Tuesday, March 30, 2021

Diabetics - తప్పని సరిగా ఇది చదవండి

💐
Diabetics - తప్పని సరిగా ఇది చదవండి . మీకు చాలా ఉపయోగం .
మీకు Diabetes లేక పోతే, మీకు తెలిసి అది ఉన్న వారికి పంపండి . వారికి ఉపయోగం ! 😊



ఇంగ్లాండు లో ఒక పరిశోధన నిర్వహించారు .
Walking Experiment on Diabetes ఫలితాలు :

రోజుకు ఒక అర గంట, లేక 45 నిముషాలు వాకింగ్ ( పొద్దున్న కానీ , సాయంత్రం కానీ , వారి వారి వీలును బట్టి ) ఏకబిగిన నడిచే వారికంటే, పొద్దున్న ఒక 5 నుంచి 10 నిముషాలూ, మధ్యాన్నం లంచ్ తరువాత 10 నిముషాలూ, రాత్రి డిన్నర్ తరువాత ఒక 10 నిముషాలూ , అలా మొత్తం రోజులో మొత్తం మీద అరగంట వాకింగ్ చేయడం వల్ల రక్తం లో సుగర్ నిల్వలు బాగా తగ్గుతాయి అని తేలింది !

అలా తిన్న 5 నిముషాల లోపు లేచి , 5-10 నిముషాలు వాకింగ్ చేసిన వారి రక్తం లో Sugar నిలవలు 11% నుంచి 44% శాతం వరకు తగ్గినట్లు వారు నిర్వహించిన Blood Test లలో తేలింది !

కాబట్టి, Diabetics వరకు , ఎంత సేపు వాకింగ్ చేశారు , ఎంత దూరం నడిచారు ? అనే దానికంటే , టైమింగ్ , అనగా ఎప్పుడు నడిచారు ? అనే దానికి ప్రాధాన్యత ఉన్నట్లు తేలింది !

ఈ పరిశోధన , ఇంగ్లాండ్ లో 23 దఫాలు గా నిర్వహించారు . ఇందులో పెద్ద సంఖ్య లో, అనగా 12 లక్షల మంది డయాబెటిస్ ఉన్నవారు వాలంటీర్స్ గా సహకరించారు . ఈ పరిశోధన 40 రోజుల పాటు సాగింది .
వారు వాడే Medicines Dosage లలో ఏమీ మార్పు లేదు .

ఇందులో సగం మంది ని, రోజు కు ఏకబిగిన 45 నిముషాలు నడవ మన్నారు . మిగతా సగం మందిని 3 పూటలా , తిన్న వెంటనే ( తిన్న 5 నిముషాల లోపే , లేచి ) 10 నిముషాలు నడవమన్నారు .
40 రోజుల తరువాత 2 గ్రూపు లకీ Blood Test లు చేశారు

దానిలో ఈ సత్ఫలితాలు వెల్లడి అయ్యాయి . ముఖ్యం గా, రాత్రి Dinner తరువాత 10 నిముషాలు నడిచిన వారి లో Sugar శాతం 22% తగ్గిందని వెల్లడి అయింది .

Sugar ఉన్నవారు , స్త్రీలైనా , పురుషులైనా , మొత్తం మీద వారానికి 150 నిముషాలు యావరేజి న వాకింగ్ చెయ్య వలసిందే అని ఏకగ్రీవం గా వెల్లడి అయింది .

Action point :

తిన్న వెంటనే TV చూస్తూ కూర్చోకండి. లేచి , మీ ఇంటి గదుల్లో నే అయినా సరే , గడియారం చూసుకుని 10 నిముషాలు నడవండి .
3 పూటలా చేయండి.
40 రోజుల తరువాత blood test చేయించుకోండి.💐

Source - Whatsapp Message

పొట్టి శ్రీరాములు శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు.

ఆ శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు.
.
పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగ చరిత్ర చదువుతుంటే కళ్లలో నీళ్లు ఆగటం లేదు.. తెలుగు వాళ్ల చేవ చచ్చిన తనం పైన వికారం పుడుతోంది.

ఆయన జీవితం స్కూల్లో పాఠాలుగా చదువుకున్నాం. కానీ అది సగం సగం నిజాలతో కూడిన ఫ్యాబ్రికేటెడ్ చరిత్రని అని ఈ పరిశోధనాత్మక కథనం చూశాక అర్థమైంది.

ఒకటి మాత్రం నిజం.. పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి నాడే కాదు.. దశాబ్ధాల తరబడి...ఈనాటికీ అవమానం జరుగుతూనే వుంది.

నాటి గుడివాడ నివాసి... అమరజీవి పొట్టి శ్రీరాములు గారు గుడివాడ గడ్డ నుండే ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం నిరహారదీక్ష కు పూనిన సంకల్పానికి సాక్షిగా ఒక గుడివాడ యువ పత్రికా విలేఖరి,
అమరజీవి మరణం తదనంతరం ఉన్న చీకటి కోణాల్ని, పరిశీలించి తెలుగువారికి,ముఖ్యంగా గుడివాడ ప్రాంత ప్రజలకు అందించిన నేటి విద్యావేత్త, నాటి పరిశోధనాత్మక విలేఖరి డా: ఎమ్.ఎస్.వి.
సత్య నారాయణ బాబు గారు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భాన అందించిన వ్యాసం ప్రతి తెలుగు వాడూ తెలుసుకోవలసిన విషయం. (-నూలు)

నేడు అమరజీవి పొట్టిశ్రీరాములుగారి జయంతి. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన 58 రోజులపాటు మద్రాసు నగరంలో నిరాహార దీక్ష చేసి ఆ దీక్షలోనే చనిపోయారు. ఆయన శవాన్ని మోసేందుకు కనీసం నలుగురు మనుషులు కూడా లేని నిస్సహాయ స్థితిలో అనాధగా అభాగ్యుడిగా ఆయన అసువులు బాసారు. నిజానికి పొట్టి శ్రీరాములుగారి గురించి ఆయన చేసిన త్యాగం గురించి చరిత్ర ఒక నల్లని దుప్పటి కప్పుకుంది. అమరజీవి పేరుతో ఈరోజుకు మాత్రం ఒకసారి ఆయనను తలుచుకుని అమర్ రహే అనుకుని మన పని మనం చేసుకుంటాం. ఆర్యవైశ్యులు ఆయన కులస్తులు కాబట్టి వాళ్ళే చూసుకుంటారని ఒక గుడ్డి కులం ముద్రను ఆయనకు వేసి మిన్నకుంటాం. ఎంత డొల్లతనం మన తెలుగువారిది. ఏది సీరియస్ గా తీసుకోవాలో ఏది వదిలిపెట్టాలో దిశ దశ లేక తెలుగుజాతి ఇలా నీరుగారిపోవటమే నేటికీ దేశ స్థాయిలో తెలుగువారంటే చేతగానితనం అనిపించుకుంటానికి కారణం. పక్కనే ఉన్న తమిళులు భాషా, సంస్కృతి , సంప్రదాయాలతో తమ జాతి ప్రత్యేకత కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉంటుంటే దానిని గొప్పగా చెప్పుకుంటాం గాని మనం మాత్రం మన జాతి పురుషుల గురించి కూడా సరిగ్గా తెలుసుకోము. ఇది ఎవరినో నిందించటానికి కాదు. మన తెలుగుజాతి కోసం నిండుప్రాణాలను తృణప్రాయంగా బలిచేసుకుని మనకు మాత్రం ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పడ్డ కష్టం గురించీ వేదన గురించి నేటి తరం కనీసం కొంచెమైనా తెలుసుకోకుండా చేశారే అనే ఆవేదన.

పొట్టిశ్రీరాములు గారిది నెల్లూరు జిల్లా. ఐటిఐ చదువుకుని మద్రాసులో రైల్వే ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయన పట్ల విధి చిన్నచూపు చూడటంతో ఒకే సంవత్సరంలో భార్యా బిడ్డా తల్లీ కూడా వరుసగా చనిపోవటంతో ఆయన ఖిన్నుడైపోయాడు. ఇక తన జీవితానికి అర్ధం లేదని కుమిలిపోతున్నాడు. ఆ సమయంలో గాంధీజి మద్రాసు పర్యటన ఆయన ఆలోచనను మార్చివేసింది. ఎవరికీ కొరగాని ఈ జీవితం బాపూజి సబర్మతీ ఆశ్రమంలో ఆయన శిష్యరికంలో గడపడమే సబబని తోచి సబర్మతీ వెళ్ళిపోయారు. అక్కడ గుడివాడ నుంచి వచ్చిన యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం కలిసి ఇద్దరూ తెలుగువాళ్ళు కావటంతో స్నేహం కుదిరింది.
.
గాంధీజీ కోపం విసుగు :-
.
విరాగులు, స్వాతంత్ర సమరయోధులతో సబర్మతి నిండిపోయింది. గాంధీజీకి రోజురోజుకూ తన చుట్టూ చేరుతున్న వారి పట్ల విసుగేసింది. "నా చుట్టూ చేరి రోజూ భజన చేయటం కంటే పల్లెసీమలకు వెళ్ళి ప్రజలను అహింసా పద్దతిలో స్వాతంత్రం కోసం పోరాడటానికి సిధ్దంగా తయారుచేయండి వెళ్ళండి" అని వాళ్లకు ఉద్భోద చేసారు. తన ఊర్లో తనకు ఎవరూ లేరని బాధపడుతున్న శ్రీరాములను యెర్నేని సుభ్రహ్మణ్యం తాను గుడివాడ దగ్గర స్థాపించిన గాంధీ ఆశ్రమంకు రమ్మని ఇద్దరం కలిసి పనిచేసుకుందామని ఆహ్వానించారు. వెంటనే గాంధీజీ కి చెప్పి గుడివాడ బయలుదేరారు. కొమరవోలు చెంత గల గాంధీ ఆశ్రమానికి గాంధీజీ 3 సార్లు వచ్చి వెళ్ళిన ఘనత ఉంది. పొట్టిశ్రీరాములు తన మకాం గాంధీ ఆశ్రమానికి మార్చారు. కానీ గుడివాడ కూడలి ప్రాంతం కావటంతో ప్రతి రోజూ నడుచుకుంటూ 7 కిలోమీటర్లు దూరంలోని గుడివాడకు వచ్చేవారు. ఆయనకు వైద్యం తెలుసు. తన ఆయుర్వేదమూలికల కోసం గాంధీ ఆశ్రమంలో రెండు ఎకరాలు ప్రత్యేకం ఔషధ మొక్కలు నాటుకుని ఉచితంగా వైద్యం చేసేవారు. మానేపల్లి మల్లిఖార్జున గుప్త, కూరాళ్ళ భుజంగభూషణరావు, మెండా నాగయ్య, రావూరి అర్జనరావు, గోరా తదితరులతో నిత్యం గాెంధీజీ కార్యక్రమాల గురించి చర్చించేవారు. గోరా నాస్తిక సభలకు కూడా వెళ్లేవారు. హరిజన దేవాలయ ప్రవేశం అంగలూరులో నిర్విహించారు. విదేశీ వస్త్ర బహిశ్కరణ, స్వాతంత్రం వచ్చాక నెహ్రూ నిత్యావసర సరుకుల పై కంట్రోల్ పెట్టడాన్ని వ్యతిరేకించి గుడివాడ బజార్లలో బియ్యం రాసులుపోసి అమ్మి పోలీసుల నుంచి కూడా గౌరవ మర్యాదలు అందుకున్నారు.

పదేళ్ళు గడిచిపోయాయి. మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభసూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్రం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభసూరులు అని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా హేళన చేసింది. దిగమింగుకోలేని ఈ అవమానానికి శ్రీరాములు స్పందించారు. ఎవరూ లేని తన జీవితం తెలుగువారి ఆత్మగౌరవానికి ఉపయోగపడనప్పుడు వేస్ట్ అని మిత్రుడు సాధు సుభ్రహ్మణ్యంతో కూర్చిని ఒప్పించి తాను చనిపోయైనా సరే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధిస్తానని చెప్పారు. ఆయన ఆఖరి భోజనం వడ్డించిన 12 ఏళ్ల పోతరాజు రాధామనోహరి చెబుతూ ఆయన ఎప్పుడూ మజ్జిగన్నం బెల్లంతో తినేవారు. అదే వడ్డించాను. ఇదే నా ఆఖరి భోజనం అని చెప్పారు.అంది.

సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు. ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్లారా అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. భారతీయ భాషలకు భాషా ప్రయుక్త రాష్టాల పేరిట ఇస్తున్నారు కదా కాంగ్రెస్ అన్ని చోట్లా కూడా ఇస్తున్నదే కదా అని అడిగితే తెలుగు భాష కూడా ఒక భాషా? అన్నాడు. తెలుగు తమిళానికి చెందినదే ఆ భాష మాట్లాడే వారి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం అవసరమే లేదు. అది అసలు ప్రత్యేకమైన భాష కాదు అన్నాడు. తెలుగు భాష యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరు కూడా అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగు వాళ్ళల్లో వున్న కాంగ్రెస్ నాయకులంతా మొఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా తమ కోసం తమ భాష కోసం ఒక రాష్ట్రం కోరి దీక్ష చేస్తుంటే ఇన్ని కోట్ల మంది తెలుగు వారిలో కూడా జాలీ దయ లేదు. కేవలం టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కానీ భజనపరులకే ప్రాధాన్యత నిచ్చే అధిష్టానానికి ఆయన వేదన పట్టలేదు. ఆయనకు కాంగ్రెస్ లో పార్టీలో బలం లేక, ఏమీ చెయ్యలేక కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు శ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగులు నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణ వ్యవస్థ తిరగబడి మలం కూడా నోటి నుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక బలంతో నిండుకుండలా వుండే శ్రీరాములు గారు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది. ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు.

ఇక మరణించాక మరీ దారుణం. ఎంతో నిర్లక్ష్యం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా కృష్ణాజిల్లాకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని చెపితే ఆయన ఆశ్చర్యపోయి ఎంతో ఆవేదన పడి వెంటనే అప్పటికప్పుడు కదలి శ్రీరాములు గారి శవాన్ని ఉంచిన స్థలం దగ్గరకు వచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. శవాన్ని కాకులు పొడవకుండా తాటాకులతో కప్పి వచ్చిన సుబ్రహ్మణ్యాన్ని "శ్రీరాములు గారి శవం ఎక్కడా"? అని ఘంటసాల అడిగారు. ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఈ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతులు చేసుకున్నారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకు వెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని , చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులు బాసిన అమరజీవి వయ్యా శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు.

గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు. అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణ శవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతుపురాణంతో పచ్చి బూతులు తిడుతూ తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడకల్లారా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు.
అప్పటికి కానీ నెహ్రూ కదల్లేదు ఆ తరవాత ఆ మహానుభావుడు రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధా పోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది.
సాధుసుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు. గుడివాడలో పొట్టిశ్రీరాములు స్మృతికి హైస్కూల్ వెలిసింది. అదే ఎస్పీ.ఎస్ హైస్కూల్. గుడివాడ నిండా ఆయన విగ్రహాలు అనేక పాఠశాలల్లో వాసవీ సంఘాలు వారు పెట్టారు. కానీ ఆయన నిజమైన త్యాగచరిత్రను నేటి తరానికి అందించటంలో పూర్తిగా కృతకృత్యులు కావటానికి అంకితభావం కలిగిన దేశభక్తి, తెలుగుజాతిపట్ల పరిపూర్ణ ఆరాధ్యత నిండిన దూతలు అవసరం. తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి అన్ని బాధలు పడి ప్రాణాలను బలిచేసుకున్న ఆయన్ని ఆనాడే కాదు ఈనాడూ కుల పిచ్చి ముదిరిపోయిన తెలుగు నాయకుల్లో పట్టించుకునే వాళ్ళు లేరు. విగ్రహాలు పెట్టడం కూడా చెయ్యరు.
.

జర్నలిస్టుగా నేను 1992లో గుడివాడలో బాధ్యతలు తీసుకున్నాను. మూడు వారాల్లో ఒ పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టాను. ఆ సందర్భంలో నాకు ప్రాణహాని కూడా ఎదురైంది. తప్పించుకున్నాను. కుంభకోణం చేసిన వారు ఆ రోజుల్లో 5 లక్షలు నాకు లంచం ఎరచూపారు. నేను లొంగలేదని ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు. చివరికి పరువునష్టం దావా లక్షల్లో వేసారు. నా రిపోర్టు యాదార్ధమని రుజువు కావటంతో సదరు వ్యక్తులు తగిన శిక్ష అనుభవించారు. ఎందరికో అన్యాయం చేసిన వాళ్ళ పాపాలు నా చేతిలో పండాయి అన్నారంతా. మంచి జర్నలిస్టునని పేరువచ్చింది. ఆ పేరు విని ఒక వ్యక్తి చిన్న ఫోటో తెచ్చి నాకిచ్చి "ఇదేమిటో పరిశోధించడం మీ వల్లే అవుతందని ఇది నా ప్రగాఢ విశ్వాసం" అని అన్నాడు. ఎద్దులబండి మీద శవం ఉన్న ఆ ఫోటో పట్టుకుని 6 నెలలు పాటు పరిశోధించగా అప్పటికి జీవించి ఉన్న స్వాతంత్ర్య సమరయోధులు ఎందరో మహనీయులు నాకు దారి చూపించారు. ఊహించని వ్యక్తులను కలిసాను. ఇంటర్యూలు చేసాను. మంచంలో ఉన్నవారు కొందరు. కళ్ళు కనిపించని వృధ్ధులు కొందరు. అవసాన దశలో ఉన్నవారే దాదాపూ అందరూ. వావిలాల గోపాలకృష్ణయ్య ఒక్కరే ఆరోగ్యంగా తిరుగుతున్నారు. కానీ వారంతా గొలుసుకట్టుగా నాకు సమాచారాన్ని అందించారు. చరిత్ర పొట్టిశ్రీరాములు ఆఖరిరోజులపై కప్పిన నల్లటి దుప్పటిని నేను చించిపోగులు పెట్టాను. రాజకీయ దురుద్దేశాలతో కప్పెట్టిన సత్యాన్ని ధైర్యంగా వెలుగులోకి తెచ్చాను. అప్పటి మా ఎడిటర్ అమరనాధ్ గారు నాకు సంపూర్ణ స్వేచ్చ, సహకారం ఇచ్చారు. అదే సమయంలో గుడివాడలో పొట్టిశ్రీరాములు కాంస్యవిగ్రహాన్ని నా తెనాలి ఆఫ్తమిత్రుడు అక్కలశ్రీరామ్ చెక్కుతున్నాడు. దానితో ఈనాడు పత్రిక నన్ను చరిత్ర పరిశోధకుడిగా పరిచయం చేస్తూ బ్రహ్మారెడ్డిగారు పామర్రు నుంచి గుడివాడ ఇన్ చార్జిగా నా పరిశోధనను ఈనాడు మెయిన్ ఎడిషన్ మొదటి పేజీలో 1996 డిసెంబరు 16న ప్రకటించారు. అదే రోజు కాంస్యవిగ్రహ ఆవిష్కరణకు వచ్చిన కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర, రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ బహిరంగ సభలో నా రిపోర్టు చరిత్రను తిరగరాసిందని కితాబునిచ్చారు.
అవన్నీ ఒక ఎత్తు నేటికీ పొట్టి శ్రీరాములుగారి త్యాగం నా గుండెల్లో మాటల్లో ఏనాటికీ నేను చెప్పలేనంత తీరని వేదననే మిగల్చింది.

ఇటీవల కూరాళ్ళ భుబంగభూషణరావు గారి అభ్బాయి భవ మా ఇంటికివచ్చి గాంధీ మండపం విశేషాలు చరిత్ర వల్లె వేసుకున్నాం. భుజంగ భూషణం గారు పొట్టి శ్రీరాములు గారికి మంచి మిత్రులు. నాతో చాలా విషయాలు ఆనాడు పంచుకున్నారు. స్వాతంత్ర సమరయోధులు, తామ్రపత్ర అవార్డు గ్రహీత. గుడివాడలో జాతీయజండా పండుగ దినాలైన ఆగస్టు 15, రిపబ్లిక్ దినోత్సవం రోజుల్లో పిల్లలందరికీ వారి విజయలక్ష్మీ ఫోటో స్టోర్స్ దగ్గర జండాలు పంచేవారు - నిజమైన దేశభక్తులు
రచయిత - MSV సత్యనారాయణ బాబు(కపర్డి)

Source - Whatsapp Message

తులసి

శ్రీనివాస సిద్ధాంతి.9494550355

తులసి

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని అంతా మంచే జరుగుతుందని నమ్మకం. అంతేకాదు తులసి ఆకుల వల్ల మనం పలు అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ, ఈ తులసి మొక్క తన సహజరంగును కోల్పోవడమో, ఆకులు సడన్‌గా ఎండిపోవడమో లేదా రాలిపోవడమో జరుగుతుంది. ఈ మార్పులను బట్టి ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఒక రకంగా తులసి చెట్టు మార్పులు మన భవిష్యత్తుకు సంకేతాలు.

తులసిలో మార్పులు... వాటి అర్థం తెలుసుకుందాం...
1. తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే... ఇంట్లో ఆనందం, సంతోషం మన వెంటే ఉంటాయి. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థం.
2. ఒకవేళ నీళ్ళు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే... ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థం. భవిష్యత్తులో వారికి సంపద బాగా వస్తుంది.
3. పచ్చగా కళకళలాడుతున్న తులసి చెట్టు ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే.... ఆ ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా కీడు జరుగబోతుందని అర్థం. ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుందని అర్థం.
4. చెట్టు ఆకులు సడన్‌గా వేరే రంగుకు మారితే... ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థం. ఎవరైనా గిట్టనివారు క్షుద్రశక్తులు ప్రయోగించినప్పుడే తులసి ఆకులు రంగు మారుతాయి.
దీనినిబట్టి తులసి మొక్కని భక్తిగా పూజ చేయడమే కాదు... తులసి మొక్క ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మొక్కలో మార్పులు గమనిస్తూ ఉండాలి

ప్రతి ఇంటికి ఒక తులసి మొక్క వుండాలి

జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును.
ద్విస్వర్ణ కంకణ సన్మానిత.
జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి
లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.
9494550355
plz forward the message🌹

Source - Whatsapp Message

శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం

శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం

1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు
2. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228 (3228 B.C)
3. మాసం : శ్రావణం
4. తిథి: అష్టమి
5 . నక్షత్రం : రోహిణి
6. వారం : బుధవారం
7. సమయం : రాత్రి గం.00.00 ని.
8 జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు
9. నిర్యాణం: క్రీ పూ 18.02.3102(3102 B.C)
10. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది
11 కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత మరణించెను
12. కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.
13. భీష్ముడు క్రీ.పూ. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.
14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి:
మధురలో కన్నయ్య
ఒడిశాలో జగన్నాధ్
మహారాష్ట్ర లో విఠల (విఠోబ)
రాజస్తాన్ లో శ్రీనాధుడు
గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్
ఉడిపి, కర్ణాటకలో కృష్ణ

15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు
16. జన్మనిచ్చిన తల్లి దేవకీ
17. పెంచిన తండ్రి నందుడు
18. పెంచిన తల్లి యశోద
19. సోదరుడు బలరాముడు
20. సోదరి సుభద్ర
21. జన్మ స్థలం మధుర
22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ
23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు : చాణుర - కుస్తీదారు
కంసుడు - మేనమామ
శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు
24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.
25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది.
26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది.
27. 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.
28. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.
29. కాలయవన అను సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.
30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
31. శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు.
32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.
33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.
34. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.
35. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థపింపజేసెను.
36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.
37. రాజ్యము నుండి వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.
38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.
39 ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.
40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.
41. శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు.
43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.
అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు.
44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.
(సేకరణ)

Source - Whatsapp Message

బౌద్ద మతం

 


2018 పోస్ట్... మరో మారు రీ పోస్ట్

#మొదటభౌధచరిత్రచూదాం; బౌద్ద మతం అవతరించడానికి కారణం సిద్ధార్థ గౌతముడు. అయన గారు 29 ఏళ్లు సమాజానికి దూరంగా రాజ కోట లో చీమ కూడా కుట్టనంత సుఖంగా పెరిగాడు. రాజ మహల్ స్త్రీలతో చట్టపట్టాళేసుకుని జీవితాన్ని అనుభవించాడు. ఉన్నట్టు ఉండి రాజ కీరీటం , ప్రజాపాలన చేయాల్సివచ్చింది. శత్రువుతో పోరాడి గెళవ గల సత్తా లేదు. పుర ప్రజల సమస్యలు తీర్చలేడు అని గ్రహించి , అయోమయం లో రాత్రికి రాత్రి రాజ్యం నుంచి దొంగ చాటుగా పారిపోయి ఇద్దరు సన్యాసులు దగ్గర చేరి వారి విద్య నేర్చుకుని ఓక రోజు తాను జ్ఞాని అని ప్రఖటన చేస్తాడు. అది నిజం అని నమ్మి యఱ్రి జనాలు ఆయన పంచన చేరతారు. అఢుక్కు తినే సొమ్ము పని చేయకుండా రావడంతో సోమరుల సంఖ్య పెరిగింది. వ్రుత్తి విద్యా నైపుణ్యం కొరవడింది. చేసేది లేక ఈ గుంపు బుధ బుధ అంటూ రాజ్యాల మిద పడడం. అప్పటికే జనాల్లో పెరిగిన అసహనం తో రాజులు వీరి పంచన చేరడం జరిగింది.
వీరి పొట్ట కూటి కోసం జనాల మద్య కుల గొడవలను పోషించారు. కుల వృత్తులు దారి తప్పాయి.కుల అహంభావం - కుహంభావం తారా స్తాయికి చేరాయి.
సుఖాల్లో మునిగి తేలడం వల్లన రాజ్యాన్ని కాపాడే రాజులు శక్తి హీనం అయ్యారు. క్రియా శీలక పదవుల్లో భౌద్దులు ఉండడం దేశ రక్షణ వ్యవస్థ నాశనానికి దారి తీసింది.
భౌద్దులు అప్పటి వరకు ఉన్న హిందు విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసారు. హిందు విద్యా వ్యవస్థలో సామజిక అంశాలు , యోగ లాంటి విద్యలు , శాస్త్రీయ అంశాలు , దైవ సంబంద అంశాలు విరివిగా ఉండేవి.
భౌధ ఆరామాల్లో కేవలం భౌధ ఆరాధన , భౌధ బిక్ష... ఇలాంటి సామజిక స్పృహ లేని అంశాలు మాత్రమే ఉన్నాయి... అక్కడ అక్కడ జరిగే పోరపాట్లను పెద్దవి చేసి భౌధ మత మార్పిడి చేసే వారూ. హిందు దేవతా ఆరాధనను తప్పు పట్టే వారూ...
ఫలితంగా అఖండ భారత వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయింది. హూనూళూ , మంగోళూలు , ఇస్లాం దోపిడీ దొంగల దాడుల్లో పర దేశియూలు చేతుల్లో కి వెల్లి పోయింది... వాళ్ల స్వార్ధం ఫలితం 500 ఏళ్లు పైగా బానిసత్వం!

ఇది నేను ఎదో కల్పితం గా చూపిన చెప్పిన మాటలు కాదు. చరిత్ర చెప్పిన సత్యం!
ఓక అసమర్ఢుఢు పదవిలో ఉంటే దేశం ఎలా నాశనం అవుతుందో జరిగిన పరిణామాలు రుజువు చేస్తాయి.....
★ బౌద్ధం బలం అయ్యి ఉంటే విదేశీ చేతుల్లో భారత్ వెళ్ళేది కాదు!
★ బౌద్ధం న్యాయం అయ్యి ఉంటే బౌద్ధ శాసన కర్తల్లో అవినీతి పరులు పెరిగి విదేశీ చెంచాలకు అమ్ముడుపోయి దేశం నాశనం అయ్యేది కాదు!
★ భౌద్జం శక్తి వంతం అయి ఉంటే అశోక చక్రవర్తి లాంటి వారి చేతుల్లో నుంచి విడిపోయి చిన్న చిన్న రాజ్యాలు వచ్చేవి కావు!
★ బౌద్ధం పదిలం అయి అయ్యి ఉంటే కుల సమష్యలు పెరిగివి కాదు!
★ అఖండ భారతం మూకల చేతికి పోవడంఒక్క మాటలో చెప్పాలి అంటే బౌద్ధం అంతం జరిగి వుండేది కాదు!

👉 ఆదునిక భారతం లో కి వెళ్లి చుస్తే.....

1870-1880 ల్లో ఆంగ్లేయులు భారత ఎందుకు నిర్వీర్యం కాలేకపోతుందో అధ్యయనము చెయ్యడానికి "మేఖలె " లాంటి వారిని నియమించింది.వారు భారత్ మొత్తం తిరిగి " హైందవ భారతీయ సనాతన వ్యవస్థ" ను నాశనం చేస్తే భారత్ సమూలంగా నాశనం అవుతుంది అని గ్రహించారు.సనాతన వ్యవస్త నాశనము అవ్వాలి అంటే " వేదాలు , పురాణాలూ , ఇతిహాసాలు " నాశనము అవ్వాలి అని నిర్ణయం చేసారు.
వారికి అమ్ముడు పోయిన కొంత మంది మిడి మిడి సంస్కృత జ్ఞానం కలిగిన వారూ ( భౌథుళు కూడా ఉన్నారు ) వేద సంపదను వక్రీకరణ చేయడం మొదల పెట్టారు. మిగిలిన కొంత మంది సంస్కృత పండితులను నాశనం చేసారు.....
【హిందువులు సంఖ్య తక్కువ ఉన్న చోట ప్రత్యేక దేశం చేయడం. బర్మా , టిబెట్ , శ్రీలంక దేశాలు గ విడ తీసారు...】
హిందు వ్యవస్థ లో ఉన్న కులాలను , తెగలను రెచ్చ కొట్టారు.
1910 తరువాత వక్రీకరణ చేసిన పుస్తకాలను విద్యా వ్యవస్థ లో ప్రవేశ పెట్టారు. ఈ మద్య కాలం లో కమ్యూనిస్ట్లు భారత్ లో ప్రవేశించారు. అప్పటి వరకు ఉన్న భౌధ నాయకులూ అందరు కమ్యూనిస్ట్లు గ మారడం. కులాల మద్య వ్యత్యసం పెంచడం మొదలు పెట్టారు.....
ఇలాంటి భావ జాలాలకు బలి ఐన " బాబా సాహెబ్ అంబెడ్కర్ ,మహా కవి శ్రీ శ్రీ " లాంటి వారూ రావడం , మార్పులు కోసం ప్రయత్నం చేయడం , స్వాతంత్రం రావడం , భారత్ , పాకిస్తాన్ , బాంగ్లాదేశ్ గ విడిపోవడం, రాజ్యాంగం రాయడం అన్నీ చక చక జరిగాయి... అప్పుడు అప్పుడే క్రైస్తవం విస్తరించడం మొదలు అయింది.
వక్రీకరణ చేసిన పుస్తకాలను జనాల బుర్రలో నింపడం మొదలు పెట్టారు. కొందరు ఏకంగా రామాయణ , మహాభారత , భగవద్గీత లను తప్పుగా రాయడం మొదలు పెట్టరు.....
ఉదాహరణ: రంగ నాయఖమ్మ లాంటి వారు. ఫలితంగా మత మార్పిడిలు వీజృంభించాయి......
ఓక వైపు కుల కోట్లాటలు పెరిగి పెరిగి నరుక్ఖునె స్తాయికి వచ్చాయి.....
కమ్యూనిస్ట్ లు ngo రూపం లో ఆర్దిక వ్యవస్థ ను సృష్టించి మత మార్పిడిలు పెంచడం , ఇస్లాం కాస్త ఉగ్రవాద రూపం దాల్చడం జరిగాయి......

ఓక వ్యవస్థ నాశనం అవ్వాలి అంటే విద్యా వ్యవస్త , ఆర్దిక వ్యవస్థ , రక్షణ వ్యవస్త నాశనం అవ్వాలి.

విద్యా వ్యవస్థ లో జరిగిన వక్రీకరణాల వల్ల కుల - మత గొడవలు తారా స్తాయికి చేరాయి.....

పాలకుల అవినీతి వల్ల రక్షణ రంగం కొంచెం దెబ్బ తిన్నది.ఇంక ఆర్దిక వ్యవస్త ఐతే చెప్పాల్సిన పనే లేదు.

వాదాలు పేరిట కమ్యూనిజం లో ఉన్న బౌద్ధం కాస్త , జన వాదం , బహు జన వాదం , అంబెడ్కర్ వాదం , కుల వాదం ... ఇలా వాదాలు గా వీభజించుకుని అన్నీ రకాల వ్యవస్థ లో కి చొచ్చుకు పోయింది.
👉 ఫలితం ఈ రోజు మనం చూసే కుల పోరాటాలు...
👉 భారత్ భర్భథి అరుపులు , పట్ట పగలు హిందువులను చంపడం.
👉 నోటికి ఇష్టం వచ్చినట్టు హిందు సంప్రదాయాలను తిట్టడం.
👉 హిందు దేవుళ్ళని పఱిహాసం చేయడం , దేవాలయ వ్యవస్త ను నిర్వీర్యం చేయడం. 【ద్వారా హిందు కి హిందు అంటే అసహ్యం పుట్టించి మతం మార్చడం... ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.....】

👉 రాబోయే రోజుల్లో కుల గొడవలు , మత పెరగడం , అవి పూర్తీ స్థాయి అంతర్యుద్ధం కి దారి తీయడం ద్వారా సమూలంగా భారత్ ను నిర్వీర్యం చేయడం , ముక్కలు చేయడం అనేది వీరి ప్లాన్.

👉 కావాలంటే గమనించండి!

1920 తరువాత కుల గొడవలు మొదలు అయ్యాయి స్వాతంత్రం తరువాత పెంచారు....

1940 తరువాత నుంచి ఇస్లాం - హిందు గొడవలు పెంచారు.....

1970 తరువాత క్రైస్తవ - హిందు గొడవలు పెంచారు.....

👉 ఈ రోజున ఏకంగా కాశ్మీర్ ముక్కలు చేయండి , అస్సాం , త్రిపుర , నాగాలాండ్ ను ప్రత్యెక క్రైస్తవ దేశం ఛెయమనడం, కేరళ ను ప్రత్యెక దేశం కావాలని గొడవలు చేయడం అన్నీ ఇందుకు ప్రత్యెక సాక్ష్యాలు....

హిందువులను నాశనము చేయాలి!
హిందు గ్రంధాలను నాశనము చేయాలి!
కుల గొడవలు పెంచాలి!
మత గొడవలు పెంచాలి!
అంతర్యుద్ధము జరగాలి..

*అందుకే ఈ మద్య అసహనం డ్రామాలు ఆడడం మొదలు పెట్టారు....

ఇది భౌధ రూపం లో కమ్యూనిస్ట్ రూపం లో జరుగుతున్న తతంగం...

కావాలంటే చరిత్ర చదువుకొండి , అర్ధం చేసుకోండి , పాయింట్ లు రాసుకోండి.

"అంబెడ్కర్ వాదం పేరుతో భౌథుళు , కమ్యూనిస్ట్లు హిందువులను , భారత్ ను ముక్కలు చెయ్యాలి అని చూస్తున్నారు "

ఇది చరిత్ర చెప్పిన సత్యం జాగొ హిందు జాగొ మత మార్పిడీలు తిప్పి కొడదాం!

#కుల
పిచ్చివదిలిఏకం_అవుదాం!

Source - Whatsapp Message

Monday, March 29, 2021

ఆంజనేయ స్వామి వారు - ఎవరిని వివాహం చేసుకున్నారు ?



ఆంజనేయ స్వామి వారు - ఎవరిని వివాహం చేసుకున్నారు ?

హ‌నుమంతుడు ఎంత శ‌క్తివంత‌మైన దేవుడో భ‌క్తుల‌కు బాగా తెలుసు. ఆయ‌న‌ను పూజిస్తే దుష్ట‌శ‌క్తుల నుంచి విముక్తి క‌లుగుతుంద‌ని భ‌క్తులు న‌మ్ముతారు. అయితే ఆంజ‌నేయ స్వామి బ్ర‌హ్మ‌చారి అని కూడా అంద‌రికీ తెలుసు. ఆయ‌న అస్సలు పెళ్లి చేసుకోలేద‌ని, జీవితాంతం బ్ర‌హ్మ‌చారిగానే ఉన్నాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. అయితే మీకు తెలుసా..?

నిజానికి ఆంజ‌నేయ స్వామికి పెళ్ల‌యింది.
ఆయ‌న భార్య పేరు సువ‌ర్చ‌ల‌.

అయితే హ‌నుమంతుడు అనుకోకుండా కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమెను వివాహం చేసుకోవాల్సి వ‌చ్చిందట‌.

దీని వెనుక ఉన్న అస‌లు క‌థేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హ‌నుమంతుడు సూర్య భ‌గ‌వానుడిని గురువుగా చేసుకుని ఆయ‌న వ‌ద్దే అనేక విద్య‌ల‌ను అభ్య‌సించాడు. అయితే న‌వ వ్యాక‌ర‌ణాలు అనే విద్య‌ను మాత్రం హ‌నుమంతుడు నేర్చుకోలేక‌పోతాడు. ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలంటే క‌చ్చితంగా వివాహం అయి ఉండాల్సిందే. దీంతో హ‌నుమంతుడు ఏం చేయాలో తెలియ‌క అలా ఉండిపోతాడు.

ఇది గ‌మ‌నించిన సూర్యుడు త‌న తేజ‌స్సుతో సువ‌ర్చ‌ల అనే యువ‌తిని సృష్టిస్తాడు. ఆమె అయోనిజ‌గా పుడుతుంది.
అంటే సూర్యుని తేజ‌స్సుతో పుడుతుంది. దీంతో ఆమె సూర్యుని కూతురుగా ఉంటుంది.

ఈ క్ర‌మంలో సువ‌ర్చ‌ల‌ను పెళ్లి చేసుకోవాల‌ని సూర్యుడు హ‌నుమంతున్ని కోరుతాడు. అయితే బ్ర‌హ్మచారిగా ఉండాల‌న్న త‌న కోరిక‌కు అది ఆటంకం క‌లిగిస్తుంద‌ని పెళ్లి చేసుకోనంటాడు.

దీంతో సూర్యుడు గురు ద‌క్షిణగా అయినా సువ‌ర్చ‌లను పెళ్లి చేసుకోమంటాడు. అందుకు కూడా హ‌నుమ అంగీకరించ‌డు. ఇక చివ‌రిగా సూర్యుడు అంటాడు,

పెళ్లి చేసుకున్నప్పటికీ నువ్వు బ్ర‌హ్మ‌చారిగానే కీర్తించ‌బ‌డ‌తావ‌ని, ఆ పెళ్లి లోక క‌ల్యాణం కోస‌మే గానీ నువ్వు గృహ‌స్థుడిగా ఉండిపోవ‌డానికి కాద‌ని, పెళ్లి చేసుకుంటే ఆ విద్య‌ను అభ్య‌సించ‌వ‌చ్చ‌ని, లోక క‌ల్యాణం జ‌రుగుతుంద‌ని, అంటాడు. దీంతో హ‌నుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి కాగానే సువ‌ర్చ‌ల మారు మాట్లాడ‌కుండా త‌పస్సుకు వెళ్లిపోతుంది.

ఆ త‌రువాత ఆమె క‌నిపించ‌దు, ఈ క్ర‌మంలో హ‌నుమ ఆ విద్య‌ను అభ్య‌సించి స‌క‌ల శాస్త్ర పారంగ‌తుడు అవుతాడు.

ఇదీ… హ‌నుమంతుని పెళ్లి వెనుక ఉన్న అస‌లు క‌థ‌. దీని గురించి మ‌హ‌ర్షి ప‌రాశ‌రుడు రాసిన ప‌రాశ‌ర సంహిత‌లో మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు...

Source - Whatsapp Message

Die Empty

“Die Empty”.

పెద్ద నీతితో కూడిన ఈ చిన్నపుస్తకాన్ని టాడ్ హెన్రీ (Todd Henry) రాశారు.
ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ వుంది.
టాడ్ హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్నవేస్తాడు.
‘ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?’ అనేది ఆ ప్రశ్న.
‘గల్ఫ్ దేశాలు అని ఒకరు, వజ్రాల గనులు ఉన్న ఆఫ్రికా’ అని మరొకరు ఇలా జవాబులు చెబుతారు.
అప్పుడా డైరెక్టర్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసే సమాధానం చెబుతాడు.
‘ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం స్మశానం’
‘ఎందుకంటే...
అంటూ ఆయనే వివరణ ఇస్తాడు.
‘ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్లమంది పుట్టారు, మరణించారు. ఇంకా పుడుతూనే వున్నారు, ఇంకా చనిపోతూనే వున్నారు. పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢ౦గా వున్న మేధస్సును, అనేక ఆలోచనలను, అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడలేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కకుండా పోయింది. అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ వుంటుంది చెప్పండి’
డైరెక్టర్ చెప్పిన మాటలు టాడ్ హెన్రీ మనస్సులో గట్టిగా నాటుకుని పోయాయి.
ఆ ప్రేరణతోనే టాడ్ హెన్రీ "Die empty” అనే పుస్తకం రాసి అద్భుతమైన రచయితగా పేరు పొందాడు.
ఆయన ఈ పుస్తకంలో అంటాడు ఇలా ఒకచోట.
‘మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి. అవేవో ఈ ప్రపంచానికి పంచేసి వెళ్ళండి’
నిజానికి టాడ్ హెన్రీ చెప్పదలచుకున్నది ఏమిటంటే:
‘మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్ళండి.
‘మీ దగ్గర మంచి ఆలోచన వుంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి.
‘మీలోని జ్ఞానాన్ని నలుగురికీ పంచండి.
‘మీకేదైనా లక్ష్యం వుంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి.
‘ప్రేమను పంచండి, మీలోనే దాచుకుని వృధా చేయకండి’
వున్నది నలుగురికీ పంచడం ఈనాటి నుండే మొదలు పెడదాం. మన మంచితనంలోఉన్న ప్రతి అణువునూ అందరికీ ఇచ్చేద్దాం!
‘అప్పుడు హాయిగా ...ప్రశాంతంగా....

“Let us Die Empty”

Source - Whatsapp Message

నేటి జీవిత సత్యం.

నేటి జీవిత సత్యం.
ఈ లోకంలో మనకంటూ ఒకరుండాలి. మనకంటే ‘మనకు మనకే’ అని కాదు. మనకోసం. మనకోసం మనసిచ్చేందుకు. మనకోసం ప్రాణమిచ్చేందుకు. అదీ ఇదీ అని కాదు. ఏదైనా ఇచ్చేందుకు, ఏమైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా...! అవును. అలాంటివారు ఒకరుంటే జీవితం ఎంత బేఫికర్‌గా ఉంటుంది! పండు వెన్నెల్లో, పూలపడవలో ప్రయాణంలా ఉంటుంది. కష్టం ఇష్టంలా ఉంటుంది. ఇష్టం మరింత ఇష్టమైపోతుంది. పసితనంలో- అమ్మ ఉంటే చాలు. అన్నం లేకపోయినా ఫరవాలేదు. అన్నీ లేకపోయినా ఫరవాలేదు. అయితే అది కొంతవరకే. ఆ తరవాత మన అవసరాలకు అమ్మ చాలదు. ఎందుకంటే తెలివిమీరిన మనిషికి ప్రేమ ఒక్కటే చాలదు. అమ్మప్రేమ ఒక్కటే చాలదు. అందుకే అమ్మలా ఒకరు కావాలి- అమ్మకంటే మిన్నగా అవసరాలు తీర్చేవారు!

నిజమే, మనిషికి అవసరాలు పెరుగుతాయి. వాటితోపాటే కష్టాలు, కన్నీళ్లు... ఎన్నో. వాటిని పంచుకునేందుకు, వీలైతే వాటిని తీర్చేందుకు... ఒకరుండాలి. మనం ఎవరమైనా ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా- అమ్మలా అక్కున చేర్చుకునేలా ఒకరుండాలి. అతడు సర్వశక్తిమంతుడైతే, ఎదురులేనివాడైతే, ఎవరికీ జవాబుదారీ కానివాడైతే, మనకు అండ, దండ, కొంత అన్నీ వాడే అయితే అలాంటివాడి తోడు, ఆదరణ, భరోసా లభిస్తే జీవితం పండగకాక మరేమిటి? అయితే ఇది ఊహించటానికి అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది, ఉండాలని ఆశగా ఉంది. కానీ అటువంటి తోడు ఉంటుందంటే అభూత కల్పనలా ఉంది. అతిశయోక్తిలా ఉంది. జీవితంలోని అసంబద్ధ కోరికలు, తప్పొప్పుల చిట్టా మనకే ఎబ్బెట్టుగా, అసహ్యంగా ఉంటుంది. ఇన్ని అవసరాలు, అపసవ్యాల మనిషిని, మనల్నీ... అన్నీ పట్టించుకోకుండా- మన కోసం, మనకోసమే ఉన్నాననే ఆ ఉదారుడెవరు? మన మనసులో మనసుగా, శ్వాసలో శ్వాసగా, కళ్లలో నీళ్లుగా, నిట్టూర్పులో ఓదార్పుగా... ఉంటారంటే- ఎంత బాగుంది? ఎంత అద్భుతంగా ఉంది. అది సాధ్యమవుతుందంటే- మనకు అపనమ్మకం!

మనకు తెలీదు. తెలిసినా మనం నమ్మలేం. నమ్మలేక, గుడ్డివాళ్లుగా బెంబేలెత్తిపోతున్నాం. ఎందుకంటే మనమెంత మంచివాళ్లమో ఎంత నిజాయతీపరులమో మనకు తెలుసు. ముఖ్యంగా అలాంటి వరానికి మనమెంత అర్హులమో అన్నింటికంటే బాగా తెలుసు. వాస్తవమేమిటంటే మన నమ్మకాలు, అపనమ్మకాలతో పని లేకుండా, మనం వెదుక్కునే అవసరం కూడా లేకుండా ఆ అద్భుత, అజ్ఞాతవ్యక్తి(!) మన పక్కనే, మన ఎదురుగానే, ముందూ వెనకా, పైనా కిందా... ఊహూ... మనలోనే మన అణువణువునా ఉన్నాడంటే మనం నమ్మగలమా? కానీ తప్పదు. ఎందుకంటే... ఉన్నాడు.

మన అర్హతానర్హతలు ఆయనకు అవసరంలేదు. మన స్థితిగతులతో ఆయనకు పనిలేదు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు సకలం సమకూర్చిన మావిని బొడ్డుకోసి అవతల పడేసినట్టు, మనల్ని సృష్టించి పోషిస్తున్న భగవంతుడి ఉనికినీ మరచిపోయినా, అసలు గుర్తించకపోయినా- ఆయన మాత్రం మనల్ని వదలడు. అందుకే ఆయన ఉన్నాడు, ఉంటాడు. అంతే!

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

గురువే దేవుడు

🤘గురువే దేవుడు
🕉️🌞🌎🏵️🌼🚩

' గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా.
యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని కొందరు 'జగద్గురువు'గా భావిస్తారు . అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు. రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది.
అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చేందుకు అంత లావు శ్రమ తీసుకున్నది!.
గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు.
క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా. మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు. పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది! నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.
మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు.

జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. ఎందుకయ్యా?' అనడిగితే తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!
దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు.
బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది.
' గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు ' గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.
గురువులు అష్టవిధాలు.
అక్షరాభ్యాసం చేయించినవాడు,
గాయత్రి ఉపదేశించినవాడు,
వేదాధ్యయనం చేయించినవాడు,
శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు,
పురోగతి కోరేవాడు,
మతాది సంప్రదాయాన్ని నేర్పించేవాడు,
మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు,
మోక్షమార్గాన్ని చూపించేవాడు
అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు.
దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.

- కర్లపాలెం హనుమంతరావు

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

నేటి మంచిమాట

నేటి మంచిమాట
🌀 జననం ధర్మమని, మరణం తప్పదని అందరికి తెలుసు 60 లేదా 70 కాకపోతే 80 సంవత్సరాలు.

🌀 ఖాళీ చేతులతో తల్లి గర్భంనుండి వచ్చాము, ఖాళీ చేతులలో భూగర్భంలోకి పోతాం, తొలిస్నానం గుర్తులేదు, చివరిస్నానంతెలియదు.

🌀 నీగురించి నీవు ఎక్కువ మాట్లాడు తున్నావ్ అంటే నీకు ౼ నేను అన్నది పోలేదన్నమాట...

🌀 జ్ఞానమున్న వారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది కాని అజ్ఞానునితో వాదించకు నీ విజ్ఞతను కోల్పోతావు...

🌀 ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది, ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు....
అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది...

🌀 మనం ఎంత మంచిగా ఉన్న ఎవరో ఒకరి కథలో చెడ్డ వాళ్లమే, కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది..

🌀 బయట గరికగడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు. అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేరు..

🌀 ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు, అబద్దం అందంగా తయారై అందర్నీ తనవైపు ఆకర్షిస్తుంది..

🌀 మన దగ్గర డబ్బులేకుంటే మన రక్తసంబంధంలోనే విలువుండదు, అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది.,
ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవారు, ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు...

🌀 ఎదుటి వ్యక్తి నీపై నేరుగా నెగ్గే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు...

🌀 నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బతికి ఉన్నావని అర్ధం,
ఇతరుల నొప్పిని కుడా నీవు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బతికి ఉన్నావని అర్ధం.._

🌀 మన వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునేవారి గురించి ఆలోచించకండి ఎందుకంటే...? వారిస్థానం ఎప్పుడు మన వెనుకే...

🌀అతివేగం ప్రమాదాలకు దారితీస్తుంది..అలాగే అన్నీ అనారోగ్యసమస్యలు వేగంగా తగ్గిపోవాలని వాడే మందుల వల్ల వచ్చే ప్రమాదాలే సైడ్ ఎఫెక్ట్స్.
అందుకే నో డాక్టర్ నో మెడిసిన్ ఓన్లీ మెడిటేషన్.

సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

సాథన గురించి ఒక చిన్ని కథ

సాథన గురించి ఒక చిన్ని కథ
చేతినిండా పని, మనసునిండా తగిన ఆలోచనలు... ఈ రెండూ మనిషి ప్రగతి రథానికి రెండు చక్రాలు. పనిలేక పోవడం వలన నిరాసక్తత ఏర్పడుతుంది. అలాంటివారిలో నిర్లిప్తత చోటు చేసుకుంటుంది. ఆ నిర్లిప్తత వల్ల ఎన్నో అనర్థాలు. అందుకే 'పనిలేనివాడి బుర్ర దయ్యాల నిలయం' అనే నానుడి పుట్టింది.

ఎల్లప్పుడూ పని చెయ్యడానికి అలవాటు పడిన శరీరం చురుకుగా ఉంటుంది. మెదడూ ఉత్సాహం పుంజుకొంటుంది. శరీరాన్ని శ్రమ పెట్టకుండా సుఖాలు కల్పిద్దామని విశ్రాంతినిచ్చామో... శరీరం, మనసు రెండూ రోగగ్రస్తం కావడం మొదలు పెడతాయి.

చైతన్యపురంలో కృషీవలుడు అనే రైతు ఉండేవాడు. అతడికి ఉన్నది కొద్దిపాటి భూమి. అందులోనే నిరంతర కృషితో అత్యధిక ఫలసాయం పొందుతూ ఉండేవాడు. అతడు విశ్రాంతిగా ఒక్కరోజైనా కూర్చునేవాడు కాదు.

ఒకసారి అతడు పొలం దున్నుతూ ఉండగా అటు వెళుతున్న ఆ ప్రాంత జమీందారు చూశాడు.

అది నడివేసవి కాలం. కృషీవలుడి గురించి, అతడి విజయాల గురించి అంతకుముందే విన్నాడతను. ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఎన్నాళ్ళనుంచో అనుకుంటున్నాడు. ఇన్నాళ్ళకు ఇలా అవకాశం దొరికింది అనుకుంటూ- బండి ఆపించి దిగి అతడి దగ్గరకు వెళ్ళాడు.

పరస్పర పరిచయాలు అయ్యాక 'ఇంత ఎండలో పనిచెయ్యకపోతేనేం?... ఇది పంట పండే కాలం కూడా కాదాయె. ఇప్పుడెందు కింత శ్రమపడి పనిచెయ్యడం?' అన్నాడు జమీందారు.

ఆ మాటకు జవాబుగా కృషీవలుడు 'పండే కాలం కాదని మనం అనుకుంటున్నాం. భూమికి మాత్రం ఖాళీగా ఉండటం తెలియదు... దానికి తెలిసిందల్లా ఏదో ఒక మొక్కను తనలో నుంచి మొలిపించి పెంచడమే... నేను ఈ రోజు దున్నకపోయినా, విత్తులు వేయకపోయినా భూమి మాత్రం తనపని తాను చేసుకుపోతుంది. తన గర్భంలోనే ఇదివరకటి నుంచి ఉన్న ఏ రకమైన విత్తులనైనా మొలిపిస్తుంది. అలా జరిగితే నేను నిజంగా పంట వేసేవేళకు ఆ కలుపు మొక్కలతో ఎన్నో అవస్థలు పడవలసి వస్తుంది.

ఆ పొలంలాంటిదే ఈ శరీరమూ... దీనికి పని చెప్పకుండా ఖాళీగా ఉంచితే ఏవో సుఖాలు కోరుతుంది. ఆలోచనలు చెయ్యడమే సహజ గుణమైన మెదడు సైతం అనేకమైన ఇతర ఆలోచనలు చేస్తుంది. ఫలితంగా పనిచెయ్యకుండా వదిలిన పొలంలో కలుపు మొక్కలు పెరిగినట్లే నా మనోక్షేత్రంలోనూ అనవసరమైన ఆలోచనలు సాగవుతాయి. శరీరానికీ, మనసుకూ హాని చేసే ఆలోచనలు నన్ను ఎటు తీసుకెళతాయో తెలియదు. అందుకే ఈ పొలానికి కలుపు మొక్కలు పెరిగే ఆస్కారం, మనసుకు చెడు తలపులు కలిగే ఆస్కారం ఇవ్వకుండా ఈ భూమిని మెత్తగా దున్నుతున్నాను. దీనివల్ల రాబోయే వర్షకాలంలో నా పనులు అతి సులువుగా జరగడానికి ఆస్కారం ఉంటుంది' అన్నాడు. కాబట్టి- ఏ రంగంలోనైనా నైపుణ్యం సాధించాలంటే నిరంతర కృషి, పరిశ్రమ ఉండాలి. ఉన్నత స్థానానికి ఎదిగేవారి విజయరహస్యం ఇదే.

అందరికీ బయటకు కనిపించేది- ఎదుటివారి విజయపరంపరే. బయటకు కనబడని అంశాలు- వారి నిరంతర శ్రమ, సాధన.
పియానో వాద్యంలో ప్రపంచ ప్రసిధ్ధి పొందినవాడు పడెర్విస్కీ. అతడు కచేరీ ముగిశాక విశ్రాంతి తీసుకోకుండా మళ్ళీ కనీసం అయిదు గంటలు సాధన చేస్తూండేవాడు. అది చూసిన మిత్రుడొకడు 'నువ్వు ఇంత చక్కగా కచేరీ చేస్తున్నావు. అదీ కాక ఇంచుమించు ప్రతిరోజూ కచేరీ ఉంటూనే ఉంది. అయినా ఇంకా సాధన ఎందుకు?' అని అడిగాడు.

ఆ మాట విన్న పడెర్విస్కీ 'నేను ఒక్కరోజు సాధన చెయ్యకపోతే నా సంగీత సామర్థ్యం తగ్గిపోయిందని నాకు తెలిసిపోతుంది. రెండు రోజులు సాధన చెయ్యకపోతే తోటి విద్వాంసులు గుర్తించేస్తారు. వరసగా మూడు రోజులు సాధన చెయ్యకపోతే, నా సంగీత అభిమానులంతా నా సామర్థ్యం తగ్గినట్లు గుర్తిస్తారు. కళ పట్టుబడటం ఒకెత్తు. దాన్ని నిలబెట్టుకోవడం మరొకెత్తు. ఈ రెండింటికీ నిరంతర పరిశ్రమే ప్రధానం. అది లేకపోతే మనసు ఖాళీగా కూర్చోదు. మరొక పనిలో పడుతుంది. అప్పుడు అసలు పని సరిగ్గా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి మనం కోరి తెచ్చుకోకూడదు. దానికోసం నిరంతరం సాధన, కృషి చేస్తూనే ఉండాలి. సాధనతోనే సాఫల్యం కలుగుతుంది' అన్నాడు.

*సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

నేటి జీవిత సత్యం

నేటి జీవిత సత్యం శరీరంలో ప్రాణములున్నంతవరకే కుశలమునడుగుదురు.

ప్రాణములు పోయిన పిదప ఆ శవమును చూచి భార్య కూడా భయపడును.

ఈ శరీరం ఎప్పుడూ ఇలాగే ఉండేది కాదు, ఇప్పుడు అందంగా, బిగువుగా, ఆకర్షణీయంగా ఉన్న శరీరం కొంతకాలం గడిచేసరికి సడలిపోతుంది, కృశించి పోతుంది, అందవిహీనమౌతుంది, చివరకి రాలిపోతుంది. ఈ విషయాన్ని మనం మరువరాదు, ఈ శరీరం నేను కాదు, ఇది కేవలం నేను వాడుకొనే పరికరం మాత్రమే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

ఉదాహరణకు నాకో చేతి గడియారం ఉంటే దానిని నేను ఎలా జాగ్రత్తగా వాడుకుంటున్నానో, దానిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నానో, అది చెడిపోతే ఎలా బాగు చేయించు కుంటున్నానో, కొత్త విడి భాగాలు అమర్చుకుంటున్నానో, అలాగే ఈ శరీరాన్ని కూడా అలానే వాడుకోవాలని భావించాలి...
దుస్తులు వేయాలి, పోషించాలి, అందంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, అవసరమైతే చెడిపోయిన అవయవాలను తొలగించి కొత్త అవయవాలను వేయాలి...
అయితే ఒక ముఖ్య విషయాన్ని మాత్రం మరచిపోకూడదు. ఇది మన కోసం వాడుకోవాల్సిన పరికరమని, ఒక ముఖ్యమైన పని కొరకు వినియోగించ వలసిన సాధనమని, ఇది శాశ్వతంగా ఉండేది కాదని, కనుక తెలివిగా, జాగ్రత్తగా వినియోగించు కోవాల్సినదని జ్ఞాపకం ఉంచుకోవాలి...

🎊💦🌹🦜🍇🦚🍓

’పరోపకారం ఇదం శరీరం’ అన్నారు. ఈ శరీరం పరులకు ఉపకారం చేయుటకు, సత్యశోధనకై, పరమాత్మ ప్రాప్తికై, సత్కార్యములకై మాత్రమే దీనిని వినియోగించాలి... అంతే గాని శరీరాన్ని పోషించటమే మానవ జీవితం యొక్క పవిత్ర కర్తవ్యం కాదు!

ఏదైనా ఒక వస్తువును పనికి వచ్చినంత కాలం వాడుకుంటాం, పనికి రాకపోతే పారవేస్తాం...
అలా పనికిరాక పారవేసే చిత్తు కాగితాలను గాని, ప్లాస్టిక్ వస్తువులను గాని, ఇనుప ముక్కలను గాని, బల్బులను గాని ఎవరో ఒకరు కొంటారు.
అలాగే ఏ జంతువన్నా చనిపోతే వాటి మాంసాన్నో, వాటి చర్మాన్నో, దంతాలనో ఉపయోగించుకుంటాం.
కాని మనిషి శరీరం మాత్రం ఎవరూ కొనరు. ఎదురు డబ్బు ఇచ్చినా తీసుకోరు...
ఇలాంటి పనికిరాని మురికి మూట అయిన ఈ శరీరం కోసం బ్రతికినన్నాళ్ళు తపించి పోవటం, ఇతరుల నెత్తిన చెయ్యి పెట్టటం, గొంతులు కొయ్యటం, యుద్ధాలు చెయ్యటం, దారుణంగా హత్యలు చెయ్యటం జరుగుతుంటాయి.

ప్రాణం పోయిన తర్వాత దీనికి పైసా విలువలేదు, ఇంటిలో ఎవరూ దీని క్షేమాన్ని గురించి పట్టించుకోరు, తుదకు భార్య కూడా భయపడుతుంది, ఈ కట్టెను మండే కట్టెల మీదకు చేర్చి అడ్డం వదలించుకుంటారు

మరి ఇట్టి శరీరాన్ని చూసుకొని, దీని కోసం విలువైన జీవితాన్ని వ్యర్థం చేసు కోవటం, మానవ జీవిత పరమార్థాన్ని సాధించటానికి వినియోగించకపోవటం తెలివైనపనేనా ?

కనుక ప్రాణం పోతే ఎందుకూ పనికిరాని ఈ శరీరాన్ని ప్రాణం ఉన్నంత కాలం ఎలా ఉపయోగించుకోవాలో, ఏమి సాధించు కోవాలో అనే విషయాన్ని నిరంతరం విచారణ చేసుకోవాలి, శరీరాభిమానం తగ్గించుకోవాలి,
నిజంగా శరీరాభిమానమే మనకు ఒక బంధం అని గ్రహించాలి...🙏*
సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

నేటి *చిన్ని కథ: మల్లాది కృష్ణమూర్తి*

నేటి చిన్ని కథ: మల్లాది కృష్ణమూర్తి

ఓ ధనికుడు గొప్ప దాత. 'నేను సంపాదించిన దాన్ని నేను దానం చేస్తున్నాను' అనే భావన లేకుండా, 'అంత దేవుడి సొమ్ము' అనే నమ్మకంతో దానం చేసేవాడు. అతని ఈ సాత్విక దాన గుణానికి సంతోషించిన దేవుడు ఓ రాత్రి అతనికి కలలో కనపడి చెప్పాడు.
"నీ దాన గుణానికి మెచ్చాను. నీ నీడకి కూడా దానం చేసే గుణాన్ని ప్రసాదిస్తున్నాను."
వెంటనే అతను దేవుడి పాదాలకి మ్రొక్కి చెప్పాడు.
" మీ మాటకి అడ్డొస్తున్నాననుకోక పొతే. నా నీడ ముందు కానీ, నాకు రెండు పక్కల కానీ ఉన్నపుడు కాక, కేవలం నా వెనుక ఉన్నపుడే దానం చేసే శక్తిని దానికి ప్రసాదించవలసిందిగా కోరుతున్నాను."
"ఎందుకని?" ప్రశ్నించాడు దేవుడు.
"లేకపోతే నా నీడ కూడా దానం చేస్తోందన్న అహంకారం నాలో కలగొచ్చు. నా వెనుక అది ఏం చేసినా నాకు తెలీదు కదా. నీడలా వెన్నాడే అహంకారం బారిన నేను పడదలచుకోలేదు." వివరించాడు ఆ ధనవంతుడు*

🕉️🌞🌎🏵️🚩

Source - Whatsapp Message

నేటి ఆణిముత్యాలు.

నేటి ఆణిముత్యాలు. ఆకలిగా ఉన్నవారికి గుప్పెడు అన్నం ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయ్యి బాధలో ఉన్న వారికి కొంచెం ఓదార్చు అందించడమే నిజమైన మానవత్వం

చదువు లేని వారు అమ్ముడు పోయాడంటే అర్థం ఉంది చదువు కొన్న పట్టభద్రుడా నీవురేపటి తరానికి వారధినువ్వుభవిష్యత్తు రధసారధి నువ్వు ఆలోచించుకో .

🎊💦💖🐋🍇🦚🍋

జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి నేను ఎదుగు తున్నాను , నేను బాగ సంపాదిస్తున్నాను , నీకు ఎవరితోను అవసరం రాదు లేదు అనుకోకు , ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేమీ చెప్పిరాదు , భాగా గుర్తుపెట్టుకో ఎవ్వరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడకు .

కన్నీరు అనేది లేకుంటే కంటి అందం కనిపించేది కాదేమో , దుఖః అనేది లేకుంటే సంతోషం విలువ తెలిసేది కాదేమో , మనకు కావలసినవి అన్ని సులువుగా దొరికిపోతే దేవుడిని కూడా గుర్తుకు చెసుకునే వాళ్ళం కాదేమో . అని అనుకుంటూ ఇప్పుడే నన్ను నేను అద్దంలో చూసుకున్నాను .

నాకు ఒకటి అర్థం అయ్యింది ఈ లోకంలో అమాయకత్వం ఇంకా బ్రతికే ఉందని

🎊💦

Source - Whatsapp Message

కోపం మనకు శత్రువా?

కోపం మనకు శత్రువా? ఓ రాజు తనకు యుద్ధంలో విజయం సంపాదించిపెట్టిన తన సామంతులకు విందు ఇస్తూ,

తన అందమైన కుమార్తె చేత వడ్డింపజేస్తున్నాడు.

ఇంతలో ప్రచండమైన గాలి వీచి, దీపాలు ఆరిపోయాయి.

తరువాత రాకుమార్తె ఏడుస్తూ తండ్రిని చేరి,

ఒక సామంతుడెవడో తన చేయి పట్టుకొని లాగాడని,

తాను విడిపించుకొని వస్తూ అతని తలపాగాను లాక్కొచ్చానని,

దాని సాయంతో ఆతని శిక్షించమని చెప్పింది.

రాజు, ఆమెను ఊరుకోబెట్టి, దీపాలు వెలిగించాక, తన సామంతులతో

సంతోషకరమైన ఈ విందు సమయంలో అధికారాన్ని సూచించే తలపాగాలు ధరించవద్దని

అందర్నీ తీసేయమన్నాడు. అందఱూ తీసేసి, మరింత ఉత్సాహంతో విందారగించారు.

ఆ తరువాత తన చర్యను రాకుమార్తెకు వివరిస్తూ, రాజు,

ఆ సంతోషసమయంలో అతనిని శిక్షిస్తే, అది విషాదంగా మారుతుందని,

తమ సాటివాడు శిక్షకు గురయితే, అది మిగతావారికి క్షోభకరంగా మారుతుందని,

అందువల్ల ఓపికవహించానని, మనకు విజయం సాధించిపెట్టాడు కాబట్టి

నీవు కూడా అతనిని క్షమించలేవా? అన్నాడు.

రాకుమార్తె, అంగీకరించిందో లేదో మనకు తెలియదు.

ఒకనాడు రాజు వేటకు వెళ్లగా, పగబట్టిన శత్రువులు అదును చూసి, చుట్టుముట్టారు.

రాజు యుద్ధం చేస్తున్నాడు కానీ అలసిపోయాడు. అదే సమయంలో మెరుపులా దూకిన

ఒకడు, రాజుకు అండగా నిలబడి, శత్రువులందర్నీ ఊచకోత కోశాడు.

ప్రాణాలకు తెగించి, తన ప్రాణాలను కాపాడిన అతడికి రాజు కృతజ్ఞతలు తెలియజేయగా,

నా ప్రాణాలను కాపాడిన మీకే నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అని అతడన్నాడు.

ఆశ్చర్యపొతున్న రాజుతో అతడు విషయం తెలుపుతూ,

విందురోజున వీచిన గాలికి, అలంకరణార్థం ఏర్పాటుచేసిన స్తంభం ఒకటి

రాకుమార్తెమీద పడబోతుండగా తాను, విధిలేక

ఆమె చేయి పట్టుకొని, ఇవతలకు లాగానని,

అయితే మీరు పెద్దమనసుతో తనను క్షమించి, ప్రాణాలను తీయక వదలిపెట్టినందువల్లే

ఇప్పుడు మీ ప్రాణాలను కాపాడగలిగానని చెప్పాడు.

ఈసారి రాకుమార్తె అతణ్ణి క్షమించడం కాదు. అతడికే క్షమాపణలు చెప్పి ఉంటుంది.

ఈ కథ క్షమాగుణం యొక్క గొప్పతనాన్ని తెలుపుతోంది.


పైవన్నీ ప్రక్కన పెట్టండి. కోపం మనకు ఎలా శత్రువవుతుందంటే,

కోపం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.

అనేక కెమికల్ టాక్సిన్స్ పుడతాయి. ఇవి మనకు చెరుపు కలుగజేస్తాయి.

రక్తప్రసరణవేగం హెచ్చుతుంది.

అంటే బిపికి రహదారి కోపం.

తలనొప్పులు వస్తాయి.

ముఖ కవళికలు మారతాయి. దాంతో ముఖం అందవిహీనంగా మారుతుంది.

నుదుటిన ముడుతలు ఏర్పడతాయి.

వాల్మీకి, రామాయణంలో రాముని వర్ణిస్తూ,

రాముని నుదుటి మీద ఎన్నడూ ముడుతలు ఏర్పడలేదని అంటాడు.

అంటే రాముడెప్పుడూ ప్రసన్నమైన మోముతోనే ఉండేవాడని అర్థం.


ఈ ప్రసన్నతే అంటే శాంతగుణమే ఆరోగ్యదాయిని.

చుట్టం అవసరంలో ఆదుకొన్నట్లు

మన దయాస్వభావం మనను అవసరంలో తప్పక ఆదుకొంటుంది.

తద్ద్వారా ఏర్పడిన సంతోషం ఇక్కడే స్వర్గాన్ని సృష్టిస్తుంది.

Source - Whatsapp Message

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.
కొన్ని కాళ్లే నీతో నీ వెంట నడుస్తాయి,
కొన్ని మనసులే నిన్ను తలుస్తాయి,
కొన్ని కళ్లే నీ కంటిలోని కన్నీటి తడిని గమనిస్తాయి,
ఆ ''కొన్నే"నీకు అన్నీ...
ఆ కొన్నిటినే జాగ్రత్తగా ఎంచుకో,
ఆగిపోతావేమో అన్న భయం కోసం కాదు...?
జీవితంలో సాగిపోవాలన్న నమ్మకం కోసం..!
జీవితం అనేది...
విభిన్న మార్గాలను కలిగి ఉండే ప్రయాణం,
మీరు ఎంచుకున్న మార్గం ఏదైనా,
దానిని మీ విధిగా ఉపయోగించుకోండి..

అవసరం గొప్పది,
తెగిపోతున్న బంధాన్ని కలుపుతుంది,
బలమైన బంధాన్ని తెంపుతుంది,
అన్ని బంధాలు నిస్వార్థం అనలేము.!
దూరమౌతున్నవారు...దూరమౌవడమే మంచిది,
ఎంత త్వరగా దూరమౌతే...
వారి నుండి మనం పోందే,
మానసిక వేదన...అంత తగ్గుతుంది.!!
కొందరికి దూరంగా ఉండటం మంచిది,
మరి కొందరిని దూరంలో ఉంచడం మంచిది..


అబద్ధాలకు అలవాటు
పడిన మనసులు
నిజాన్ని జీర్ణించుకోలేరు

మనమెప్పుడైతే ఆలోచనా
పరిధిని పెంచుకుంటామో
అప్పుడు మాత్రమే
మనం భ్రమల్లో బ్రతకడం మానేసి

వాస్తవంలోకి వస్తాము

మనం ప్రయోగించే మన పదజాలం
మన గౌరవాన్ని మన వ్యక్తిత్వాన్ని

తెలిపేలా ఉంటుంది.*

👏👏👏👏👏

Source - Whatsapp Message

నేటి ఆణిముత్యాలు.

నేటి ఆణిముత్యాలు. మాట మీద నిలబడటం వేరు
నిలబడే మాట పలకడం వేరు
మొదటిది
నిజాయతీ
రెండవది దార్శనికత

👍👍👍👍👍👍👍

చెప్పింది చేయడం వేరు
చేసేది చెప్పడం వేరు
మొదటిది నిబద్దత
రెండవది పారదర్శకత

👍👍👍👍👍👍👍

ఇతరుల మీద గెలవడం వేరు
ఇతరుల మదిలో నిలవడం వేరు
మొదటిది తంత్రం
రెండవది తత్వం

👍👍👍👍👍👍👍

ఎంత దూరమైనా వెళ్ళడం వేరు ఎంత దూరం వెళ్ళాలో తెలియడం వేరు
మొదటిది సాహసం
రెండవది వివేకం

👍👍👍👍👍👍👍

ఎలాగైనా చేయడం వేరు ఎలా చేయాలో తెలిసుండటం వేరు
మొదటిది చొరవ
రెండవది నేర్పు

👍👍👍👍👍👍👍

ఇతరులపై చూపుడు వేలు ఎత్తడం వేరు ఇతరుల కోసం పిడికిలి బిగించడం వేరు
మొదటిది నింద నీడన అస్తిత్వం
రెండవది నీడ వీడిన చైతన్యం

👍👍👍👍👍👍👍

గెలవడం వేరు గెలిపించడం వేరు
మొదటిది నేను
రెండవది మేము

సంఘం కట్టడం వేరు సంఘటితం అవ్వడం వేరు
మొదటిది వ్యూహం
రెండవది చైతన్యం


మొదటిది కావాలో... రెండవది కావాలో... ఆలోచన మనదే ... ఆచరణా మనదే ...

మనస్సులో సంతోషం లేనపుడు,
నువ్వు ఏడంతస్థుల మేడలో వున్నా,
ఏమీ లేని గుడిసెలో ఉన్నా ఒకటే..
మనస్సులో ఓర్వలేనితనం ఉన్నపుడు,
నువ్వు ఏడుకొండలు ఎక్కినా,
ఏడుస్తూ పూజచేసినా ఒక్కటే..
ముద్దాడినా కత్తి గాయమే చేస్తుంది,
తెగ నరుకుతున్నా చెట్టు నీడనే ఇస్తుంది,
మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే..

తమని తాము గౌరవించుకోలేని బలహీనులు,
సమాజంలో అడుగడుగునా మనకు అగుపిస్తూనే ఉంటారు.!
పుట్టుకతో వచ్చిన నలుపురంగును దాచి,
ముఖాన రంగులు పూసుకునే వారు,
పొట్టిగా ఉన్నానని కుంచించుకుపోయి,
హీల్స్ వేసుకుని సంబరపడేవాళ్ళు,
బట్టతలను చూసుకుని బావురుమనే వాళ్ళు,
తమకు లేనివి చూసి బతుకంతా బాధపడేవాళ్ళు,
ఎదుటివాళ్ళలో హీరోని/హీరోయిన్ ను చూసి,

నేను కాలేకపోయానని కుమిపోతున్న వాళ్ళు ఎందరో...?

మనల్ని మనమే గుర్తించకపోతే,

గౌరవించుకోలేకపోతే, _ఇతరులెందుకు గౌరవిస్తారు.?

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.
తన వైపు ఇతరులు విసిరే
రాళ్ళతో తన ఎదుగుదలకు
పునాదులు వేసుకునే వాడే
తెలివైన వ్యక్తి..

ఈ సృష్టిలో మనం ఒక అణువంత.అందిన అభిమానాన్ని చులకనగానో, నిర్లక్ష్యంగానో, దూరం చేసుకుంటే, వారిని తిరిగి చూడలేం. జ్ఞాపకాలలో తప్ప.

జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరీక్షా ఒంటరిగానే ఎదుర్కొంటాం. కానీ, దాని పరిణామం మాత్రం అందరికీ తెలుస్తుంది. కాబట్టి, ఎదైనా పని చేసేముందు, తర్వాత ఎదుర్కోబోయే పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ పని చేయడం ఉత్తమం.

నువ్వు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్నా, ఇతరులను గౌరవించడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే, నువ్వు మరణించిన తర్వాత నీ సొంత కాళ్ళతో స్మశానానికి చేరుకోలేవు.

ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని గాని, మార్చాలి అని గాని ప్రయత్నించకండి. మీరే మారండి.
కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాంగాని రోడ్డంతా తివాచి పరుస్తామా?

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

సమయస్ఫూర్తి. చిన్న కథ

🌹సమయస్ఫూర్తి. చిన్న కథ

ఒకానొకప్పుడు బర్మా దేశంలోని ఒక చిన్న పట్టణంలో ఒక చిరువ్యాపారి ఉండేవాడు. అతను పెద్ద మొత్తంలో ఒక వడ్డీ వ్యాపారికి బాకీ పడ్డాడు. ఆ వడ్డీ వ్యాపారి ముసలివాడు, కానీ చండశాసనుడు. తన వడ్గీ వసూలు కోసం ఎంత నీచస్థాయికైనా దిగజారగలడు.

ఒకసారి, వడ్డీ ఇవ్వడం ఆలస్యమయినందున, ఆ వడ్డీవ్యాపారి కోపంగా ఈ చిన్న దుకాణదారు ఇంటికి వచ్చాడు. తన వడ్డీ సంగతేం చేశావని నిలదీసాడు. ఈ నెల దుకాణం సరిగా నడవనందున ఆదాయం చాలినంత లేదని, త్వరలో ఇచ్చేస్తానని నమ్మబలికాడు.
ఆ ముసలివాడిని శాంతపరిచేందుకు మజ్జిగ తెమ్మని తన కూతురికి పురమాయించాడు. మజ్జిగతో వచ్చిన ఆ వ్యాపారి కూతుర్ని చూసిన ఈ వృద్ధ వడ్డీ వ్యాపారి దుర్బుద్ధి పుట్టి ఆ దుకాణదారుతో ‘నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తే, నీ బాకీ మొత్తం రద్దు చేస్తా’నని స్పష్గం చేసాడు.

ఆ వ్యాపారి ముసలివాడిని అసహ్యంగా చూసాడు. అది గమనించిన వడ్డీవ్యాపారి, ‘సరే… నీకు రెండు అవకాశాలిస్తాను. ఏదైనా ఒకదానిని నువ్వు ఎంపిక చేసుకోవచ్చు. అవేంటంటే, రెండు గులకరాళ్లు ఒక సంచీలో వేస్తాను. ఒకటి నల్లది. రెండోది తెల్లది. మీ అమ్మాయి వచ్చి సంచీలోనుండి ఒక రాయిని బయటకు తీయాల్సివుంటుంది. నల్లరాయి వస్తే, నీ బాకీ రద్దవుతుంది. కానీ, మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం జరిపించాలి. తెల్లరాయి వస్తే కూడా నీ బాకీ రద్దవుతుంది. అప్పుడు నీ కూతుర్ని కూడా నాకివ్వనవసరం లేదు’ అని తేల్చాడు.

ఈ చిరువ్యాపారికి వేరే అవకాశం లేకపోవడం వల్ల ఈ ఒప్పందానికి ‘సరే’ అన్నాడు. ఆ అమ్మాయి గుండెల్లో రాయి పడింది. ‘ఇదెక్కడి అన్యాయంరా భగవంతుడా. నాకేమిటి దారి? చివరకు ఈ ముదుసలిని, అనాకారిని పెళ్లి చేసుకోవాలా?’ అని బాధపడి, తర్వాత స్థిమితపడి పరిపరివిధాల ఆలోచించసాగింది.

ఇంతలో, ఆ వడ్డీవ్యాపారి వీరి ఇంటి ముందు ఉన్న గులకరాళ్ల దారి వద్దకు వెళ్లి, వంగి, అటూఇటూ చూసి రెండు గులకరాళ్లు తీసి సంచీలో వేసాడు. నిజానికి ఆ రెండూ నల్ల రాళ్లే. అనుకోకుండా వ్యాపారి కూతురు ముసలివాడి దుశ్చర్యను చూసింది. అయినా ఏమీ తెలియనట్లు ఓ పక్కన నిలబడిఉంది.

అప్పుడు ఆ ముసలివాడు తండ్రీకూతుళ్లను దగ్గరికి రమ్మని పిలిచాడు. ‘అమ్మాయి. ఒక రాయి తీయి’ అని సంచీని ముందుకు చాపాడు. ‘నువ్వు కూడా చూడు’ అని తండ్రిని కూడా అదిలించాడు.

ఇక్కడ ఇక ఆ ఆమ్మాయినిక మిగిలింది మూడే అవకాశాలు.
1. సంచీలోనుండి రాయి తియ్యడానికి నిరాకరించడం.
2. సంచీలోనుంచి రెండు రాళ్లు బయటకు తీసి ముసలివాడి అన్యాయాన్ని బయటపెట్టడం.
3. తెలిసి తెలిసి, తండ్రి అప్పు తీర్చడం కోసం సంచీలోనుండి ఒక రాయి బయటకు తీసి, అతన్ని పెళ్లి చేసుకుని, త్యాగం చేయడం.

ఇంతలో ఆ అమ్మాయికి మెరుపులాంటి ఆలోచన ఒకటి వచ్చింది. వెంటనే సంచీలో చేయిపెట్టి, ఒక రాయిని బయటకు తీసి, అదే జారిపోయినట్టుగా కిందకు దారిలో వదిలేసి ఆ ముసలివాడితో ఇలా అంది.

‘‘ అయ్యో.. నన్ను క్షమించండి. రాయి పొరపాటున జారిపోయింది. కింద అన్నీ గులకరాళ్లే. జారిపోయింది ఏదో తెలియడం లేదు కదా. అయినా పరవాలేదు. సంచీలో ఉన్నది బయటకు తీయండి. దాంతో కిందపడిందేదో తెలిసిపోతుంది కదా’’

ఆ వృద్ద వడ్డీవ్యాపారి కంగారు పడ్డాడు. మింగాలేక, కక్కాలేని పరిస్థితి. లోపల ఉన్నది బయటకు తీస్తే, కింద పడ్డది తెల్ల రాయి అని నిర్ధారించినట్లే. లేదూ నల్లరాయే అంటే, తన మోసం తెల్లారిపోతుంది. ఇక ఏం చేయలేక, ఏడ్వలేక నవ్వుతూ, ఆ దుకాణదారుడి బాకీ మొత్తం రద్దు చేసి వెళ్లిపోయాడు.

``
నీతి ఏంటంటే.. ‘‘ప్రతీ కష్టసమయాన్ని దాటడానికి ఓ ఉపాయం ఉంటుంది. విభిన్నంగా ఆలోచించడం ద్వారా ఆ ఉపాయం తడుతుంది. పరిస్థితులు కల్పించే అవకాశాలే కాక, మరో అవకాశం మన ఆలోచన వల్ల వస్తుంది’’*

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

🌸ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చిందని
🍂పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది

🍃 పదార్థాన్ని బట్టి అవసరము

పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటుంది

కనుక.....

🌷మనమెంత గొప్పవారిమైనా

🌱మన అవసరం లేని దగ్గర మౌనంగా
ఉన్నపుడే
మన విలువ పెరుగుతుంది.🌟




ఎక్కడైనా మనం సరిపోని చోట
బలవంతంగా ఇమిడిపోయే ప్రయత్నం చేసి,
మనల్ని మనమే బాధ పెట్టుకోవద్దు.!

చుట్టూ దొంగ దోస్తులను పెట్టుకొని ఆనందించడం కంటే,
ఒంటరి తనాన్ని ఆస్వాదించడం మేలు..
ఎంత సహాయం చేస్తే అంత ఎదుగుతావు,
ఎంత మోసం చేస్తే అంత నలిగిపోతావు..

నీ చుట్టూనే ఉంటూ నవ్వుతూ,
నవ్విస్తూ ఉండే వాళ్లంతా,
నీ మిత్రులని భ్రమ పడకు...
ఆస్కార్ అవార్డులు పొందిన వారికంటే,
చాలా బాగా నటించేవారుంటారు..
ఎప్పుడో వాస్తవ పరిస్థితులు,
వారి నకిలీ భాగోతం బహిర్గతం కాదు,
కాబట్టి జాగృత్త గా ఉండాలి.!
కాన్ని సందర్భాల్లో మంచి వాళ్ళు గా ఉండే కంటే,
ప్రశాంతంగా ఉండడానికే ప్రాధాన్యత ఇవ్వాలి..
అయితే మన మంచి తనాన్ని బలహీనతగా తీసుకుంటే,
గుణపాఠం చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడవద్దు...
👏👏👏👏

Source - Whatsapp Message

ఈ శరీరం కర్మ ఫలమే

ఈ శరీరం కర్మ ఫలమే
🕉️⚜️🌎🏵️🌼🚩

ధర్మం చాలారకాలుగా ఉంటుంది. చాలా సూక్ష్మంగా ఉంటుంది. వేదవిహితము, పెద్దలమాటలూ , వారి ఆచరణ చూసి ధర్మసూక్ష్మాన్ని గ్రహించాలి. సత్యవ్రతం గొప్పది. కాని ఇతరులకు జరిగే అపాయాన్ని నివారించడానికి చెప్పే అబద్ధం నిజం కంటే గొప్పది. ఏ ప్రాణికైనా అపకారం కలిగించే నిజం అబద్ధం చెప్పడంతో సమానం. ప్రాణాపాయ స్థితిలో, వివాహసమయంలో చెప్పే అసత్యం నిజంతో సమానం. కులవృత్తి దైవ సమానం. ఇష్టాయిష్టాలతో పని లేకుండా దానిని ఆచరించడం మానవ ధర్మం. మనము అనుభవించే కష్టసుఖాలు మనం పూర్వజనమలో చేసిన పాపపుణ్యాలే కారణం. ఇది తెలియని మూఢులు దైవాన్ని దూషిస్తారు. మానవులు తాము చేసే పనులకు తామే కర్తలమని భావిస్తారు. అది అజ్ఞానం అదే నిజమైతే తాము చేసే కార్యములన్నీ ఎందుకు ఫలించడం లేదు. ధర్మాత్ములు, నీతిమంతులు చేసే కార్యములు ఒక్కోసారి నిష్ఫలమతున్నాయి కాని దుర్మార్గులు చేసే పనులు ఫలిస్తున్నాయి. కొందరికి అనాయాసంగా ధనరాశులు వచ్చి పడుతున్నాయి. కొందరికి ఎంత శ్రమించినా పేదరికం పోదు. కటిక దరిద్రులకు పేదవారికి వద్దన్నా సంతానం కలుగుతుంది. కొందరు ధనవంతులకు ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలుగదు. ఇదంతా పూర్వజన్మ కర్మ ఫలమే. మానవులు కర్మాధీనులు కాకుంటే రోగాలు, మరణం లేకుండా బ్రతకవచ్చు కదా. కనుక ఈ శరీరం కర్మ ఫలంగానే ఏర్పడుతుంది. శరీరం చేయవలసిన పనులు కర్మవశాన నిర్ణయించబడతాయి. మరణానంతరం కర్మఫలాన్ననుసరించి దేహధారణ నిర్ణయించ బడుతుంది.

*సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

నేటి మంచిమాట

🌹నేటి మంచిమాట🌹

మనలా ఎవరి దగ్గరైతే ఉండగలమో,
ఎవరైతే మనల్ని మనలా అర్థం చేసుకుంటారో,
మనలో ఉన్న మంచిని మనకు చెపుతూ,
మనలో ఉన్న చెడును హెచ్చరిస్తూ,
ఎప్పటికప్పుడు సరిచేస్తూ,
మన ఎదుగుదలకు నిరంతరం పరితపిస్తూ,
మనకు ధైర్యాన్నిచ్చేవారు,
మన పక్కన ఒక్కరున్నా చాలు..వారే మనకు బలం..
నిన్ను తక్కువ చేసి మాట్లాడేవారికి,
నోటితో చెప్పే సమాధానం కన్నా,
నువ్వు సాధించిన విజయమే సరైన బలమైన సమాధానం అవుతుంది..

పై పైన ఎన్ని మెరుగులు దిద్దిన,
లోన ఉన్న మెరుగును ఆపలేవు?
అది ఏదైనా సరే..
వ్యక్తిత్వం పరంగా అయినా,
గుణం పరంగా అయినా,
స్వభావం పరంగా అయినా,
ఏదో ఒక సమయంలో సమయానుకూలంగా నీలోని నిజమైన,
నిజస్వరూపం బయట పడుతూనే ఉంటుంది..
అందరికంటే నేనే గొప్ప అనుకోవడం అవివేకం,
ఒక వేలు పొడుగు ఒకవేలు పొట్టిగా ఉన్నంత మాత్రాన విలువలు మారవు,
అక్షరం రాయాలన్నా ,
అన్నం తినాలన్నా ,
ఐదువేళ్ళూ కలవాల్సిందే..
మనుషులైనా అంతే,
చిన్న పెద్ద అన్న తేడా వద్దు
ఎవరి ప్రాముఖ్యం వాళ్లదే..

☘శుభోదయం🌹🦚

Source - Whatsapp Message

మనసులో మాలిన్యం

🌼మనసులో మాలిన్యం🎊
🕉️🌞🌎🏵️🌼🚩

1. మనసులో మాలిన్యం ఉన్నపుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం.. చేపలు రాత్రింబవళ్లు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా.


2. సక్రమంగా ఉండాలా దయగా ఉండాలా అన్న సంశయం వస్తే దయవైపే మొగ్గు, అది ఎప్పుడూ సక్రమమే అవుతుంది.

3. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒదుదొడుకులు నిన్నేమీ చెయ్యలేవు.


4. తినవలసిన వ్యక్తులు నలుగురుండి ముగ్గురికి సరిపడా భోజనం మాత్రమే ఉన్నప్పుడు ’ఎందుకో నాకీ రోజు అస్సలు ఆకలి వేయ్యడం లేదు’ అని చెప్పే వ్యక్తి.. అమ్మ


5. నీతిని బోధించడానికి అర్హతలేనివాళ్లు నీతి సూక్తులు చెప్పడం ప్రారంభిస్తే, ప్రజలకు ఆ వ్యక్తుల మీదే కాక అసలు నీతిమీదే నిరసన భావం ఏర్పడే ప్రమాదం ఉంది.

6. డబ్బు కాదు.. డబ్బు మీద ప్రేమ, మోహం, దురాశ అనార్థాలకు హేతువులు.

7. కనిపించేదాన్ని చూడటానికి కళ్లు చాలు, కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి.

8. దుష్టులకు దూరంగా ఉండాలి. కానీ వారితో విరోధంగా ఉండకూడదు.

9. ముందుకు వెళ్ళలేని ప్రతి మనిషీ వెనక్కు వెళ్ళాల్సిందే.

10. ఇప్పటివరకూ వచ్చిన మంచి పుస్తకాలన్నీ చదవటమంటే.. గత శతాబ్దాలకు చెందిన మహనీయులందరితో ముఖాముఖీ మాట్లాడటం.

🎊💦💞🦚🌹🦜🌈

Source - Whatsapp Message

Good quotes

అన్నింటికన్నా గొప్పవరం సంతోషంగా ఉండగలగటమే.

ప్రేమతోనే ద్వేషాన్ని దూరం చేయగలము.

సహనం కోల్పోకూడదు.

చెడు ఆలోచనలే సమస్యలకు కారణము.

మార్చలేని గతాన్ని గురించి ఆలోచించడం ఎందుకు.

రాబోయే భవిష్యత్తు గురించి శ్రమించు.

ప్రయత్నం చేసినా ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఆపకూడదు.

కష్టాలు ఎదురైనప్పుడే మనిషి సామర్థ్యం తెలుస్తుంది.

ఎంత కాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం.

విద్య నీడలాంటిది, దానిని మన నుంచి ఎవరు దూరం చేయలేరు.

విజయం సాధించాలంటే చేసే పనిని ప్రేమించాలి.

జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య.

కాలాన్ని వృథా చేయడమంటే జీవితాన్ని వ్యర్థం చేయడమే.

ఎన్ని పూజలు చేసినా బుద్ధి వంకరగా ఉంటే ఉపయోగం లేదు.

సత్యవచనాలను కూడా ప్రేమపూరితంగానే చెప్పాలి.

సంశయం సద్గురువు ఇచ్చే వరాలను శిష్యునికి అందకుండా చేస్తుంది.

🎊💦💖🦚🌹🦜

Source - Whatsapp Message

ఎవరు తీసిన గోతిలో

ఎవరు తీసిన గోతిలో...
✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు

భక్త తుకారాం పాండురంగడి భక్తుడు. నిరంతరం దైవ నామ స్మరణలో గడిపేవాడు. దేవుణ్ణి కీర్తిస్తూ అభంగాలు రచించి గానం చేసేవాడు.
తుకారాం భక్తి ప్రపత్తులకు ఆకర్షితుడయ్యాడు ఆ వూళ్ళోని ఒక భక్తుడు. అతడు తరచుగా భక్త తుకారాంని ఇంటికి ఆహ్వానించి అతనితో ఆధ్యాత్మిక విషయాలు చర్చించేవాడు.

అలా తుకారాం వచ్చి భర్తను కలవడం భక్తుని భార్యకు నచ్చేది కాదు. తన భర్త తుకారాంని కలవడం వల్ల ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ తనను పట్టించుకోటం లేదని బాధపడేది. కొన్నాళ్ళకు ఆ బాధ కాస్తా కోపంగా మారింది. భక్త తుకారాం మీద పగ తీర్చుకోవాలన్నంత కసి పెరిగింది ఆమెలో.

ఒక రోజు ఆ భక్తుని ఇంటికి వెళ్ళాడు తుకారాం. వారిద్దరూ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుండగా భక్తుడి భార్యకు మనసులో అప్పటికే ఉన్న కోపం తారాస్థాయికి చేరుకుంది.

ఎలాగైనా తుకారాంని తమ ఇంటికి రాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఒక గిన్నెలో నీరు నింపి పొయ్యి మీద బాగా మరిగించింది. ఆ వేడి నీరుని తుకారాం కాళ్ళ మీద పోసినట్టయితే తన పగ చల్లారుతుందని తరువాత నుండి తుకారాం బాధ తప్పి పోతుందని అనుకుందామె.
వేడి నీరున్న గిన్నెను గుడ్డతో పట్టుకుని వంటగది నుండి బయటకు వచ్చి నడుస్తుండగా అనుకోని విధంగా ఆమె కాలు జారి క్రింద పడింది. మరుక్షణం గిన్నె లోని వేడినీరు ఆమె ఒంటి మీదనే చిలికి ఒళ్ళంతా బొబ్బలెక్కాయి. బొబ్బల బాధను తట్టుకోలేక పెద్దగా కేకలు వేస్తూ అరిచింది భక్తుని భార్య.

భార్యకు ఏమైందోనని భక్తుడు ఆందోళన చెందుతుండగా అతడితో బాటూ తుకారాం కూడ లోపలకు వెళ్ళాడు. అక్కడ భక్తుడి భార్య బాధతో గిలగిలా కొట్టుకుంటోంది. ఆమెకు జరిగిన ప్రమాదం చూసి చలించిపోయాడు తుకారాం. భగవంతుని స్మరిస్తూ ఆమె శరీరం మీద స్పృశించాడు. తుకారాం చేయి ఆమెను తాకగానే ఆమె బాధ మటుమాయమై పోయింది. అంతే కాకుండా కాలిన బొబ్బలన్నీ మాయమై పోయాయి.

తాను చేసిన తప్పుకు కుమిలిపోతూ భక్త తుకారాం పాదాలపై పడి క్షమించమని వేడుకుంది . విశాల హృదయం గల తుకారాం ఆమెను క్షమించాడు. తనను పాండురంగడే కాపాడాడని తుకారాం మనసులోనే దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు.

ఎవరు తీసిన గోతిలో వారే పడతారని తెలుసుకున్న భక్తుని భార్య తుకారాంని గౌరవించడం నేర్చుకుంది. తరువాత నుండి భర్తను తుకారంతో వెళ్లేందుకు ప్రోత్సహించింది.

👏👏👏👏👏👏

Source - Whatsapp Message

నేటి మంచిమాట.

🌻🌄శుభోదయం. నేటి మంచిమాట.

🌼 అందరూ బాగుండాలి🌼

🌺 అందులో మనముండాలి 🌺

సర్వేజనాః సుఖినోభవన్తు.

లోకాసమస్తా సుఖినోభవంతు.


🌳 ప్రకృతిని ప్రేమిద్దాం 🌳
💚 పచ్చదనం కాపాడుకుందాం 💚

నిజాయితీగా ఉండేవారు
ఎప్పుడూ పొగరుగానే ఉంటారు
ఎందుకంటే వాళ్ళకు నటించడం
తెలియదు......
ఆత్మగౌరవంతో జీవించడం తప్ప
వాళ్ళు ఎవ్వరికీ నచ్చరు....
నచ్చితే వదులుకోలేరు...
వారి బలమూ అదే....
బలహీనత కూడా అదే....!!
🌹☘️🌹☘️ ☘️🌹☘️

మంచికోసం..మనిషి
మారాలి కానీ.....
అవకాశం కోసం మనిషి
తన రంగులు మార్చకూడదు...!!

☘️🌺☘️🌺 🦚🌺☘️

☘️🟣☘️

రూపం ఎంత బాగున్నా
అది కంటి వరకే విలువ
ఆ రూపం వెనుక
మనసు....ఆ మనసు నుండి
వచ్చే మాట...కల్మషం లేనప్పుడు
మనిషికి రూపానికి మించిన విలువ...!!
☘️🟣☘️🟣 🟣☘️🟣☘️

🔵🔶🔵

"TRUST"
is an invisible Currency,
hard to earn...
easy to lose.....!!

🔵🔶🔵🔶 🔶🔵🔶🔵
🟢🔶🟢

నీ జీవితాన్ని మార్చేవాడు
నీ ముందు అద్దంలో తప్ప
లోకంలో ఎక్కడా కనిపించడు....!!


రూపం ఎంత బాగున్నా
అది కంటి వరకే విలువ.

ఆ రూపం వెనుక మనసు....
ఆ మనసు నుండి వచ్చే మాట...

కల్మషం లేనప్పుడు

మనిషికి రూపానికి మించిన విలువ...!!



మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకీ
ఏదైనా చెప్పొచ్చు కానీ....
ప్రతి చిన్న విషయాన్ని అపార్థం
చేసుకునే వాళ్ళకుఏదీ...
చెప్పక పోవడమే మంచిది....!!


అహంకారం ,
గర్వం ,
పొగరు
అనేవి నా దృష్టిలో చాలా ఖరీదైనవి ,
నాకు వాటిని కొనుక్కోవడం ఇష్టం లేదు ,
అందుకే,
ప్రేమతో దొరికే చిరునవ్వు ,
సంతోషం ,
ప్రేమ ,
ఆప్యాయత అనే వాటితోనే సంతోషంగా ఉంటున్నా..
ఇతరులకు కూడా అవే పంచి పెడుతున్నా..


నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం
గొప్ప కాదు.
మన గురించి ఎదుటి వ్యక్తి ఆలోచించటం
గొప్పతనం.

బంగారం కొత్తదే బాగుంటుంది
బియ్యం పాతగవుతున్నాకొద్ది బాగుంటాయి
కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు
బియ్యంతో వండిన అన్నమే.
కొత్త పరిచయాలు బాగుంటాయి
పాత బందాలే బలంగా ఉంటాయి
కానీ కష్టం తీర్చేవి కొత్త కావు
పాతికేళ్ళ స్నేహలు.! పాతుకుపోయిన బందాలే.
అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోరాదు
అపురూపమైన బందాలను వదులుకోరాదు.*

సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

అర్ధం చేసుకోవడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బుద్దితో, రెండవది హృదయంతో.

అర్ధం చేసుకోవడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బుద్దితో, రెండవది హృదయంతో. ఈశ్వరార్పణం అనేది ఎప్పుడూ బుద్ధితో జరగని పని. ఎందుకంటే బుద్ధి ఎప్పుడూ అహంకారాన్ని దాటిపోదు.

కర్మ నాది, ఫలం నీది అనే సూత్రాన్ని బుద్ధి అర్ధం చేసుకోలేదు. హృదయం తో అర్ధం చేసుకోవడం అంటే, లభించిన ప్రతీది పరమాత్మ ప్రసాదమే అని గ్రహించడం.

తర్కము కానీ, బుద్ధి కానీ ఎందుకు?అని ప్రశ్నిస్తాయి. ఆ ఎందుకు అనే దానికి జవాబు దొరకకపోతే అవి వెనక్కి వచ్చేస్తాయి. ఎక్కడ ఈ ఎందుకు? అనే దానికి జవాబు దొరకదో, అక్కడ హృదయం శోధిస్తుంది.

ఏది బయట ద్వారా లోపలికి తీసుకోబడుతుందో, దానికి ఆహారం అని పేరు. అంటే భోజనం ఒక్కటే కాదు. మనం ఇంద్రియాల నుండి లోపలికి తీసుకునే ప్రతీది, ప్రాణాన్ని ప్రాణంలోకి సమర్పించడానికి అనువుగా ఉండాలి.

మనం తీసుకునే ఆహారం, ప్రాణానికి ఉత్తేజం, ఉద్వేగం కలిగించి, ప్రాణం బయట వస్తువుల వైపు పరుగులు తీసేలా చేస్తుంది. ఆ పరుగుని ఆపగలిగితే ఈ ప్రాణం, మహాప్రాణంలో విలీనం అవుతుంది.

ఈ ప్రపంచంలో అజ్ఞానానికి మించిన మృత్యువు ఏదీ లేదు. శరీరంలో శరీరం గురించి తప్ప మరే తత్త్వము తెలియని వాడు అజ్ఞాని. "నేను" అనేది తెలుసుకోగలిగేదే జ్ఞానము. మనం ఉన్నాము అనే ఎరుక కలిగివుండి, ఆ మనం ఏమిటో తెలియక పోవడమే అజ్ఞానం. తెలియడం జ్ఞానం.
👏👏👏

Source - Whatsapp Message

జీవితం ఒక హరివిల్లు

జీవితం ఒక హరివిల్లు

సుఖం-దుఃఖం, వేడుక-వేదన, గెలుపు-ఓటమి, లాభం నష్టం... వీటి సమ్మేళనమే జీవితం.

గెలుపు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఓటమి ఎదురైనా కుంగిపోకుండా సమతుల్యతతో జీవితం సాగించే ప్రతి మనిషీ స్థితప్రజ్ఞుడేనని పెద్దలు చెప్పిన మాట. వీరు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని విజేతలవుతారు ప్రతికూలతలోంచి సానుకూలతను వెదుకుతారు కీడులోంచి మేలు సాధిస్తారు. ప్రమాదాలను ప్రమోదాలుగా, ఆపదలను సంపదలుగా మలచుకుంటారు.

శకుని మాయాజూదంతో అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చినా పాండవులు తమ దుస్థితికి బాధపడలేదు రుషులతో ధర్మశాస్త్ర చర్చల ద్వారా ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ సమయంలోనే అర్జునుడు తపస్సు చేసి ఇంద్రుడు మొదలైన దేవతల అనుగ్రహం పొంది వారి ద్వారా అనేక అస్త్ర, శస్త్రవిద్యలు సాధించాడు

తనను యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తారని తెలిసినప్పుడు శ్రీరాముడు ఆనందపడలేదు. తరవాతి రోజే తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆందోళనా చెందలేదు అరణ్యకాండలో మునులను రాక్షసులబారినుంచి రక్షించాడు. శబరి వంటి భక్తులను అనుగ్రహించాడు.

మహానుభావుల జీవిత చరిత్రలు పఠిస్తే వారి అనుభవాలు జీవితసారాన్ని బోధిస్తాయి. మార్గదర్శక సూత్రాలు నిర్దేశిస్తాయి. కష్టాలపాలైనప్పుడు వాటిని ధైర్యంతో ఎదుర్కొన్నారు. వ్యామోహానికి గురైనప్పుడు నిగ్రహం వహించారు. నిరాశ ఎదురైనప్పుడు మానసిక స్థైర్యంతోముందుకు కదిలారు. ప్రతిబంధకాలనుంచి అవకాశాలు సృష్టించుకున్నారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడిచిన ప్రతి మనిషి వెలుగునీడల సమ్మేళనమైన తన జీవితగమనంలోని ప్రతి అడుగూ సంయమనంతో వేస్తాడు, స్థితప్రజ్ఞుడిగా ఎదుగుతాడు.

ఒక న్యాయవాది తన ఇరవై ఒకటో సంవత్సరంలోనే వ్యాపారంలో దిగి పూర్తిగా నష్టపోయాడు. తరవాతి సంవత్సరం శాసనసభకు జరిగే ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. మరో రెండేళ్లకు వ్యాపారంలో దిగి మళ్లీ నష్టపోయాడు. ఆపై రెండేళ్లకు తాను ప్రాణాధికంగా ప్రేమించిన స్నేహితురాలి మరణంతో విషాదం అనుభవించాడు. ముప్పై నాలుగేళ్ళ వయసులో మళ్ళీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. తిరిగి నలభై అయిదేళ్ళ వయసులో బరిలోకి దిగీ చట్టసభలో స్థానం సంపాదించుకోలేకపోయాడు. ఇంకో రెండేళ్లకు దేశ ఉపాధ్యక్షుడి పదవికి పోటీచేసి ఓటమి చవిచూశాడు అయితేనేం అన్ని వైఫల్యాల తరవాత తన యాభై రెండో ఏట సువిశాల అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యాడు ఆయనే ప్రతి ఓటమినీ గుణపాఠంగా మలచుకుని, తుదకు విజేతగా ఎదిగిన అబ్రహాంలింకన్.

వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని సంతోషపడతాం. ఆ వానలు ఉద్ధృతమై వరదలుగా, తుపానులుగా మారితే భయపడతాం. మండుటెండల్లో చల్లటిగాలికి సేదతీరతాం. ఆ శీతలపవనం నరాల్ని కొరికే చలిగా మారితే తట్టుకోలేం. వర్షం, ఎండ, శీతలపవనం... శాశ్వతం, వాటినుంచి వచ్చే బాధలు, భయాలు త్వరితగతిన సమసిపోతాయి. అవి తాత్కాలికం మేఘంనుంచి జాలువారిన ప్రతి చినుకూ ముత్యం కాకపోయినా- ఏ చిన్ని మొలకకో ప్రాణం పోస్తుంది. ఎండు ఆకైనా ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారుతుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతి జీవి బతుక్కీ ఒక అర్థమూ, పరమార్థం ఉంటాయి. అది తెలుసుకున్నవారి జీవితం చరితార్థమవుతుంది

హరివిల్లులో ఏడు రంగులుంటాయి. ఆ సప్తవర్ణాల సమ్మేళనంతో ఆహ్లాదం, ఆనందం వెల్లివిరుస్తాయి. ఆ హరివిల్లు ఏర్పడాలంటే ఎండావానా రెండూ కావాలి సంతోషం దుఃఖం, మంచి చెడు, ఆశ నిరాశల సమ్మేళనమే జీవితం. అలా ప్రతికూల, అనుకూల పరిస్థితులతోనే ప్రతి జీవి బతుక్కీ స్థిరత్వమూ, సార్థకతా! అవే మనిషిని స్థితప్రజ్ఞుడిగా నిలబెడతాయి. అందుకే జీవితం ఒక హరివిల్లు

👏👏👏👏👏👏

Source - Whatsapp Message

కాలం...

మనిషి పుట్టినప్పటి నుంచి గిట్టేదాక, అతడి జీవితంలో అవిభాజ్యమై ఉండేది కాలం. పుట్టినప్పుడు ఉన్నకాలం పెరుగుతున్నప్పుడు మారిపోతుంది. పెరిగినంత కాలం ఉండే కాలం తరిగిపోతున్నప్పుడు మాయమైపోతుంది. లిప్తలిప్తకు జారిపోయే కాలం పాదరసంలాంటిది. పట్టుకుంటే దొరకదు అది నిరంతరం కరిగిపోతూనే ఉంటుంది. అనంతమైన కాలవాహినిలో మానవుడి బాల్య, యౌవన, వార్ధక్యాలు చిన్నబిందువులవలె కనిపిస్తాయి. నూరేళ్ల జీవితం వేగంగా .గడిచిపోతుంది

కాలం పక్షపాతి కాదు. ఒకరి మీద అవ్యాజమైన ప్రేమను చూపదు. మరొకరిమీద అకారణమైన ద్వేషాన్ని కనబరచదు. రాజు, పేద, పండితుడు, పామరుడు ఎవరైనా ఒకటే. ఎవరి మీదైనా సమదృష్ట. బాల్య, కౌమార, యౌవన వృద్ధాప్యాలను అందరికీ వర్తింపజేస్తుంది. అలాగే మరణాన్నీ! మరిన్ని ప్రాణులకు ఊపిరిపోస్తుంది. రాగద్వేషాలకతీతంగా ఉంటూ తన సుదీర్ఘ ప్రయాణాన్ని సాగిస్తూనే ఉంటుంది. ఎవరికైనా అవే గంటలు, అవే నిమిషాలు. సరైన యోచనతో విభాగించుకుని మనకు, ఇతరులకు ఎంతెంత వినియోగించుకోవాలో నిర్ణయించుకోవాలి.
మనుషులు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దినచర్యను చక్కగా అవలంబించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ వేళ ఏ పనిచేయాలో, ఆ వేళ ఆ పని చేయడమే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమని గుర్తించాలి. కాలం కలిసి వచ్చినప్పుడు స్పందించకపోతే, మనిషికోసం కాలం ఆగదు. నీటి ప్రవాహం సాగిపోయిన తరవాత ఆ నీటిని పట్టుకోవడం సాధ్యమా? కానే కాదు. కాలం మనిషికి ఎన్నో సదమాశాలను ప్రసాదిస్తోంది. వాటిని అందుకోకుండా జాప్యం చేస్తే భవిష్యత్తు శూన్యమే అవుతుంది. నిన్నటి పని మొన్ననే చేసి ఉండటం, నేటి పనిని నిన్ననే పూర్తిచేయడం, రేపటి పనిని నేడే పూరించడం కార్యసాధకుడి లక్షణం.
👏👏👏👏

Source - Whatsapp Message

మంచి మాట.... లు

ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు మారియు హోలీ శుభోదయ శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబసభ్యులకు ఆదిదంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మన బతుకుతోపాటుగా ఇంకో 10మందికి బతకడానికి చేయూతనిద్దాం, పోయేదేమి లేదు ఇంకొకరి కష్టాలు భాదలు తప్ప..
సోమవారం --: 29-03-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.... లు

మనకు ఈ జీవితం శాశ్వతం కాదు ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు మనం జీవించే కొంత కాలానికే ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాము బతికే ఉంటే ఇంకా పోలేదా అంటాము , రేపు అనేదాన్ని చూస్తామో లేదో తెలియని మన బతుకులకు పగలు , కక్షలు , పంతాలు ఎందుకు నేస్తమా ! ఎవరూ ఉండి తినేది లేదు పోయి సాధించేది లేదు ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవిదాం

ఏ పనినైనా చేసే ముందు నిన్ను నీవు ప్రశించుకో నువ్వు చేసేది మంచా చెడా అని
సమాధానం తప్పక వస్తుంది.
మంచి అనిపిస్తే చేసేయి....
చెడు అనిపిస్తే ఆపేయి....

ఇద్దరి మధ్య గొడవ జరిగితే కానీ బయటపడవు అసలు ఎవరి మనసులో ఎముందో చూడటానికి ఏముంది అందరు నవ్వుతూ పలకరించే వాళ్ళే అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయట పడుతుంది కొపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయట పడతాయి .

సేకరణ *మీ ...AVB సుబ్బారావు 💐🤝🙏

Source - Whatsapp Message