ఎందుకు ఈ గుర్తింపు పిచ్చి | Why Ego Destroys Your Inner Happiness | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=N9dqQPOpH-c
Transcript:
(00:00) స్టేజ్ మీద కూర్చున్నప్పుడు 10 మంది చప్పట్లు కొడతారు. అది కూర్చునే కుర్చీకి ఇచ్చే గౌరవం. కానీ మీరు స్టేజ్ కింద సాధారణంగా కూర్చున్నా కూడా 10 మంది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి పలకరిస్తే అది మీ వ్యక్తిత్వానికి ఇచ్చే గౌరవం. ఈ రెండిటికి మధ్య ఉన్న తేడానే జీవితం. మీరు ఎప్పుడైనా గమనించారా మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మన లోపల ఒక చిన్న తాపత్రయం ఉంటుంది. నలుగురు నన్ను చూడాలి.
(00:21) నేను అందరికంటే ప్రత్యేకంగా కనిపించాలి. నా మాట నెగ్గాలి అని. మనకు తెలియకుండానే మనం ఒక అదృశ్యమైన కిరీటాన్ని తల మీద పెట్టుకొని తిరుగుతున్నాం. అదే అహంకారం. ఈ అహంకారం అంటే ఏదో పెద్ద విల్ల లాంటిది కాదు అది చాలా సున్నితంగా మనలో ఉంటుంది. మన డ్రెస్ దగ్గర నుంచి మనం వాడే ఫోన్ వరకు మనం మాట్లాడే మాట వరకు ప్రతిదీ ఇతరుల మెప్పు కోసమే జరుగుతుందా? ఒకసారి ఆలోచించండి మనం మన కోసం బ్రతుకుతున్నామా లేక పక్కవాడి కళ్ళల్లో కనిపించే మన ఇమేజ్ కోసం బ్రతుకుతున్నామా? ఈ ప్రపంచంలో అందరూ నన్నే గుర్తించాలి అందరూ నన్నే గొప్పగా చూడాలనుకోవటం ఒక మానసికమైన బంధనం. ఈ
(00:55) బంధనంలో చిక్కుకున్నప్పుడు మనం మన నిజాయితిని కోల్పోతాం. మీరు మీలా ఉండటం మానేసి లోకం మెచ్చే ఒక బొమ్మలా మారిపోతున్నారు. ఇదే అసలైన సమస్య. ఈ అహంకారం లేదా ఈ గుర్తింపు పిచ్చి మనలోకి ఎందుకు వస్తుంది? జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మాట అంటారు. పోలిక ఉన్న చోట ప్రేమ ఉండదు. కేవలం సంఘర్షనే ఉంటుంది. చిన్నప్పటి నుంచే మనల్ని పోల్చడం మొదలు పెడతారు.
(01:18) పక్కింటి వాడితో క్లాస్మేట్ తో తోటి ఉద్యోగసులతో ఇలా ప్రతి చోట మనం ఒక రేసులో ఉన్నామని భ్రమను కల్పిస్తారు. మనం లోపల చాలా ఒంటరిగా వెల్తిగా ఫీల్ అయినప్పుడు ఆ వెల్తిని పూడ్చుకోవడానికి బయట నుంచి వచ్చే చప్పట్లు కావాలనుకుంటాం. నేను తక్కువ కాదు అని మనకి మనం నిరూపించుకోవడానికి అహంకారాన్ని ఒక కవచంలా వాడుకుంటాం. కానీ ఇక్కడే ఒక ప్రమాదం ఉంది. ఎప్పుడైతే మీరు ఇతరులు మెప్పు మీద ఆధారపడతారో మీ సంతోషం రిమోట్ కంట్రోల్ వారి చేతిలోకి వెళ్ళిపోయినట్లే వారు మిమ్మల్ని పొగిడితే ఆకాశంలో తేలుతారు.
(01:46) అదే చిన్న విమర్శ చేస్తే కుంగిపోతారు. గుర్తింపు లభించినప్పుడు తీవ్రమైన నిరాశ డిప్రెషన్ కూడా కలుగుతాయి. ఎందుకంటే మీరు మీ విలువని మీ లోపల వెతుక్కోవట్లేదు. బయట వ్యక్తుల మాటల్లో వెతుక్కుంటున్నారు. ఈ ఇమేజ్ బిల్డింగ్ ప్రాసెస్ లో మీరు ఎంత అలసిపోతున్నారో గమనిస్తున్నారా? ఒక అబద్ధపు గొప్పతనం కోసం మీ ప్రశాంతతని తాకట్టు పెడుతున్నారు.
(02:07) మరి దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం అంటే హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయాల్సిన అవసరం లేదు కేవలం గమనించడం మాత్రమే మీరు చేయాలి. మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఎందుకు అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారు అని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడమే అసలైన పరిష్కారం. మీరు ఎప్పుడైతే నేను అందరికంటే గొప్పవాడిని కావాలి అనే భారాన్ని దించేస్తారో అప్పుడు మీరు చాలా తేలుకైపోతారు.
(02:29) గుర్తింపు కోసం పాకులాడటం మానేసి మీరు చేసే పనిలో నిజాయితి ఉంటే మీరు మాట్లాడే మాటల్లో స్వచ్ఛత ఉంటే గౌరవం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. మామూలుగా ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా లేకపోతే అక్కడికి వెళ్ళినా సరే అందరికన్నా మంచి బట్టలు నేనే వేసుకున్నానా అందరికన్నా కాస్ట్లీ ఫోన్ నేనే వాడుతున్నానా అందరికన్నా కాస్ట్లీ కార్లో వచ్చానా అని చెప్పేసి మనల్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం ఆపేసి ఆ కంపారిజన్ అని ఆ నరకంలో నుంచి బయటికి వచ్చేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం.
(02:55) అందులోనూ మన మాటలు కానీ మన చేష్టలు కానీ నిజాయితీతో ఉంటే మాత్రం ఆటోమేటిక్ గా గౌరవం వచ్చేస్తుంది. అలా కాకుండా బట్టల గురించి ఫోన్ల గురించి కార్ల గురించి ఇవాళ ఉండి రేపు పోయే డబ్బు గురించి అవతల వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు అది కూడా మనకంటే తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు మనకు నిజంగా గౌరవం ఉంటుందా ఎందుకంటే డబ్బు సంపాదించడం అనేది ఈరోజు మనకు కుదిరింది రేపు పొద్దున ఇంకొకడికి కుదురుతుంది.
(03:16) ఆ తర్వాత మరొకళ్ళకి కుదురుతుంది. ఈరోజు మనం డబ్బు సంపాదించినంత మాత్రాన అవతల సంపాదించని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర మనం షో చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈరోజు మనకు డబ్బు సంపాదించడంలో ఒక మెలుకువ తెలిసింది సంపాదించేశాము. రేపు అతనికి కూడా తెలుస్తుంది అతను కూడా సంపాదించుకుంటాడు. కానీ మనుషులు సంపాదించుకోవాల్సింది మనిషినే ఎందుకంటే డబ్బు ఎంత ఉన్నా సరే మనకి అవసరాలకి పనికొస్తుందే తప్ప ఒక స్టేజ్లో మనకి డబ్బు పనికి రాదు.
(03:42) డబ్బు మన అవసరాలను తెలుస్తుంది. ఖచ్చితంగా డబ్బు ఈ భూమి మీద మనకి అవసరమే కానీ వాటికన్నా మనుషులు మనకి చాలా చాలా అవసరం. మనం ఒక బాధ చెప్పుకోవాలన్నా మనల్ని ఇక్కడి నుంచి వేరే చోటుకి తీసుకెళ్లాలన్నా ముఖ్యంగా 60 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి మనుషుల అవసరం చాలా అంటే చాలా ఉంటుంది. ఆ స్టేజ్ లో వాళ్ళు సంపాదించాల్సింది డబ్బు కాదు.
(04:00) కేవలం మనుషుల్ని మాత్రమే. కాకపోతే చాలా మంది ఏం చేస్తారంటే నెత్తి మీద ఒక బర్త్డేని పెట్టుకొని నేను వాడికన్నా గొప్పగా ఉండాలి వీడికన్నా గొప్పగా ఉండాలి వీడు నాకన్నా తక్కువ లేకపోతే వాడు నాకన్నా ఎక్కువ అని చెప్పేసి ఉన్న మైండ్ మొత్తాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అందులోనూ మిమ్మల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళని కూడా దూరం చేసుకుంటూ ఉంటారు.
(04:17) కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే మీ నెత్తి మీద ఉన్న ఆ బరువుని దించేయండి. నిశబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉండండి. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతూ ఉండండి. మీరు ఎక్కడున్నా సరే ఆ ప్రేమ అనేది రిటర్న్ వచ్చేస్తూ ఉంటుంది. పోనీ మోసం చేస్తున్నారు అని చెప్పంటే మాత్రం అలర్ట్ గా ఉండండి మోసపోకుండా ఉండండి అంతే అంత మాత్రాన మనుషులని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు.
(04:39) ఎందుకంటే మనుషులు అనే వాళ్ళు 24 గంటలు చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ సిచువేషన్స్ వాళ్ళని చెడ్డవాళ్ళుగా మారుస్తాయి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు మంచిగానే ఉంటారు. లేవు కాబట్టే కొంచెం క్రూయల్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనం కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మనం అలర్ట్ గా ఉంటే చాలు అంతకు మించి ఏం లేదు. కాబట్టి మనుషులని గౌరవించడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది.
(05:01) బేసికల్ గా వీడు ఎంత డబ్బున్నోడు అనిపించుకోవడం కన్నా ఇతను చాలా మంచోడు అనిపించుకోవడం ఈ సమాజంలో చాలా చాలా అవసరం. ఎందుకంటే డబ్బు ఉంటే గౌరవం వస్తుందో లేదో తెలియదు కానీ 10 మందితో మంచిగా ఉంటే మాత్రం కచ్చితంగా గౌరవం అనేది వస్తుంది. సరే ఇదంతా బాగానే ఉంది. అవతల వాడు మనల్ని మోసం చేస్తున్న కూడా మనం ఎలా అలెర్ట్ గా ఉండాలి అందులోనూ అందరితో నవ్వుతూ ఎలా మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళలో చాలా మంది మనల్ని మోసం చేయాలని చూస్తూ ఉంటారు.
(05:24) వాళ్ళలో చాలా మంది మన గురించి బ్యాడ్ గా చెప్తూ ఉంటారు. ఇన్నీ ఎలా తట్టుకోవాలి ఎలా మంచిగా ఉండమంటావ అని చెప్తే మాత్రం అందరికీ నేను చెప్పేది ఏంటంటే రేపు మీరు ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా లేదా ఆఫీస్ లో మీటింగ్ ఉన్నా అక్కడ అందరి దృష్టి మీద ఉండాలని చెప్పేసి కోరుకోమాకండి అందరినీ గమనించండి అందరితో ప్రేమగా ఉండండి కానీ నేనే హైలైట్ అవ్వాలి అనే తాపత్రయాన్ని వదిలేయండి అక్కడే మన జీవితంలో ఉన్న సగం సమస్యలు పోతాయి సగం కాదు చాలా పోతాయి.
(05:49) సో మనం వెళ్ళిన చోట నేను గొప్పగా ఉండాలి. నా మాట అందరూ వినాలని చెప్పేసి ఎందుకు అనుకుంటారు అలా అనుకుంటేనే సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదు అనుకోండి బాధపడతారు. అంతే కాకుండా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ మీద మీకు కోపం పెరిగిపోతుంది. వాళ్ళ మీద మీకు ఈర్ష ద్వేషం కూడా పెరిగిపోతుంది. అలా పెరగడం వల్ల మీరు ఒక మాట అంటారు.
(06:06) దానివల్ల వాళ్ళు కూడా రెండు అంటారు. అసలు ఏం పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటే మీకెందుకు పట్టించుకోకపోతే మీకెందుకు ఎవరు మిమ్మల్ని పొగడితే మీకెందుకు పొగడకపోతే మీకెందుకు మనం మన పని చేయడానికి వచ్చాం అంతే అంతకుమించి ఏమ లేదు. మీ పనిని మీరు సైలెంట్ గా పరిపూర్ణంగా చేసుకెళ్ళండి. మీ క్యారెక్టరే మీ బ్రాండ్ అవ్వాలి.
(06:25) ఎందుకంటే మనల్ని చూసి 10 మంది నికోలే తప్ప మనల్ని చూసి 10 మంది నవ్వకూడదు. అందులోనూ ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా అది మీ విలువ తగ్గించలేదు అని గుర్తించండి. ఎందుకంటే సముద్రంలో ఒక రాయి వేస్తే సముద్రం విలువ తగ్గుతుందా? తగ్గదు కదా అలాగే మీ లోపల ఒక స్థిరత్వాన్ని సంపాదించుకోవాలి. స్థిరత్వం అంటే ఎవరైనా పొగిడినా ఎవరైనా తిట్టినా సరే రెండిటిని ఒకేలాగా ట్రీట్ చేయాలి.
(06:49) ఎందుకంటే పొగడతల్ని ఎక్కువగా మైండ్ కి ఎక్కించుకున్న కూడా మనకే సమస్య ఎందుకంటే సడన్ గా వాళ్ళు పొగడటం మానేశారు అనుకోండి ఏమైంది నేనేమైనా తప్పు చేశానా లేకపోతే ఏం జరిగింది అని చెప్పేసి మీలో ఒక టెన్షన్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి పొగడ్తలని సీరియస్ గా తీసుకోమాకండి అలా అని చెప్పేసి విమర్శలను కూడా మీరు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
(07:09) జీవితంలో స్థిరత్వం అనేది కచ్చితంగా అవసరం. ఆ స్థిరత్వాన్ని సంపాదించుకోండి. దానికి మించిన ఆస్తి ఇంకా అది ఏది ఉండదు అనుకోండి జీవితం అంటే ఒక ప్రయాణం అందులో మనం ఎంత సంపాదించాం అన్నది కాదు ఎంతమంది మనసుల్లో చేరామ అన్నది ముఖ్యం. ఎందుకంటే చాలా మంది చాలా మందికి శత్రువులు అయిపోతూ ఉంటారు. ఎందుకు మనకందరూ శత్రువులు అవుతున్నారు అనేది కూడా ఆలోచించుకోరు.
(07:28) కేవలం ఈగోని సాటిస్ఫై చేసుకోవాలి. సో చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం వాళ్ళ చెప్పినట్లు నడవాలి వాళ్ళకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం ఎలా ఈ భూమి మీదకి వచ్చామో మిగిలిన వాళ్ళు కూడా అలాగే వచ్చారు. సో వాళ్ళు మన కోసం కాంప్రమైజ్ అవ్వరు. అలాని చెప్పేసి మనం కూడా అవ్వాల్సిన అవసరం లేదు. మనం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి.
(07:46) అలా అడ్జస్ట్ అవ్వడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అంటే కచ్చితంగా మనకే ఉంటుంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటాం. ప్రతిదాన్ని పట్టించుకుంటే మాత్రం చిరాకు వచ్చేస్తుంది కాబట్టి మీరు మీ జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే వినయంతోనే సాధ్యమవుతుంది. వినయంగా ఉండండి నేటి నుంచి ఒక కొత్త మార్పు చేయండి. ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు వారి మాటల్ని పూర్తిగా వినండి.
(08:04) మీ గొప్పలు చెప్పుకోవడానికి ఆతృత పడకండి ఎందుకంటే అవతలడు ఏదైనా విషయం చెప్తే వాడి దగ్గర కూడా మీ గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా ఆ నిశశబ్దంలోనే మీకు ఒక నిజమైన శక్తి కనిపిస్తుంది. మీరు మారితే ఈ ప్రపంచం మారుతుంది. ఇది కేవలం మాటలు కాదు కొత్త జీవితానికి పునాది ఈరోజే ఇప్పుడే అహంకారాన్ని వదిలేసి స్వేచ్ఛగా ఊపిరి తేసుకోండి.
(08:24) ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీరు ఇప్పటి దాకా చూశారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న మీ జీవితంలో మీరు కేవలం ఇతరుల మెప్పు కోసం లేదా 10 మందిలో గొప్పగా అనిపించుకోవడం కోసం చేసిన ఒక పని ఏంటి చెప్పండి ఆ పని చేస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న ఆందోళనలు ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది కచ్చితంగా కామెంట్ చేయండి ఒకరి అనుభవం నుంచి ఇంకొకరికి నేర్చుకునే అవకాశం దొరుకుతుంది.
(08:45) అంతేకాకుండా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎన్కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్.
(09:18) ఓం
No comments:
Post a Comment