Thursday, March 19, 2026

☠️ఆత్మ ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి! How is it Possible?

☠️ఆత్మ ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి! How is it Possible?

Author Name:Sudheer Vlogger

Youtube Channel Url:https://www.youtube.com/@Sudheer_vlogger

Youtube Video URL:https://www.youtube.com/watch?v=B53HhIj3XZ4



Transcript:
(00:00) మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ శరీరం నుంచి బయటకు వస్తుందని చాలా మతాలు చెప్తాయి. కానీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే బ్రతికున్న ఒక మనిషి అతని ఆత్మని టెంపరరీగా శరీరం నుంచి బయటకు తీసి ఇంకొకరి శరీరంలోనికి తీసుకెళ్లగలరా అని అఫ్కోర్స్ ఇది వినగానే మీకు ఏదో అమ్మో బొమ్మ సినిమా కథలా అనిపించొచ్చు కానీ భారతీయ యోగశాస్త్రాల్లో దీనికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది అదే పరకాయ ప్రవేశం.
(00:26) అంటే ఒకరి బాడీలో ఉన్న ఆత్మ వేరే వాళ్ళ శరీరంలోకి ప్రవేశించడం. ఈ శక్తి గురించి యోగ గ్రంథాలు పురాణాలు ఇంకా కొంతమంది యోగుల కథల్లో కూడా ప్రస్తావన ఉంది. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే ఇది నిజంగానే సాధ్యమా లేదంటే కేవలం పురాణాల కథలేనా ఈరోజు ఈ వీడియోలో మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. పరకాయ ప్రవేశం అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. పర అంటే ఇతర అని, కాయ అంటే శరీరం అని, ప్రవేశం అంటే లోపలికి వెళ్లడం అని.
(00:52) ఒక యోగి తన కాన్షియస్ నెస్ ని అంటే తెలుగులో చెప్పాలంటే చైతన్యాన్ని వేరే శరీరంలోకి తీసుకుని వెళ్ళడం. యోగశాస్త్రాల ప్రకారం దీన్ని ఒక యోగ సిద్ధిగా చెప్తారు. ఎగ్జాంపుల్ గా యోగ సూత్రాస్ ఆఫ్ పతంజలి అనే గ్రంధం తీసుకుంటే ఇన్ కేస్ మీకు ఈ గ్రంధం గురించి తెలియకపోతే ఇది సుమారు 2000 సంవత్సరాల క్రితం పతంజలి అనే ఒక గొప్ప మహర్షి రాసిన యోగ శాస్త్ర గ్రంథం ఈయనే ఫాదర్ ఆఫ్ యోగ అని కూడా పిలుస్తారు.
(01:17) దాని నుండే ఈ పతంజలి అనే బ్రాండ్ ని కూడా పెట్టారు. కానీ పతంజలి అనే ఆయన ఎవరు అనేది ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మందికి తెలియదు. సో ఈ యోగ సాధన ద్వారా పొందే కొన్ని అసాధారణ శక్తుల గురించి ఈ గ్రంథంలో రాసి ఉంది. ఈ గ్రంథం పెద్ద పుస్తకం ఏం కాదు మొత్తం 195 చిన్న చిన్న సూత్రాలు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చదవచ్చు.
(01:37) యోగ గురించి ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన గ్రంథాల్లో ఇదొకటి. ఇందులో ముఖ్యంగా మూడు విషయాలు చెప్తారు. మనసుని ఎలా కంట్రోల్ చేయాలి? ధ్యానం ద్వారా ఎలా లోతైన సమాధి స్థితికి చేరాలి. ఇక్కడ సమాధి స్థితి అంటే మన మనసుని పూర్తిగా నిశ్శబ్దంగా మార్చే ఒక స్థితి అన్నమాట. అంటే మనకు నార్మల్ గా మైండ్ లో ఆలోచనలు ఫీలింగ్స్ ఈ మెమరీస్ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి కదా మైండ్ లో అసలుకి రెస్ట్ అనేది ఉండదన్నమాట చెప్పాలంటే ఈవెన్ మనం పడుకున్నప్పుడు కూడా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి.
(02:02) కానీ నేను ఇప్పుడు చెప్పిన ఈ సమాధి స్థితిలో ఆలోచనలు కంప్లీట్ గా ఆగిపోతాయి మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ మనిషి తన అసలు కాన్షియస్నెస్ ని అప్పుడు అనుభవిస్తాడని యోగ సంప్రదాయం చెప్తుంది. అందుకే యోగాలో సమాధిని అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిగా భావిస్తారు. అంటే ఇది ఒక పీక్ స్టేజ్ అన్నమాట. ఒక యోగి గాఢమైన సమాధి స్థితికి చేరుకున్నప్పుడు అసాధారణమైన కొన్ని శక్తులు కలుగుతాయి అని చెప్తారు.
(02:25) సూపర్ పవర్స్ అంటాం కదా అలాగా అందులో ఒకటే ఈ పరకాయ ప్రవేశం. యోగ సంప్రదాయం ప్రకారం ఒక యోగి గాఢమైన సమాధి స్థితిలోకి వెళ్లి తన చైతన్యాన్ని మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఆత్మని శరీరం నుంచి వేరుచేసి మరొకరి శరీరంలోకి ప్రవేశించగలరు అని చెప్తారు. ఇది సాధారణంగా అందరూ చేయగలిగే ధ్యానం కాదు ఎందుకంటే ఇది చాలా పీక్ స్టేజ్ యోగ ప్రాక్టీస్ తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది.
(02:48) మీలో కొంతమంది అనుకోవచ్చు ఆ బుక్ లో ఉన్న 190 సూత్రాలను నేర్చుకొని నేను కూడా పలకాయ ప్రవేశం చేసేస్తా అని ఇదేం సినిమా కాదు మనం అనుకోగానే ఒక రోజులో అయిపోవడానికి ఫస్ట్ ఆ సూత్రాలని పాటించాలి ఆ తర్వాత మనసుని బ్రెయిన్ ని కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికే లైఫ్ అంతా సరిపోద్ది. అంతెందుకు అసలు ఏం ఆలోచించకుండా ఒక 10 మినిట్స్ ఉండటానికి ట్రై చేయండి చాలా డేస్ పడుతుంది.
(03:07) ఇన్ కేస్ ఎవరైనా యోగా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా తెలుసు ఈ విషయం గురించి ఇన్ కేస్ మనలాంటి వాళ్ళు చాలా కష్టపడి ఆ పవర్ ని తెచ్చుకున్నా కూడా మనకి ఇప్పుడున్న కోరికలు, అలవాట్లు, ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలుగా కనపడతాయి. అసలు ఈ సొసైటీ నుంచే దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక మనిషి యోగిగా మారిపోయాక మనలాంటి సామాన్య ప్రజల మధ్యన అసలు బ్రతకలేరు.
(03:30) అంటే ఐ మీన్ వాళ్ళకి అసలుకి ఈ రియల్ వరల్డ్ మీద ఆశ గాని కోరిక గాని కంప్లీట్ గా పోతుంది. అంటే నీకు ఆ శక్తి రావడానికి ముందున్న మైండ్సెట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా మారిపోతుంది. పరకాయ ప్రవేశం గురించి ఆదిశంకరాచార్యులకు సంబంధించిన ఒక ఫేమస్ కథ కూడా ఉంది. ఆయన ఒకసారి అందరితో కలిసి ఒక పెద్ద చర్చలో పాల్గొన్నప్పుడు ఆయనకి ఒక క్వశ్చన్ వచ్చింది.
(03:49) అదేంటంటే మీకు ప్రపంచ జీవితం గురించి ప్రత్యక్షంగా అనుభవం ఉందా అని అడిగారు. ఇందాక నేను చెప్పినట్లు ఆయన ఒక పెద్ద యోగ్ కాబట్టి ఆయనకి మనలాగా సోషల్ లైఫ్ గాని కోరికలు గాని ఆశలు గాని ఏమీ ఉండవు. ఆయన లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. సో అందుకే ఆయన్ని ఇలా మీకు రియల్ లైఫ్ గురించి ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు. అప్పుడు శంకరాచార్యులు అవును నిజమే కదా అని భావించి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు.
(04:11) అదేంటంటే తన శరీరాన్ని సమాధి స్థితిలో ఉంచి చనిపోయిన ఒక రాజు శరీరంలోకి ప్రవేశించాడు. ఆ రాజు పేరు అమరుక. కొంతకాలం ఆ రాజు శరీరంలో జీవించి ప్రపంచ జీవితం గురించి అనుభవం పొందిన తర్వాత తిరిగి తన అసలు శరీరం ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి దాంట్లోకి వచ్చాడు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ఆయన వెళ్ళింది చనిపోయిన రాజు శరీరంలోకి సో శంకర దిగ్విజయ అనే ఈ గ్రంథంలో దీని గురించి డీటెయిల్ గా ఉంటుంది ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు.
(04:40) యూజ్వల్ గా మనలాంటి వాళ్ళకి పలకాయ ప్రవేశం లాంటి శక్తులు వస్తే ఏం చేయాలనుకుంటామో మళ్ళీ నేను వేరే చెప్పక్కర్లేదు. ప్రెజెంట్ ఈ కలికాలంలో మంచికయతే ఎవరు యూస్ చేయరు అందుకే అవన్నీ మనకి సాధ్యం కాదు. అది సాధించడానికి చాలా కష్టపడాలి చాలా కృషి చేయాలి అంత చేశాక అది అచీవ్ చేసే టైం కి నీ మైండ్ సెట్ నీ ఆలోచనలు నీ మనసు కంప్లీట్ గా మారిపోతుంది.
(05:01) ఈవెన్ నువ్వు ఒక కరుడు కట్టిన నేరస్తుడు అయినా కూడా ప్రపంచం మొత్తాన్ని నాశనం చేద్దాం అనే ఉద్దేశంతో నువ్వు ఆ శక్తిని పొందాలని అలా చేసి మొత్తం ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఆ శక్తిని తీసుకోవడానికి అది మొత్తం చేసిన తర్వాత నీకు దాని మీద ఎటువంటి ఆశ గాని లేదంటే ఎటువంటి కోరిక గాని ఏమీ ఉండదు దాన్ని కంప్లీట్ గా మర్చిపోతావ్. సో అందుకే ఇలాంటివి చేసే ఎవ్వరు కూడా మన మధ్యలో ఉండరు.
(05:25) ఒకవేళ ఉన్నా కూడా నాకు శక్తులు ఉన్నాయని చూపించుకోరు అండ్ వాళ్ళకి అసలు అవసరం కూడా లేదు చెప్పాలంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అసలు పరకాయ ప్రవేశం దేనికి కనిపెట్టారు అసలు అది ఎందుకు చేస్తారు అని. పరకాయ ప్రవేశం చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఇతరులకు సహాయం చేయడం. ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళ శరీరంలోకి ప్రవేశించి వాళ్లకి సహాయం చేయడం.
(05:44) ఎలా అంటే ఎగ్జాంపుల్ గా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా ఎవరైనా కోమాలో ఉన్నప్పుడు ఒక యోగి తన ఆత్మతో ఆ శరీరంలోకి వెళ్లి ఆ మనిషి కాన్షియస్నెస్ ని తీసుకొని వచ్చి అతన్ని కోమాలో నుంచి బయటికి తీసుకొచ్చి బ్రతికించడం సెకండ్ రీజన్ వచ్చేసి తన కర్మఫలాలను ముగించడం కోసం ఒక యోగి తన శక్తితో ఇంకొకరి బాధను లేదా వాళ్ళు అనుభవించాల్సిన కర్మలో కొంతని ఇతను తీసుకొని ఆ వ్యక్తికి సహాయం చేయడం ఎందుకంటే కొన్ని అనుభవాలు ఏంటంటే మన కర్మలో భాగంగా ఉంటాయి అని చెప్తారు అవి అనుభవించకుండా ఆ కర్మ ధర్మ ముగిదని కూడా మనం నమ్ముతాం.
(06:17) సో అందుకే కొంతమంది యోగులు ఆ అనుభవాన్ని పొందడానికి మరొకరి శరీరంలోకి వెళ్లి జీవిస్తారు. లైక్ ఇందాక నేను చెప్పాను కదా ఆదిశంకరాచార్యులకి సంబంధించిన రాజు కథని సో సేమ్ అలాగే నెక్స్ట్ మూడో రీజన్ వచ్చేసి ఆధ్యాత్మిక ప్రయోగాలు. ఈ కాన్షియస్నెస్ అనేది అంటే చైతన్యం అనేది ఏదైతే ఉందో అది నిజంగా శరీరంతో బంధించబడిందా లేదంటే శరీరం బయట కూడా ఉండగలదా అని తెలుసుకోవడానికి యోగులు ఇలా చేస్తారు.
(06:40) ఇంకొకటి లైఫ్ అండ్ డెత్ మధ్య ఉన్న ఈ రహస్యాన్ని తెలుసుకోవడం కోసం అండ్ ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళు చెప్పింది ఏంటి అంటే శరీరం అనేది జస్ట్ ఒక మీడియం ఒక టూల్ మాత్రమే కానీ కాన్షియస్నెస్ అనేది అసలు సత్యం అని చెప్తారు. అందుకే చాలా మంది యోగులు ఏం చేస్తారంటే ఈ కాన్షియస్ నెస్ ని శరీరం లేకుండా ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తారు.
(07:00) అంతేగాని మనం అనుకునేలాగా ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఎవరికో హాని చేయడానికో లేదంటే ఏదో ఎవరినో కొల్లగొట్టి సంపాదించుకోవడానికో యూస్ చేసేది కాదు కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇది మనలాంటి సాధారణ మనుషులకు గాని లేదంటే నార్మల్ యోగులకి గాని కూడా పోజిబుల్ కాదు ఎవరికైతే అత్యున్నత స్థాయి సమాధి సాధించిన యోగులు ఉంటారో వాళ్ళకి మాత్రమే సాధ్యం అని మన గ్రంథాలు చెప్తున్నాయి అసలు ఇది నిజమా లేక ఒట్టి పురాణమా అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లేటెస్ట్ సైన్స్ ప్రకారం అయితే పరకాయ ప్రవేశం నిజంగా జరుగుతుందని నిరూపించే సైంటిఫికల్ ప్రూఫ్ అయితే ఇప్పటివరకు లేదు.
(07:34) ఓన్లీ యోగ సంప్రదాయం పురాణాలు ఆధ్యాత్మిక గ్రంథాల్లో మాత్రమే ఉంది. అందుకే కొందరు దీన్ని యోగ సిద్ధి అని నమ్ముతారు. మరికొందరు మాత్రం ఇది కేవలం పురాణ కాదులే అని చెప్పేసి కొట్టిపారేస్తా ఉంటారు. ఎవరి నమ్మకాలు వాళ్ళయి కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మన భారతీయ యోగ సాంప్రదాయం ఎప్పుడో మనిషి కాన్షియస్నెస్ గురించి చాలా లోతుగా ఆలోచించింది.
(07:55) ఈ పరకాయ ప్రవేశం అనేది నిజమా కాదా అనేది పక్కన పెడితే మనిషి మనసు కాన్షియస్నెస్ గురించి ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. దీని గురించి ఫ్యూచర్ లో సైన్స్ కూడా ప్రూవ్ చేస్తదని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ సైన్స్ అంటిల్ ఇట్ ఇస్ ప్రూవ్ అనే నమ్ముతాను నేను. ఒక 100 సంవత్సరాల క్రితం అప్పటి మనుషులకి మనం ఫ్యూచర్ లో గాలిలో ఎగిరే విమానాల్లో తిరుగుతాం అంటే నమ్మేవాళ్ళా లేదు కదా వేల కిలోమీటర్స్ అవతలు ఉన్నవాళ్ళతో మనం ఒక చిన్న ఫోన్ అనే డివైస్ లో మాట్లాడొచ్చంటే నమ్మేవాళ్ళా లేదు కదా సో ఇది కూడా అంతే ఇలాంటి మిస్టరీలు చరిత్రలో దాగిన నిజాలు
(08:26) ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తెలుసుకోవాలంటే సుధీర్ వ్లాగర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్

No comments:

Post a Comment