Thursday, March 19, 2026

🚨 నీచమైన Rules! | Iran లో ఆడవాళ్ల బతుకులు!

🚨 నీచమైన Rules! | Iran లో ఆడవాళ్ల బతుకులు!

Author Name:Sudheer Vlogger

Youtube Channel Url:https://www.youtube.com/@Sudheer_vlogger

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Uk67Z5jv0OM



Transcript:
(00:00) రీసెంట్ గా కొమేని చనిపోయాక ఇరాన్ లో చాలా మంది ఆడవాళ్ళు బయటకవచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్నేళ్లుగా మహిళలపై జరిగిన దారుణాలన్నీ ఇక్కడితో ముగిసిపోతాయని చాలా పెద్ద ఆశతో ఉన్నారు. అసలు ఎవరి ఆయితుల్లా అలీ కొమేని అండ్ ఆయితుల్లా రోహల్లా కొమేని వీళ్ళ పాలనలో మహిళల జీవితాలు ఎలా ఉండేవి? 1979 ఇరాన్ రెవల్యూషన్ తర్వాత రూల్ లోకి వచ్చిన రోహల్లా కొమేని అండర్లో మహిళల మీద పెట్టిన కఠినమైన రూల్స్ వింటే ఎవ్వరికైనా మతి పోవాల్సిందే.
(00:29) ఇతని అండర్లో ఇరాన్ దేశం పూర్తి స్థాయి షర్యాలా వైపు వెళ్ళిపోయింది. అప్పటిదాకా పర్సనల్ ఛాయిస్ గా ఉన్న హిజాబ్ మహిళలకి మాండేటరీ అయిపోయింది. హిజాబ్ వేసుకోకపోయినా జుట్టు కనపడేటట్టుగా హిజాబ్ వేసుకున్న ఆడవాళ్ళని పబ్లిక్ గా రోడ్ల మీదకి అందరి ముందు తీసుకొచ్చి కొరడాలతో కొట్టేవాళ్ళు. కొంతమంది ఆడవాళ్ళకి వందల కొద్ది కొరడాలు దెబ్బలు కొట్టే శిక్షలు కూడా విధించారు.
(00:47) ఆడపిల్లలకి పెళ్లి వయసు 18 సంవత్సరాల నుంచి కేవలం తొమ్మిది సంవత్సరాలకు కుదించారు. కోర్టులో ఒక మహిళ చెప్పే సాక్ష్యానికి విలువ మగాడు చెప్పే సాక్ష్యంలో సగం మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఒక మహిళ ఇతర దేశాలు వెళ్ళాలంటే తన భర్త పర్మిషన్ ఉంటేనే తనకి పాస్పోర్ట్ వస్తుంది. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఒక [సంగీతం] దేశంలో ఉమెన్ రైట్స్ ఇంత వేగంగా ఎలా డిసపియర్ అయ్యాయి.
(01:11) 1979 రివల్యూషన్ తర్వాత ఇరాన్ లో ఆడవాళ్ళ జీవితాలు ఎలా పూర్తిగా మారిపోయాయో ఈ వీడియోలో చూద్దాం. 1979 ఇరాన్ లో ఒక తిరుగుబాటు జరిగింది. దాని తర్వాత ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు మనకి ఫ్రీడం వస్తుంది మన జీవితాల్లో మార్పు వస్తుందని వాళ్ళక అనిపించింది. కొన్ని నెలల్లోనే మార్పు వచ్చింది. కానీ వాళ్ళు అనుకున్నట్టు కాదు.
(01:32) ఈ రెవల్యూషన్ అసలు ఎందుకు జరిగిందంటే అప్పట్లో ఇరాన్ దేశాన్ని షా మొహమ్మద్ రేజా పల్వి అనే కింగ్ పాలిస్తున్నాడు. అతని రూల్ లో ఇరాన్ వెస్టర్న్ కంట్రీస్ కి చాలా క్లోజ్ గా ఉండేది. ఎకానమీ డెవలప్ అయినా కూడా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. కొంతమంది ప్రజలు షా రూల్ ని ఒక అథారిటేరియన్ రూల్ అని విమర్శించారు. పొలిటికల్ అపోనెంట్స్ ని అరెస్ట్ చేయడం కూడా జరిగేది.
(01:53) ఇది మాత్రమే కాదు రిలీజియస్ లీడర్స్ కి కూడా షా గవర్నమెంట్ లో పెద్ద కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అప్పుడే ఒక పేరు చాలా పెద్దగా వినిపించడం మొదలైంది. అదే రోహల్లా మోసావి కొమేని. రోహల్లా కొమేని ఒక పవర్ఫుల్ రిలీజియస్ లీడర్ షా గవర్నమెంట్ పాలసీస్ ని పబ్లిక్ గా క్రిటిసైజ్ చేశడు. దీంతో 1964 లో కొమెనీని ఇరాన్ నుంచి బహిష్కరించారు. దేశ బహిష్కరణలో ఉన్నప్పటికీ కొమేని ఇన్ఫ్లుయెన్స్ ఏ మాత్రం తగ్గలేదు.
(02:16) ఇరాన్ లో ఉన్న చాలా మంది అతన్ని ఒక రిలీజియస్ లీడర్ గా సపోర్ట్ చేయడం ప్రారంభించారు. మెల్లగా షాపాలన మీద ప్రజలకి అసంతృప్తి పెరిగిపోయింది. 1978 79 మధ్య ఇరాన్ అంతా ప్రొటెస్ట్లు పెరిగిపోయాయి. 1979 లో షా మొహమ్మద్ ప్రొటెస్ట్లు తారస్థాయికి చేరడంతో వెకేషన్ అని చెప్పి తన ఫ్యామిలీతో కలిసి ఇరాన్ వదిలి ఈజిప్ట్ కి వెళ్ళిపోయాడు. 16 రోజుల తర్వాత ఫిబ్రవరి 1, 1979న కొమ్మేని 14 సంవత్సరాల దేశ బహిష్కరణ తర్వాత ఇరాన్ కి తిరిగి వచ్చాడు.
(02:45) అక్కడి నుండే ఇరాన్ హిస్టరీ పూర్తిగా మారిపోయింది. ఎగ్జైన్ నుంచి తిరిగి వచ్చిన రోహల్లా కొమ్మేని టెహరాన్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నప్పుడు లక్షలాది మంది ప్రజలు అతనికి వెల్కమ్ చెప్పారు. చాలా మందికి కొమ్మేని ఒక రిలీజియస్ లీడర్ మాత్రమే కాదు రెవల్యూషన్ కి సింబల్ గా కనిపించాడు. కొమేనీ తిరిగి వచ్చిన 10 రోజుల్లోనే ప్రెజెంట్ ఉన్న సిస్టం ని గూల్చేసి ఇరాన్ లో ఒక కొత్త పొలిటికల్ సిస్టం ని ఎస్టాబ్లిష్ చేయడం ప్రారంభించాడు.
(03:06) కొద్ది కాలంలోనే ఇరాన్ అఫీషియల్ గా ఇస్లామిక్ రిపబ్లిక్ గా ప్రకటించబడింది. అంటే దేశంలో ఉండే లాస్ మొత్తం ఇక ఇస్లాం మత ప్రాధిపతిక ఆధారంగా నడుస్తాయి. ఇక్కడి నుంచే మహిళల జీవితాలపై ప్రభావం చూపే డెసిషన్స్ తీసుకోవడం ప్రారంభమైింది. మార్చ్ 7, 1979 న కొమ్మెని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అదేంటంటే గవర్నమెంట్ ఆఫీసెస్ లో పనిచేసే మహిళలు ఇస్లామిక్ హిజాబ్ తప్పనిసరిగా ధరించాలి అని అతని ప్రకారం హిజాబ్ లేకుండా బయటకి రావడం ఇస్లామిక్ మొరాలిటీకి వ్యతిరేకం.
(03:37) ఈ అనౌన్స్మెంట్ చాలా మంది మహిళలకి షాక్ ఇచ్చింది. ఎందుకంటే రెవల్యూషన్ సమయంలో హిజాబ్ కంపల్సరీ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇది ఇరాన్ ఉమెన్ ఫ్రీడమ్ మీద మొట్టమొదటి పెద్ద రెస్ట్రిక్షన్ గా మారింది. ఈ డెసిషన్ ని అందరూ యాక్సెప్ట్ చేయలేదు. కొద్ది రోజుల్లోనే ఇరాన్ స్ట్రీట్స్ లో ఒక పెద్ద ప్రొటెస్ట్ ప్రారంభమయింది. మార్చ్ 8, 1979 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున టెహరాన్ స్ట్రీట్ లో సుమారు లక్ష మంది మహిళలు ప్రొటెస్ట్ చేయడానికి బయటక వచ్చారు.
(04:01) వాళ్ళు ఒక విషయం స్పష్టంగా చెప్పారు హిజాబ్ ఒక పర్సనల్ ఛాయిస్ కావాలి గవర్నమెంట్ ఫోర్స్ చేయకూడదని. ఈ ప్రొటెస్ట్ లో స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, టీచర్స్, మదర్స్ ఇలా రకరకాల బ్యాక్గ్రౌండ్స్ కి చెందిన మహిళలు పాల్గొన్నారు. ఇంకొంతమంది లేడీస్ హిజాబ్ లేకుండా రోడ్ల మీద మార్క్ చేసి తమ వ్యతిరేకతను చూయించారు.
(04:19) కొంతమంది లేడీస్ ఏమో ప్లకార్డ్స్ పట్టుకొని స్లోగన్స్ ఇచ్చారు. ఈ ప్రొటెస్ట్లు దాదాపు ఆరు రోజుల పాటు కొనసాగాయి. మార్చ్ 8 నుంచి మార్చ్ 14 వరకు ఇరాన్లో మహిళలు స్ట్రీట్ లోకి వచ్చి తమ రైట్స్ కోసం ప్రొటెస్ట్ చేశారు. కానీ ఈ ప్రొటెస్ట్లు పీస్ ఫుల్ గా ఏమి సాగలేదు. కోమేనీ సపోర్టర్స్ ఈ ప్రొటెస్ట్ సమయంలో ఉమెన్ ప్రొటెస్టర్స్ ని చాలా చోట్ల వైలెంట్ గా అటాక్ చేశారు.
(04:39) కొన్ని చోట్ల ప్రో గవర్నమెంట్ గ్రూప్స్ ప్రొటెస్ట్ చేస్తున్న మహిళలపై రాళ్ళు కర్రలతో దాడులు చేశారు. కొన్ని సందర్భాల్లో ఇటుకులు గాజు పెంకులు కూడా వాళ్ళ పైకి విసిరారు. చాలా మంది గాయాల పాలయ్యారు. అంతే కాదు కొన్ని చోట్ల ఉమెన్ ప్రొటెస్టర్స్ ని ఇస్లాం కి వ్యతిరేకులు అని వెస్ట్ ఏజెన్స్ అని కూడా ఎక్యూస్ చేశారు.
(04:57) కొన్ని గ్రూప్స్ హిజాబ్ పెట్టుకోలేకపోతే మీపై దాడి చేస్తామని త్రెట్స్ కూడా ఇచ్చారు. కొంతమంది ఉమెన్ ప్రొటెస్టర్స్ ని అరెస్ట్ చేశారు. అయినా కూడా చాలా మంది మహిళలు ప్రొటెస్ట్లు కొనసాగించారు. ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ కి వ్యతిరేకంగా జరిగిన మొట్టమొదటి పెద్ద పబ్లిక్ ప్రొటెస్ట్ గా హిస్టరీలో నిలిచిపోయింది. అయితే ఈ ప్రొటెస్ట్లు చాలా పెద్ద స్థాయిలో జరగడంతో గవర్నమెంట్ మొదట హిజాబ్ రూల్ ని రికమెండేషన్ మాత్రమే మాండేటరీ ఏమి కాదని చెప్పి పెన్షన్ తగ్గించడానికి ప్రయత్నించింది.
(05:22) గవర్నమెంట్ తాత్కాలికంగా టోన్ సాఫెన్ చేసినట్టు కనిపించింది. కానీ ఈ ప్రొటెస్ట్ తర్వాత ఇరాన్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. దానికి బదులుగా రూల్స్ ని మరింత కఠినంగా ఎన్ఫోర్స్ చేయడం ప్రారంభించింది. అక్కడి నుంచే ఇరాన్ లో ఒక కొత్త సిస్టం ప్రారంభమయింది. అదే మొరాలిటీ పోలీసింగ్. [సంగీతం] కొన్ని నెలల తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఈ రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయడం ప్రారంభించింది.
(05:42) దేశమంతటా కొత్త ఎన్ఫోర్స్మెంట్ గ్రూప్స్ క్రియేట్ అయ్యాయి. వీళ్ళ పని మొరాలిటీ పోలీసింగ్ అంటే పబ్లిక్ ప్లేసెస్ లో ఇస్లామిక్ రూల్స్ ఫాలో అవుతున్నాయా లేదా అని చెక్ చేయడం. స్ట్రీట్స్, మార్కెట్స్, బస్సెస్, యూనివర్సిటీస్ దగ్గర మహిళలు వేసుకునే బట్టల్ని చెక్ చేయడం ప్రారంభమయింది. హిజాబ్ సరిగ్గా లేకపోయినా లేదా జుట్టు కనిపించినా ఆ ఉుమెన్ ని అక్కడికక్కడే ఆపేసి క్వశ్చన్ చేయడం కొన్ని సందర్భాల్లో వాళ్ళని పోలీస్ వెహికల్స్ లో తీసుకెళ్ళడం కొంతమంది ఉమెన్స్ ని అరెస్ట్ కూడా చేశారు.
(06:10) కొన్ని కేసెస్ లో కోర్ట్లు హార్ష్ పనిష్మెంట్స్ కూడా ఇవ్వడం ప్రారంభించాయి. ఇమ్మోరల్ బిహేవియర్ అనే అక్యూజేషన్ తో విక్టిమ్ ని పబ్లిక్ స్క్వేర్స్ [సంగీతం] అండ్ స్ట్రీట్స్ లో నిలబెట్టి కొరడాలతో కొట్టేవాళ్ళు. ఇది జస్ట్ పనిష్మెంట్ మాత్రమే కాదు, ఇది ఒక మెసేజ్ కూడా ఇస్లామిక్ రూల్స్ ని బ్రేక్ చేస్తే సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని. ఇక్కడి నుంచే ఇరాన్ లో మోరల్ పోలీసింగ్ అనేది రోజువారి జీవితంలో భాగంగా మారిపోయింది.
(06:33) ఈ రూల్స్ జస్ట్ డ్రెస్ కోడ్ వరకే ఆగిపోలేదు. కొద్ది కాలంలోనే ఇరాన్ లీగల్ సిస్టం లో చాలా పెద్ద చేంజెస్ వచ్చాయి. కొత్త షరియా లాస్ ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. ఈ లాస్ వల్ల మహిళల జీవితాలపై చాలా పెద్ద ప్రభావం పడింది. మొదటిగా ఫ్యామిలీ లాస్ లో చేంజెస్ ని చేశారు. అమ్మాయిలకి లీగల్ మ్యారేజ్ ఏజ్ ని 18 సంవత్సరాల నుంచి కేవలం తొమ్మిది సంవత్సరాలకు తగ్గించారు.
(06:53) అంటే తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఒక అమ్మాయికి మ్యారేజ్ చేయడం 100% లీగల్. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేబీ పర్సనల్ ఒపీనియన్ అనుకోండి తొమ్మిది సంవత్సరాల వయసున్న ఒక చిన్న పాప మెంటల్ గా ఫిజికల్ గా సైకలాజికల్ గా మ్యారేజ్ కి అసలు రెడీ కాదు. ఇక ఆ అమ్మాయిని చేసుకోవాలనుకునేవాడు నా దృష్టిలో అసలు మనిషే కాడు. నువ్వు ఒక రిలీజియన్ ని ఫాలో అవుతున్నప్పుడు అందులో ఇలాంటి ఒక దరిద్రమైన లా ఉంటే అది తీసి పారదొబ్బలి గాని వాడు ఎవడో పెట్టాడని చెప్పేసి గుడ్డిగా ఫాలో అవుతాను అంటే నిన్ను మించిన క్రూర మృగం ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఇది మాత్రమే కాదు కొన్ని లీగల్
(07:25) కేసెస్ లో కోర్ట్ లో ఒక ఉమెన్ చెప్పే టెస్టిమోనీ [సంగీతం] ఒక మగవాడు చెప్పే టెస్టిమోనీ కంటే తక్కువ వెయిట్ తో కన్సిడర్ చేసే లీగల్ ఇంటర్ప్రిటేషన్ కూడా వచ్చింది. ఇంకా కొన్ని సిచువేషన్స్ లో ఒక మహిళ ఇతర దేశాలకు ట్రావెల్ చేయాలంటే హస్బెండ్ పర్మిషన్ కంపల్సరీగా ఉండాలి. ఇన్ కేస్ పర్మిషన్ లేకపోతే తనకి పాస్పోర్ట్ కూడా రాదు.
(07:45) ఇన్ కేస్ ఆడవాళ్ళు ఏదైనా పెద్ద తప్పు చేశారని తెలిస్తే వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి అందరి చేత రాళ్లతో కొట్టిస్తారు. 1986 లో సురాయ అనే ఒక 35 ఇయర్స్ ఓల్డ్ లేడీ కేస్ గురించి తెలిస్తే మీకు అసలు ఇలా కూడా ఉంటారా మనుషులు అనిపిస్తది. సొరాయ హస్బెండ్ కి ఒక టీనేజ్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని కోరిక కలిగింది. వాళ్ళ వైఫ్ ని ఎలాగైనా అడ్డదొలగించుకోవాలని అతని ఫ్రెండ్స్ తో కలిసి తనని వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒకరితో సంబంధం ఉందని అతనికి నా వైఫ్ అన్నం వండి పెట్టింది అని చెప్పేసి లోకల్ కోర్ట్లో కేస్ ఫైల్ చేశాడు.
(08:14) ఆ లోకల్ కోర్ట్ ఆ అమ్మాయిని ఊర్లో అందరి ముందు రోడ్డు మీదకి తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపేశారు. ద స్టోనింగ్ ఆఫ్ సురాయ అని ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ మూవీ చూడండి. [సంగీతం] ఇంకొక కేస్ ఏంటంటే సెప్టెంబర్ 16 2022 లో మాసా అమిని అనే ఒక లేడీ హిజాబ్ సరిగ్గా లేదు అని తన హెయిర్ కొంచెం బయటకి కనిపిస్తుందని చెప్పేసి అక్కడే ఉండే మొరాలిటీ పోలీసులు తనని అరెస్ట్ చేసి మూడు రోజులు కస్టడీలో ఉంచి తనకి చిత్రహింసలు పెడితే తను కస్టడీలోనే చనిపోయింది.
(08:40) ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇరాన్లో ప్రొటెస్ట్లు కూడా జరిగాయి. నాకు తెలియని విషయం ఏంటంటే తల మీద కొంచెం హెయిర్ కనబడింది కాబట్టి రిలీజియన్ నేమ్ తో వాళ్ళని చంపేస్తా అంటే అసలు వాళ్ళు ఏం మనుషులో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంకొక యూనివర్సిటీ స్టూడెంట్ అయితే ఈ హిజాబ్ రూల్స్ ని చూసి చూసి తట్టుకోలేక బట్టలు తీసేసి ఒక అండర్వేర్ అండ్ బ్రా తో రోడ్డు మీద తిరుగుతూ ప్రొటెస్ట్ కూడా చేసింది.
(09:00) ఆ తర్వాత మొరాలిటీ పోలీసులు తన్ని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళారు. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి కోసం వీళ్ళు చాలా మంది రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేసిన తర్వాత తనకేదో మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయింది అని చెప్పేసి తన్ని రిలీజ్ కూడా చేశారు. సో ఇలా లీగల్ సిస్టం లో వచ్చిన చేంజెస్ వల్ల ఉమెన్ పబ్లిక్ లైఫ్ లో చాలా రెస్ట్రిక్షన్స్ ఎదుగుకోవాల్సి వచ్చింది.
(09:17) 1979 తిరుగుబాటు తర్వాత ఇరాన్ లో ఉుమెన్ రైట్స్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఈ రూల్స్ ఒకటి రెండు సంవత్సరాలకు ముగిసిపోలేదు. 1980 లో ఈ సిస్టం మరింత బలంగా స్థిరపడింది. హిజాబ్ రూల్స్, మోరల్ పోలీసింగ్, లీగల్ రెస్ట్రిక్షన్స్ ఇవి ఇరాన్ లో రోజువారి జీవితంలో భాగంగా మారిపోయాయి. ఒక కొత్త జనరేషన్ ఈ రూల్స్ మధ్య పెరిగింది.
(09:36) చాలా మంది ఇరానియన్ ఉమెన్ ఈ రెస్ట్రిక్షన్స్ కి వ్యతిరేకంగా వివిధ కాలల్లో ప్రొటెస్ట్లు కూడా చేశారు. కానీ 1979 రెవల్యూషన్ తర్వాత ఎస్టాబ్లిష్ అయిన సిస్టం ని మాత్రం దశాబ్దాల పాటు అలాగే కొనసాగింది. ఒకప్పుడు ఫ్రీడమ్ కోసం జరిగిన రెవల్యూషన్ చాలా మంది మహిళలకు మాత్రం కొత్త రెస్ట్రిక్షన్స్ కి ప్రారంభంగా మారింది.
(09:55) దాదాపు 10 సంవత్సరాలు ఇరాన్ ని పాలించిన తర్వాత ఐతుల్లా రుహల్ల కొమ్మేని జూన్ 1989 లో చనిపోయాడు. అతని మరణం తర్వాత ఇరాన్ లో ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. ఇప్పుడు సిస్టం మారుతుందా అని కొంతమంది ఇరానియన్ ఉమెన్ కి ఒక ఆశ కూడా కలిగింది. ఇన్నేళ్లుగా ఎన్ఫోర్స్ అవుతున్న స్ట్రిక్ట్ రూల్స్ కొంచెం తగ్గొచ్చేమో అని కానీ అలా అసలు జరగలేదు.
(10:16) రోహల్లా కొమేని తర్వాత అలీ హుసేన్ కొమేని ఇరాన్ సుప్రీమ్ లీడర్ గా పవర్ లోకి వచ్చాడు. అంటే 1979 రెవల్యూషన్ తర్వాత ఎస్టాబ్లిష్ అయిన సిస్టం రోహల్లా కొమేని చావుతో ముగియలేదు. ఇది కొత్త నాయకత్వంతో కొనసాగింది. ఫిబ్రవరి 28, 20 26 న ఇరాన్ సుప్రీమ్ లీడర్ అలీ హుసేన్ కొమేని ఒక పెద్ద మిలిటరీ అటాక్ లో చనిపోయాడు. ఈ వార్త బయటిక వచ్చిన తర్వాత ఇరాన్ లో రెండు రకాల రియాక్షన్స్ కనిపించాయి.
(10:40) కొంతమంది వీధుల్లోకి వచ్చి అతని మరణంపై దుఃఖం వ్యక్తం చేశారు. కానీ మరి కొంతమంది ఇన్నేళ్లుగా కొనసాగుతున్న స్టెట్ సిస్టం ఇప్పుడు మారొచ్చని సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇరాన్ లో మహిళలపై ఉన్న రెస్ట్రిక్షన్స్ మారుతాయా లేదా అదే సిస్టం కొనసాగుతుందా అనేది ఇంకా చూడాల్సి ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్ సుధీర్ వ్లాగర్ బాయ్.

No comments:

Post a Comment