శత్రువుని చూసి నవ్వండి! | Smile at Your Enemies to Win Life | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2ptq97xP0Pw
Transcript:
(00:00) మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీకు అత్యంత ఇష్టమైన డ్రెస్ వేసుకొని బయటకి వెళ్తున్నప్పుడు ఎవరో తెలియని వ్యక్తి వచ్చి దానిపై కాస్త బురద చలితే మీరు ఏం చేస్తారు వెంటనే కోపంతో ఊగిపోతారు కదా మరి అదే వ్యక్తి మీ మనసు మీద మీ గౌరవం మీద బురద చలితే అప్పుడు మీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది చాలా మంది చేసే పని ఒకటే ఎదురుదాడి వాళ్ళు ఒక మాట అంటే మనం 10 మాటలు అనాలనుకుంటాం.
(00:23) వాళ్ళు మనల్ని అవమానిస్తే అంతకు అంత తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి తాపత్రయ పడతాం. ఇక్కడే అసలైన సమస్య మొదలవుతుంది. మీ శత్రువు మీకు ఎదురైనప్పుడు మీరు ఇచ్చే రియాక్షనే మీ స్థాయిని నిర్ణయిస్తుంది. మీ ప్రత్యేది ఎవరో కాదు ఆ క్షణంలో మీరు ఇచ్చే రియాక్షనే మీకు అతి పెద్ద శత్రువు. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. ఎవరైనా మనల్ని చిన్న మాట అన్నా విమర్శించినా లేదా తక్కువ చేసి మాట్లాడినా మన రక్తం మరిగిపోతుంది.
(00:47) నేనేంటో వాడికి చూపించాలి నన్ను అంటాడో వాడు అని చెప్పేసి వాడు ఎంతో తేలుస్తా అని చెప్పేసి పగ పెంచేసుకుంటాం. ఆ పగ అనేది ఒక నిప్పుకను లాంటిది. దాన్ని అవతలి వ్యక్తి మీద విసరాలని మీరు చేతితో పట్టుకుంటే ముందు కాలిపోయేది మీ చెయ్యి మాత్రమే. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ కామెంట్ వచ్చిన ఆఫీస్ లో కొలీగ్ మన గురించి తప్పుగా మాట్లాడినా ఇంట్లో వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోయినా మనం వెంటనే రియాక్ట్ అయిపోతున్నాం.
(01:12) ఈ రియాక్షన్ వల్ల మీరు ఏం సాధిస్తున్నారు? ప్రస్తుతానికి మీ ఈగో అనేది సాటిస్ఫై అవుతుంది. అందులోనూ లో లోపల మీరు అశాంతికి లోన అవుతున్నారు. అవతలి వ్యక్తి విసిరినే నెగిటివిటీ వలలో మీరు చిక్కుకుపోతున్నారు. మీ ప్రశాంతతని వేరొకరి చేతికి రిమోట్ కంట్రోల్ లా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఒక్క బటన్ నొక్కితే మీరు కోప్పడాలి. వాళ్ళు ఒక్క బటన్ నొక్కితే మీరు బాధపడాలి.
(01:31) ఇదేనా మీ జీవితం. మీ స్థాయి ఇదేనా ఒకసారి ఆలోచించండి. మనం ఎందుకు అంత త్వరగా రియాక్ట్ అవుతాం. ఎందుకు పగ తీర్చుకోవాలని చూస్తాం. దీని వెనుక చాలా లోతైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన పెంపకం మన చుట్టూ ఉన్న సమాజం మనకి నేర్పిన పాఠాలు దెబ్బకి దెబ్బ తీయాలి అనేది ఒక వీరత్వంగా మనం భావిస్తాం. కానీ నిజానికి అది వీరత్వం కాదు ఒక బలహీనత.
(01:53) పగ అనేది మీ మనశశాంతిని హరిస్తుంది. అది మిమ్మల్ని ఒక నెగిటివ్ వ్యక్తిగా మారుస్తుంది. మీరు ఎప్పుడైతే ఒకరిపై పగలు పెంచుకుంటారో మీ మెదడులో 24 గంటలు వారి గురించి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. వాడు నాకు అది చేశాడు. నేను ఇది చేయాలనే లూప్ లో మీరు ఇరుక్కుపోతారు. దీనివల్ల మీ ఎదుగుదల ఆగిపోతుంది. మీ ఎనర్జీ అంతా ఇతరుల గురించి ఆలోచించడానికే ఖర్చుఅయిపోతుంది.
(02:14) నిజానికి మన శత్రువులు బయట ఉండరు. మన ఆలోచనల్లో ఉంటారు. ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు మనం ఎందుకు బాధపడతాం ఎందుకంటే వారి మాటలు మనం నిజం అని నమ్ముతాం. లేదా మన గురించి మనకున్న నమ్మకం తక్కువగా ఉంటుంది. ఒక గొప్ప వ్యక్తి గురించి ఎవరో ఏదో అన్నంత మాత్రాన ఆ వ్యక్తి విలువ తగ్గిపోతుందా? ఒక డైమండ్ ని తీసుకెళ్లి బురదలో వేసిన అది డైమండ్ే అవుతుంది.
(02:36) కానీ మనం ఏమనుకుంటాం అంటే అవతల వాడు బురద చల్లాడు కాబట్టి నేను కూడా బురద చల్లితే నా విలువ పెరుగుతుంది అనుకుంటాం. ఈ నెగిటివ్ ఎనర్జీ ఒక వైరస్ లాంటిది. ఇది మీ ప్రొడక్టివిటీని చంపేస్తుంది. మీరు ఒక గొప్ప పని చేయాలనుకున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. మీ లక్ష్యం వైపు చూడాల్సిన కళ్ళు మీ శత్రువు ఎక్కడున్నాడా అని చెప్పేసి వెతుకుతుంటాయి.
(02:56) ఫలితంగా మీరు చేరాల్సిన గమ్యం దూరమైపోతుంది. పగ తీర్చుకోవడం వల్ల మీరు గెలిచినట్లు అనిపించొచ్చు కానీ ఆ గెలుపులో ఆనందం ఉండదు. కేవలం అహంకారం మాత్రమే ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి శత్రువుని ప్రేమించాలా ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు కానీ ఒక విషయం గుర్తుంచుకోండి శత్రువుని ప్రేమించడం అంటే వాళ్ళ నెత్తిని పెట్టుకోవడం కాదు.
(03:14) వారి నెగిటివిటీని మీలోకి రాకుండా చూసుకోవడం. వారిని క్షమించడం అంటే వారు చేసిన తప్పును ఒప్పుకోవడం కాదు. ఆ తప్పు వల్ల కలిగిన బాధ నుంచి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం మీరు వారిని క్షమించడం ద్వారా మీరు వారికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నారని చెప్పేసి నిరూపించుకోవాలి. క్షమించడం అనేది బలవంతుడి లక్ష్యం. బలహీనమైన వ్యక్తి ఎప్పటికీ క్షమించలేడు అందులోనూ అసూయ పడుతూనే ఉంటాడు.
(03:37) ఒక వ్యక్తి మిమ్మల్ని అవమానించినప్పుడు మీరు మౌనంగా ఉంటే ఆ అవమానం ఆ వ్యక్తి దగ్గరే ఉండిపోతుంది. మీరు దాన్ని స్వీకరిస్తే అది మీ సమస్యగా మారుతుంది. సో బుద్ధుడు ఒకసారి ఒక మాట చెప్పాడు ఎవరైనా మీకు బహుమతి ఇచ్చినప్పుడు మీరు దాన్ని తీసుకోకపోతే అది ఎవరి దగ్గర ఉంటుంది ఇచ్చిన వారి దగ్గరే ఉంటుంది కదా అలాగే ఎవరైనా మిమ్మల్ని దూషించినప్పుడు మీరు దాన్ని పట్టించుకోకపోతే ఆ దూషణ వారి దగ్గరే ఉండిపోతుంది.
(04:00) మీ మైండ్సెట్ ని మార్చుకోండి. మిమ్మల్ని విమర్శించే వారిని మీ ఉచిత ప్రచారకులుగా భావించండి. మీ గురించి వారు మాట్లాడుకుంటున్నారంటే మీరు వారికంటే ముందున్నారని అర్థం. సింహం ఎప్పుడూ కుక్కల అరుపులకి స్పందించదు. ఎందుకంటే సింహానికి తెలుసు తన స్థాయి ఏంటో మీరు మీ స్థాయిని గుర్తించండి. మీ ఎనర్జీని పగతీర్చుకోవడానికి కాకుండా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించండి.
(04:22) అలా ఉపయోగిస్తేనే మీ శత్రువులకి మీ విజయాన్ని చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదే మీరు ఇచ్చే పెద్ద సమాధానం కూడా వాళ్ళకి. అలా కాకుండా ప్రపంచంలో ఉన్న పనులన్నీ వదిలేసి నేను పగతీర్చుకుంటాను వాడిని ఇబ్బంది పెడతాను అంటే వాడు ఇబ్బంది పెడతాడు ఎందుకంటే వాడు ఎలాగో జీవితంలో ఎదగడు కానీ మీరు ఇబ్బంది పెడుతున్నారు కదా మీకంటూ ఉన్న జీవిత లక్ష్యాన్ని పక్కన పెట్టి మరి వాడిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నారు కదా అలా ఉండటం వల్ల మీరు మాత్రమే ఇబ్బంది పడట్లేదు మీ భార్య మీ పిల్లలు అందరూ ఇబ్బంది పడతారు.
(04:49) ఒకవేళ మీకు పెళ్లి కాలేదునుకో మీ అమ్మ నాన్న అవ్వచ్చు లేకపోతే మీ శ్రేయోభిలాషులు అవ్వచ్చు వీడేంట్రా ఉన్న పని మొత్తం మానేసి అవతల వాడి మీద గెలవడమే పనిగా పెట్టున్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే మీ శత్రువు మీద మీరు గెలిస్తే వాడు ఒక్కడికే తెలుస్తుంది. కానీ మీ మీద మీరు గెలిచారు అనుకోండి ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది.
(05:08) అందులో వాడు కూడా ఉంటాడు. వాడు అంటే మీ శత్రువు జీవితం చాలా చిన్నది. ఇందులో పగలు ప్రతీకారాలకి చోటు ఉండకూడదు. మరి ప్రాక్టికల్ గా దీన్ని ఎలా అమలు చేయాలంటే రేపటి నుంచి మిమ్మల్ని ఎవరైనా విమర్శించినా లేదా అవమానించినా వెంటనే రియాక్ట్ అవ్వకండి ఒక ఐదు సెకండ్లు ఆగి దీర్ఘంగా ఆలోచిస్తూ ఒక శ్వాస తీసుకోండి. కోపంతో కాకుండా మౌనంతో లేదా ఒక చిన్న చిరునవ్వుతో సమాధానం ఇవ్వండి.
(05:30) అందులోనూ ఆ నవ్వులో ఒక అర్థం ఉండాలి. అర్థం ఏంటంటే నువ్వు అనే మాటల్ని నేను సీరియస్ గా తీసుకోవట్లేదు అని చెప్పేసి అందులోనూ అవతల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తప్పు చేస్తున్నా సరే వాళ్ళ తప్పులని దేవుడికి లేకపోతే ప్రకృతికి వదిలేయండి. కాలం అందరికీ పాఠాలు చెప్తుంది. ఆ బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకంటూ భూమి మీద చాలా బాధ్యతలు ఉన్నాయి.
(05:51) కాబట్టి ఆ బాధ్యతని దేవుడికే వదిలేయండి. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి. నా మనశశాంతిని ఎవ్వరికీ ఇవ్వను. నా ఆనందానికైనా నా బాధకైనా నేనే బాధ్యుడినే ఎవరైనా నన్ను కించపరిస్తే అది వారి సంస్కారం నేను ఎలా స్పందిస్తాను అనేది నా వ్యక్తిగతం. సో మీరు ఉన్నతమైన వ్యక్తులుగా మారాలంటే మీ ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉండాలి. చిన్న చిన్న గొడవల్లో చిల్లర రాజకీయాల్లో మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.
(06:16) ఎందుకంటే ఇప్పటి జనరేషన్ చాలా మంది వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే మనం రెండున్నర గంటల సినిమా చూస్తాం, ఆనందిస్తాం, హ్యాపీగా ఉంటాం. కానీ బయటికి వచ్చిన తర్వాత కూడా అందులో యాక్ట్ చేసిన వాళ్ళ గురించి పోరాటాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నేను అభిమానించే హీరో గొప్ప నేను అభిమానించిన వాళ్లే గొప్ప అని చెప్పేసి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు.
(06:40) అందులోనూ చిల్లర రాజకీయాల్లో చాలా మందికి ఏంటంటే అయితే క్రికెట్ లేకపోతే సినిమా లేకపోతే పాలిటిక్స్ ఈ మూడిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో నేను అభిమానించే వాళ్ళు గొప్ప అని చెప్పేసి ఎవరేమన్నా అంటే చాలు వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. అది క్రికెటర్ అవ్వచ్చు, సినిమా యాక్టర్ అవ్వచ్చు లేకపోతే పొలిటీషియన్ కూడా అవ్వచ్చు. నేను చెప్పవచ్చేది ఏంటంటే మీరు ఎవరినైనా అభిమానించొచ్చు.
(07:01) ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. కానీ వాళ్ళు అవతల వాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళని ఎవరైనా ఏమన్నా అంటే మీరు డిఫెండ్ చేయాల్సిన అవసరం మీకు లేదు కదా. మీరు ఎలాగైతే ఒక రాజకీయ నాయకుడిని ఒక సినిమా నటుడిని ఒక క్రికెటర్ ని ఇష్టపడుతున్నారో అవతల వ్యక్తి కూడా వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాడు అంతే అంతకుమించి ఏం లేదు అతని అభిరుచి వేరు మీ అభిరుచి వేరు అంత మాత్రాన నేను అభిమానించే వాడిని నువ్వు అభిమానించాలి నేను అభిమానించేవాడు గొప్ప అని చెప్పేసి అతనితో గొడవ పడటం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా ఎవ్వరికీ లేదు నిజం చెప్పాలంటే మీరు అభిమానించే వాళ్ళకి కూడా
(07:31) తెలియదు మీరు ఇక్కడ గొడవ పడుతున్నారు అన్న సంగతి కాబట్టి నేను ఏమంటానంటే పాలిటిక్స్ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు వీటి మీద అభిమానం ఉండాలిఅ అయన్నీ మనం అబ్సర్వ్ చేయాలి క్రికెట్ చూసి ఆనందించాలి సినిమా చూసి సంతోషించాలి మన భవిష్యత్తు కోసం మనం ఓటు వేయాలి కానీ వాళ్ళ కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం మనకు లేదు ఎందుకంటే మనకంటూ ఒక జీవితం ఉంది.
(07:51) మనకంటూ కొన్ని జీవిత లక్ష్యాలు ఉన్నాయి. ఈ మూడిటిని పక్కన పెట్టి మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేసుకుంటూ చక్కగా క్రికెట్ ఉన్నప్పుడు మ్యాచ్లు చూడండి, సినిమాలు వచ్చినప్పుడు చూడండి అందులోనూ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీ బాధ్యతను నిర్వర్తించండి. అంతేకానీ వాళ్ళ కోసం సోషల్ మీడియాలో పోరాటాలు చేయొద్దు. వాళ్ళు గొప్ప అని చెప్పేసి మీ చుట్టూ ఉండే వాళ్ళకి మీరు శత్రువులు అవ్వాల్సిన అవసరం లేదు.
(08:10) ఎందుకంటే సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా ఓడ మునిగిపోదు. ఆ నీళ్లు ఓడ లోపలికి వస్తేనే [సంగీతం] అది మునిగిపోతుంది. కాబట్టి బయట ఎంత నెగిటివిటీ ఉన్నా మీరు పాడవరు. దాన్ని మీ మనసులోకి తీసుకుంటేనే మీరు బలహీన పడతారు. కాబట్టి నెగిటివిటీ అనేది ఎక్కడున్నా సరే అది నీలోకి రాకూడదు. సోషల్ మీడియాలో నెగిటివిటీ అవ్వచ్చు, లేకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య ఉండే నెగిటివిటీ కూడా అవ్వచ్చు.
(08:35) అది నీ లోపలికి వచ్చి నిన్ను బలహీన పరచకూడదు. నీటి నుంచే మారాలి. గతాన్ని వదిలేయండి పగలను తుడిచేయండి. మీ లక్ష్యం వైపు ఒక సింహంలా అడుగు వేయండి. మీరు సాధించాల్సింది చాలా ఉంది. ఆ చిన్న చిన్న అడ్డంకులు మీ ప్రయాణాన్ని ఆపకూడదు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఒక అద్భుతమైన కావ్యంలా మలుచుకోండి. చివరగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను.
(08:55) మీరు ఈరోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటున్నారా? లేక మీ శత్రువు గురించి ఆలోచిస్తూ నిద్ర లేని రాత్రిని గడపాలనుకుంటున్నారా? మీ సమాధానం మీ మార్పుకి మొదట అడుగు కావాలి కాబట్టి కామెంట్ చేయండి ఏమనుకుంటున్నారు అందులోని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను వాటిని కూడా చూడండి.
(09:19) ఇంకా లాస్ట్ టైం ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్. ఓం ఓం
No comments:
Post a Comment