబడి నీళ్ళు త్రాగరాదు .
# చల్లని నీళ్ళు ( Cool Water) త్రాగరాదు .
# గోరు వెచ్చని నీళ్ళు త్రాగవలెను .
# ఎండాకాలములో ( మార్చి నుండి జూన్) మట్టికుండలోని నీరు త్రాగవలెను .

మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు.
మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు .
స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగరాదు.

మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన మూత్ర సంబంధ వ్యాధులు వస్తాయి .
మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన యెడల మలబద్ధకం వస్తుంది .
స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగిన యెడల చర్మ వ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి .
ఎండ నుండి నీడకు వచ్చి వెంటనే నీళ్ళు త్రాగితే సమస్యలు వస్తాయి .
రిఫ్రిజిరేటర్ నీళ్ళు చాలా హానికరము .

మనకు ఆహారము ఎంత ప్రధానమో , తిన్న ఆహారము సక్రమంగా జీర్ణమటం అంతే ప్రధానము .

మనము తిన్న భోజనము జీర్ణము కాని యెడల అది కుళ్ళిపోతుంది . ఆ కుళ్ళిన ఆహారము వలన శరీరంలో విషవాయువులు పుట్టి 103 రోగాలకు కారణం అవుతుంది . మొట్టమొదట గ్యాస్ ట్రబుల్ , గొంతులో మంట , గుండెలో మంట , ఎసిడిటీ , హైపవర్ ఎసిడిటీ , అల్సర్ , పెప్టిక్ అల్సర్ మొదలగునవి వస్తాయి . చివరగా క్యాన్సర్.

మీరు ఎల్లప్పుడూ నీటిని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగిన యెడల , మీరు జీవితంలో
ఏ రోగాల బారిన బడరు . సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుంటారు .
ఈ సృష్టిలో ప్రతి జంతువు నీటిని చప్పరిస్తూ ఒక్కొక్క గుటకగా త్రాగుతుంది.*

టిఫిన్లపుట్టు పూర్వోత్తరాలు

టిఫిన్ల కథ:: డా. జి వి పూర్ణచందు
తెలుగు వారిది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ప్రొద్దున పూట తేలికగా చద్దన్నం, మధ్యాహ్నం పూట ఘనాహారం, సాయంత్రం పూట అల్పాహారం తీసుకోవటం మన పూర్వాచారం.
ఆంగ్లేయ యుగం చివరి రోజుల్లో ఉదయంపూట టిఫిను తినే అలవాటు మనకు సంక్రమించింది. స్వాతంత్ర్యం వచ్చాక క్రమేణా చద్దన్నం స్థానంలో ఇడ్లీ అట్టు పూరీ, ఉప్మాలు చోటు చేసుకో సాగాయి. 2000వ మిలీనియం సంవత్సరం లో ఉదయం పూట కొత్తగా బజ్జీలు పునుగులు కూడా స్థానం సంపాదించుకున్నాయి. ఒకప్పుడు హోటళ్లలో సాయంకాలాలే చపాతీలు వేసే వారు. సాయంత్రం 6 అయ్యాక బజ్జీలు పునుగుల బళ్ళు రోడ్డుపక్కన వెలిసేవి. ఇప్పుడు నిలబడి తినేసే జంక్‘ఫుడ్స్, ఇతర వేగాహారాల టిఫిన్ సెంటర్లు వెలిశాక మైసూరు బజ్జీలు, పునుగులూ తెల్లారేసరికే దొరుకుతున్నాయి.
పెళ్ళిళ్లలోనూ ఇతర భోజనాల్లోనూ వడ్డించే టిఫిన్లలో రెండు రకాల స్వీట్లు, నాలుగైదు రకాల హాట్లూ ఉంటున్నాయి. ఇవే తినాలనే అభిప్రాయం బలంగా నాటుకు పోవటంతో ప్రొద్దున్నపూట మెతుకు తగలకూడదనే భావన పాతుకుపోయింది. చివరికి ఉదయాన్న కమ్మని చద్దన్నం కనుమరుగైపోయింది.
చద్దన్నం అంటే పెరుగన్నమే!
చల్ల లేదా పెరుగు కలిపిన అన్నాన్ని చలిదన్నం అంటారు. దీనికి తాలింపు పెడితే అది దధ్యోదనం. తాలింపు లేకుండా పెరుగు లేదా చల్లన్నాన్ని అమ్మవారికి నివేదన పెడతారు. దీన్ని చలిది - చద్ది అన్నం అని పిలుస్తారు.
చద్దన్నం అంటే చల్లన్నం లేదా పెరుగన్నమే గానీ, పాచిపోయిన, నిన్న రాత్రి మిగిలిపోయిన అన్నం అని కాదు. అందువలన ఈ నాటి తరం ఉదయాన్న ఆరోగ్య దాయకమైన చద్దన్నాన్ని వదిలేసి ఎక్కువ కేలరీలు, ఎక్కువ కొవ్వు, తక్కువ పోషకాలు కలిగిన టిఫిన్లను తినటానికి అలవాటు పడ్డారు. ప్రొద్దున్న పూట మెతుకు తగలకూడదంటారు గానీ,
అమ్మవారికి నైవేద్యం పెట్టే చలిదన్నం పవిత్రమైనదని గుర్తించలేకపోతున్నారు.
గోపబాలురంతా కృష్ణుడి చుట్టూ పద్మాకారంలో కూర్చుని ఇళ్ళ దగ్గరనుంచి తెచ్చుకున్న పెరుగన్నాన్ని మాగాయ ముక్కలతో నంజుకు తిన్నట్టు పోతనగారు వర్ణించాడు. కృష్ణుడు చద్దన్నం తినే గొప్పవాడయ్యాడని మనం పిల్లలకు నచ్చ చెప్పాలి గానీ, మనమే చద్దన్నం అనగానే ముఖం అదోలాపెట్టకూడదు. ఆహార పదార్ధాల్లో కెల్లా చద్దన్నమే అత్యంత శక్తిదాయకమైనది, ఆరోగ్యదాయకమైనదీ కూడా! చద్దన్నం (పెరుగన్నం) పెట్టకుండా రెండిడ్లీలు పెట్టి పిల్లల్ని బళ్లకు పంపే తల్లులు తమ బిడ్డల్ని అర్థాకలితో పోషిస్తున్నట్టే లెక్క!
ఇడ్లీ ఇతిహాసం
ఒక తెలుగు సినిమాలో కాఫీలు తిన్నారా, టిఫినీలు తాగారా? అని ఓ హాస్య పాత్ర అడుగుతుంది! టిఫిను కాఫీల
సోదరీబంధం ఓ వందేళ్ళ క్రితమే బలపడింది. కాఫీ హోటలుకు వెళ్ళి ఇడ్లీ, అట్టు, పూరీ లేదా, ఉప్మా తిని, కప్పు “కాఫీ”, లేక “టీ” తాగే అలవాటు మనకి గత వందేళ్ళ నుంచే మొదలయింది. అంతకు మునుపు కాఫీ మనకు మాదక ద్రవ్యమే! గొప్పింటివారి పానీయం!
1907లో బిపిన్ చంద్రపాల్ గారు బందరు వచ్చారు. జాతీయోద్యమం తొలిరోజులవి. వందేమాతర ఉద్యమ సందే శాన్ని ఆయన ప్రచారం చేస్తున్నసమయం. కృష్ణాపత్రిక సంపాదకులు ‘ముట్నూరి కృష్ణారావు’ గారు చంద్రపాల్ గారి గౌరవార్ధం విందు చేసి, అందరికీ ఆవడ, కాఫీ వడ్డించారట. వాటిని సేవించిన బ్రాహ్మణ అతిథులు కాఫీ అనే మాదక ద్రవ్యాన్ని సేవించినందుకు వారికి కులవెలి శిక్ష పడినంత పని అయ్యింది. అయ్యదేవర కాళేశ్వరరావు గారు తన “ నా జీవితము-నవ్యాంధ్రము”లో ఈ సంఘటన గురించి వ్రాశారు. అంటే, 20వ శతాబ్ది ప్రారంభం దాకా టిఫిన్లు చేయటం, కాఫీ సేవించే అలవాట్లు మనకు లేవనీ, ఆ తరువాతే తెలుగు ప్రజలకు అవి అలవాటులోకి వచ్చాయనీ అర్ధం అవుతోంది,..
వీటూరి వాసుదేవశాస్త్రి 1938లో “వస్తుగుణప్రకాశిక” గ్రంథంలో ఇడ్డెనల గురించి వ్రాస్తూ, “కాఫీ హోటళ్ళలో నిది ప్రథానమగు ఫలహారపు వస్తువు. ఇరువది సంవత్సరముల ను౦డి దీనికి కలిగిన ప్రభావము, వ్యాప్తి వర్ణనాతీతము. దీనికై ప్రత్యేకముగ ఇడ్లీపాత్రలు బయలు దేరినవి, నాగరికత గల ప్రతి కుటుంబములోనూ యుదయము నిడ్డెన తయారు చేయుచునే యు౦దురు” అని వ్రాశారు. ఈ మాటల్నిబట్టి 1920కి పూర్వ౦ మనపూర్వులు ఇప్పటి పద్ధతిలో ఇడ్డెనులను వండేవారు కాదనీ, ఇలా తినే వారు కాదని తేలికగా గ్రహించవచ్చు.
ఉప్పుడురవ్వ అంటే పులవబెట్టిన బియ్యపు రవ్వ. దీనితో చేసిన ఇడ్లీని సా౦బారు, చట్నీలతో తిని వెంటనే, పాలు పోసి కాచిన కాఫీ/టీ తాగటం వలన, విరుధ్ధ పదార్థాలు సేవించినట్టు అవుతుందనీ, అందువలన అజీర్తి పెరుగుతుందనీ ఈ గ్ర౦థ౦ 1938లోనే హెచ్చరించింది. ఇడ్లీ కాఫీ అక్కా చెల్లెళ్ళే గానీ తోడికోడళ్ళు కాదన్న మాట.
ఆ రోజుల్లో ఇంగ్లండులో కూడా కాఫీ హౌసులు ఉండేవి. అక్కడ కాఫీతో పాటు కొద్ది పాటి శ్నాక్స్ మాత్రమే దొరికేవి. భారతదేశంలో మాత్రం కాఫీ హోటలంటే టిఫిన్లు తినే చోటు అనే అర్థం స్థిరపడింది.
600 యేళ్ళ క్రితం శ్రీనాథుడు దమయంతీ స్వయంవరానికి వచ్చిన అతిథులకు భోజనంలో వడ్డించిన అనేక రకాల వంటకాల్లో ఇడ్డెనలు కూడా ఉన్నట్టు వ్రాశాడేగానీ, ఉదయం పూట ఇడ్లీ ఉప్మా చట్నీ సాంబారు వడ్డించినట్టు వ్రాయలేదు.
వెనకటికి ఓ అత్తగారు కొత్తల్లుణ్ణి” నాయనా! చద్దన్నం తింటావా? చక్కిలాలు తింటావా? మధ్యాన్నం మీ మావగారితో భోజనం చేస్తావా?” అనడిగిందట. దానికి ఆ అల్లుడు “ముందు చద్దన్నం తింటాను, తరువాత చక్కిలాలు తింటాను. ఆనక మావగారితో అన్నం తింటాను” అన్నాడట. ప్రొద్దున్న పూట చద్దన్నమో, చక్కిలాలో తిన్నారే గానీ బక్కెట్టు సాంబారుతో రెండిడ్లీ తినేవారు కాదని ఈ సామెత చెప్తోంది.
టిఫిన్లపుట్టు పూర్వోత్తరాలు
1611లొ ఆంగ్లేయులు గ్లోబ్ అనే ఓడలో మొదటగా బందరు ఓడరేవులో దిగారు. క్రమేణా దేశాన్ని ఆక్రమించి 200 సంవత్సరాలపాటు దేశాన్ని ఏలారు. బ్రిటిష్ యుగంలో మనం తెలివి మీరింది తక్కువే గానీ దొరల అలవాట్లు వంటబట్టి నాగరికత మీరింది ఎక్కువ. టిఫిన్లు తినే అలవాటు అలా సంక్రమించిందే మనకి.
ఇక్కడో. విచిత్రమైన కథ ఉంది. మద్రాసు కేంద్రంగా మనల్ని పరిపాలించటం మొదలెట్టిన తరువాత ఆంగ్లేయులు ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మాలను కూడా ఇష్టపడి మధ్యాహ్నం తేలికగా వాటిని తినటానికి అలవాటు పడ్డారు. సాధారణంగా ఆంగ్లేయులు ఉదయంపూట చాలా తేలికగా ఆహారం తీసుకుంటారు. మధ్యాహ్నం అల్పాహారం, రాత్రికి ఘనమైన ఆహారం తీసుకోవటం వాళ్ళ అలవాటు. మధ్యాహ్నం పూట తీసుకునే అల్పాహారాన్ని(లంచ్) ఇంగ్లీషు పామరజనులు ‘టిఫింగ్’ అనే వాళ్ళట. ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మాలను మధ్యాహ్న భోజనంగా తీసుకొనేవాళ్లు కాబట్టి, ఈ టిఫింగ్ లేదా టిఫిన్ అనే మాట వాటికి వర్తించటం మొదలయ్యింది. అది క్రమేణా ప్రధాన ఆహారానికన్నా భిన్నమైన దాన్ని తీసుకోవటం అనే అర్ధంలో వ్యాప్తిలోకి వచ్చింది. చివరికి అదే మన భారతీయ సాంప్రదాయం, తరతరాల సంస్కృతి అన్నంతగా మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చింది.
భారత దేశంలో అలా కొత్త అర్థాన్ని సంతరించుకున్న ఈ టిఫింగ్ మన పామర భాషలో టిఫిన్‘ గానూ ప్రామాణిక ఆంగ్ల భాషలో ‘లంచ్’ కి పర్యాయ పదంగానూ మారిపోయింది. ఆంగ్లేయులకు లంచ్ అంటే స్వల్ప భోజనం. అదే టిఫినంటే!
మనకు పగలు పెద్ద భోజనం, రాత్రి అల్పారం అలవాటు. 30-40 యేళ్ల క్రితం వరకూ తెలుగు వారి పెళ్ళి భోజనాల్లో రాత్రిపూట చాలా తేలికగా అరిగేవే ఉండేవి. పగటి పూట భోజనంలో పప్పు వడ్డిస్తే రాత్రి భోజనాల్లో కందిసున్ని వడ్డించేవాళ్లు. కానీ, యూరోపియన్లు రాత్రి భోజనాన్ని (సప్పర్) చాలా ఎక్కువగా తీసుకుంటారు. ఆ మోజుకొద్దీ మనం విందుభోజనాలను రాత్రి పూట (డిన్నర్) ఏర్పాటు చేస్తున్నాం. యాబై నుండి అరవై వంటకాలను వడ్డించి అత్యంత హెవీ ఆహారం తినటాన్ని వారినుండే అలవాటు చేసుకున్నాం.
స్వాతంత్ర్యానంత్యరం టిఫిన్లు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. బొంబాయి ఒక మహానగరం కాబట్టి, అక్కడ ఉద్యోగం ఒక చోట, నివాసం మరెక్కడో ఉండటాన, ఉదయాన్నే నిద్ర లేచి భోజనం క్యారియర్ కట్టుకు వెళ్లటానికి తగినంత సమయం ఉండదు. దీనికి పరిష్కారంగా ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళకి మధ్యాహ్నానికి భోజనం క్యారియర్‌లు తెచ్చి ఆఫీసుల దగ్గర అందించే ఒక కొత్త కొరియర్ వ్యవస్థ ఏర్పడిందక్కడ. మధ్యాహ్న భోజనాన్ని తెచ్చే భోజనం డబ్బాని ‘టిఫిన్ బాక్స్’, ‘టిఫిన్ క్యారియర్’ అన్నారు. ఇక్కడ టిఫిన్ అంటే ‘మధ్యాహ్న భోజనం’ అని అర్థం.
ఎటుతిరిగీ మహారాష్ట్రులకు భోజనం అంటే చపాతీ, పూరీ, పుల్కాలే కాబట్టి, వాటిని టిఫిన్ అనటం ఒక ఆచారం అయ్యింది. అది చూసిన తెలుగు వాళ్ళు వరి అన్నం కన్నా భిన్నమైన ఆహార పదార్ధాల్ని టిపిన్ అనటం మొదలు పెట్టారు. బొంబాయిలో టిఫిన్ అంటే మధ్యాహ్న భోజనం. తెలుగులో టిపిన్ అంటే ‘అల్పాహారం’ అని కొత్త అర్థాలు స్థిరపడ్డాయి.
టిఫినొద్దు- అన్నమే మేలు
గురువారం , శుక్రవారం, శనివారం ఇలా ఏదో ఒక దేవుడి పేరుతో రాత్రిపూట అన్నం తినకుండా ఉపవాసాలు ఉండాలనుకునేవాళ్ళు ‘ఫలహారం’ అంటే ఏ అరటిపళ్ళో తిని గ్లాసు మజ్జిగ తాగి పడుకోవాలి. కానీ, ఇడ్లీలు, అట్లు, వడలు వీటిని తేలికపాటి ఆహారం అంటూ, లైటుగా తీసుకున్నామని భావించుకోవటం అన్యాయం. శనగచట్నీ, అల్లప్పచ్చడి. నెయ్యి కారప్పొడి, సాంబారు ఇన్నింటితో తిన్న ఇడ్లీ కన్నా అన్నమే మిన్న!
బియ్యపు రవ్వని సంబారాలేమీ లేకుండా కేవలం జీలకర్ర తాలింపు పెట్టుకుని తినటాన్ని ‘ఉప్పిడి ఉపవాసం’ అంటారు. ఇది ఇడ్లీకన్నా మేలైన ఆహారం. శరీరాన్ని శుష్కింపచేస్తుంది. కేలరీలను, కొవ్వునీ పెంచదు. నూనెలు కక్కే, మషాలాలు మండే కర్రీలతో బట్టర్ నానులు తింటూ డైటింగు చేస్తున్నా మనుకోవటం అనాలోచనే అవుతుంది.
కొలిచి చూస్తే, అన్నం కన్నా టిఫిన్ల ద్వారా ఎక్కువ కేలరీలు, కొవ్వు, అనేక విషపదార్ధాలు, మషాలాలు మన కడుపులోకి వెడుతున్నాయి. తాజాగా పీజాలు, బర్గర్లు కూడా ఈ టిఫిన్ల జాబితాలో చేరాయి. మనకు నోరుతిరక్కుండా చం చం, జంజం అనే పేర్లు పెడితే మనం ఒళ్ళు మరిచి తినేస్తున్నాం. టిఫిన్లు ఇలా మనల్ని నానారకాలుగా భ్రష్టు పట్టిస్తున్నాయి. డైటింగ్ చేయాలంటే టిఫిన్లకు బదులు కొద్దిగా అన్నమే తినండని వైద్యులు సూచించాల్సిన పరిస్థితి వచ్చేసింది. దేవుడికి హాయ్ చెప్పి పీజ్జాలు, బర్గర్లు, చైనా నూడిల్స్ మహానివేదన పెట్టే కాలం దరిదాపుల్లోనే ఉంది.
2017 ఏప్రిల్ నెల ఆంధ్రప్రదేశ్ పత్రికలో ప్రచురితం

భగవంతుడు చెడుని సృష్టించాడా?

🐤భగవంతుడు చెడుని సృష్టించాడా?🐤

🤔ఒక విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసరుగారు పరమ నాస్తికుడు. అంతవరకూ ఫర్వాలేదు కానీ ఆయన వీలయినప్పుడల్లా తన తరగతి గదుల్లో భగవంతుని గురించి ఎగతాళిగా మాట్లాడుతూ ఉండేవారు. అలాగే ఓ రోజు దేవుడి గురంచి కాసేపు విద్యార్థులను ఆటపట్టిద్దామనుకుంటూ తరగతిలోకి ప్రవేశించారు ప్రొఫెసరుగారు…
‘ఈ ప్రపంచంలో ప్రతిదానినీ భగవంతుడే సృష్టించాడని మీరనుకుంటున్నారా?’ అంటూ విద్యార్థులను సూటిగా అడిగారు ప్రొఫెసరుగారు.
‘ఓ! ఆ విషయంలో మాకెలాంటి అనుమానమూ లేదు!’ అని బదులిచ్చారు ఆస్తికులైన కొందరు విద్యార్థులు.
‘మీరు చెప్పినదాని మీద మీరు నిలబడతారా?’ అని మళ్లీ ప్రశ్నించారు ప్రొఫెసరుగారు.
‘తప్పకుండా!’ అన్నారు విద్యార్థులు.
‘అయితే మీరన్న మాట ప్రకారం భగవంతుడు పరమ దుర్మార్గుడై ఉండాలి. ఎందుకంటే మీ మాటల ప్రకారం అతను ఈ లోకంలోని చెడునీ, స్వార్థాన్నీ కూడా సృష్టించి ఉండాలి కదా! అంచేత దేవుడు దుర్మార్గుడన్నమాటే’ అనేశారు.
ప్రొఫెసరుగారి మాటలకి ఏం జవాబు చెప్పాలో విద్యార్థులకి అర్థం కాలేదు. తరగతి మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇంతలో ఓ విద్యార్థి లేచి ‘ప్రొఫెసరుగారూ మీరు మమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు కదా! మేం కూడా మిమ్మల్ని ఓ ప్రశ్న అడగవచ్చా!’ అని అడిగాడు.
‘తప్పకుండా’ అన్నారు ప్రొఫెసరుగారు నిర్భయంగా.
‘మీ దృష్టిలో చలి అనేది ఉందా?’ అని అడిగాడు సిగ్గుపడుతూ.
‘ఏం నీకెప్పుడూ చలి వేయలేదా’ అని ఎగతాళి చేస్తూ ‘ఈ ప్రపంచంలో వేడి ఉంటే చలి కూడా ఉన్నట్లే కదా!’ అన్నారు.
‘కానీ భౌతికశాస్త్రం రీత్యా వేడి లేకపోవడమే చలి. అంతేకానీ చలి ప్రత్యేకించి ఉండదు. ఎంత వేడిగా ఉందని కొలుస్తారు కానీ ఎంత చల్లగా ఉందో కొలవరు కదా! వేడి తగ్గుతున్న కొద్దీ దాన్నే చలిగా భావిస్తాము. సరే. ఇప్పుడు ఇంకో ప్రశ్నని అడుగుతాను. మీ దృష్టిలో చీకటి ఉందా!’ అన్నాడు విద్యార్థి.
అప్పటికే విద్యార్థి మాటలో ప్రొఫెసర్‌గారికి కాస్త ఇబ్బందిగా ఉంది. అయినా మాటలు కూడగట్టుకుని ‘తప్పకుండా! చీకటి లేకపోవడమేంటి. రాత్రి అయితే చీకటి ఎలా ఉంటుందో చూడవచ్చు కదా!’ అన్నారు.
‘ప్రొఫెసర్! మీ విజ్ఞానం ప్రకారం చీకటి అనేది ప్రత్యేకంగా ఉండదు. వెలుతురు లేకపోవడమే చీకటి. ఆ వెలుతురిని రకరకాలుగా పరిశోధించవచ్చు. అందులోంచి వెలువడే సప్తవర్ణాలను చూడవచ్చు. చూడటం అన్నదే వెలుతురుతో సాధ్యమవుతుంది. అది లేకపోవడమే చీకటి.’ అన్నాడు.
ప్రొఫెసర్ గారికి ఈ వాదన ఎక్కడికి వెళ్తుందో అర్థం కాలేదు. అప్పుడు అడిగాడు విద్యార్థి…. ‘సర్‌! ఇప్పుడు చెప్పండి. ఈ ప్రపంచంలో చెడు ఉందా!’ అని
‘లేకపోవడం ఏంటి! పొద్దున్నే లేచిన దగ్గర్నుంచీ ఎన్ని ఘోరాలు చూడటం లేదు. ఎన్ని దారుణాల గురించి చదవడం లేదు. ఇవన్నీ చెడుకి మరో రూపం కాక ఇంకేంటి!’ అని అన్నారు ఆవేశంగా.
‘అయ్యా! మీరన్నట్లు చెడు ప్రత్యేకించి ఉండదు. మంచితనం, విచక్షణ, సహనం లోపించడమే దుర్మార్గం. ఎలాగైతే వేడి లేకపోవడాన్ని చల్లదనం అనీ, వెలుగు లేకపోవడాన్నీ చీకటి అనీ అంటామో… మంచితనం లేకపోవడమే చెడు. భగవంతుడు చెడుని సృష్టించలేదు. ఆయన కరుణనీ, ప్రేమనీ సృష్టించాడు. మనలో అవి లోపించినప్పుడే దుర్మార్గం ప్రాణం పోసుకుంటుంది! ఇప్పుడు చెప్పండి భగవంతుడు దుర్మార్గుడా?’ అని అడిగాడు.
దానికి ప్రొఫెసరుగారి దగ్గర ఎలాంటి జవాబూ లేకపోయింది. 🤔

Source - whatsapp sandesam

మానవులు గా బతకటం కాదు మానవత్వం తో బతకాలి.

కొన్ని నమ్మపలికిన విషయాలు

మానవులు గా బతకటం కాదు మానవత్వం తో బతకాలి.

ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి

ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు

దేవుడి కోసం తీర్ధాలు, పుణ్య క్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడో లేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనే వున్నాడు.

కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో

కొబ్బరిచెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగే కొద్దీ తన పర భేదాలు తొలగి పోతాయి.

పుండు మానితే పొలుసు అదే పోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభం లేదు !

సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి.

నీపై నమ్మకం నీకు బలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీ బలం ఎవరికీ తెలియక పోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !

మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసిన వారు వదిలిపెట్ట లేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణం పోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది

నీ పరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో.

వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ?

నిజాయితీపరులు సింహం లాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !

ముని-మహర్షి-తపస్వి-యోగి.. వీరు వేరు వేరు.

మౌనంగా వుండేవాడు ముని.
నియమ నిష్టలతో తపింప చేసుకునే వాడు తపస్వి.

అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి.
ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి.


#పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !

ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నా వాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు

వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మ వుందో లేదో తెలీదు._

నువ్వు 'నా వాళ్ళు నా వాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళ వాళ్ళ కోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !

అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈ మాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటం లోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !

మరణం దగ్గర పడితేనే మహా సత్యాలు బోధపడ్తాయ్.

పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది. వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగమొస్తే నీ బదులు భరించటానికి ఎవరూ దొరకరు.

వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు తెరపడే రోజు ఏం తెలిసినా ప్రయోజనమేంటి ?

పక్కనెంత మందున్నా, ఎంత సంపదున్నా ఏంటి ?
30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే.. పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా వదిలేసే పోవాలి !

జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు

మానవులుగా బతకటం కాదు.
మానవత్వంతో బతకాలి.

Source - whatsapp sandesam

ఐశ్వర్యం పరమార్థం

🙏 ఐశ్వర్యం పరమార్థం 🙏

ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది.

జీవితం కూడా అంతే...

ఏంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది.

• అదేదో ఏంజాయ్ చేసిపోతే, ఆ జీవితానికి ఓ పరమార్థం వుంటుంది.
తర్వాత నరకం, స్వర్గం అంటారా?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు.

• తాగినోడు ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు కాదు.
• పోని తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే, ఆ గ్యారంటీ లేదు.
• ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది.

ఫైనల్ గా చెప్పదేంటంటే...

టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త.

• ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా?
• లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా!.

ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!
• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం.
• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం.
• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం.
• అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం.
• భార్య చూసే ఓర చూపు ఐశ్వర్యం.
• పచ్చటి చెట్టు, పంటపొలాలు ఐశ్వర్యం.
• వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం.
• పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం.
• మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం.
• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం.
• ప్రకృతి అందం ఐశ్వర్యం.
• పెదాలు పండించే నవ్వు ఐశ్వర్యం.
• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు ఐశ్వర్యం.
• బుద్ధికలిగిన బిడ్డలు ఐశ్వర్యం.
• బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం.
• భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం.
• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి ఐశ్వర్యం.
• పరులకు సాయంచేసే మనసు మన ఐశ్వర్యం.

ఐశ్వర్యం అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు.
• కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం.
• మనసు పొందే సంతోషం ఐశ్వర్యం.
💐🙏💐👏💐👍💐👌💐🙏.

Source - whatsapp sandesam

Thursday, June 25, 2020

చెడు భావాలను తొలగించడం ఎలా

చెడు భావాలను తొలగించడం ఎలా

మీ భావాలను మార్చుకోవడం ద్వారా మీ జీవితంలో మీరు ఏమైనా మార్చుకోవచ్చు

ఏ విషయంలోనైనా భావాలను మార్చుకో గానే విశ్వం మారిపోతుంది

కానీ నీ లోని చెడు భావాలను వదిలించుకోవడానికి ప్రయత్నించకండి చెడు భావాలను మార్చుకోవాలని ఆలోచిస్తుంటే ఆలోచన మొత్తం చెడు పైనే ఉంటుంది ఎందుకంటే అవన్నీ మీలో ప్రేమ లోపించడం వల్ల కలిగినది అందుకోసం మీరు ఆ విషయాలలో ప్రేమభావం నింపడానికి ప్రయత్నించండి

కోపాన్ని దుఖాన్ని ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టాలని ఆలోచించకండి కోపంలో దుఃఖంలో ప్రేమను నింపండి ప్రేమను నింపి నప్పుడు చెడు భావాలు వాటి కవి మారిపోతాయి ఒకేసారి మనసు రెండు విధాలుగా ఎప్పుడూ ఆలోచించదు

మన శక్తి మన మనసులో ఉంటే దివ్యశక్తి పేరే డివైన్ లవ్

వీరు మంచి భావనలో ఉంటే నీలో డివైన్ లవ్ ఉన్నట్లు
చెడు భావనలు ఉంటే మీలో డివైన్ లవ్ మిస్ అయినట్టు

చెడు భావాలని వద్దు వద్దు అని ఆలోచిస్తూ ఉంటే చెడు డామినేట్ చేసి మన వద్దకు మళ్లీ మళ్లీ వస్తూ ఉంటుంది
కాబట్టి చెడు భావాలతో పోరాటం చేయరాదు చెడు భావాలు అనేవి జీవితంలో ఒక భాగం మనం అంశం చేయలేము ఎందుకంటే అది ప్రకృతిలో ఒక భాగము

చెడు భావాలు వస్తుంటే మరింత ప్రతికూలత తో ఆలోచిస్తూ ఉంటే వాటిని శక్తి పెంచినట్లు

అందమైన జీవితం పొందడానికి చెడు భావనలు ఏమాత్రం సహాయం చేయలేవు అని అర్థం అయితే చాలు

చెడు భావాలు అడవి గుర్రాలు లాంటివి
కోపంతో ఉన్న ఒక గుర్రం చెరువులు లాడే ఒక గుర్రం నిందించే ఒక గుర్రం ముఖం ముడుచుకున్న ఒక గుర్రం చిచాకు పడే ఒక గుర్రం ఇలా చాలా గుర్రాలు ఉంటాయి

ఏదైనా ఒక విషయంలో ఆశా భంగం కలిగినప్పుడు నువ్వు ఆశాభంగం అనే గుర్రంపై నుంచి ముందు క్రిందికి దిగాలి మీకు తెలియకుండా ఏదైనా అడవి గుర్రాన్ని నువ్వు ఎక్కినప్పుడు తక్షణం ఆ గుర్రాన్ని పైనుంచి కిందికి దిగి పోవాలి భావనని సృష్టించుకోవాలి...
🥢🌿🥢🌿🥢🌿🥢
మీ....పి.సారిక...

Source - whatsapp sandesam

ఇది ఆనందం కాదా! ఇందులో ఆనందం లేదా?

ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

కళ్ళు- కాళ్ళు, ముక్కు- మొగము
అన్నీ సరిగా ఉన్నాయి చాలదా
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

రోగాలు- రొచ్చులు , వ్యాధులు-బాధలు లేవు
రాళ్లు తిన్నా ఆరాయించుకునే శక్తి ఉంది చాలదా
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

అన్నమో రామచంద్రా! అని అలమటించే వారున్నారు
అన్నం తిన్నా అరాయించుకోలేని వారున్నారు
ముక్కల్తో ముప్పూటలా తింటున్నాము ఆరాయించుకుంటున్నాము
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

అక్షరంముక్క రాని వారున్నారు
ఆలోచించలేని వారున్నారు
చక్కగా చదువుకున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

చక్కగా చదివి,చేత మంచి డిగ్రీలు పట్టిన వారున్నారు
మన కంటే గొప్పగా మంచి మార్కు లున్నవారున్నారు
అయినా వాళ్ళు రోడ్డు మీదుండొచ్చు
మనం మారాజుల్లా బతుకుటుందొచ్చు
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

మన చుట్టూ పెళ్లికాని వారున్నారు
పెళ్ళైతే ..పిల్లలు లేని వారున్నారు
మనకి పెళ్ళాం పిల్లలు ఉండొచ్చు
వారితో హాయిగా గడుపుతుండొచ్చు
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

డబ్బుల్లేని వారున్నారు
డబ్బులున్నా..జబ్బులతో బాధ పడేవారున్నారు
మనకి అవసరానికి డబ్బు అందితే చాలు
జబ్బుల గబ్బు లేకుంటే అదే పదివేలు
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

నిలువ నీడ లేని వారున్నారు
గుడ్డ గుడిసె గూడు లేని వారున్నారు
మనకి ఉండటానికి అద్దె ఇళ్లయినా ఉన్నాయి
గుడ్డ గుడిసె గూడు అన్నీ ఉన్నాయి
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

ఉన్నదానితో ఆనందించటం నేర్చుకోవాలి
లేనిదానికి అర్రులు చాచటం మానుకోవాలి

అందని దానికి ఆరాటం వదులుకోవాలి
అందినదాని విలువ తెలిసి మసలుకోవాలి

నీలో ఉన్న ఆనందం కోసం బయటెక్కడో వెదకకు
బయట ఉన్న బురదను నీలోకి తెచ్చుకోకు.

ఆనందం అంటే .. కొత్త పదం కాదు కొనుక్కోవడానికి
ఆనందం అంటే..పాతపదం
వెదుక్కోవటానికి.
👏👏👏👏👏

Source - Whatsapp sandesam

అందరి మన్ననలు పొందుతూ, ముందుకు సాగిపోవడం లోనే ఆనందం ఉందిగా..

ఒక వ్యక్తిని లొంగదీయలన్నా. కించపరిచాలన్నా. తగ్గి ఉంచాలన్న. మొదటి చేసేది మాటల దాడి.. మనకు నచ్చినట్లు మలచుకోవడానికి, మనకిoదా లొంగి ఉంచడానికి చాలా తేడా ఉంది.. మనకు నచ్చినట్లు ఉంటూ, ఇతరులు మెచ్చినట్లు ఉండాలి. అందులోనే ఉంది మన గొప్పతనము.. నీ ఆలోచనలను అభిప్రాయాలను, కించపరుస్తూ,నిను జడ్జి చేస్తూ సాగుతుంది మానసికమైన దాడి.. నీ పై ఉన్న నీ నమ్మకాన్ని, నీలో ఉన్న నిబ్బరాన్ని బలహీన పరిచేందుకు, శత్రువులకు ఉన్న ఆయుధమే మాటలు.. ఆ సమయంలో నీవు మౌనం వహించటం మంచిది. దాని కంటే నీకు మంచి ఆయుధం లేదు.. సొంతవారము అంటూ కూడా కొందరు చేసే పని ఇదే.. దానికున్న పేరు, నీమంచి కోసం అనటం, నీకే తెలియదు అనటం.. చెడ్డ వారంటూ ఎవరూ ఉండరు.. వారి వారి మానసిక స్థితి బట్టి, నీవు మసులుకో వటము లోనే ఉంది నీగొప్పతనము.. నీవు మానసికంగా, దృఢంగా, ఉన్న రోజు నీవు తీసుకున్న నిర్ణయాలు నీకు బలం చేకూర్చుతాయి.. మనల్ని చూసి ఎదుటి వారు అలవాటు, అభిప్రాయాలు, మార్చుకునై విధంగా మనం ఉన్న రోజు, నీకు శత్రువు అంటూ ఎవరూ ఉండరు.. మిత్రమా మాటలు చాలా పదునైనవి. వాడే విధానము బలాన్నిచ్చే మన మాట గా ఉండాలి.. అప్పుడే నువ్వు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది.. మిత్రమా మాట చాలా నమ్మకమైనది. వాడే విధానం మారితే బలాన్నిచ్చే మాట కూడా గాయాన్ని చేస్తుంది.. శత్రువుల మధ్య ఉండేది పోరు.. మిత్రుల మధ్య ఉండేది గౌరవం.. నీకు నచ్చినట్లు అందరూ ఉండాలని అనుకుంటే, నీకు నువ్వు ఈ లోకంలో తోడు అవ్వగలవు.. మరి ఎవరు తోడు అవ్వలేదు.. సొంతం అనుకునేవారుకి నీవు ఇవ్వాల్సింది స్వేచ్ఛ, దైర్యం, విలువ కానీ ఆకాంక్షలు తీర్పులు కాదుగా.. శత్రువుకు, మిత్రుడికి, ఒకటే పద్ధతి ఉంటే.. ( బంధం) అనే సరసాల లో ఎవరు ఎక్కువ రోజులు ఉండలేరుగా.. అందించే చెయ్యి ఆయుధమై గాయాలు చేస్తే భరించేది ఎన్నాళ్ళు నీవెంట నడవదు కదా.. మన, పరాయి, అనే వాటికి తేడా లేకుండా మాటలు వాడితే, జ్ఞాపకాలు కూడా మిగలవు అక్కడ.. చులకన చేయడం కాదు , స్వీకరించడం చేయూతనివ్వాలి.. నిన్ను మెచ్చినట్లు ఉంటూ, ఇతరులకు నచ్చినట్లు ఉంటేనే, నీ వారు అంటూ నీ చుట్టూ ఉన్న వారికి చోటు ఉంది కదా.. నీకు మేలు చేసిన వారు, ఎన్నడూ నీకు కీడు చెయ్యడు.. చేసిన మేలు మరచిన.. చేసిన ద్రోహం జ్ఞాపకం ఉంటుందిగా.. అది మరచి నీ వెంట నడుస్తున్నారు అంటే, నీవు బలమైన ఆయుధం అనేగా.. నిన్ను నువ్వు తెలుసుకున్న నాడు, నీకు ఎదురు లేదుగా.. ఈ లోకంలో ఏదీ మన వెంట రాదు.. కాటికి కాలు చాపిన రోజు, నీ వెంట వచ్చేది ఆ నలుగురే కదా.. ఎవరు బాధలో ఉన్న కన్నీరు కార్చే హృదయము.. అందరూ తన వాళ్ల అనుకునే గుణము.. ఇవి ఎప్పుడూ మనలో ఉన్నంత వరకూ ఆభగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.. అందరి మన్ననలు పొందుతూ, ముందుకు సాగిపోవడం లోనే ఆనందం ఉందిగా.. 🙏🙏

Source - WhatsApp sandesam

విశ్వమత గ్రంధం ఏమిటి?

#విశ్వమత గ్రంధం ఏమిటి?
💐🙏💐🙏💐🙏💐🙏💐🌼🌼🌼🌼🌼🌼

🌸 #ఈ లోకంలో ప్రతి మానవుడు సుఖాన్నే కోరుకుంటాడు. ఎంత తెలివి తక్కువ వాడు కూడా #దుఃఖాన్ని కోరుకోడు. కోరకపోయినా పూర్వజన్మ కర్మల ఫలితంగా రావలసిన సమయంలో దుఃఖాలు వస్తూనే ఉంటాయి.

#అలా వచ్చినప్పుడు ఈ దుఃఖం ఎప్పుడు పోతుందా? 🙏🌷

#తిరిగి ఎప్పుడు సుఖం వస్తుందా?
అని ఎదురు చూస్తాడు. ఎదురు చూడటమే కాదు. ఆ సుఖంకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. డబ్బు #సంపాదిస్తాడు, వస్తువులు తెచ్చుకుంటాడు. ఇతరుల సాయం అర్ధిస్తాడు. అనేక వస్తువులు కనిపెడుతుంటాడు, తన వృత్తిని మారుస్తాడు, వ్యాపారాన్ని మారుస్తాడు, ఉద్యోగాన్ని మారుస్తాడు, ఉన్న ఊరిని మారుస్తాడు, తన దేశాన్ని కూడా వదిలి #విదేశాలకెళతాడు, పెద్దవాళ్ళతో స్నేహం చేస్తాడు, శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమిస్తాడు - ఇలా ఎన్నో, ఎన్నెన్నో చేస్తాడు. వీటి ఫలితంగా దుఃఖాలు పోవచ్చు, సుఖాలు రావచ్చు. కాని ఆ సుఖాలు శాశ్వతంగా ఉండటం లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఆ #సుఖాలు దూరమై, మళ్ళీ దుఃఖాలు దరిచేరతాయి. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడ్డా మానవుడు తాను కోరుకున్న సుఖాన్ని, ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. ఎందువల్ల ? తాను #కోరుకొనేది శాశ్వత ఆనందమే గాని, తాత్కాలిక ఆనందం కాదు.

#ఎప్పుడూ ఉండే సుఖం - ఎప్పుడూ ఉండే ఆనందమే కావాలి. అప్పుడే తపన తీరేది, అన్వేషణ #ఆగేది.🍀🍂

🌸 #అట్టి శాశ్వత ఆనందం, నిత్యసుఖం ఎన్ని వస్తువులు సంపాదించినా, ఎందరు వ్యక్తులను దరిచేర్చుకున్నా, ఎన్ని పరిస్ధితులను, స్ధితులను మారుస్తున్నా రావటం లేదు. అనిత్యమైన సుఖమే వస్తున్నది ఎందువల్ల?🌸🌺

🌸 #మనం కోరుకొనేది నిత్యసుఖాన్ని, కాని పట్టుకొనేది అనిత్య వస్తువులను. అనిత్య వస్తువులు అనిత్యమైన సుఖాన్నే ఇస్తాయిగాని నిత్యసుఖాన్ని ఇవ్వలేవు. నిత్యవస్తువు మాత్రమే నిత్యసుఖాన్నిస్తుంది. మరేమిటి ఆ నిత్యవస్తువు ?

#నిత్యవస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం #సర్వమనిత్యం"

#నిత్యవస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. పరమాత్మకన్న వేరైన సమస్తమూ అనిత్యమే - అని శంకరాచార్యులవారు 'తత్త్వబోధ' అనే ప్రకరణ #గ్రంధంలో తెలియచేసారు 🌼🙏

🌸 కనుక ప్రతిమానవుడు నిత్యమైన పరమాత్మను మాత్రమే పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే అనిత్య వస్తువులు, విషయాలు, భోగాలు మొదలైన వాటి #పట్టు నుండి విడిపించుకోవాలి. ఈ అనిత్య వస్తువుల పట్టు నుండి విడిపించుకొని శాశ్వతమైన పరమాత్మను ఆశ్రయించి, పరమాత్మతో ఇక్యమై పోవుటకే మనకు ఈ మానవజన్మ వచ్చింది. ఈ #మానవ జన్మలోనే దీనిని సాధించాలి. అలా సాధిస్తేనే ఈ జన్మసార్ధకం. సాధించలేనిచో ఈ జన్మ వ్యర్ధం.

🌸 #మరి ఎలా సాధించటం? 🙏

#ఎలా ప్రాపంచికవిషయ వ్యామోహాన్ని వదలటం?

#ఎలా పరమాత్మను తెలుసుకొని, ఆశ్రయించి, అందుకోవటం?
ఎలా సమస్త దుఃఖాల నుండి శాశ్వతంగా నివృత్తి చెంది అనంతమైన, అఖండమైన, దుఃఖ రహితమైన శాశ్వత ఆనందాన్ని పొందటం? 🍀

#ఈ అన్ని సందేహాలకు ఖచ్చితమైన సమాధానమే
భగవద్గీత🍂🍀

🌸 #భగవద్గీత సర్వ ఉపనిషత్తుల సారం, యోగ శాస్త్రం, బ్రహ్మ విద్యా ప్రతిపాదిత గ్రంధం. ఇది మోక్ష శాస్త్రం. అన్ని వేదాల, ఉపనిషత్తుల, సమన్వయ శాస్త్రం. అన్ని శాస్త్రాలను, సిద్ధాంతాలను మధించి #వెలికి తీసిన సార సంగ్రహం. 🌸🌹

#ఒక్క హిందూమతానికేగాక, అన్ని మత సాంప్రదాయాలకు సబంధించిన ప్రధాన సూత్రాలను, ధర్మాలను క్రోడీకరించిన సర్వ ధర్మ సమన్వయ క్షేత్రం ఇది. 🌹🌷

#అందుకే దీనిని విశ్వమత గ్రంధం అన్నారు
.

#ప్రపంచంలోని 42 భాషలలోనికి అనువదించబడి, 125 దేశాలలో పరిచయమున్న అద్భుత గ్రంధం #భగవద్గీత. 🌿🌼

#అన్ని కాలాలలోని, అన్ని దేశాలలోని మానవులందరి జీవిత సాఫల్యానికి కావలసిన సమస్త విషయాలను తెలియజేసిన సమగ్ర గ్రంధరాజం భగవద్గీత. 🍀🍂

#ఎందరో మహాత్ములు మహానుభావులు, ఆచార్యులు, పీఠాధిపతులు, స్వామీజీలు ఈ గీతాసాగరంలో మునిగి, అనర్ఘమైన రత్నాలను చేజిక్కించుకొని వాటిని సామాన్య మానవులకు పంచుతూనే ఉన్నారు.🌹🌻🍀

🌼🙏ప్రతి ఒక్కరూ ఈ గ్రంథ రాజాన్ని తమ వద్ద ఉంచుకొని చదవాలి,పిల్లలకు నేర్పించి జన్మను సాకారం చేసుకోవాలి........🌻🌹🌷

స్వస్తి........

సనాతన ధర్మస్య రక్షిత-రక్షితః
*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Source - whatsapp sandesam

ఆత్మ ఘోష

👻👻👻ఆత్మ ఘోష👻👻👻

శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బతికినా శవం అనే అంటారు,

సమయం మించకుండా తీసేయండి అని పెద్దలు అంటున్నారు,

భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్లిపోయారు..

అప్పుడు మొదలు అవుతుంది ఆత్మ ఘోష ...నా భార్య నా పిల్లలు నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళ్తాడు. అతను ఎవరికీ కనిపించడు వినిపించడు ఇది నా ఇల్లు నా వస్తువులు నా ఆస్తి అని నిన్నటి వరకు కాపాడుకున్న ఏది నాతో తీసుకుని వెళ్లలేకపోయానే.... వీటి కోసమా జీవితం అంతా కష్టపడ్డాను.. అని ఏడుపు మొదలు అవుతుంది..

గుండె పగిలేలా ఏడుస్తున్న భార్యను చూసి ఉన్నన్ని రోజులు ఎదో సాకుతో సాదించాను కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేది ఇప్పుడు ఓదార్చే శక్తి కూడా లేదు..అని అప్పుడు అనిపిస్తుంది .

కుటుంబ సభ్యులను చూసుకుని చేసిన పోరాబాట్లు గుర్తు చేసుకొని ఒక్కసారి భగవంతుడు బతికిస్తే అందరికి క్షమాపణ చెప్పుకుని మళ్ళీ నీ దగ్గరకు వస్తాను తండ్రి అని ఆత్మ ఘోషిస్తుంది,

చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషం గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ఎక్కడైతే వదిలేసారో అదే స్మశానానికి తిరిగి వెళ్లి అక్కడ ఒంటరిగా రోదిస్తూ భగవంతుడా అని పిలవ గానే ఓ స్వరం వినిపిస్తుంది నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నాను బయపడకు అని ,ఎవ్వరూ రాని చోటికి ఏ దిక్కు లేని చోట కూడా నీ కోసం శివుడు ఉన్నాడు... అప్పుడు కనిపిస్తాడు దేవుడు.

అప్పటివరకు ఆత్మ ఘోషతో రోదిస్తున్న ఆత్మ.. ఏమైయ్యా బతికి ఉండగా ఎన్నిసార్లు పిలిచి ఉంటాను..ఎంత మొక్కి ఉంటాను ఏనాడైన ఇలా వెంటనే పలికావా ఇప్పుడు మటుకు ప్రత్యక్షం అయ్యావు అని అడుగుతుంది ఆత్మ ,

శివయ్య అంటాడు నేను నువ్వు పిలిచిన ప్రతి సారి పలుకుతూనే ఉన్నాను కానీ నువ్వు వినలేక పోయావు.
నువ్వు ఒకసారి పిలిస్తే నేను 108 సార్లు పలుకుతాను అది నీకు వినపడాలి అని ....కానీ నువ్వు బతికి ఉన్నంత కాలం నేను నాది అనే మాయలోనే ఉన్నావు.. ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అన్న సత్యాన్ని గ్రహించావు కనుకే నా మాట వినగలిగావు.. స్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్న నేను ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను నీ ప్రతి కష్టంలోనూ తొడుగానే ఉన్నాను దాటిస్తూనే ఉన్నాను కానీ అదంతా నువ్వే చేస్తున్నావు అనుకున్నావు కనుక నన్ను గుర్తించలేక పోయావు.......
నువ్వు వచ్చే టప్పుడు నువ్వు పోయే టప్పుడు నీతో వస్తున్నది నీ కర్మ మటుకే ఇంక ఏదీ నీతో రాదు అని శివయ్య చెప్పాక......
ఏది శాశ్వతం కాదు అని గ్రహించిన ఆత్మ శాంతించి వెళ్ళిపోతుంది.
ఋణ బంధం ఉన్నంత వరకే ఈ జీవితం.. దేహం తట్టుకునే వరకే ప్రాణం తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే ప్రాణం పోతుంది....ఇంకో కొత్త దేహాన్ని వెతుక్కుంటుంది ప్రాణమే అలా ఉన్నప్పుడు ఇంక ఋణను బంధాలు ఎలా ఉంటాయి!! ఆలోచించండి......ఓం నమఃశివాయ🙏🙏🙏🙏🙏🙏

Source - WhatsApp sandesam

పత్రం పుష్పం ఫలంతోయమ్

పత్రం పుష్పం ఫలంతోయమ్


చాలా పేదరాలైన ఒక వృద్ధురాలు పరమాచార్య స్వామివారిపై పరమ భక్తితో తనకున్న అత్యంత అల్పమైన ధనంతో పొదుపుగా జీవనం సాగిస్తోంది. వేదవిహితమైన పరమ ధార్మిక జీవనం గడుపుతూ, నిజమైన భక్తురాలిగా రోజులు గడుపుతోంది. ఆమె ప్రతీరోజూ పరమాచార్య స్వామివారు ఉపయోగించే స్థలాలను శుభ్రపరచి, రంగవల్లులతో అలంకరించి దీపం వెలిగించేది. ఆమె మొత్తం ఆస్తి కేవలం రెండు చీరలు అంటే. మూడవది కొనగలిగే ఆర్థిక స్థితి కూడా లేదు.
స్వామివారి భక్తుడోకసారి చాలా పెద్ద మొత్తంలో బియ్యము, బెల్లము సమర్పించాడు. అది సరైన విధంగా ఉపయోగించాలి కదా? అందుకే స్వామివారు ఈమెను ఎంచుకున్నారు.
“కాంచీపురంలో ఉన్న ప్రతీ చీమలపుట్ట వద్దకు వెళ్ళి, అందులో వీటిని కొద్దిగా వెయ్య”మని స్వామివారు ఆజ్ఞాపించారు.


ఆమె విధేయత ఎటువంటిదో అందరికీ తెలుసు. మొత్తం కాంచీపురం అంతా తిరిగి, ఎన్నో పుట్టలను వెతికి పట్టుకుని అందులోకి బియ్యము, బెల్లము వేసింది. ఇది చూడడానికి చిన్న విషయంలా కనిపించినా అన్నీ పుట్టలను కనుక్కోవడం చాలా కష్టం. మహాస్వామి వారి అనుగ్రహంతో ఈ పని పూర్తిచెయ్యగానే, స్వామివారామెకు పెద్ద వత్తుల దండ, నూనె డబ్బా ఇచ్చి, “దీన్ని చిన్న చిన్న దీపపు వొత్తులుగా కత్తిరించి, ప్రతీ దేవాలయానికి వెళ్ళి, నీకు ఎన్ని వీలైతే అన్నీ దీపాలను వెలిగించు. రోజూ రెండు మూడు దేవాలయాలకు వెళ్లగలితే చాలు” అని ఆజ్ఞాపించారు.


స్వామివారి నుండి మరొక్క ఆదేశం వచ్చింది. ఆ వృద్ధురాలు వినగానే ఎంతో సంతోషంతోషించింది. స్వామివారి ఆజ్ఞానుసారం రోజూ వీలైనన్ని దేవాలయాలకు వెళ్ళి కొద్దిరోజుల్లోనే ఇచ్చిన పనిని పూర్తిచేసింది. ఆ విషయం స్వామివారికి చెప్పెటప్పుడు తన ఆనందానికి అవధులు లేవు.


అందరికీ తెలిసినట్టు, స్వామివారు ఏమి చేసినా దానికొక బలమైన కారణం ఉన్నట్టు, ఈవిడతో ఈ పనులు చేయించడంలో కూడా ఏదో కారణం ఉండిఉంటుంది.
ఒకరోజు శ్రీమఠానికి పెద్ద డాబు దర్పంతో ఒక ధనిక వ్యక్తి వచ్చాడు. అతను వచ్చిన క్షణం నుండి తన సంపదను ప్రదర్శించడం, నిర్లక్ష్య ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తన గురించి తాను గొప్పగా భావిస్తూ, సంస్కార హీనుడిగా ప్రవర్తిస్తున్నాడు. అహంకారం తొణికిసలాడుతున్న మాటలతో, “నేను సహస్ర భోజనం (వెయ్యిమందికి అన్నదానం) చేసి ఇక్కడకు వచ్చాను. అంతేకాదు, లక్ష దీపాలను వెలిగించాను” అని చెప్పాడు.


ఆ ధనవంతుని అహంకారము, గర్వము స్వామివారికి తెలుసు. మంచి పనులు చేసి వాటి గురించి గొప్పగా చెప్పుకుంటే దాని ఫలితం ఉండదు. అటువంటి చర్యలవల్ల కలిగిన మంచి అంతా శూన్యమైపోయి, ఆ పుణ్యాన్ని పొందే అర్హతను కోల్పోతాడు. ఇదే విషయాన్ని ఈ వ్యక్తి వినయంతో, భక్తిగా చెప్పివుంటే స్వామివారు చాలా సంతోషించేవారు. కానీ ఇతను అహంకారంతో మాట్లాడాడు. దాంతో స్వామివారు వెంటనే విషయం మార్చాలని మాట్లాడడం మొదలుపెట్టారు.
“ఇక్కడ ఒక వృద్ధురాలు ఉంది. ఆమె కూడా లక్ష భోజనాలు చేసింది. అంతేకాక లక్షల దీపాలను కూడా వెలిగించింది” అని ఆ ధనికునికి చెప్పారు స్వామివారు.


తను చెప్పిన విషయం స్వామివారు ఏమీ వినకుండానే తంలాంటి పనులు చేసిన ఒక వృద్ధురాలు గురించి చెబుతున్నారు స్వామివారు అని ధనవంతుడు ఆలోచనలో పడ్డాడు. అంతేకాక ఆమె తనకంటే ఢంవంతురాలెమో అని కూడా ఆలోచన చేస్తున్నాడు. ఆమె గురించి ఇంకాస్త తెలుసుకోవాలన్న కుతూహలం కూడా హెచ్చింది.
అప్పుడు స్వామివారు ఇతని ఆలోచనలను తెలుసుకుని ఆమెను అక్కడకు పిలిపించారు. “అంతటి పుణ్యకార్యాలు చేసిన వ్యక్తి ఈవిడే” అని ఆమె గురించి చెప్పారు స్వామివారు. చిరిగిన చీరలో ఉన్న ఆ వృద్ధురాలిని చూసి ఆ ధనవంతుడు నిశ్చేష్టుడయ్యాడు. నుదుటన పెట్టుకున్న తెల్లని వీభూతిరేఖలు ఆమె నిర్మలమైన స్వచ్చమైన మనస్సుకు సంకేతంలా ఉన్నాయి.

తరువాత స్వామివారు మాట్లాడనారంబించారు.
“భగవంతుడు అన్నీ జీవరాశులలోనూ ఉన్నాడు. బ్రహ్మ నుండి చీమ దాకా అన్నిటిలో పరమాత్మ ఉన్నాడు. మనుషుల్లో కూడా ఉన్నాడు. నువు వెయ్యి మందికి అన్నం పెట్టావు. కానీ ఈ వృద్ధురాలు లక్షల లక్షల ప్రాణుల ఆకలి తీర్చింది. ఒక దేవాలయంలో లక్ష దీపాలను వెలిగించడానికి కావాల్సిన సంభారాలు ఇచ్చావెమో నువ్వు. కానీ ఈమె ఎంతో భక్తితో విధేయతతో ఎన్నో దేవాలయాలకు వెళ్ళి, స్వయంగా ప్రమిదలను తెచ్చి, నూనె పోసి, వత్తి పెట్టి, తన చేతులతో దీపాలను వెలిగించింది”.
స్వామివారు చెప్పడం ఆపగానే, తన తప్పును గ్రహించి మౌనంగా నిలబడున్నాడు. స్వామివారి ఎదుట అలా అహంకరించి మాట్లాడడం తప్పు అని తెలుసుకున్నాడు. సత్యం గ్రహించగానే ఇతర భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా పక్కకు తప్పుకున్నాడు.


తల్లి కంటే అధికంగా కరుణను కురిపించే స్వామివారు, తప్పు గ్రహించిన ఆ ధనవంతుడిని పిలిచి, దగ్గరగా కూర్చోబెట్టుకుని మాట్లాడి ప్రాసాదం ఇచ్చి పంపారు. మంచి పనులు చేసినప్పుడు అహంకరించకుండా వినయంగా ఎలా ఉండాలో ఆరోజు నేర్చుకున్నాడు.
అవును భక్తితో కేవలం ఒక్క బిల్వదళాన్ని అర్పించినా చాలు, పరమేశ్వరుడైన పరమాచార్య స్వామివారు ప్రేమతో స్వీకరిస్తారు.


--- “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి

🙏🏼🙏🏼🙏🏼

Source - whatsapp sandesam

సాయపడే హృదయం

సాయపడే హృదయం
👌 మనిషి తనను తాను చూసుకున్నప్పుడు తన శరీరం కనిపిస్తుంది. తనకో వ్యక్తిత్వం ఉన్నట్లు అనిపిస్తుంది. తన ఉనికి తనకు స్పష్టంగా తెలుస్తుంది.
నేను అనే భావం మనిషికి చాలా ఆనందం కలిగిస్తుంది. పుట్టుకలో లేని నేను ఎదుగుతున్న కొద్దీ ఎరుకలోకి వచ్చి మొక్క మానైనట్లుగా మహావృక్షంగా పెరుగుతుంది.

నేేను అనేది శిఖరంలా, నాది అనేది ఆధార పీఠంలా మనిషి బతుకుతుంటాడు. ఒక్కోసారి ఒక్కడే అంతా తానే అయి చేస్తున్న భావనకు లోనవుతుంటాడు. అది అతడి మనసు చేసే మాయాజాలం.

ఎక్కడా ఏ సహాయం తీసుకోకుండా గాలికి పుట్టి గండాన పెరిగినట్లు, తనకు ఎవరి అవసరం లేనట్లు ఊహల్లో ఒక్కోసారి మనిషికి అనిపిస్తుంది. అది అందమైన భ్రమ.

నిజానికి మనిషి ఎందరిమీదో ఆధారపడి బతుకుతాడు. ఏ సహాయమూ లేకుండా జీవితం సాగదు.

తల్లిగర్భంలోనే శిశువుకు రూపం ఏర్పడుతుంది. తల్లి బతుకుతో బిడ్డ బతుకు ముడివడి ఉంటుంది. ఇంతకు మించిన సహాయం లోకంలో లేనే లేదు. అందుకే తల్లి రుణం తీర్చడం ఏ బిడ్డకూ సాధ్యం కాదు అంటారు.

పుట్టి భూమ్మీద పడిన శిశువు గాలితో, నీటితో, పాలతో, తల్లి ప్రేమతో బతుకుతాడు. పెరుగుతున్నకొద్దీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో సహాయాల మూలాన మనిషి శరీరాన్ని నిలబెట్టుకుని ఒక వ్యక్తిత్వం సంపాదించుకుంటాడు.

అన్ని వనరులున్నా, అందరూ ఉన్నా- మనిషి మీద మనిషి ఆధారపడి బతకాలి. ఒకరికొకరు సహాయం చేసుకోకుండా మానవ జీవనం ముందుకు సాగదు.

గొప్ప మనుషులు, మహానుభావులు- లోకం తమకు చేసిన సహాయం వల్లనే ఇంతటి స్థాయికి వచ్చామని చెబుతూ ఉంటారు.

శ్రీకృష్ణుడి సహాయం లేకుండా పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చెయ్యగలిగేవారా? శ్రీరాముణ్ని కలిసిన హనుమ చేసిన సహాయం సీతమ్మను చూపించడానికే కదా. దివ్య సహాయాలు దైవ కార్యాల్లో ఎన్నో ఉన్నాయి.

యోగికి యోగంలో సహాయం కావాలి. జ్ఞానికి జ్ఞానంలో సహాయం అవసరం. భక్తుడికి నిరంతరం భగవంతుడి సహాయం తప్పనిసరి.

సహాయం ఒక దివ్యమైన, శక్తిమంతమైన ఆపన్న హస్తం. ఆ చెయ్యి వెనక ఉండి నడిపించకపోతే మహాకార్యాలెన్నో ఆగిపోతాయి.

అవసరమైనప్పుడు సహాయాన్ని కోరాలి. సహాయం కోసం పోరాడాలి. సహాయం కోసం ప్రార్థించాలి. సహాయం కోసం శరణాగతి చెందాలి.

మనుషులు మనుషులకే కాదు, పశుపక్ష్యాదులకూ ప్రేమతో సహాయం చెయ్యాలి.

మనకు మనం అవసరాలకు, ఆపదలకు ఆదుకుంటున్నతీరు చూసినప్పుడు ఈశ్వరుడి మనసు కరుగుతుంది. తనవంతుగా కొండంత బలాన్ని, ధైర్యాన్ని, ఆశీర్వచనాన్ని అందించి దయగల దేవుడు అని నిరూపించుకుంటాడు.

మన కోసం మనం బతుకుతూ ఇతరుల కోసం బతకాలి. సహాయం చెయ్యడానికి ముందుండే మనిషే మనిషి. సహాయం చెయ్యడానికి అవకాశం కోసం ఎదురుచూసే మనిషిదే గొప్ప హృదయం.


యోగక్షేమాలు చూసేవాడు భగవంతుడు. మనుషుల ద్వారా ఎవరెవరికి ఏ సమయానికి ఏ సహాయం చెయ్యాలో క్షుణ్నంగా తెలిసినవాడు ఆయన. అది ఆయన ప్రణాళిక. తనకు కావలసిన పూజ చేయించుకుని, దానికి తగిన ఫలాన్ని ఇచ్చి, అతడి పాపాన్ని తొలగించడానికి చేసే సహాయమే దైవానుగ్రహం.

సహాయం కావాలంటే, సహాయం చెయ్యాలి. ఎప్పుడో ఎవరికో చేసిన సహాయమే ఇప్పుడు మనల్ని సుఖంగా ఉంచుతోంది🙏🏻

Source - whatsapp sandesam

జనసేవయే జనార్ధన సేవగా భావించండి

"ధనాన్ని ఎంతైనా సంపాదించవచ్చు. అయితే, సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచినప్పుడే, ఆ ధనమునకుకూడా తగిన గౌరవము లభిస్తుంది. కానీ, ఈనాడు సంపాదించిన ధనాన్ని ఏ విదేశీ బ్యాంకుల్లోనో పెట్టి, కట్టకడపటికి కన్నుమూసి వెళుతున్నారు. పీల్చుకొన్న గాలిని వదలినప్పుడే, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అదేవిధంగా ధనాన్ని ఒక చేతితో సంపాదించాలి, మరొక చేతితో త్యాగం చేయాలి.

పూర్వం ప్యారిస్ లో ఒక వృద్ధ స్త్రీ ఉండేది. ఆమె చాల బీద స్త్రీ అయినప్పటికీ, తాను సంపాదించిన ధనముతో రెండు, మూడు దుప్పట్లుకొని, రాత్రిపూట చలిలో నిద్రిస్తున్నవారిమీద కప్పేసి వచ్చేది. ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పేది కాదు. ఎప్పుడూ తల క్రిందకు వంచుకొని నడిచేది. కానీ జనులంతా ఆమె త్యాగాన్ని గుర్తించి, "అవ్వా! మీరింత త్యాగం చేస్తున్నారు కదా! తల ఎత్తుకొని తిరుగకూడదా?” అని అడిగారు. అప్పుడీ వృద్ధురాలు చెప్పింది, “నాయనలారా! భగవంతుడు నాకు అనంత హస్తాలతో అందిస్తుంటే నేను ఒక హస్తంతోనే ఇతరులకు దానం చేయటం చాలా అవమానకరంగా ఉంది” అనేదట.

కానీ ఈనాటివారు పది రూపాయలు దానం చేస్తేచాలు, వేయి రూపాయలు ఖర్చుచేసైనా తలకాయంత అక్షరాలతో పేపర్లలో ప్రకటించాలని ఆశిస్తుంటారు. కానీ ఆమే ఇటువంటివి ఏవీ ఆశించలేదు. భారతదేశంలో ఇటువంటివారు ఉండడం చేతనే దేశము సుభిక్షముగానుండగలుగు చున్నది. కనుక సంపాదించిన ధనమును పదిమందికి దానం చేసి, మంచి కార్యాలలో ప్రవేశించండి. జనసేవయే జనార్ధన సేవగా భావించండి. ఇదే మీరు చేయవలసిన సాధన. "🌴_*

Source - whatsapp sandesam

నేను నేనే!

నేను నేనే!
🕉️🌞🌎🏵️🌼🚩

గాలికి సముద్రంలో అల లేస్తుంది. అల వేరు, సముద్రం వేరుగా అనిపిస్తుంది. నీలం రంగులో కనిపించే సముద్రం, నురుగుతో తెల్లగా ఉండే అల వేరుగా తోచడం సహజం. సాగరంలో పుట్టి, దానిలోనే లయం అయ్యే అలలు ఒకదానితో ఒకటి ఆధారపడి ఉంటాయి. మనిషి భగవంతుడి నుంచి జన్మించి ఆయనలోనే లీనమయ్యే ప్రక్రియ- భిన్నత్వంలో ఏకత్వానికి దర్పణం.

నేను నేనే’ అనుకోవడం మనిషి లక్షణం. భగవంతుడితో సంబంధం లేదని కొందరు భావించవచ్ఛు ఆయనపై ఆధారపడనట్లు తలచినా, సముద్రం-అలకు ఉన్న బాంధవ్యం మనిషికి-భగవంతుడికి మధ్య ఉన్నదని పెద్దలు చెబుతారు.

నేను నాలానే ఉంటాను, ఎవరి కోసం నేను మారను, నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, నా ఇష్టం నాది... అనేవి మనిషి పెంచుకునే అహంకారాలు. తల్లిదండ్రులు పసితనం నుంచి తమ పిల్లలకు అందరిలా ఉండవద్దు, గొప్పగా ఉండాలి. నీ ప్రత్యేకత కనిపించాలి అని నేర్పుతారు. ‘నేను నేనే’ అనే అహం వయసు పెరిగిన కొద్దీ బలపడుతుంది. నాకన్నా తెలివి కలవాడు, నాకన్నా సమర్థుడు లేడు అని భావిస్తాడు.

‘నేను’ నుంచి మనం వరకు ప్రయాణం చేయడమే ఆధ్యాత్మిక సాధన. అంతర్యామి ప్రబోధించే విభూతులు పిల్లలకు చుక్కల మందు వంటివి. సంస్కారవంతమైన మహర్షుల దివ్య సూక్తులు పిల్లలకు చెప్పగలిగితే, అవి జీవిత పర్యంతం వారి వెన్నంటి ఉంటాయి.

‘నేను నేనే అనే అహాన్ని వీడటం సులభం కాదు. దానికి సాధన కావాలి. నాదేమీ లేదు. నేను నిమిత్తమాత్రుడిని అనుకోవాలంటే మూడు రకాల సాధనలు అవసరమని పెద్దలు పేర్కొంటారు.

మొదటిది త్యాగం. తనకున్నదానిలో కొంత ఇతరులకు పంచడం దానం. తనకున్నదంతా ఏ ప్రయోజనాన్నీ ఆశించక ఇవ్వడం త్యాగం. భీష్ముడు తండ్రి కోసం రాజ్యాన్ని, దాంపత్య జీవితాన్ని త్యాగం చేశాడు. కర్ణుడు తనకున్నదానిలో కొంత దానం చేశాడు.

బలి చక్రవర్తి దానిశీలిగా పేరు తెచ్చుకున్నా, అహంతో పాతాళానికి దిగిపోయాడు. శిబి చక్రవర్తి తన శరీరం నుంచి మాంసాన్ని కోసి డేగకు అందించి త్యాగశీలిగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు. త్యాగం మనిషి స్వార్థాన్ని తగ్గిస్తుంది. కోరికలను అదుపు చేస్తుంది. పరోపకారాన్ని ప్రోత్సహిస్తుంది. సమస్త లోకాలు సుఖంగా ఉండాలనే శాంతి మంత్రంగా పని చేస్తుంది.

రెండోది కృతజ్ఞత. ఇతరులు చేసిన సహాయానికి కృతజ్ఞత తెలపడం. మనిషి జన్మించినప్పటి నుంచి మరణించే వరకు ఆహారం, గాలి, నీరు ప్రకృతి నుండి ఉచితంగా పొందుతాడు. మరొకరికి అవి అందే విధంగా మొక్కలు పెంచడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఆహారాన్ని వృథా చేయక పొదుపుగా వాడుకొనేదే కృతజ్ఞత.

మనిషి సృష్టిలోని సమస్తానికి ధన్యవాదాలు సమర్పిస్తూ అందరి కోసం కృషి చేయడం అతడిలోని నేను నేనే అహాన్ని మరిపిస్తుంది.

మూడోది నిష్కామ సేవ. కోరికతో చేసేది సహాయం. ఎటువంటి ప్రయోజనాన్నీ ఆశించక తన కర్తవ్యంగా భావించి చేసేది సేవ.

తల్లి పిల్లలకు సేవ చేస్తుంది. తన కర్తవ్యంగా భావిస్తుంది. వారు కోరకున్నా వారి అవసరాలు గుర్తించి, తీరుస్తుంది. సేవలో విశ్వజనీన ప్రేమ కలుగుతుంది. ఆంజనేయుడు ఏమీ ఆశించకుండా శ్రీరాముడికి సేవ చేయడం నిష్కామ కర్మకు నిదర్శనం. భూమి మొలకెత్తడం, గాలి వీచడం, వెలుతురు ప్రసరించడం- ప్రకృతి జీవులకు అందించే సేవలు. నేను నేనే అనే భావాన్ని వీడి- నేను అందరి కోసం అనుకునే విశాల భావమే... భారతీయ సంస్కృతి.

🕉️🌞🌎🏵️🌼🚩

Source - whatsapp sandesam