Sunday, March 22, 2026

పెళ్లి: ఒక బాధ్యతా? కేవలం ఒక ఎంపికా? - వేదాలు ఏం చెబుతున్నాయి?

పెళ్లి: ఒక బాధ్యతా? కేవలం ఒక ఎంపికా? - వేదాలు ఏం చెబుతున్నాయి?

Author Name:Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=TDhAJYTsqsw



Transcript:
(00:00) మన జీవితంలో పెళ్లి తప్పనిసరా లేక ఒక ఎంపిక మాత్రమేనా వేదాలు వివాహాన్ని ఒక పవిత్ర సంస్కారంగా చూసాయి. కానీ ప్రెజెంట్ జనరేషన్ నాటి సమాజం దానిని ఒక అవగాహనతో కూడిన వ్యక్తిగత నిర్ణయంగా చూస్తోంది. పెళ్లి చేసుకోకపోతే ధర్మం తప్పిపోతుందా? సంతానం లేకపోతే పితృ ఋణం తీరదా? కుటుంబం కోసం పాపం చేస్తే అది పుణ్యం అవుతుందా? ఒంటరిగా జీవిస్తూ సమాజానికి సేవ చేయడం ధర్మమా అధర్మమా? వేదాలు ఒక మాట చెబుతున్నాయి.
(00:30) ఆధునిక జీవితం మరో ప్రశ్న వేస్తోంది. ఈ రెండు మధ్య నిజమైన సత్యం ఏది ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికే ఈ విశ్లేషణ. వివాహం, సంతానం, ధర్మం, త్యాగం, మోక్షం అన్నింటిని ఈ ప్రెజెంట్ జనరేషన్ నాటి వాస్తవానికి ఎదురుగా నిలబెట్టి స్పష్టంగా మాట్లాడే ప్రయత్నమే ఇది. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మీకు ఈ టాపిక్ మీద ఒక మంచి క్లారిటీ వస్తుంది అని ఆశిస్తున్నాను.
(00:56) మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ పశుపతి రాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. వేదాలు ఎప్పుడూ పెళ్లిని అందంగా ఆమోదించలేదు. అలాగే వేదాలు జీవితాన్ని కూడా తిరస్కరించలేదు. వేదాల దృష్టిలో ముఖ్యమైనది ఒకటే మన జీవితం ధర్మబద్ధంగా ఉందా? లేదా కాదా వివాహం వేదకాలంలో ఎందుకు ప్రాధాన్యం పొందింది అనే ప్రశ్నకు సమాధానం సామాజిక నిర్మాణంలో ఉంది.
(01:29) ఆ కాలంలో సమాజం కుటుంబాల మీద ఆధారపడి నిలబడి ఉండేది. ఆ కుటుంబాల ద్వారా ధర్మం, సంస్కృతి, జ్ఞానం తరతరాలకు అందేది. అందుకే వివాహాన్ని ఒక పవిత్ర సంస్కారంగా ఏర్పాటు చేశారు. అది మనిషిని బాధ్యతాయుతుడిగా తీర్చిదిద్దే ఒక శిక్షణలా ఉండేది. అయితే వేదాలు ఎక్కడ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పలేదు. బ్రహ్మచర్యం, వానప్రస్తం, సన్యాసం వంటి ఆశ్రమాలు కూడా అదే వేద సంస్కృతిలో భాగమే.
(01:56) అంటే కుటుంబ జీవితం ఒక మార్గం మాత్రమే. అది ఒక్కటే మార్గం కాదు. ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న వస్తుంది. మనిషి పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఏంటి? వేదాల ప్రకారం పెళ్లి అంటే సుఖం కోసం కాదు. అది బాధ్యత కోసం ధర్మాన్ని కలిసి ఆచరించడానికి ఒకరికి ఒకరు సహాయపడుతూ సమాజానికి ఉపయోగపడే జీవితాన్ని నిర్మించడానికి కానీ ఈ జనరేషన్ నాటి సమాజంలో ఈ అర్థం మారిపోయింది.
(02:22) పెళ్లి ఇప్పుడు అవసరాల కోసం కాదు ఆశయాల కోసం కూడా కాదు చాలాసార్లు అది భయాల వల్ల జరుగుతోంది. ఒంటరితనం భయం. సమాజం ఏమంటుందో అనే భయం. వయస్సు దాటిపోతుందేమో అనే భయం. ఈ భయాల మీద నిర్మించిన బంధాలు ఎక్కువ కాలం నిలబడవు. బాధ్యతగా మోయలేని బంధాలు చివరికి బరువుగా మారుతాయి. అప్పుడు పెళ్లి ఒక సంస్కారం కాకుండా ఒక శిక్షలా మారుతుంది. అందుకే వేదాలు ఒక స్పష్టమైన సూత్రం చెబుతున్నాయి.
(02:51) మానసిక పరిణతి లేకుండా తీసుకున్న ఏ నిర్ణయమైనా ధర్మబద్ధం కాదు. ఇది పెళ్లికే కాదు, ఒంటరి జీవితానికి కూడా వర్తిస్తుంది. బాధ్యత నుంచి పారిపోవడానికి ఒంటరిగా ఉండటం కూడా ధర్మం కాదు. కుటుంబాన్ని పోషించలేమని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడం ఎంత తప్పో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆలోచించకుండా సింగిల్ గా ఉండటం కూడా అంతే తప్పు అందుకే ఈ విశ్లేషణలో ఒక పక్షాన నిలబడే ప్రయత్నం లేదు పెళ్లి మంచిదని గాని ఒంటరి జీవితం గొప్పదని గాని చెప్పడం లక్ష్యం కాదు ఏ మార్గాన్ని ఎంచుకున్నా అందులో ధర్మం బాధ్యత నిజాయితీ ఉన్నాయా లేదా అన్నదే అసలు ప్రశ్న ఈ నేపథ్యంతోనే ఇప్పుడు మనం
(03:29) ఒక్కొక్క అంశాన్ని విడిగా పరిశీలిద్దాం వివాహం, సంతానం, సంపాదన, కుటుంబం, సేవ, త్యాగం, మోక్షం వీటన్నింటిని వేదాల కంటితో కూడా ఈ జనరేషన్ నాటి వాస్తవంతో కూడా చూద్దాం. అప్పుడే ఒక విషయం స్పష్టమవుతుంది. ధర్మం అనేది పెళ్లిలో లేదు ఒంటరిగా ఉండడంలో లేదు. ధర్మం మన ఎంపికలలో ఉంది. మన నడవడికలో ఉంది. మన జీవన విధానంలో ఉంది.
(03:55) వివాహం బాధ్యతగా తీసుకున్నప్పుడు వివాహం వేదాల దృష్టిలో సుఖాన్ని అందించే ఏర్పాటు కాదు అది ఒక బాధ్యతాయుతమైన జీవన విధానం ఇద్దరు వ్యక్తులు కలిసి తమ కోరికలను నియంత్రిస్తూ పరస్పరం గౌరవిస్తూ ధర్మాన్ని ఆచరించడానికి తీసుకునే సంకల్పమే వివాహం. అందుకే వివాహ సమయంలో వరుడు వధువుకు ఇచ్చే మాట చాలా గంభీరమైనది. ధర్మేచ, అర్ధేచ, కామేచ, నాతిచ రామి అంటే ధర్మంలోనే కాదు ఆర్థిక వ్యవహారాల్లో కూడా వ్యక్తిగత కోరికల విషయంలో కూడా నేను నిన్ను అతిక్రమించను.
(04:25) ఈ ఒక్క వాక్యం వివాహంలో ఉన్న పరిమితిని కూడా గౌరవాన్ని కూడా బాధ్యతను కూడా తెలియజేస్తుంది. వేదకాలంలో పెళ్లి అంటే ఒకరిపై ఒకరు హక్కులు పొందడం కాదు. ఒకరికి ఒకరు బాధ్యత వహించడం. రామాయణంలో శ్రీరాముడు సీతను భార్యగా మాత్రమే చూడలేదు. ఆమెను తన ధర్మయాత్రలో భాగస్వామిగా చూశాడు. అందుకే అరణ్యవాసం వంటి కఠిన సమయంలో కూడా ఆమెను వదలలేదు.
(04:51) ఇది వివాహం అంటే కలిసి సుఖాలు అనుభవించడం మాత్రమే కాదని కలిసి కష్టాలు భరించడమే అసలు అర్థం అని చెబుతుంది. పితృ ఋణం అంటే ఏమిటి? వేదాలు ప్రతి మనిషికి మూడు రుణాలు ఉన్నాయని చెబుతాయి. దేవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. వీటిలో పితృ ఋణాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. పితృ ఋణం అంటే కేవలం కొడుకును కనడం కాదు తమ నుండి పుట్టే తరాన్ని ధర్మబద్ధంగా తీర్చిదిద్దడం మంచి విలువలు ఇచ్చి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు చేయడం అందుకే శాస్త్రాలు సంతానం గురించి ఒక మాట స్పష్టంగా చెబుతున్నాయి. సంతానం ఉండాలి.
(05:26) కానీ అది ధర్మబద్ధంగా ఉండాలి. కేవలం వారసుడు కావాలని అక్రమ సంపాదన చేయడం అన్యాయం చేయడం లగ్జరీ జీవితం గడపడం పితృ ఋణాన్ని తీర్చడం కాదు అది కొత్త పాపాలను సృష్టించడం మాత్రమే వంశాభివృద్ధి అంటే సంఖ్య కాదు గుణం సమాజానికి మేలు చేసే మనుషులను అందించడమే అసలైన వంశాభివృద్ది. పెళ్లి చేయకపోవడం కూడా ధర్మమేనా? ఈ ప్రశ్నకు వేదాలు చాలా స్పష్టమైన సమాధానం ఇస్తాయి.
(05:56) మానసిక పరిణతి లేకపోతే బాధ్యత తీసుకునే స్థితి లేకపోతే పెళ్లి చేయకపోవడమే ధర్మం. భీష్ముడు దీనికి గొప్ప ఉదాహరణ. తన తండ్రి కోసం తన లక్ష్యం కోసం వివాహాన్ని త్యాగం చేశాడు. ఆయన జీవితం ఒక విషయాన్ని చెబుతుంది. వ్యక్తిగత బంధాల కంటే ధర్మ లక్ష్యం గొప్పది. అర్థం లేని బంధంలో ఉండి రోజూ గొడవలు పడడం, పిల్లల మనసులను గాయపరచడం, సమాజానికి భారంగా మారడం కన్నా ఒంటరిగా ఉండి నీతిగా జీవించడం ఎంతో శ్రేయస్కరం.
(06:24) కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒంటరిగా ఉండటం అంటే బాధ్యత నుంచి పారిపోవడం కాదు. ఒంటరిగా ఉండటం అంటే బాధ్యతను విస్తరించడం. కుటుంబం కోసం పాపం చేయాలా? ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు వచ్చాము. కుటుంబాన్ని పోషించడానికి అధర్మ మార్గాల్లో సంపాదించవచ్చా? వేదాలు దీనికి స్పష్టంగా వద్దు అని చెబుతున్నాయి. సంపాదన తప్పు కాదు కానీ అధర్మ సంపాదన భయంకరమైన ఫలితాలను ఇస్తుంది.
(06:51) అధర్మే నైదతే తావత్తతో భద్రాని పశ్యతి తః సపత్నాన్ జయతి సమూలస్తు వినశ్యతి అధర్మ మార్గంలో సంపాదించినవాడు మొదట చాలా వేగంగా ఎదుగుతాడు. సుఖాలు అనుభవిస్తాడు. శత్రువులను కూడా జయిస్తాడు. కానీ చివరికి వాడు తన వంశంతో సహా నాశనం అవుతాడు. ఈ శ్లోకం ఈ రోజు కూడా అంతే నిజం. అక్రమ సంపాదన మొదట సౌకర్యం ఇస్తుంది. కానీ చివరికి కోర్టు కేసులు, మానసిక భారం, కుటుంబ అవమానం అన్ని ఒకేసారి వస్తాయి.
(07:18) పాపం ఎవరిది వాల్మీకి మహర్షి జీవితం దీనికి స్పష్టమైన ఉదాహరణ. బోయేవాడైన వాల్మీకి తన కుటుంబం కోసం దోపిడీలు చేసేవాడు. సప్తఋషులు అతనిని ప్రశ్నించారు. ఈ పాపానికి నీ కుటుంబం కూడా బాధ్యత తీసుకుంటుందా? అని. అతను ఇంటికి వెళ్లి భార్య బిడ్డలను అడిగాడు. వారు చెప్పింది ఒక్కటే నిన్ను పోషించమని అడిగాం. పాపాలు చేయమని కాదు ఆ పాపం నీదే ఇది నేటి కాలానికి వర్తిస్తుంది.
(07:44) కుటుంబం సుఖాలు అనుభవిస్తుంది. కానీ అక్రమ మార్గాల వల్ల వచ్చే శిక్షలు అపకీర్తి పాప ఫలాలు అన్ని సంపాదించిన వ్యక్తికే వస్తాయి. సహజ బంధాలు తెచ్చిపెట్టుకున్న బంధాలు మన జీవితంలో కొన్ని బంధాలు మనం ఎంచుకున్నవి కావు. అవి మన పుట్టుకతోనే మనతో వస్తాయి. తల్లిదండ్రులు అటువంటి సహజ బంధం. మనం ఈ భూమి పైకి రాకముందే మనకోసం తపస్సు చేసిన వారు వారు.
(08:09) అందుకే వేదాలు ఈ బంధానికి అత్యున్నత స్థానం ఇచ్చాయి. వేద వాక్యం స్పష్టంగా చెబుతుంది. మాతృదేవోభవ పితృదేవోభవ దీని అర్థం తల్లిదండ్రులను దేవుడిగా చూడాలి అన్నది కాదు. మన ఉనికికి మూల కారణమైన వారిగా గౌరవించాలి అన్న భావన. వారిని సేవించడం మన ప్రథమ ధర్మం. ఇది మనం ఎంచుకున్న బాధ్యత కాదు. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన రుణానుబంధం. ఇక భార్య పిల్లలు స్నేహితులు బంధువులు మనం మన ఇష్టంతో ఎంచుకున్న బంధాలు కాబట్టి వారిని పోషించడం చూసుకోవడం గౌరవించడం మన కర్తవ్యం కానీ దాన్ని త్యాగంగా భావించడం తప్పు ఎందుకంటే ఆ బంధాన్ని మనమే కోరుకున్నాం భార్యకు నగలుకొనడం పిల్లలకు సౌకర్యాలు
(08:50) ఇవ్వడం గొప్పతనం కాదు అది మన బాధ్యత. దీనిని గొప్పతనంగా భావించినప్పుడే మోహం మొదలవుతుంది. మమకారం ఎంత ప్రమాదకరం మహాభారతంలో ధృతరాష్ట్రుడి జీవితం దీనికి పెద్ద ఉదాహరణ. తన కుమారుడైన దుర్యోధనుడిని పై ఉన్న మమకారం అతని వివేకాన్ని కమ్మేసింది. ధర్మం ఏది అధర్మం ఏది అన్న తేడా కనిపించకుండా చేసింది. ఆ మమకారమే చివరికి కురువంశం నాశనాన్ని కళ్ళారా చూపించింది.
(09:16) ఇది ఒక విషయాన్ని బలంగా చెబుతుంది. తెచ్చిపెట్టుకున్న బంధాలపై మితిమీరిన మోహం ధర్మాన్ని కూడా అందం చేస్తుంది. నిస్వార్ధ సేవ అంటే ఏమిటి? చాలా మంది సేవ చేస్తున్నామని భావిస్తారు. కానీ అక్కడ కూడా చాలాసార్లు స్వార్థం దాగి ఉంటుంది. ఒక తండ్రి తన కొడుకును చదివిస్తే అందులో మమకారం ఉంటుంది. అది తప్పు కాదు కానీ అది నిస్వార్ధ సేవ కాదు కానీ మనకు ఎటువంటి రక్త సంబంధం లేని ఒక అనాధను చదివించి అతని జీవితాన్ని నిలబెడితే అక్కడ స్వార్థానికి చోటు ఉండదు.
(09:46) అక్కడే నిజమైన కరుణ మొదలవుతుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన సారం ఇదే. ఫలాన్ని ఆశించకుండా చేసే కర్మే నిజమైన ధర్మం. మనకు తిరిగి ఏమీ రాని చోట చేసిన సేవే నిష్కామ కర్మ. ఒంటరి జీవితం, త్యాగం మరియు మోక్షం. ఇక్కడే చాలా మందికి గందరగోళం వస్తుంది. ఒంటరిగా ఉంటే బాధ్యతలు లేవని భావించడం. ఇది పూర్తిగా తప్పు ఒంటరిగా ఉండటం అంటే బాధ్యతను వదలడం కాదు బాధ్యతను విశాలం చేయడం.
(10:14) కుటుంబానికి పరిమితం కాకుండా సమాజాన్ని తన కుటుంబంగా చూడడం. అందుకే ఉపనిషత్తులు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. నకర్మణ ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుహ కైవల్యోపనిషత్తు కేవలం కర్మల వల్ల కాదు సంతానం వల్ల కాదు ధనం వల్ల కూడా కాదు కేవలం త్యాగం ద్వారానే అమృతత్వం లభిస్తుంది. శంకరాచార్యులు స్వామి వివేకానందులు వివాహం చేసుకోలేదు.
(10:40) కానీ వారు బాధ్యతల నుంచి పారిపోలేదు. కోట్ల మందికి మార్గదర్శకులయ్యారు. వారి జీవితం ఒంటరిగా ఉండటం అంటే స్వార్థం కాదు అని నిరూపిస్తుంది. తలకొరివి భయం అవసరమా చాలా మంది ఒక భయంతో జీవిస్తారు. కొడుకు లేకపోతే అంత్యక్రియలు ఎవరు చేస్తారు అనే భయం. ఈ భయాన్ని పురాణాలు పూర్తిగా తొలగిస్తాయి. రామాయణంలో జటాయువు ఉదాహరణ. దీనికి స్పష్టమైన సమాధానం.
(11:05) జటాయువుకు భార్య లేదు సంతానం లేదు కానీ ధర్మం కోసం ప్రాణత్యాగం చేశాడు. అతను మరణించే సమయంలో శ్రీరాముడే స్వయంగా వచ్చి తండ్రికి చేసినట్లే అంత్యక్రియలు చేశాడు. ఇది ఒక విషయాన్ని చెబుతుంది. ధర్మంగా జీవించిన వాడికి రక్త సంబంధం అవసరం లేదు. ధర్మమే అతని బంధం భగవంతుడే బాధ్యత తీసుకుంటాడు. శాస్త్రాలు మరో మాట కూడా చెబుతాయి. అనాధ ప్రేత సంస్కారం కోటి యజ్ఞ ఫలప్రదం.
(11:29) ఎవరూ లేని అనాధకు అంత్యక్రియలు చేయడం కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం. అంటే సమాజంలో ఎవరో ఒకరు ధర్మబద్ధంగా ఆ బాధ్యత తీసుకుంటారు మోక్షం అనేది మరణానంతరం ఎవరో చేసే కర్మల వల్ల కాదు జీవించి ఉన్నప్పుడు మన నడవడిక వల్ల తుది నిర్ణయం 2026 నాటి వాస్తవం ఇప్పుడు ఈ మొత్తం చర్చ నుంచి ఒక విషయం స్పష్టమవుతుంది. పెళ్లి ఒక మార్గం ఒంటరి జీవితం మరో మార్గం రెండూ ధర్మానికి విరుద్ధం కావు ధర్మాన్ని నడిచే విధానం మన చేతిలో ఉంది.
(12:00) పెళ్లి చేసుకుంటే బాధ్యతగా జీవించాలి. సింగిల్ గా ఉంటే నిస్వార్థంగా సేవ చేయాలి. బంధాల పేరుతో పాపం చేయడం కన్నా బంధాలు లేకపోయినా పుణ్యం చేస్తూ జీవించడం మిన్న తలకొరివి పెట్టినా పెట్టకపోయినా మనం చేసిన పుణ్యమే మనల్ని మన తల్లిదండ్రులను ఉత్తమ గతులకు తీసుకెళ్తుంది. తల్లిదండ్రుల తర్వాత సమాజాన్ని తన కుటుంబంగా భావించేవాడు బాధ్యతల ఖైదీ కాడు అతను స్వార్థాన్ని దాటి ఒక శక్తిగా మారతాడు.
(12:27) మీరు ఎంచుకున్న మార్గం ఏదైనా అందులో నీతి నిజాయితీ ఉంటేనే ఆ జీవితానికి సార్ధకత ఉంటుంది. చివరగా నా అభిప్రాయం భార్య బిడ్డల పేరుతో పాపాలు మూటగట్టుకోవడం కంటే ఒంటరిగా ఉండి లోకానికి సేవ చేయడం కోటి రెట్లు మేలు. కుటుంబం వరకెందుకు మనం మన కోరికలను ఎంత అదుపులో ఉంచుకున్నా ఒక్కో సందర్భంలో మన కోరికలే మనం అదుపులో పెట్టుకోలేము.
(12:51) అలాంటిది మన భార్య బిడ్డల కోరికలను మనం అదుపు చెయ్యాలి అనుకోవడం అనేది ఒక మూర్ఖత్వం అయితే పెళ్లి చేసుకున్న సరే లగ్జరీల జోలికి వెళ్లకుండా ఉన్నదాంట్లో తృప్తిగా ఉంటూ ధర్మంగా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేటి సమాజంలో ఆ నిగ్రహం ఉండటం చాలా కష్టం కాబట్టి ఈ ఆలోచనలో ఉన్న నిబద్ధత నిజంగా గొప్పది. నేను తెచ్చిపెట్టుకున్న బంధం కోసం నేను చేయడం గొప్ప కాదు.
(13:16) నాకు సంబంధం లేని వాడి కోసం చేయడం గొప్ప అనేది అత్యున్నతమైన మానవీయ కోణం. బుద్ధుడు వివేకానందుడు వంటివారు అనుసరించిన మార్గం కూడా ఇదే. పెళ్లి చేసుకొని తన పరిధిని కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం చేసుకోవాలా లేక పెళ్లి చేసుకోకుండా తన కష్టాన్ని 10 మందికి పంచిపెట్టి ఒక గొప్ప ఆశయం కోసం బతకాలా అనేది వ్యక్తిగత విచక్షణ పై ఆధారపడి ఉంటుంది.
(13:42) అయితే బాధ్యత కంటే త్యాగం మిన్న అనే సూత్రం ప్రకారం చూస్తే నిస్వార్ధంగా సమాజానికి సేవ చేసే మార్గం అన్నిటికంటే అత్యున్నతమైనది. దీనిపై సమాజం ఒక ప్రశ్న వేయవచ్చు. ప్రతి ఒక్కరు ఇలాగే బంధాలు వద్దనుకుంటే సృష్టి ఎలా ముందుకు సాగుతుంది అని కానీ నా వాదన ఏంటంటే సృష్టి సాగడం కోసం అబద్ధాలు మోసాలు చేస్తూ కేవలం తన వారి కోసమే పాకులాడే కోట్లాది మంది మధ్య అసలు ఏ బంధం లేకుండా లోకం కోసం బతికే ఒకరు ఉండటంలో తప్పేముంది? ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి.
(14:15) మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది.
(14:38) థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్యూ ఆల్.

No comments:

Post a Comment